పరకాలలో ఘనంగా హిందూ ధర్మ సమ్మేళనం

పరకాలలో ఘనంగా హిందూ ధర్మ సమ్మేళనం

చిన్నారి భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణ

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని స్థానిక గొడ్ల అంగడిలో నిర్వహించిన హిందూ ధర్మ సమ్మేళనం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు,స్థానిక ప్రజలు హాజరై ధార్మిక ఉత్సాహాన్ని ప్రదర్శించారు.సమ్మేళనంలో పాల్గొన్న వక్తలు హిందూత్వం మరియు సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక విలువల అవసరాన్ని గుర్తు చేశారు. ధర్మం,సంస్కృతి,సంప్రదాయాల పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఓ చిన్నారి ప్రదర్శించిన భరతనాట్యం పౌర్ణమి సినిమాలోని భరతవేదమున పాటకు చిన్నారి అందించిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.తన భావ వ్యక్తీకరణ,లయ,కదలికల సమన్వయంతో చిన్నారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.చిన్నారి ప్రతిభకు సభలో ఉన్నవారు ఘనంగా అభినందనలు తెలిపారు.ఈ ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version