ఘనంగా అభయ ఆంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం

ఘనంగా అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గుల్మోహన్ పార్క్ నేతాజీ నగర్ లో శ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం రెండవ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. శనివారం ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో ఆలయ రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కాలనీ లో తెల్లవారుజామున బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ శివ నాగేంద్ర స్వామి దేవాలయంలో అర్చనలు నిర్వహించిన అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం విగ్నేశ్వర పూజలతో ప్రారంభమై హనుమాన్ విగ్రహానికి అభిషేకం నిర్వహించిన వేద బ్రాహ్మణులు హోమం నిర్వహించారు. కాలనీవాసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు వేలాదిమంది హాజరై ప్రత్యేక పూజలు తమ మొక్కులను తీర్చుకున్నారు.

అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఉరిటి వెంకటరావు, రాగం మల్లికార్జున్ యాదవ్, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, సురేందర్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆశనోళ్ళ వెంకటేష్ గౌడ్, కోశాధికారి రామేశ్వరం రెడ్డి, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు ఏ. మల్లేష్ ముదిరాజ్, ఎం. సంతోష్ కురుమ, ఆర్ రమేష్ బాబు, సంయుక్త కార్యదర్శిలు ఎం మహేష్ కురుమ, బుచ్చన్న, ఉప్పరి దయాసాగర్, కార్యనిర్వాహక కార్యదర్శిలు లావా చారి, యాదగిరి సాగర్, ఎం శ్రీను కురుమ, సాంబరాజు, కార్యవర్గ సభ్యులు పి. నర్సిరెడ్డి, సోమేశ్ రెడ్డి, డి. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version