బడి, భక్తి, బీజేపీ పార్టీ!

-దైవ చింతన చాలా వున్న ప్రీతి రెడ్డి.

యూనివర్సిటీలో మహా శివరాత్రి వేడుకలు.

హనుమాన్ జయంతి ఉత్సవాలు.

-ఇంట్లో విశేషమైన పూజలు.

“Preeti Reddy Set to Join BJP

-ఆధ్యాత్మిక చింతనతో బీజేపీ వైపు అడుగులు.

-దైవ భక్తితో బీజేపీ పార్టీ వైపు చూపులు.

సబ్కా సాత్.. సబ్కా వికాస్ ప్రీతి రెడ్డిని ఆకర్షించిన అంశాలు.

-ప్రధాని మోడీ పాలనలో ప్రజలు సుఖ శాంతులు.

హైదరాబాద్ వద్దు..భాగ్యనగర్ ముద్దు అనేది ప్రీతి రెడ్డి ఆలోచన.

-ప్రజలందరి చేత భాగ్య నగరం అని పిలిపించే కార్యాచరణ.

-ప్రీతి రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజల పెరుగుతున్న మద్దతు

హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

-ప్రీతి రెడ్డి పిలుపుతో రామదండులా కదులుతున్న యువత

విదేశాలకు వెళ్ళినప్పుడు మీది పాకిస్తాన్ హైదరాబాద్ ఆ లేక ఇండియా లోని

హైదరాబాద్ ఆ అని ప్రశ్నిస్తుంటే మనస్సు చివుక్కు మంటోంది.

-ఇండియా లో తెలంగాణ హైదరాబాద్ అని చెప్పాల్సివస్తోంది.

-ఒక రకంగా అవమానంగా భావించాల్సి వస్తోంది.

-తన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ ప్రజలను ఆలోచించే విధంగా చేసింది

-రాష్ట్రవ్యాప్తంగా భాగ్యనగరే కావాలి అని ప్రజలకు అనిపించే విధంగా

మాట్లాడింది

-రాజకీయ చాణుక్యుడైన మామ మల్లారెడ్డి శిష్యురాలిని అనిపించుకుంది.

తెలంగాణ బీజేపీలో సంజయ్ తో సమానమైన మాటకారి ప్రీతి రెడ్డి అని కొనియాడబడుతోంది.

 

హైదరాబాద్, నేటిధాత్రి:

రాజకీయాల్లోకి కొందరు హఠాత్తుగా దూసుకొస్తారు. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటారు. బలమైన నాయకులుగా తయారౌతారు. చూస్తుండగానే పెద్ద నాయకులౌతారు. అలాంటి కోవలోకే ప్రతీ రెడ్డి రానున్నారా? అనే చర్చ తెలంగాణలో బలంగా వినిపిస్తోంది. నిజానికి ప్రీతిరెడ్డికి తెలంగాణలోనే కాదు, ఏపిలో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఉన్నత విద్యావంతురాలిగా, విద్యా సంస్దల అదినేతగా, వాటి నిర్వాహకురాలిగా సుపరిచితురాలు. సహజంగా విద్యా సంస్ధలకు చెందిన వ్యక్తులు బైట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఎక్కడో ఏదో టీవిల్లోనో, న్యూస్ పేపర్లలో అప్ప్పుడప్ప్పుడూ సక్సెస్ స్టోరీలలో కనిపిస్తుంటారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఇతరలు ఎదగాలన్న ýక్ష్యంతో మీడియా వారిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కాని ప్రతీరెడ్డి అందుకు భిన్నం. సోషల్ మీడియా యుగంలో ఆమె మీడియా పరిచయం కంటే ముందే కొన్ని ýక్షల మందికి తెలుసు. పైగా మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు కావడం కూడా అదనపు బలం చేకూరింది. అయితే ఇటీవల ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందన్న వార్తలు జోరందుకున్నాయి. నిజానికి గత ఎన్నికల్లోనూ ఆమె రాజకీయ ప్రవేశం గురించి కొన్ని వార్తలు వచ్చినా వాటిని అప్ప్పుడే ఖండించింది. తాను కేవలం ఎమ్మెల్యేల మల్లారెడ్డి తొలి రాజకీయ ప్రవేశం నుంచి కనిపిస్తున్నారు. ప్రజలకు చేరువౌతున్నారు. అలా మేడ్చల్ జిల్లాలో జరిగే అనేక ఎన్నికల సమయాల్లోనూ ప్రచారం నిర్వహించే బాద్యతలు ఆమె చేపడుతూ వచ్చారు. గత ఎన్నికల ముందు ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. కాని అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్ప్పుడు ఎన్నికలకు మÖడేళ్ల ముందుగానే ఆమె రాజకీయ ప్రవేశంపై వార్తలు విరివిగా వస్తున్నాయి. వాటిని ఆమె కూడా ఎక్కడా ఖండించలేదు. అంటే మౌనం అంగీకారం అనే అర్దం నిజం కాబోతుందన్న తేలిపోయింది. అయితే ఆమె బిఆరఎస్‌కు దూరంగా బిజేపికి చేరువకానున్నారు. సహజంగా విద్యార్ధి రాజకీయాల ఎంతో కొంత ఒంటబట్టినా, అప్ప్పుడు రాజకీయ ప్రవేశం ఆగిపోయిన వారు ఇలా అవకాశం కలిసి వచ్చినప్ప్పుడు చేరుతుంటారు. సహజంగా మన దేశంలో దేశ భక్తి, దైవ భక్తి వున్న వారు ఎక్కువగా బిజేపి పార్టీని కోరుకుంటుంటారు. అది సహజం. ప్రీతి రెడ్డిలో ఎనలేని దేశ భక్తి వుంది. ప్రాంత భక్తి వుంది. ఆమె విదేశాలకు వెళ్లినప్ప్పుడు ఎక్కడైనా మీరు ఎక్కడినుంచి వచ్చారన్న ప్రశ్నకు చెప్పే సమాదానం తర్వాత అవతలి వారు మరో ప్రశ్న వేయడం విచిత్రంగా అనిపించేది. ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్నకు ఎవరైనా హైదరాబాద్ అని చెబుతుంటాం. ఏ హైదరాబాద్ అని అవతలి వ్యక్తులు మరో ప్రశ్న వేసినప్ప్పుడు మరీ చిత్రంగా తోస్తుంది. అంటే మీరు ఇండియనా, లేక పాకిస్తానా? అర్ధం వచ్చేలా వారి ప్రశ్న వుండడం ఆమెను ఒక దశలో కలిచి వేసినంత పనైంది. మన దురదృష్టమేమిటంటే మన దాయాది దేశం పాకిస్తాన్‌లో కూడా ఓ హైదరాబాద్ వుండడం దౌర్భాగ్యం. ఆ పేరు అక్కడ కూడా పేరొందని ప్రాంతం కావడం మనకు మరీ ఇబ్బందికరం. అందుకే విదేశాలలో ఏ హైదరాబాద్ అనే ప్రశ్న వినాలంటే కూడా ప్రీతిరెడ్డికి ఇబ్బందిగా అనిపించేది. అయినా మన హైదరాబాద్ పేరు పూర్వ అది కాదు. మనం ఇప్ప్పుడు పిలుచుకుంటున్న హైదరాబాద్ ఒకప్ప్పుడు గోల్కొండ రాజ్యం. ముత్యాల నగరం అని కూడా అనేవారు. హైదరాబాద్ చుట్టూ అందమైన తోటలు వుండేవి. అందువల్ల బాగ్ నగరం అని కూడా పిలుస్తూ వుండేవారు. తర్వాత కాలంలో బాగ్యమతి అనే యువతి పేరు మీద బాగ్యనగర్ అని ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ముస్లిం రాజులో ఒకడైన హైదర్ పేరు మీద హైదరాబాద్ గా పిలవడం మొదలైంది. అయితే అప్ప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది. హైదర్ అనే పదానికి సింహం అని అర్దం వస్తుంది. అప్పట్లో హైదరాబాద్ చుట్టూ అటవీ ప్రాంతం విస్తరించి వుండేది. అది సింహాలకు నిలయంగా వుండేది. అందువల్ల ఆ పేరు పెట్టినట్లు నాటి ముస్లిం రాజులు నమ్మించారు. తర్వాత అదే పేరు సుస్ధిరం చేశారు. కాని హైదరాబాద్‌ను బాగ్యనగరం అని కూడా పిలుస్తూ వుండేవారు. బిజేపి పార్టీ ఏర్పాటైన తర్వాత బాగ్యనగర్ అనేది బాగా ప్రసిద్ది చెందింది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కూడా బాగ్యనగర్ అనే పేరును విసృతంగా వాడుతూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వాలు బాగ్యనగర్ అనే పేరును మరుగున పడేస్తూ వచ్చారు. బిజేపి పార్టీ మళ్లీ ఆ పేరును పదే పదే ప్రస్తావిస్తూ వచ్చింది. కాని ఇటీవల ప్రీతిరెడ్డి చేసిన కొన్ని ప్రకటనల మÖలంగా బాగ్యనగర్ ఉద్యమం మొదలైందని చెప్పాలి. ఆమె ఇచ్చిన పిలుపు మేరుకు బిజేపికి చెందిన వానర సేన లాంటి సంస్ధలు జనంలోకి విపరీతంగా తీసుకెళ్తున్నారు. ఆమె కూడా ఎక్కడ ఈ ప్రస్తావన వచ్చినా బాగ్యనగర్ అంటూ సంబోధిస్తుండడంతో ప్రజలను ఆకట్టుకుంటోంది. మన హైదరాబాద్‌ను ప్రస్తావిస్తే, విదేశాలలో పాకిస్తాన్‌ను గుర్తుచేయడం అనేది మన దేశభక్తులకు ఎంతైనా ఇబ్బంది కరం. దేశ భక్తి, దైవ భక్తి ఎంతో వున్న ప్రీతిరెడ్డికి మన నగరాన్ని ఇకపై బాగ్యనగరం అనే పేరుతోనే అందరూ ప్రస్తావించాలని సూచించడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తోంది. ఇది వ్యక్తిగతంగా ఆమెకు, రాజకీయంగా బిజేపికి ఎంతో ప్లస్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇంత అంకితభావంతో గతంలో ఎవరూ బాగ్యనగర్ అని ఒక ఉద్యమంగా తీసుకెళ్లలేదు. నిజం చెప్పాలంటే ఎన్నికల సమయంలోనే ఎక్కువగా ఆ మాట వినిపించేది. గణేష్ నవరాత్రుల సమయంలో బాగ్యనగర్ ఉత్సవ సమితి అనే పేరుతో వినిపించేది. అంతే కాని ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటికీ ఈ పదం వాడడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే ముస్లిం ఓట్లు ఎక్కడపోతాయో? అనే భయంతో ఒక్క బిజేపి తప్ప మరే పార్టీ బాగ్యనగర్ అనేందుకు ధైర్యం చేయలేకపోయాయి. ఇప్పటికీ వాటి నోటి నుంచి ఆ పదం రావడానికి కూడా ఇష్టపడరు. అందుకే ప్రతీరెడ్డి ఎంతో ధైర్యం చేశారు. బాగ్యనగర్ అనే పేరును ప్రతి వ్యక్తి చేత అనిపించేలా ఆమె పదే పదే గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అని అందరూ అనేలా ఉద్యమం ఎలా సాగిందో ఇప్ప్పుడు బాగ్యనగర్ అనే పదం ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రతీరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. దేశభక్తి, దైవ భక్తికి సంబంధించి ప్రజల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచేందుకు కూడా ఎంతో దోహదపడుతున్నారు. మన దేశం బలమైన హిందూ దేశంగా నిర్మాణం సాగాలని ఆమె కోరుకుంటున్నారు. అందుకే ఆమె కార్యాచరణలోకి దిగారు. ఏకంగా మÖడు క్యాంపస్‌లకు చెందిన విద్యార్దులు, వారి తల్లిదండ్రులు, కాలేజీల సిబ్బందితో కలిసి ఆమె నిర్వహించిన శివరాత్రి ఉత్సవం తెలంగాణలోనే కాదు, దేశంలో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసింది. సహజంగా విద్యా సంస్ధల్లో భక్తి పరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ధైర్యం చేయరు. అదే మైనార్టీ స్కూళ్లలో వారి ఆద్యాత్మిక కార్యక్రమాలు జరిగితే ఎవరూ ప్రశ్నించరు. కాని మన హిందూ స్కూళ్లలో హైందవ సంస్కృతి కనిపించేలా వుంటే మాత్రం రాజకీయం చేస్తారు. అలాంటి రోజులకు చరమగీతం పాడేలా మొదటిసారి ప్రతీరెడ్డి మల్లారెడ్డి కాలేజీల క్యాంపస్‌లో మహాశివరాత్రి ఉత్సవం నిర్వహించారు. ఉపవాసం, జాగరణం తోపాటు శివయ్యకు అబిషేకాలు, పూజలు పెద్దఎత్తున నిర్వహించి తన దైర్యం ఏమిటో ప్రతీరెడ్డి చూపించారు. బిజేపి పెద్దల దృష్టిలో పడ్డారు. భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలకు ఒక ఐకాన్‌గా ప్రతీరెడ్డిని ఎంపిక చేయాలని బిజేపి పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యావంతురాలు కావడం వల్ల దేశ వర్తమాన రాజకీయాలు, పరిస్ధితులు, ఆర్దిక స్దితిగతులపై ఆమెకు సంపూర్ణ అవగాహన వుంది. మన దేశ ఇతర ప్రపంచ దేశాలలో పోటీ పడుతూ ఎకానమీలో దూసుకెళ్తున్న విదానం ఆమెకు తెలుసు. ఇప్పటికే ప్రపంచంలో మÖడో అతిపెద్ద ఎకానమీగా మన దేశాన్ని తీర్చిదిద్దిన ప్రదాని మోడీ పాలన అంటే ప్రీతిరెడ్డికి ఎంతో గౌరవం. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయించి, భవిష్యత్తు బారతంలో మహిళపాత్రను పెంచిన బిజేపికి ఆమె దగ్గరౌతూ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజేపికి అదికారంలోకి రావాలంటే ప్రీతి రెడ్డి లాంటి నాయకులు కావాలి. ఆమె వాక్పటిమ, మాట్లాడే విధానం, ప్రజలకు అర్దమయ్యే తరహా ప్రసంగం ఆమెలో గొప్ప నాయకత్వ లక్షణాలు అని చెప్పొచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version