ఈ నెల 18న సీఎం కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. 

ఖమ్మం జిల్లా: ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సందర్శించారు.

అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసే సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

సమీక్షలో మంత్రి హరీశ్ రావు వెంట స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.

*ఆరోగ్య రంగంలో తెలంగాణ నెం.1 స్థానానికి చేరాలి*

*ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలి*

*రౌండ్ ద క్లాక్ వైద్యులు అందుబాటులో ఉండాలి*

*అనవసర రిఫరల్స్ తగ్గించాలి, స్థానికంగా చికిత్స అందించాలి*

*టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు*

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్గనిర్దేశనంలో అందరం కలసి చేస్తున్న కృషి వల్ల వైద్యారోగ్య రంగంలో మనం దేశంలోనే మూడో స్థానానికి చేరుకున్నామని, మొదటి స్థానానికి చేరడమే లక్ష్యంగా పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచింగ్ ఆసుపత్రుల పనితీరుపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా ఆసుపత్రులు బలోపేతం చేసుకుంటున్నామని, అధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చుకుంటున్నామన్నారు. అవసరమైన వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమించుకుంటున్నామని తెలిపారు. 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించగా, మంచి స్పందన వస్తున్నదన్నారు. మెడికల్ కాలేజీల్లో 201 ట్యూటర్ల పోస్టులు భర్తీ చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తరుపు నుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని, వైద్య సిబ్బంది సైతం ఉత్సాహంగా పని చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. కొత్తగా 800 మంది పీజీ SR లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రులకు అవసరం మేరకు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషాలిటీ సేవలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఎక్కువగా జిల్లాల్లో వీరిని కేటాయించడం జరిగిందన్నారు. వీరి సేవలను పూర్తి స్థాయిలో వినియోగం చేసుకునే బాధ్యత సూపరింటెండెంట్లదే అన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉండాలని, ఏ సమయంలో వచ్చినా పేషెంట్లకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రౌండ్ ద క్లాక్ సేవలు అందేలా చూడాలన్నారు. అవసరం అయితే తప్ప రెఫరల్ ఆసుపత్రులకు రిఫర్ చేయకూడదన్నారు. స్పెషాలిటీ సేవలు సైతం జిల్లా పరిధిలోనే ప్రజలకు అందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గారు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. ఎన్ ఎం సి నిబంధనలు ప్రకారం నడుచుకునేలా మెడికల్ కాలేజీలను చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ ల పైన ఉందన్నారు. తరగతులు, అనుమతుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. స్టయిఫండ్సు, వేతనాలకు సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని, ఎలాంటి ఆలస్యం జరగకుండా సూపరింటెండెంట్ లు చూసుకోవాలన్నారు. టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. అవయవ దానం ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలన్నారు. డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు ఉచితంగా మందులు ఇచ్చి పంపాలని, ఈ విషయం పేషెంట్లకు తెలిసేలా బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన ఆసుపత్రుల్లో రాత్రి వేళల్లో పోస్టుమార్టం జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను ఏకకాలంలో ప్రారంభించుకున్నామని, అన్ని వైద్య పరికరాలు పనిచేసేలా చూసుకోవాలని, గర్భిణులకు నిరంతరం సేవలు అందాలన్నారు. కొత్త మెను ప్రకారం డైట్ అందుతుందా లేదా తరుచూ చెక్ చేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ సమావేశమై మానిటరింగ్ చేసుకోవాలని ఆదేశించారు. 

 

సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఇ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీపీహెచ్ శ్రీనివాస రావు, అన్ని టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ముగ్గుల‌ పోటీలలో విజేతలకు బహుమతులు.

ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున పోటీలు.

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలలో ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణ.

సంక్రాంతి ముగ్గులకు ఎంతో ప్రత్యేకత. 

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన బొంతు రామ్మోహన్.

ఉప్పల్, నేటిధాత్రి ప్రతినిధి: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలలో సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనదని జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. బుధవారం ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ల లో మహిళలు ఎంతో అందంగా తీర్చిదిద్దిన రంగవళ్లులలో విజేతలైన వారికి బొంతు రామ్మోహన్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సంక్రాంతి ముగ్గులకు ప్రత్యేకమైన విశిష్టత వుంటుందన్నారు.

సంక్రాంతి నిలబెట్టిన నాటి నుంచి కనుమ‌ పండుగ వరకు వాకిళ్ల నిండా ముగ్గులు వేయడం ఆనవాయితీ. పల్లెల్లో వాకిలిలో చిన్న స్థలం కూడా వదలకుండా ఊరంతా ముగ్గులతో నింపేస్తారు. ఇక బోగి, సంక్రాంతి, కనుమ రోజులలో ఆ సందడే వేరు. సంక్రాంతి రోజున తెలంగాణ పల్లెల్లో ఎద్దుల బండ్ల ఊరేగింపులు ఇప్పటికీ కొనసాగుతుంటాయి. కనుమ పండగ రోజున కాటమయ్యకు పూజలు చేసి, పశువులను కొలవడం ద్వారా పాడి..పంటలకు లోటుండదు. అనాదిగా వస్తున్న ఆచారాకు ఆరోగ్యాలకు ప్రతీకలు. ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని బొంతు రామ్మోహన్ కోరారు. ముగ్గుల పోటీలలో విజేతలైన మహిళలకు బొంతు రామ్మోహన్ అభినందనలు తెలిపారు. అనంతరం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ బన్నలా గీత ప్రవీణ్, బొంతు శ్రీదేవి యాదవ్, మాజీ కార్పొరేటర్లు గొళ్ళూరి అంజయ్య , మేకల అనల హనుమంత రెడ్డి, గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు , నందికొండ శ్రీనివాస్ రెడ్డి , మేకల మధుసూదన్ రెడ్డి, గజ్జెల సత్యరాజ్ గౌడ్ , గ్యార ఉపేందర్, కాయ హనుమంతు, బుత్కురి నవీన్ గౌడ్, జహంగీర్ గౌడ్, శివ, జాన్, అల్ల బాషా, మొహమూద్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతి కుమారి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన శాంతి కుమారి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టనున్నారు. 

తనకు సిఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసిఆర్ గారిని కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు.

 

ఈ సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

 

ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. 

గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

రైతన్న నేస్తం కేసిఆర్‌

` రైతు సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్‌.

` కేసిఆర్‌ నాయకత్వంలో దేశ ప్రగతి పరుగులు. 

`బిఆర్‌ఎస్‌ తోనే దేశ మంతా కాంతులు…

`తెలంగాణ రూపు రేఖలు మార్చారు.

`ఎనమిదేళ్ల కింద తెలంగాణలో గోసలు.

` ఇప్పుడు తెలంగాణ బంగారు పంటలు.

`ఒక నాడు ఎండిన బీడులు…

`ఇప్పుడు పచ్చని పసిడి సిరుల పల్లెలు.

`ఎటు చూలినా నీళ్లే….కను చూపు మేర పొలాలే…

`పచ్చదనం పర్చుకొని పరవశిస్తున్న భూములు.

`చెరువుల నిండుగా….మత్స్య సంపద పండగ.

` రైతు భరోసాకు రైతు బంధు ఆసరా.

`రైతు క్షేమమే దేశ సంక్షేమం…

`విద్య, వైద్య రంగాలలో గణనీయమైన మార్పులు…

`పల్లె పల్లెకూ అందుతున్న ప్రభుత్వ వైద్య సేవలు…

`దేశమంతా కరంటు వెలుగులు….

`దేశ రైతాంగానికి తీరనున్న కరంటు కష్టాలు.

`నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మనసులో మాట.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాలం పరుగులకు కళ్లెం వేయగలవారే విజేలౌతారు. ఆ కాలాన్ని సద్వినియోగం చేసి, ప్రజలకు సేవ చేసిన వాళ్లు గొప్ప మార్గ దర్శకులౌతారు. ఆ ప్రజలకు దిక్సూచీ అవుతారు. ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతారు. జనం కష్టాలను తీర్చుతారు. నాయకులుగా చరిత్రలో నిలిపోతారు. అలాంటి నాయకుడు కేసిఆర్‌. తను కలగన్నాడంటే అది నిజం చేసి చూపిస్తాడు. ఆ కలతో తెలంగాణ ఆవిష్కరించాడు. అలుపెరగని పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం చేసి తెలంగాణ సాధించాడు. తెచ్చిన తెలంగాణలో అధ్భుతాలు సృష్టించి, ఊహకందని తెలంగాణ నిర్మాణం చేశాడు. అన్ని వర్గాల ప్రజల జీవితాలు ఆనందమయం చేశాడు కేసిఆర్‌. అని అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మనసులో మాట నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో….

రైతు సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్‌. 

తెలంగాణ గోస కళ్లారా చూసి అనేక సార్లు కంట నీరు పెట్టుకున్న నాయకుడు కేసిఆర్‌. తాను కూడా స్వయంగా రైతు. రైతు కష్టాలు తెలుసు. రైతులు పడే ఇబ్బందులు తెలుసు. రైతాంగం ఎదుర్కొనే సమస్యలన్నీ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సాగే సాగుతో రైతుల దుఃఖం చెప్పనలవి కానిది. అటు గోదావరి పారినా తెలంగాణ కు చుక్క నీరందని రోజులు. ఇటు కృష్ణమ్మ పారినా పాలమూరు, రంగారెడ్డి ,నల్గొండ ఎండిన కాలం. ఎటు చూసినా బీడులు. పడావు బడ్డ భూములు. ఎండిపోయిన బావులు. వాటికి పూడికలు తీసుకునే స్థోమత లేని రైతులు. చినుకు పడగానే సంబరపడి ఈ ఏడాదైనా పంట తీద్దామని అప్పు చేసి, పొలం పెడితే ఎండిపోవడం తప్ప పంట చేతికి రాని రోజులు. అయినా భూమిని నమ్ముకొని, మళ్ళీ అప్పులు చేసి బోర్లేసినా నీళ్లు పడక కన్నీళ్లతో వ్యవసాయం చేసిన ప్రాంతం తెలంగాణ. బిందెలతో నీళ్లు పోసి, మొక్కలు తడిపినా, చినుకు జాడ లేక విత్తులు మొలకెత్తని గోస తెలంగాణది. అలాంటి తెలంగాణలో నీటి జాడలు కలలో కూడా చూస్తామని ఏ ఒక్కరూ అనుకోలేదు. కానీ ఒక్క కేసిఆర్‌ కలగన్నాడు. తెలంగాణ చీకట్లను పారద్రోలానుకున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కష్టాలు తీరడం కల అని గుర్తించాడు. తెలంగాణ సస్యశ్యామలం కావాలి. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలి. ఎటు చూసినా పచ్చదనం వెల్లివిరియాలి. తెలంగాణలో బంగారు పంటలు పండాలి. ఇవన్నీ సాధ్యం కావాలంటే తెలంగాణ రావాలి. తెలంగాణలో ప్రాజెక్టులు రావాలి. రిజర్యాయర్ల నిర్మాణం జరగాలి. చెరువుల పునరుద్ధరణ జరగాలి. ప్రతి ఊరిలోనూ భూ గర్భ జలాలు తొనికిసలాడాలి. వాగులు వంకలు పొంగాలి. చెక్‌ డ్యాంల నిర్మాణం విరివిగా జరగాలి. ఎక్కడికక్కడ జలసిరులు నిండాలి. అవి పొలాలకు మళ్లాలి. నిరంతరం నీరు పంటకు అందుబాటులో వుండాలి. నీరు లేదన్న మాట వినపడకూడదు. ఎండిన పంటలు అన్న మాట తెలంగాణలో వినిపించకూడదు. తెలంగాణ కూడా ఒక ధాన్యాగారం కావాలి. దేశానికి తిండిపెట్టాలి. తెలంగాణ రైతు దేశాన్ని సాదాలి. ఇదీ తెలంగాణ ఉద్యమం చేపట్టిన నాడే ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలగన్న తెలంగాణ. అలా ప్రజల కోసం కలగని ఆ కలలు నెరవేర్చిన నాయకుడు ప్రపంచంలో ఒక్క కేసిఆర్‌ మాత్రమే… ఒకే ఒక్కడు కేసిఆర్‌ మాత్రమే… 

తెలంగాణ రూపు రేఖలు మార్చారు. అనుకున్నది సాధించాడు.

ఎనమిదేళ్ల కింద తెలంగాణలో గోసలు చెప్పుకుంటే ఒక్క పూటలో చెప్పుకునేంత చిన్నవి కాదు. ఎంత చెప్పినా ఒడువని ముచ్చట. తెలంగాణలో పంటలు పండాలంటే కరంటు కావాలి. ఆ కరంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఆ కాలంలో రైతుకు వ్యవసాయం తప్ప మరో వ్యాపకం లేదు. సాధ్యం కాదు కూడ. రాత్రిళ్లు బావుల దగ్గరే నిద్రలు. కరంటు షాకులు. పాముకాట్లు. రైతు ప్రాణాలకు భరోసా లేని జీవితం. ఇక గాలి దుమారాలకు వైర్లు తెగిపోయి, రాత్రి వేళల్లో పొలానికి వెళ్లిన రైతులు చీకట్లో కరంటు వైర్లకు తగిలి ఎంతో మంది కాలి బూడిదైపోయేవారు. ఇక ఇళ్లకొచ్చే కరంటు సంగతి కూడా అంతే…చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు కూడా కరంటు కష్టాలు. తెలంగాణలో పారిశ్రామిక రంగం కుదేలు. పవర్‌ హాలీడేస్‌…ఆఖరుకు అసలే సక్కగలేని సాగుకు కూడా విరామాలు తీసుకున్న రోజులు. అంతటి గడ్డుదినాలు. 

మరి. ఇప్పుడు తెలంగాణ బంగారు పంటలు. పాలమూరులో కూడా పసిడి సిరులు. పలుగురాళ్లు తేలి, పొలాలలో పోట్రౌతులు తాకే భూములు ఇప్పుడు సస్యశ్యామలమయ్యాయి. వలసల జిల్లాగా ఊర్లకు ఊర్లు మాయమై, ఇండ్లు శిదిలమై, బతికిన రోజులు. కానీ ఇప్పుడు అదే పాలమూరుకు పొరుగు కర్ణాటక నుంచి కూలీ పనులకు ప్రజలొస్తున్నారు. ఎండిన పాలమూరులో నీటి పరవళ్ళు చూసి ఆశ్చర్య పోతున్నారు. పొలాల నిండుగా నీళ్లు చూసి చలించిపోతున్నారు. గజం ఖాళీ వుంచక భూములన్నీ పొలాలుగా మారడాన్ని బిత్తరపోయి చూస్తున్నారు. పెరిగిన నీటి మట్టాలతో, ఇరవై నాలుగు గంటలు బోర్లు నడుస్తుంటే మేం తెలంగాణలో కలుస్తామంటున్నారు. ఒక నాడు ఎండిన బీడులు… ఇప్పుడు పచ్చని పసిడి సిరుల పల్లెలు. ఎటు చూలినా నీళ్లే….కను చూపు మేర పొలాలే…పచ్చదనం పర్చుకొని పరవశిస్తున్న భూములు. అసలు తెలంగాణలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఊహలకందనిది. తెలంగాణలో ప్రాజెక్టులు అంటే ఎత్తిపోతలు.

అవి సాధ్యమయ్యేవి కాదు. అన్న అభిప్రాయం అందరిది. నిర్మాణ వ్యయాలు ప్రభుత్వాలు మోయలేవు. నిర్వహణ వ్యయాలు తప్పవు. అని ఆనాడు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణను ఎండబెట్టారు. సాగును పండబెట్టారు. పాలించే ప్రభుత్వాలు పట్టించకోకపోతే ఎలా? అన్నదే కేసిఆర్‌ ఆలోచన. అందుకే తెలంగాణ రైతాంగం ఇంత కాలం పడిన గోస చాలు. ఆ కష్టాలు ఇంకా పడడం కరక్టు కాదు. అని కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేశాడు కేసిఆర్‌. మూడేళ్ల కాలంలో కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టు నిర్మాణం అన్నది కేసిఆర్‌ లాంటి నాయకుడి వల్లనే సాధ్యమైంది. తెలంగాణను మరెవరు పాలించినా అసలు కాళేశ్వరం వుండేది కాదు. రిజర్వాయర్లు వుండేవి కాదు. చెరువులు బాగుపడేవి కాదు. భూగర్భ జలాలు పెరిగేవి కాదు. రైతు కష్టం తీరేది కాదు. తెలంగాణ సస్యశ్యామలమయ్యేది కాదు. తెలంగాణ వచ్చినా రూపురేఖలు మారేవి కాదు. విఫల తెలంగాణ అని ముద్రపడేది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని పాడుకోవాల్సి వచ్చేది. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ అభివృద్ధి చేయగలడు. అన్న ప్రజల నమ్మకం నూటికి వెయ్యిపాళ్లు నిజమైంది. ఏ తెలంగాణ వాది ఊహించని తెలంగాణ ప్రగతి ఆవిషృతమైంది. అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. కేసిఆర్‌ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తోంది. 

 తెలంగాణ ప్రగతి ప్రణాళిక దేశంలో ఆచరణ కావాల్సి వుంది.

 ఇప్పుడు దేశమంతా కేసిఆర్‌ నాయకత్వం కావాలని కోరుకుంటోంది. ఒకనాడు చెరువులే దిక్కుగా తెలంగాణలో సాగు సాగింది. కొంత కాలానికి అది కూడా లేకుండా పోయింది. కానీ ఇప్పుడు తెలంగాణలో చెరువులన్నింటికీ జలకళ వచ్చింది. మూడేళ్ళలో తెలంగాణలో 46 వేల చెరువులు మరమ్మత్తులకు నోచుకున్నాయి. మిషన్‌ కాకతీయ తో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి. తెలంగాణలో మత్స్య పరిశ్రమకు పూర్వపు రోజులొచ్చాయి. పల్లెల్లో పాడి, పంట, చేతి వృత్తులు మళ్ళీ పునరుజ్జీవనం పొసుకున్నాయి. పల్లె కన్నీరు పెడుతుందో అన్న పాట విన్న చెవులతోనే పల్లెలు మురుస్తున్నాయి…పన్నీటి జలకాలాడుతున్నాయని వింటున్నాము…కళ్ల నిండా చూస్తున్నాము. అదీ కేసిఆర్‌…

 రైతు భరోసాకు రైతు బంధు ఆసరా.

 తొలకరి పలకరింపుతోనే తెలంగాణ రైతుకు దిగులు మొదలయ్యేది. చినుకు పడిరదని సంబురపడాలో…చేతిలో చిల్లి గవ్వలేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితులు. అప్పు చేస్తే తప్ప సాగు సాగని రోజులు. కానీ ఇప్పుడు తొలకరి ఎప్పుడు పడుతుందా అని రైతు ఎదురుచూడాల్సిన పని లేదు. అప్పు కోసం ఆరాటపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏడాది పొడవునా నీళ్లే…ఎల్ల కాలం పొలాలు పారుడే…పంటలు పండుడే…అందుకు పెట్టుబడి సాయం రైతు బంధు ఏటా రెండు సార్లు బ్యాంకు ఖాతాలో పడుడే…! ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఏ తెలంగాణ వాది కలలో కూడా ఊహించలేదు. ఎవరూ ఊహించని వరాలు ఇవ్వడమే కేసిఆర్‌ కు తెలుసు. రైతు క్షేమమే దేశ సంక్షేమం…విద్య, వైద్య రంగాలలో గణనీయమైన మార్పులు…పల్లె పల్లెకూ అందుతున్న ప్రభుత్వ వైద్య సేవలు…బిఆర్‌ఎస్‌ తోనే దేశ మంతా కాంతులు…కేసిఆర్‌ నాయకత్వంలో దేశ ప్రగతి పరుగులు. దేశమంతా కరంటు వెలుగులు….దేశ రైతాంగానికి తీరనున్న కరంటు కష్టాలు. దేశంలో ఇక బిఆర్‌ఎస్‌ ప్రభంజనం… దేశమంతా మారుమ్రోగనుంది బిఆర్‌ఎస్‌ నినాదం…దేశం ఎదురుచూస్తోంది కేసిఆర్‌ నాయకత్వం కోసం.

కాలం కరిగిపోతోంది…కన్నీళ్లు ఇంకిపోతున్నాయి!

`తిరిగి, తిరిగి అలసిపోతున్నారు.

`విసిగి వేసారిపోతున్నారు.

`ఓపిక కూడగట్టుకొని ఇంకా తిరుగుతున్నారు.

`ఇంత కాలం తిరిగి, ఇప్పుడు వదిలేయలేక దుఖిస్తున్నారు.

`ఇప్పటికైనా కనికరించండి.

` కేటిఆర్‌ మాట ఇచ్చాడనే ఆశతో తిరుగుతున్నారు.

`కడియం శ్రీహరి మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.

`ఉద్యోగ సంఘాల నాయకుల తప్పకుండా తమకు కొలువులిప్పిస్తారని విశ్వాసంతో వున్నారు.

`ప్రతిసారీ దేవి ప్రసాద్‌, పరిటాల సుబ్బారావు, కారం రవీందర్‌ రెడ్డి ల చొరవను పదే పదే గుర్తు చేసుకుంటూ వుంటారు.

`ఎన్నటికైనా వాళ్లు దారి చూపిస్తారని చెప్పుకుంటుంటారు. 

`ఆ 51 మంది నిరంతరం తలుచుకుంటూనే వున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 వాళ్ల బాధ వర్ణనాతీం…ఎంత చెప్పినా తక్కువే…ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు…ఆరేళ్లగా అవస్ధలు పడుతున్నారు. కష్టాలు ఎదుర్కొంటున్నారు. కన్నీళ్లు దిగమింగుకొని బతుకుతున్నారు. అయినా బతుకులకు ఏదో ఒక రోజు దారి కనిపిస్తుందన్న ఆశతో సాగుతున్నారు. కనిపించిన నాయకుడికి సమస్యలు వివరించారు. ఎదురొచ్చిన నాయకుడికల్లా గోడు వినిపించుకున్నారు. గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. మొక్కులు మొక్కుకున్నారు. ఏ దేవుడు కరుణించడం లేదు. ఏ నాయకుడు వారిని పట్టించుకోవడం లేదు. అందరూ సాయం చేస్తామన్న వాళ్లే…కాలం కలిసి రావడం లేదు. వాళ్ల వ్యధలు తీరడం లేదు. పోయిన కొలువులు రావడం లేదు. అయినా నమ్మకం సడలడం లేదు. వారికి ఎక్కడో ఒక దగ్గర విశ్వాసం వుంది. ఎన్నటికైనా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వుంది. మాట ఇచ్చిన వాళ్లు చిన్న చిన్న నాయకులు కాదు. ఒకరు రాష్ట్ర మంత్రి కేటిఆర్‌. ఆయన మాట ఇచ్చాక ఎప్పటికైనా తమ జీవితాలు నిలబడతాయని కొండంత ఆశ. మరో నాయకుడు తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఆది నుంచి గృహనిర్మాణ శాఖ నుంచి తొలగింపబడిన ఉద్యోగులకు సానుభూతి చూపిస్తూనే వున్నారు. వారికి సాయ పడుతూనే వున్నారు. అనేక ప్రయత్నాలు చేశారు. తొలుత వాళ్లు కడియం శ్రీహరిని కలిసినప్పుడు అప్పటి కలెక్టర్‌కు విషయం వివరించారు. ఆనాటి నుంచి ఒక దశలో అప్పాయింటు మెంట్లు వచ్చే దశకు చేరుకునేలా చేశాడు. వాళ్లకు కొలువులు వస్తున్నాయన్న శుభవార్త కూడా కడియం శ్రీహరి వాళ్లకు చెప్పారు. కాని ఎందుకో అర్థాంతరంగా ఆగిపోయాయి. 

 తిరిగీ తిరిగి 51 మంది ఉద్యోగులు ఎంతో అలసిపోయారు. 

వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో కొలువులు ఎప్పుడో రావాల్సివుండేది. కాని అప్పటి మేయర్‌ చేసిన చిన్న పని మూలంగా వారి జీవితాలు మళ్లీ మొదటికొచ్చాయి. అక్కడి నుంచి కదలకుండా చేశాయి. నిజానికి ఈ 51 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి పై స్ధాయి నుంచి కింది స్ధాయిదాకా సుముఖంగానే వున్నారు. ఇప్పటికీ అందరూ అయ్యో అనే అంటున్నారు. కాని ఆనాడు అప్పటి మేయర్‌ చేసిన పని మూలంగా వారి కష్టాలు ఇప్పటికీ తీరలేదు. కొలువులు రాలేదు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ కూడా ఎంతో పకడ్భందీగా చెప్పారు. మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని ఒకటికి రెండుసార్లు చర్చకు తెచ్చి మరీ కేటిఆర్‌ మాట ఇచ్చారు. తొలగించబడిన ఉద్యోగులను తీసుకోవాలని ఇప్పటికే రెండు సార్లు మున్సిపల్‌ కార్పోరేషన్‌లో కూడా తీర్మాణాలు జరిగాయి. మినట్స్‌లో పొందుపర్చడం జరిగింది. వారి పేర్లతో సహా ఉద్యోగ కల్పనపై పూర్తి స్పష్టత వుంది. కాని అప్పటి మేయర్‌ ఒక దశలో 450 మంది ఇతర ఉద్యోగులను తీసుకున్నాడు. వీళ్లకు ఆశపెట్టి మోసం చేశాడు. మంత్రి కేటిఆర్‌ ఆదేశాలను కూడా బేఖాతరు చేశాడు. కాని ప్రతిసారి మభ్యపెడుతూ, బైట ఒకలా, నాలుగు గోడల మధ్య ఒకలా మాట్లాడుతూ వారి జీవితాలకు దశ, దిశ లేకుండా చేశాడన్నది ప్రధానంగా ఉద్యోగుల ఆరోపణ, ఆవేదన. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. కాకపోతే ఇవ్వాలన్న చిత్తశుద్దిని ఎవరూ ప్రదర్శించడం లేదు. వీరి విషయంలో కమీషనర్‌ ఈ ఉద్యోగులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే పెద్ద సమస్య అవుతుందని చెప్పినా నాయకులు వినిపించుకోలేదు. పట్టించుకోలేదు. వారికి కొలువులు ఇవ్వలేదు. పైగా కొత్తగా కొంత మందిని తీసుకున్న సమయంలో కూడా వీరు ఎంత పట్టుబట్టినా కొలువులు రాలేదు. ఆఖరుకు సఫాయి కార్మికులుగా కూడ ఆపనిచేసేందుకు ముందుకొచ్చినా అధికారులు స్పందించలేదు. అప్పటి మేయర్‌ మనసు అసలే కరగలేదు. కనీసం మానవత్వం కూడా చూపలేకపోయారు. 

ఉద్యోగ సంఘాల నాయకులు చేసినంత కూడా రాజకీయ నాయకులు చేయలేకపోయారు. 

నిజానికి నాయకులు ఇలాంటి సమస్యలు పట్టించుకోవాలి. కాని ఉద్యోగ సంఘాల నాయకులు ఎంతో పట్టించుకున్నారు. దేవీ ప్రసాద్‌, పరిటాల సుబ్బారావు, కారం రవీందర్‌ రెడ్డిలు ఆ మాత్రం చొరవ చూపడం వల్లనే కనీసం వీళ్ల సమస్యలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి కేటిఆర్‌ దృష్టికి వెళ్లింది. ఒక దశలో పరిటాల సుబ్బారావు, కారం రవీందర్‌ రెడ్డిలు అనేక సార్లు వాళ్లను స్వయంగా హైదరాబాద్‌ కూడా తీసుకెళ్లేవారు. వాళ్ల కార్లలోనే తీసుకెళ్లి, మంచీ చెడులు చూసుకునేవారు. నిజానికి ఇవి చేయాల్సింది నాయకులు. కొందరు నాయకులు వీరికి ఉద్యోగాలు ఇస్తే మాకేం లాభం అన్న ఆలోచన చేశారు. మీకు ఎందుకు కొలువులియ్యాలి..రా…అన్నంత మాటలు కూడా మాట్లాడిన విషయాలు ఇప్పటికే నేటిధాత్రి వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే… మాజీ మేయర్‌, డిప్యూటీ మేయర్లతోపాటు, కొంత మంది నేతలు వీళ్లకు కొలువులు రాకుండా అడ్డుపడ్డారన్న సంగతులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. వారి స్వార్ధం కోసం ఈ 51 మంది జీవితాలలో ఆటలాడుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులైన దేవీ ప్రసాదర్‌, కారం రవీందర్‌ రెడ్డి, పరిటాల సుబ్బారావులు అంతగా పట్టించుకోవాల్సిన అసవరం లేదు. కాని వాళ్లు చూపిన జాలిలో నాయకులు పదో వంతు చూపినా ఇప్పటికే వీళ్లకు కొలువులు వచ్చాయి. 

అసలు వీళ్లపై కక్ష్య కొందరు నాయకులు ఎందుకు పెంచుకున్నారన్నదానిపై స్పష్టత లేదు. 

వీళ్ల నుంచి నాయకులు ఏదో ఆశించారన్నది మాత్రం స్పష్టమౌతోంది. కాని వాళ్లకు పూట గడవడమే కష్టమైన జీవితం గడుపుతున్నారు. అలాంటి వారి నుంచి ఏదో ఆశించడం కూడా అమానవీయం. అయినా కొందరు నాయకులకు అదేదీ పట్టడం లేనట్లు వుంది. వారు అనుకున్నది నెరవేరాలన్న ఆలోచనతోనే వున్నట్లు కనిపిస్తోంది. కాని వారి పరిస్ధితి మరీ దయనీయంగా వుంది. ఇలాంటి వారి నుంచి ఎలాంటివి ఆశించినా తప్పే అవుతుంది. అయినా ప్రజా సేవ కోసం వున్నామని నిత్యం చెప్పే నాయకులు వీరి జీవితాలకు వెలుగులిస్తే, మరింత పేరొస్తుంది. కాని పేరొస్తే ఏమొస్తుంది…అనుకునే నేతలు కూడా వరంగల్‌లో వున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇంత కాలం జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులు అసలు గుట్టు విప్పి, వీళ్లకు అన్యాయం చేస్తున్నవారికి నచ్చజెప్పి, వారి జీవితాలకు ఒక దారి చూపాలని కోరుతున్నారు. అంతే కాదు కడియం శ్రీహరి లాంటి సీనియర్‌ నాయకుడు కూడా వీరికి ఏదో ఒకదారి చూపాలన్న ఆలోచనతోనే వున్నాడు. కాకపోతే ఆయన ప్రయత్నాలు కూడా కొందరు అడ్డుకున్నట్లు స్పష్టమౌతోంది. ఏది ఏమైనా ఈ ఉద్యోగులను ఇంకా ఇబ్బంది పెట్టకండి అన్నది వారు కోరుకుంటున్నది.

నేను మీ బిడ్డను..మీ సేవ కోసమే ఉన్నాను: గడల శ్రీనివాస్‌ రావు.

`డాక్టర్‌ జిఎస్‌ఆర్‌ ట్రస్టు ద్వారా జాబ్‌ మేళా నిర్వహణ

`సుమారు పది వేల మంది యువత హజరు.

`ఏడు వేల మంది నిరుద్యోగులు ట్రస్టులో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

`65 కంపనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 

`అక్కడిక్కడే ఎంపికైన వారికి ఉద్యోగాలు కల్పించారు.

`ఆ వెంటనే నియామక పత్రాలు అందజేశారు.

`ఒక్క రోజే కొన్ని వేల మందికి నియామకపత్రాలు అందజేయడం ఒక రికార్డు.

`ఇది ఆరంభం మాత్రమే… నిరంతర ప్రక్రియ..

`ఈ రోజు హజరు కాలేని వారు ట్రస్టులో రిజిస్టర్‌ చేసుకుంటే చాలు…

`ఉద్యోగం కల్పించే భాద్యత ట్రస్టే తీసుకుంటుంది.

`నేను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం ఎంతో సంతోషంగా వుంది.

`ఎంత ఎత్తుకు ఎదిగినా ఇలాంటి కార్యక్రమాల ద్వారా సేవ చేయడం ఎంతో ఆనందాన్నిస్తుంది.

 కొత్త గూడెం,నేటిధాత్రి:

నేను మీ కొత్త గూడెం బిడ్డను…మీకు సేవ చేయడానికి వచ్చాను. మీ అభ్యున్నతి కోసం నా శక్తి,యుక్తిని ధారపోస్తాను. నేను పుట్టిన గడ్డకు ఎంతో కొంత ఇవ్వాలన్నదే నా అభిమతం. మన ప్రాంతం ఇంకా ఎంతో ఎదగాల్సిన అవరసరం వుంది. ప్రగతి మార్గాన పయనించాల్సివుంది. మీ సేవ కోసం నేనున్నాను. ఇది ప్రారంభం మాత్రమే…ఇక నుంచి మీ సేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో వుంటా…మీకు తోడుగా వుంటా…అని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు, డాక్టర్‌. జిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్లు చైర్మన్‌ గడల శ్రీనివాస్‌రావు అన్నారు. ఎవరు ఎంత ఎదిగినా, ఎంతటి స్ధాయిలో వున్నా, తన తోటి సమాజానికి సేవ చేయడంలో వున్న తృప్తి ఎందులోనూ వుండదని చెప్పారు. డాక్టర్‌ జిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ రోజు కొత్తగూడెంలో జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ జాబ్‌ మేళ ప్రారంభం మాత్రమే అన్నారు. భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతానికి ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని చెప్పారు. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి చదువుకొని ఎలాంటి అవకాశాలు లేని కాలంలో ఈ గడ్డనుంచి ఎదిగాను. నేను పట్టి పెరిగిన గడ్డ నాకు ఇంతటి జీవితాన్ని ఇచ్చింది. అందుకే నేను నా ప్రాంతానికి ఉపయోగపడాలి. కొత్తగూడెం ప్రాంతానికి నా శక్తి మేరకు ఎంత సేవ చేయాలో అంత చేస్తాను. అందుకు ఎంతో మంది శ్రేయోభిలాషులు సహకారం కూడా అందుతోంది. వారందరికీ నా కృతజ్ఞతలు అని శ్రీనివాస్‌ రావు అన్నారు. శనివారం కొత్త గూడెం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఆవరణలో డాక్టర్‌. జిఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రసు ్ట ద్వారా జాబ్‌ మేళా కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. సుమారు 10 వేల మంది నిరుద్యోగులు ఈ మేళాకు హజరయ్యారు. దాదాపు 7వేల మంది నిరుద్యోగులు రిజిస్ట్రర్‌ చేసుకున్నారు. అదనంగా మరో మూడు వేల మంది ఈ రోజు స్పాట్‌లో అప్లికేషన్లు అందించారు. ఈ జాబ్‌ మేళాలో సుమారు 65 వివిధ కంపనీలు పాల్గొన్నాయి. ఆయా కంపనీలకు అవసరమైన యువతలో అర్హతలను ఆధారంగా అక్కడిక్కడే ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసి, కొన్ని వేల మందికి అప్పాయింటు మెంటు లెటర్లు ఇవ్వడం జరిగింది. సహజంగా ఇలా ఎక్కడా జరగదు. కాని డాక్టర్‌. జిఎస్‌ఆర్‌. ఫౌండేషన్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసిన మేళాలో అక్కడిక్కడే ఉద్యోగాలకు ఎంపిక చేయడం అన్నది వినూత్నమైన అడుగు అని చెప్పక తప్పదు. మొదటగా ఓ దివ్యాంగురాలకు అమెజాన్‌ కంపనీ ఎంపిక చేసిన ఉద్యోగానికి చెందిన అప్పాయింటు మెంటు లెటర్‌ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఈ జాబ్‌ మేళా ద్వారా నా జన్మధన్యమైందని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా తన శాయశక్తులా చేయాల్సినంత సామాజిక సేవ చేస్తూనే వున్నాను. ఈ జాబ్‌ మేళా కార్యక్రమం ఇక్కడితో ముగిసేది కాదని, ఇది ఆరంభం మాత్రమే అని ప్రకటించారు. ఈ జాబ్‌ మేళాల తమ నమోదు ప్రక్రియ జరగని వాళ్లు, జిఎస్‌ఆర్‌ సెంటర్‌లో పేరు నమోదు చేసుకుంటే చాలు. వాళ్ల అర్హతకు సంబంధించిన ఉద్యోగం అందించే బాధ్యత కూడా ట్రస్టే తీసుకుంటుందని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అంతే కాదు అభ్యర్ధి ఇంటర్వూకు వెళ్లేందుకు అవసరమైన ఖర్చులు కూడా ట్రస్టే అందిస్తుందని, వారికి ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తుందని శ్రీనివాస్‌ చెప్పారు. ఓ వైపు ఇక్కడ ఉద్యోగాల జాతర మొదలైనట్లే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాల జాతర మొదలుపెట్టిందని చెప్పారు. నా ప్రాంత యువత కళ్లలో ఆనందం చూడడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నానని శ్రీనివాస్‌ రావు అన్నారు. నేను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎదిగిన జ్ఞాపకాల నుంచే సేవా భావం ఏర్పడిరదన్నారు. నన్ను ఇంత వాణ్ణి చేసిన గడ్డకు నేను కూడ ఎంతో కొంత చేయాలన్నదే నా తాపత్రయమని అన్నారు. ఎంతో మంది ఇబ్బందులకు గురి చేయాలని చూసినా…నన్ను ఇంత వాణ్ణి చేసిన పుట్టిన గడ్డకు సేవ చేస్తున్నానని అన్నారు. అనంతరం ధాత్రీ గ్రూప్‌ చైర్మన్‌, నేటిధాత్రి చీఫ్‌ ఎడిటర్‌. కట్టారాఘవేంద్రరావు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గడ్డమీద శ్రీనివాస్‌రావుకు అన్న మమకారం ఎంత గొప్పదో ఈ జాబ్‌ మేళాను చూస్తే అర్ధమౌతోంది. నేను ఎన్నో జాబ్‌ మేళాలను ప్రత్యక్ష్యంగా తిలకించాను. కాని ఇంతటి స్ధాయిలో జాబ్‌ మేళా నిర్వహన, స్పాట్‌లోనే ఉద్యోగ నియామక పత్రాలు అందించడం అన్నది గొప్ప విషయం. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి శ్రీనివాస్‌రావు గారికి ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ఒక అధికారిగా వున్న ఆయన చేసే సేవ కార్యాక్రమాలే ఇంతటి స్ధాయిలో వుంటే, ప్రజల హృదయాలలో చెరగని ముద్రతో ఆయన మరింత చేసే చేసే అవకాశం వస్తే, ఈ ప్రాంతాన్ని ఎంతగా అభివృద్ధి చేయగలరో అర్ధమౌతోంది. ఇలాంటి వారికి ప్రజల ప్రోత్సాహం కూడా ఎంతో అవసరమని అన్నారు. ఈ వెనుకబడిన ప్రాంతానికి మేలు చేయడానికి, తాను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న శ్రీనివాస్‌రావు సంకల్పాని ప్రతి ఒక్కరూ కొనియాడాల్సిన అవసరం వుందన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇలా ప్రజా సేవ మీద మక్కువ వున్నవారు ముందుకొస్తే తెలంగాణ కూడా మరో కొత్త రూపును సంతరించుకుంటుందని చెప్పడంలో సందేహం లేదన్నారు. ఏది ఏమైనా శ్రీనివాస్‌రావు చేస్తున్న ఈ సేవ సామాన్యమైంది కాదని…ఎంతో అంకితభావం వుంటే తప్ప చేయలేరని అందుకు ఆయన ప్రశంసలు చెప్పాల్సిన అవసవరం వుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రీనివాస్‌రావు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాని అన్నారు.

పని లేని, పసలేని, ప్రజల్లో లేని బిజేపి: ఎంపి వద్దిరాజు రవిచంద్ర.

`ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో బిజేపిపై రవిచంద్ర ఘాటు వ్యాఖ్యలు. 

`సిరిసిల్లను సిరుల సిల్ల చేసిన ఘనత కేటిఆర్‌ ది.

`ఒకనాడు సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అనేవారు.

`తెలంగాణ ఉద్యమ కాలంలోనే కేటిఆర్‌ సిరిసిల్లకు ప్రగతి బాటలు వేశారు.

`తెలంగాణ వచ్చాక సిరిసిల్ల రూపురేఖలు మార్చారు…

`ఇటీవల సిరిసిల్లలో జరిగిన సెస్‌ ఎన్నికలలో ఘోరంగా ఓడినంక కూడా బిజేపి కళ్లు తెరవలేదు.

` బిజేపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా సాగునీటి ఒక్క ప్రాజెక్టైనా కట్టారా? 

`తెలంగాణ లో ఇస్తున్నట్లు రైతుబంధు ఇస్తున్నారా?

`ఆసరా పింఛన్లు తెలంగాణలో ఇచ్చినంత ఎక్కడైనా ఇస్తున్నారా?

`తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా వున్నాయా?

` రైతులను నుంచి నేరుగా ధాన్యం సేకరణ బిజేపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా జరుగుతోందా?

`బిజేపి నేతలు పూటకో మాట…గడియకో అబద్దం అలవాటు చేసుకున్నారు. 

`ప్రజలను తప్పుదోవ పట్టిస్తామని పగటి కలలుగంటున్నారు.

` కేంద్రంలో ఏటా రెండు కోట్ల కొలువులు ఎప్పుడో మర్చిపోయారు.

` రాష్ట్రంలో కొలువుల జాతరను చూసి బెంబేలెత్తిపోతున్నారు.

`యువత ఇక బిజేపిని పట్టించుకోరని ఉక్కిరిబిక్కిరౌతున్నారు. 

`ఏం చేయాలో తోచక ఆగమాగమౌతున్నారు.

`అసత్యాలు, అర్థ సత్యాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.

`బిఆర్‌ఎస్‌ ను చూసి భయపడుతున్నారు.

`బిఆర్‌ఎస్‌ అభివృద్ధి నినాదం ముందు బిజేపి ఏ వాదం పని చేయదని తెలిసి తెల్ల మొహం వేస్తున్నారు.     

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఒక దారిలేదు. దిక్కు దివానం లేదు. ప్రజలు ఆదరించే పరిస్ధితి లేదు. ఆ పార్టీలకు దిశా నిర్ధేశం ఏదీ లేదు. ఎప్పుడు ఏ విధంగా వుంటారో వారికే అర్ధం కాదు. ఎప్పుడు ఏం మాట్లాడుతుంటారో అర్ధమే వుండదు. ఇప్పుడు మాట్లాడిన మాటకు, గంట తర్వాత మాట్లాడే మాటలకు పొంతన వుండదు. ఒక నాయకుడు మాట్లాడే మాటకు, అదే పార్టీలో మరో నాయకుడు మాట్లాడే మాటలకు సంబంధమే వుండదు. ఎవరు ఏం మాట్లాడాలన్నదానిపై కూడా స్పష్టత వుండదు. ప్రజల్లో వారికి స్ధానమే లేదు. ప్రజలను మెప్పించాల్సిన సందర్భంలో వాళ్లు చేసే అనవసరమైన హంగామాను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వారికి రాష్ట్ర ప్రగతి మీద ప్రేమ లేదు. దేశ రాజకీయాల మీద అవగాహన లేదు. ఎంత సేపు విమర్శలు చేస్తూ కూర్చుకుంటే సరిపోతుంది. లేని వివాదాలను సృష్టించి పబ్బం గడుపుకుంటే సరిపోతుందన్న ధోరణి తప్ప బిజేపికి పని , పాట లేదన్నట్లే వుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రతిపక్షాలను తూర్పారపట్టారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్ర రావుతో ఆయన పంచుకున్న విషయాలు రవిచంద్ర మాటల్లోనే….

  ప్రతిపక్షాలు మాట్లాడే పొంతన లేని మాటలు చాలా విచిత్రంగా వుంటాయి.

 తాజాగా సిరిసిల్ల అభివృద్ధి విషయంలో బిజేపికి చెందిన కొంత మంది నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విడ్డూరం. అసలు సిరిసిల్లలో సిరులు వెలుగులు నిండుతున్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అనేవారు. ఇప్పుడు సిరులు సిల్ల అంటున్నారు. ముఖ్యంగా మంత్రి కేటిఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలోనే సిరిసిల్ల అభివృద్ధి ప్రణాళిక మొదలు పెట్టారు. ఆ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సిరిసిల్ల రూపురేఖలే మార్చేశారు. ఒకనాడు ఆకలి సిరిసిల్లను, సిరుల సిల్లగా మార్చారు. ఇది జగమెరిగిన సత్యం. ఒకనాడేమో సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వెల్‌ మాత్రమే అభివృద్ది చెందుతున్నాయని మాట్లాడేదీ ఈ ప్రతిపక్షాలే…ఇప్పుడు సిరిసిల్లలో సమస్యలున్నాయని మాట్లాడుతున్నది ఈ ప్రతిపక్షాలే…అసలు వాళ్లు మాట్లాడేదాంట్లో ఏది నిజం…అన్నది వారికే స్పష్టత లేదు. అసలు సిరిసిల్ల అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదు. సిరిసిల్ల ఇప్పుడు సర్వాంగ సుందరంగా తయారైంది. అన్ని రకాల వసతులు తీర్చిదిద్దబడ్డాయి. హండ్లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అన్ని రంగాలలో సిరిసిల్ల అభివృద్ధి అన్నది రోల్‌ మాడల్‌గా వుంది. కాని ప్రతిపక్షాలు పూటకో వేషం వేయడం అలవాటు చేసుకున్నాయి. ప్రజలు వారి మాటలను వినడం లేదన్న అక్కసుతో లేనిపోనివి ప్రచారం చేస్తే తప్ప తమ వైపు చూడరన్న దిక్కుమాలిన వేషాలన్నీ వేస్తున్నారు. ఇక ఆ పార్టీకి చెందిన బండి సంజయ్‌ క్షణానికో మాట..పూటకో అబద్దం అలవాటు చేసుకున్నాడు. గత కొంత కాలంగా రాష్ట్రంలో కొలువులపై నిత్యం మొసలి కన్నీరు కార్చేవారు. కేంద్రంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014 ఎన్నికల్లో ప్రకటించిన బిజేపి ఒక్క కొలువు ఇచ్చింది లేదు. పైగా దేశ వ్యాప్తంగా వున్న కొలువులు తీసేస్తూ వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటు పరం చేస్తూ వస్తోంది. ఉపాధి అవకాశాలు ఏనాడో గాలికి వదిలేసింది. ఎంత సేపూ మత రాజకీయం తప్ప, ప్రజా సంక్షేమం పట్టని బిజేపి కూడా నీతులు వల్లిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే వుందని ప్రజలే చీ కొడుతున్నారు. రాష్ట్రంలో కొలువుల పండగ మొదలైంది. వేలాది ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరుగుతోంది. ఉద్యోగాల కల్పన అన్నది నిరంతర ప్రక్రియ. తెలంగాణ వచ్చాక లక్షముప్పైవేల ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటించిన నాటి నుంచి వేలాది నోటిఫికేషన్లు వెలువడుతూనే వున్నాయి. గ్రూప్‌ వన్‌ వంటి ఉద్యోగాల ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష కూడా పూర్తయింది. గ్రూప్‌ 2 ప్రకటన జరిగింది. గ్రూప్‌3, గ్రూప్‌ 4 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ పెద్దఎత్తున సాగుతోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేసుకుంటూ పోతే ఇక యువత ఓట్లు కష్టమని బిజేపికి అర్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం యువతను బిజేపికి దూరం చేయడానికే ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తున్నారని బిజేపి అనడం దివాళాకోరు తనం కాదా? బాధ్యత కల్గిన నాయకుడు బండి సంజయ్‌ మాట్లాడాల్సిన మాటలేనా? విజ్ఞత వున్న వాళ్లు మాట్లాడాల్సిన మాటేనా…యువత బాగుపడాలని కోరుకునే వారు చెప్పాల్సిన మాటలేనా? ఈ మధ్య సిరిసిల్లలో జరిగిన సెస్‌ ఎన్నికల్లో బిజేపిని రైతులు ఎంత అసహ్యించుకుంటున్నారో ఓటు ద్వారా తీర్పు చెప్పారు. 15 డైరెక్టర్ల లో ఒక్కటి కూడా బిజేపి గెల్చుకోలేదు. కాని రాష్ట్ర్రంలో అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ను చూసి బిజేపి భయపడుతోంది. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న బిఆర్‌ఎస్‌ను కట్టడి చేయాలని కేంద్ర స్ధాయిలో చూస్తోంది. రాష్ట్ర స్ధాయిలో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకుంటోంది. ప్రజలు బిజేపి చేస్తున్న కుటిల ప్రయత్నాలు అన్నీ గమనిస్తూనే వున్నారు. 

 బిజేపి పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేశారా?

 కనీసం తెలంగాణలో లాగా రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారా? తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ప్రభుత్వం మెడమీద కత్తి పెట్టి మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసే బిజేపికి రైతాంగ సంక్షేమం మీద సోయి వుందా? దేశ రాజధానిలో ఏడాదిన్నర పాటు రైతులు ఏక బిగిన ఎండనక, వాననక, చలిలోనూ పోరాటం చేసిన సందర్భం ఎన్నడైనా చూశామా? ఇదేనా బిజేపి సాధించిన ప్రగతి. రైతులను కార్లతో తొక్కించి చంపిన ఘనత బిజేపిది కాదా? ఆ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రైతు బంధు అమలౌతుందా? రైతు భీమా ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మి అన్నది ఎక్కడైనా వుందా? ఆసరా పించన్లు తెలంగాణలో ఇచ్చినంత ఇస్తున్నారా? వికలాంగుల పించన్లు తెలంగాణలో ఇచ్చినంత ఇస్తున్నారా? ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తున్నారా? తెలంగాణలో రైతుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం సేకరించినట్లు ఎక్కడైనా సేకరిస్తున్నారా? చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేని బిజేపి కోతలు కోయడం, ఆశల పల్లకిలో ఊరేగడం అలవాటు చేసుకున్నది. , ప్రజలను మాయ చేసి, మతాన్నిఅడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తామని చూస్తే తెలంగాణ ప్రజలు ఎంతో విజ్ఞలు. ఇతర పార్టీలలో నుంచి నాయకులను తెచ్చుకొని అద్దె నాయకులను చూసుకొని మురిసిపోతూ, మిడిసిపాటు ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దిక్కూ దివానం లేకుండా పోతారు. అసలు ఆ పార్టీకి రాష్ట్రంలో పోటీ చేయడానికి అవసరమైన స్ధానాలలో అభ్యర్థులే లేరు. కాని పోటీకి ఎగబడుతున్నారంటూ లేని గొప్పలు చెప్పుకుంటే అవి తాటాకు చప్పుళ్లే అవుతాయి, తప్ప నిజాలు కావు. ఇప్పటికైనా తెలంగాణ ప్రగతిని చూసి కళ్లు తెరవండి. అంతే కాని మంత్రి కేటిఆర్‌ను విమర్శిస్తే పెద్దవాళ్లు కాలేరు. ప్రజలు వారిని నమ్మరు. రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో దూసుకుపోయేలా చేయడంలో కేటిఆర్‌ పాత్ర చాలా గొప్పది. మున్సిపల్‌ మంత్రిగా పట్ణణాల రూపురేఖలు మార్చిన ఘనత కూడా కేటిఆర్‌ది. అలాంటి నాయకుడిపై ప్రతిపక్షాలు పేలే ప్రేళాపనలు ప్రజలు నమ్మరు. వారిని ఆదరించరు. వారికి స్ధానమివ్వరు. అసందర్భ ప్రేళాలపను ప్రజలు ఆహ్వానించరు. బిజేపిని ప్రజలు అసలు లెక్కలోకే తీసుకోరు. ఇది ముమ్మాటికీ నిజం…! బిజేపి నేతలు చెప్పే మాటలన్నీ అబద్దం!!

పని, ప్రశస్తి వదిలేసి, కుల ప్రస్తావనెక్కడిది!

`సామాన్యులకు సేవ చేయమంటే కులమెందుకు ముందుకొస్తుంది?

`ప్రమోషన్లలో అన్యాయం జరిగితే కొట్లాడండి?

`పై అధికారులు చులకన చేస్తే అప్పుడు చెప్పండి!

`పని చేయమని ప్రజలు తిరుగుంటే పట్టించుకోవద్దని ఏ కులం చెప్పింది!

` అదే సామాజిక వర్గ బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు?

`మరి వారి గోడు ఎందుకు పట్డడం లేదు?

`మీరే వాళ్లకు పనిలో నిర్లక్ష్యం చేస్తే వాళ్లెవరికి చెప్పుకోవాలి?

`పని చేసి మంచి పేరు తెచ్చుకొమ్మని చెప్పడం నేటిధాత్రి తప్పా?

`మంచి అధికారిగా గుర్తింపు పొందమని చెప్పే సూచన నచ్చలేదా?

`పేదలకు సేవ చేస్తే చేతులెత్తి దండం పెడతారు?

`ఎన్ని సార్లు తిరిగినా పని చేయకపోతే తిట్టిపోస్తారు? 

`అదే కదా నేటిధాత్రి చెబుతోంది!

`నేను పని చేయను, అని మీడియా మీద ఓ రాయేస్తే సరిపోతుందా?

`పని చేయకపోయినా ఫరవాలేదా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 నేటిధాత్రి సామాన్య ప్రజల గొంతుక. సమస్య ఎక్కడుంటే నేటిధాత్రి అక్కడ వుంటుంది. బాధితులకు అండగా వుంటుంది. నేటిధాత్రి రాసే అక్షరాలు ప్రజల సమస్యలు. అంతే తప్ప అక్కడ వ్యక్తి గత ప్రస్తావనలకు తావు లేదు. ప్రతి వారికి వ్యక్తి గత జీవితాలు వుంటాయి. వాటిని నేటిధాత్రి ఎప్పుడూ ప్రస్తావించే ప్రయత్నం చేయదు. మండలంలోని అనేక మంది ప్రజలు నిత్యం కొన్ని సంవత్సరాలుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ అలుపెరగ తిరుగుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. దుఖం ఆపుకోలేక నేటిధాత్రి ముందు గోడు వెల్లబోసుకుంటున్నారు. తహసీల్దారు తమను చూస్తే పురుగుల్లా చూస్తున్నారు. కనీసం తమ సమస్య చెప్పుకోవడానికి సమయం ఇవ్వడం లేదు అని విలపిస్తున్నారు. కనీసం వాళ్ల సమస్య తెలుసుకునే ప్రయత్నం తహసీల్దారు చేయనప్పుడు ప్రజల ఆవేదనకు అక్షరాల రూపం ఇవ్వడం నేటిధాత్రి కర్తవ్యం. మా బాధ్యత మేం నిర్వర్తించాం…తహసీల్దారు చేయాల్సిన పని గుర్తు చేస్తున్నాం…ప్రభుత్వ అధికారితో పని చేయించుకోవడం ప్రజల హక్కు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచే అధికారులకు జీతాలు ఇస్తారు. అలాంటి ప్రజలకు పనులు చేయకపోవడం తప్పు. వృత్తికి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఉద్యోగి పని చేయాలి. చట్టం ఇదే చెబుతోంది. పని చేయను…చేయమని అడిగిన వారిని నిందిస్తాను…బెదిరిస్తాను…కులం సాకుగా చూపి అపవాదులేస్తాను అనడం, బాధ్యతల మీద శ్రద్ధ వున్నవారు మాట్లాడాల్సిన మాటలు కాదు. తహసీల్దారు కుర్చీ అనేది బాధ్యత. అధికారం…హోదా మాత్రమే అనుకుంటే ప్రజలకు సేవ చేయలేరు. నిజంగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ ప్రజలు తిరగాల్సిన పని లేకుండా, సకాలంలో పని పూర్తయితే సమస్యే వుండదు. చేయాల్సిన పని వదిలేసి, సామాన్యులను ఇబ్బందులు పెడితే మీడియా చూస్తూ ఊరుకుంటుందా? 

ఉద్యోగులకు ప్రమోషన్లలో అన్యాయం జరిగితే రాసేది మీడియానే?

 అందులోనూ రిక్రూట్‌ మెంట్‌ లలో ఏ మాత్రం అన్యాయం జరిగినా బాధితులు ఆశ్రయించేది మీడియానే…ఎంత పెద్ద ఉద్యోగ వ్యవస్థ అయినా తమ డిమాండ్ల పరిష్కారం కోసం తొక్కేది మీడియా గడపనే…రాజకీయ నాయకులైనా, ప్రభుత్వాలైనా, ప్రజా సంఘాలైనా మీడియా కు వాళ్ల సమస్య చెప్పాల్సిందే…! పై అధికారులు చులకన చేస్తే అప్పుడు చెప్పండి! ఉద్యోగ వ్యవస్థలో మహిళలని చూడకుండా, పై అధికారులు కులం పేరుతో దూషించినా చెప్పేది మీడియాకే…!పని చేయమని ప్రజలు తిరుగుతుంటే పట్టించుకోవద్దని ఏ కులం చెప్పింది! అదే సామాజిక వర్గ బాధితులు అనేక మంది తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు? ఉద్యోగంలో విధి నిర్వహణ గుర్తు చేస్తే కులం ఎందుకు మధ్యలోకి వస్తుంది. తహసీల్దారు కార్యాలయం చుట్టూ నిత్యం తిరుగే వారిలో బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ వుంటారు. మరి వారి గోడు ఎందుకు పట్డడం లేదు? తహసీల్దారు సామాన్య ప్రజల పనిలో నిర్లక్ష్యం చేస్తే వాళ్లెవరికి చెప్పుకోవాలి? పని చేసి మంచి పేరు తెచ్చుకొమ్మని చెప్పడం నేటిధాత్రి తప్పా? మంచి అధికారిగా గుర్తింపు పొందమని చెప్పే సూచన నచ్చలేదా? పేదలకు సేవ చేస్తే చేతులెత్తి దండం పెడతారు? ఎన్ని సార్లు తిరిగినా పని చేయకపోతే తిట్టిపోస్తారు? అదే కదా నేటిధాత్రి చెబుతోంది! నేను పని చేయను అనుకునే అధికారులే మీడియా మీద ఓ రాయేస్తే సరిపోతుందని? ఆలోచిస్తుంటారు. పని చేయకపోయినా ఫరవాలేదా? వృత్తి ధర్మం వదిలేసి, మీడియా మీద నిందలేసి తప్పించుకుంటా? అనుకుంటే వ్యవస్థ ఊరుకుంటుందా? ప్రశ్నించకుండా వుంటుందా? ప్రజా సంఘాలు నిలదీయవా? 

తహసీల్దారు జ్యోతి ఒక వ్యక్తి తనకు న్యయం చేయమని వేడుకున్నా కనికరించలేదు. 

కోర్టు ఆదేశాలు పాటించమని అడిగితే పట్టించుకోలేదు. ఆఖరుకు కలెక్టర్‌ ప్రస్తావన తీసుకొస్తే తహసీల్దారు చెప్పాల్సిన సమాధానం అదేనా? పై అధికారుల ఆదేశాలు పాటించక, సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించక, ఖాళీగా కూర్చోవడానికా ఉద్యోగం. పేదల సమస్యలు తీర్చని అధికారులకు కర్తవ్యం ఎలా గుర్తు చేస్తామో! ప్రజలకు మంచి సేవలందించే అధికారుల గొప్పదనం కూడా పాఠకుల ముందుకు తెస్తుంటాం. అధికారులు ఆదర్శంగా వుండాలి. సామాన్య ప్రజల పక్షాన వుండాలి. ఉద్యోగం సంపాదించుకునే ముందు అందరూ పేదలకు సేవ చేయాలని వుందంటారు. అదేంటొ కొందరు కొద్ది రోజుల్లోనే ఆ విషయం మర్చిపోయి వివాదాలకు కేరాఫ్‌ అవుతారు. ఏది ఏమైనప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలుగా నేటిధాత్రి అలుపెరగని అక్షర ప్రయాణంలో ప్రజా గొంతకై అక్షర సమరనాధాల తాండవం సాగిస్తూనే వుంది.

సీజ్‌ చేసిన ఇసుకేమైంది?

` కంచె చేసు చేసినట్లు కాపాడాల్సిన అధికారులు ఇసుక మాయం పట్టించుకోరా?

`డాన్‌ శీను తలుచుకుంటే సీజింగ్‌ కూడా లెక్కచేయడా!

` డాన్‌ శీను సాగిస్తున్న నిర్వాకం!

` చోద్యం చూస్తున్న అధికార గణం!

` పై అధికారుల కన్నా డాన్‌ శీనునంటేనే గౌరవం.

` కోట్లు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ నేటిధాత్రితో వస్తుందంటున్న శీను.

` హైదరాబాద్‌ లో వున్నా దందా చేసే అవకాశం దొరుకుందని ధీమా!

` అవసరం వున్న వాళ్లు బండ్లగూడకు వచ్చేందుకు మార్గం ఏర్పడిరదట!

` రెండు శాఖల అధికారులంటే డాన్‌ శీనుకు ఎంత చులకనో అర్థం చేసుకోవచ్చు?

`పోలీసులు సీజ్‌ చేసిన వెహికిల్‌ బైటకు రాదు!

` అలాంటిది సీజ్‌ చేసిన ఇసుక అమ్ముతుంటే ఏం చేస్తున్నారు?

`వెహికిల్‌ ఛలాన్‌ వుంటే అప్పుడు వసూలు చేస్తారు?

`డాన్‌ శీను నుంచి ఎగ్గొట్టిన పన్నులు వసూలు చేయలేరా?

` సిఎస్‌ గారు అధికారుల నిర్లక్ష్యం, కాసుల కక్కుర్తి చూడండి!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మంచిర్యాల జిల్లాలో డీలర్‌ శీను అలియాస్‌ డాన్‌ శీను ప్రభుత్వం సీజ్‌ చేసిన ఇసుక కూడా అమ్ముకున్నాడన్న విషయం వింటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటప్పుడు అక్రమంగా తవ్వకాలు చేపట్టి, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి శీను అమ్ముకుంటున్న ఇసుకను అధికారులు ఎందుకు సీజ్‌ చేసినట్లు? ఆ ఇసుక డంపుల చుట్టూ ఎందుకు కంచెలు ఏర్పాటు చేసినట్లు? ఏర్పాటు చేసిన కంచె మాయమైతే అధికారులు ఏం చేస్తున్నట్లు? సీజింగ్‌ లో వున్న ఇసుకను డాన్‌ శీను దర్జాగా తరలించి అమ్ముకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వ ధనంతో ఇసుక డంపులకు ఫెన్సింగ్‌ ఎందుకు వేసినట్లు? అలా కూడా అధికారులే ప్రజాధనం వృధా చేయడం ఎందుకు? ఇవన్నీ అధికారులు ఎందుకు చేసినట్లు? కంచె చేను మేసినట్లు కాపాడాల్సిన అధికారులు ఇసుక మాయం పట్టించుకోరా? అక్రమ ఇసుక రవాణా చట్టరిత్యా నేరం. ఎంతో కట్టుదిట్టమైన చట్టాలున్నాయి. మైనింగ్‌ విషయంలో పొరపాట్లు చేసేవారిని ఉపేక్షించేంత ఉధాసీనత ఒక్క మంచిర్యాల జిల్లాలో తప్ప, దేశంలో ఎక్కడా వుండకపోవచ్చు. అధికారులలో ఒకరో, ఇద్దరో అవినీతి పరులు వుంటారని అనుకుంటాం! అదేమిటో మంచిర్యాల జిల్లాలో ఏ మండలాన్ని కదిలించినా, ఏ శాఖ గురించి చెప్పుకున్నా కథలు, కథలుగా అధికారుల తీరు చెబుతుంటారు. శీనుకు ఎలా ఉపయోగపడతారో పూసగుచ్చినట్లు వివరిస్తుంటారు. 

డాన్‌ శీను తలుచుకుంటే సీజింగ్‌ కూడా లెక్కచేయడా!

 అంతటి ధైర్యం ఏమిటి? అధికారులను ఎంత గుప్పిట్లో పెట్టుకోకపోతే ఇంతలా భరితెగిస్తాడు. అసలు జిల్లాలో ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థను శీను నడిపేంత పెద్ద వాడిని చేసింది అధికారులు కాదా? శీను అడుగులకు మడుగులొత్తుతోంది అధికార యంత్రాంగం కాదా? డాన్‌ శీను సాగిస్తు నిర్వాకమా? లేక అధికారుల ప్రోత్సాహమా? జిల్లాలో ఇంతటి ఘటన చోటు చేసుకుంటున్నా? అడ్డుకోలేని అధికార గణం ఎవరికి కొమ్ముకాస్తున్నట్లు? పై అధికారుల కన్నా డాన్‌ శీనునంటేనే గౌరవం ప్రదర్శిస్తున్నట్లు కాదా? 

 ప్రభుత్వాన్ని మోసం చేసి అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అక్రమ ఇసుక వ్యాపారం చేసుకుంటున్న డాన్‌ శీనుకు నేటిధాత్రి వార్తలు పబ్లిసిటీకీ పనికొచ్చేలా వున్నాయట?

 అంటే అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, నిర్లిప్తత, చేతకాని తనం,ఒక వ్యక్తికి దాసోహమైన క్రమం కనిపిస్తోంది. కోట్లు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ నేటిధాత్రితో వస్తుందని సన్నిహితులతో అంటున్నాడట. అలా శీను మారడానికి పరోక్ష కారణం అధికారుల ఉదాసీనత, కక్కుర్తి కారణం కాదా? తాను హైదరాబాద్‌ లో వున్నా దందా చేసే అవకాశం దొరుకుందని ధీమా! వ్యక్తం చేసేంత శీను ధైర్యానికి అవినీతి అధికారుల అండ కాదా? అవసరాన్ని బట్టి అధికారులే బండ్ల గూడకు వచ్చి పనులు చక్కదిద్దుతారని శీను చెప్పుకుంటున్నాడంటే, ఇంతకంటే సిగ్గు మాలిన తనం అధికారులకు వుంటుందా? దీన్ని బట్టి ఆ రెండు శాఖల అధికారులంటే డాన్‌ శీనుకు ఎంత చులకనో అర్థం చేసుకోవచ్చు?

ఇటీవల కాలంలో బైక్‌ మీద ఛలాన్లు వుంటేనే పోలీసు శాఖ వెంటాడి వేధించినంత పని చేస్తోంది.

 అలాంటిది శీను విషయంలో ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తోంది. సహజంగా పోలీసులు సీజ్‌ చేసిన వెహికిల్‌ బైటకు రాదు! అలాంటిది అధికారులు దగ్గరుండి సీజ్‌ చేసిన ఇసుక కాపాడలేకపోవడంలో ఆంతర్యమేమిటన్నది చూస్తేనే అర్థమౌతుంది.  

 ఇంతకీ డాన్‌ శీను ప్రభుత్వానికి ఎగ్గొట్టిన పన్నులు వసూలు చేయరా? చేయలేరా?

 చేయకూడదని నిర్ణయించుకున్నారా? విజిలెన్స్‌ రిపోర్ట్‌ పక్కన పెట్టేశారా? దానిని అమలు చేసే ఉద్దేశం అసలే లేదా? ఆర్డీవో స్థాయి అధికారులు కూడా శీను చేసే అక్రమాలకు వంత పాడడం విచిత్రంగా వుంది. నేటిధాత్రి ఈ విషయంలో ఇప్పటికే అనేక కథనాలు ప్రచురించింది. డాన్‌ సీను వ్యవహారం మూలంగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు తహసీల్దారు కార్యాలయాల ముందు ధర్నాలు చేసిన సందర్భాలు అనేకం వున్నాయి. అయినా స్పందించిన అధికారి లేడు. ప్రజా ప్రతినిధులు లేరు. ఎంతో సిఎస్‌ గారు అధికారుల నిర్లక్ష్యం, కాసుల కక్కుర్తి చూడండి! ఒక్కసారి సీజ్‌ చేసిన ఇసుక కుప్పలు చూడండి… తరలించుకుపోగా మిగిలిందెంతో నిగ్గు తేల్చండి. ఒక్క సారి ఈ విషయంపై స్పందించండి. ఒక వ్యక్తి ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థను నడిపిస్తున్నాడంటే ఇది ఎవరి లోపం. అధికార యంత్రాంగం ఇంత దిగజారిపోవాలా? శీను ఆగడాల మీద వెల్లువెత్తిన నిరసనలు, పిర్యాదుల మీద ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్పందించారు. శీనును బెదిరించారు. అతను జిల్లా వదిలి హైదరాబాదు లో మకాం పెట్టాడు. అయినా అధికారులకు ఈ దేబిరింపు ఏమిటి? ఒక అక్రమార్కుడికి కొమ్ము కాయడం ఏమిటి? అతను ఎలా చెబితే అలా వినడం ఏమిటి? ప్రజల భూములను శీనుకు అప్పగించడం ఏమిటి? ఇసుక వ్యాపారానికి సహకరించడమేమిటి? పన్ను ఎగ్గొట్టినా స్పందించకపోవడమేటి? అక్రమార్కులకు అధికారులు ఇలా దాసోహమేమిటి? ఉన్నత స్థాయి అధికారులకు అంతా తెలిసినా పట్టింపేది? ఎప్పుడు డాన్‌ శీను ఆగడాలకు అడ్డకట్ట పడేది? ప్రభుత్వం అబాసుపాలౌతున్నా అధికార పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఎందుకు స్పందించడం లేదు. వీటన్నింటికీ సమాధానం ఎవరు చెప్పాలి? ప్రజల ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోవాలో రాష్ట్ర స్థాయి అధికార గణమే సమాధానం చెప్పాలి.

ఠాకూర్‌ పోయి ధాక్రే వచ్చే!

`ధాక్రే ఎటువైపు?

` సీనియర్ల వైపా…రేవంత్‌ వైపా!

`ఠాకూర్‌ ను పంపించడంలో సీనియర్లు సఫలమా!

` వచ్చేది రేవంత్‌ కు గడ్డుకాలమా!

`సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గిందా?

`సీనియర్లు కోరుతున్నట్లు బిఆర్‌ఎస్‌ తో పొత్తు సాధ్యమామేనా?

` రేవంత్‌ వర్గం అభిప్రాయంతో పని లేదన్నట్లేనా!

`సీనియర్ల అడుగులు పిడుగులేనా?

`ఇక రేవంత్‌ కు చుక్కలేనా?

` బిఆర్‌ఎస్‌ తో కాంగ్రెస్‌ పొత్తు అంటే రేవంత్‌ కు పొగేనా!

` సీనియర్ల లక్ష్యం నెరవేరుతుందా!

` రేవంత్‌ ను కూరలో కరివేపాకును చేసినట్లేనా?

` సంకేతాలు చూస్తే రేవంత్‌ మాటలకు కళ్లెమేనా?

`అయినా మారకపోతే సీట్లో నుంచి దింపుడేనా! ఇంటికి పంపుడేనా!!

`థాక్రే రాకతో గెలిచిన ఆనందం సీనియర్లది!

` అయినా రేవంత్‌ కు సహకరిస్తారన్న నమ్మకమేది!

` ఇప్పటికైనా కాంగ్రెస్‌ లో కుంపట్లాగేనా?

`కుమ్ములాటలు సమసిపోయేనా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 అవసరమైతే తప్పుకుంటా! ఈ మాటలన్నది ఎవరో కాదు! సాక్షాత్తు పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. అసలు పిసిసి ఛీఫ్‌ కావడానికి పడిన ప్రయాస కన్నా…సీనియర్లతో ఎదుర్కొంటున్న ఆయాసం పెద్దదైపోయిందా? అన్న అనుమానం రాకమానదు. కాంగ్రెస్‌ లో ఏది జరిగినా వింతే. నిజానికి ఇప్పటికీ రేవంత్‌ రెడ్డి కి కాంగ్రెస్‌ రాజకీయం ఒంటబట్టలేదనేది అర్థమౌతుంది. కాంగ్రెస్‌ పార్టీలో నోరు జారడం ఎంత సహజమో! టార్గెట్‌ లో వున్న నోరు జారడం అంతే అనర్థం. ఇది రేవంత్‌ రెడ్డి కి తెలియనట్లుంది. పార్టీ అధికారంలోకి రావడం కోసం తాను పదవీ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించడమే వెర్రితనం. ఎంత కష్టమైనా పడదాం…కష్టపడి పార్టీని బలోపేతం చేద్దాం…. అధికారంలోకి తీసుకొద్దాం… ఇదీ రేవంత్‌ చేయాల్సిన వ్యాఖ్యలు. పదవి నుంచి తప్పుకుంటా? అనడమంటే సీనియర్లకు పండగే. ఇంత కాలం నుంచి సీనియర్లు అధిష్టానాన్ని అడుగుతున్నది అదే…అలాంటిది నేను అస్ర్ర సన్యాసం చేయడానికి సిద్ధంగా వున్నానని చెప్పడం అంటే తాను ఓడిపోయానని ఒప్పుకోవడం! లేదా నావల్ల కాదని చేతులెత్తేడం!! నేను సీనియర్ల గోల తట్టుకోలేనని పారిపోవడం!!! మళ్ళీ తెలుగు దేశం పార్టీకి ఊపిరి పోసే పనిలో నిమగ్నమౌతానని చెప్పడం!!!! వీటిలో ఏదైనా కావొచ్చు. ఒక్కసారి రేవంత్‌ రెడ్డి పిసిసి కుర్చీ దిగితే ఆయనను పార్టీలో పట్టించుకునే వారు వుంటారు. పదవి నుంచి తొలగిపోగానే పార్టీ నుంచి కూడా రేవంత్‌ రెడ్డి ని సీనియర్లు తరిమేయకుండా వుంటారా? పిసిసి అధ్యక్షుడు గా వుండి అనుచరులకు పదవులు ఇస్తేనే పచ్చ రంగు పులిమారు. అలాంటిది కుర్చీ దిగిన మరుక్షణం సీనియర్లు రేవంత్‌ కు పచ్చ చొక్కా వేయకుండా వుంటారా? ఏది ఏమైనా రేవంత్‌ రెడ్డి కి కాంగ్రెస్‌ లో కష్టకాలమే….పిసిసి పదవికి గడ్డుకాలమే! ఒకవేళ కొత్త ఇన్చార్జ్‌ రాజకీయం సమన్వయంగా వుంటుందా! ఎటో వైపు మొగ్గుతుందా? అన్నదానిపై ఆధారపడి వుంటుంది. 

ధాక్రే ఎటువైపు?.

 పిసిసి అధ్యక్షుడు గా రేవంత్‌ రెడ్డి అయినప్పటి నుండి మాజీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్‌ మాణికం ఠాకూర్‌ వివాదాలు ఎదుర్కొంటున్నారు. పిసిసి అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి ఎంపిక కాగానే అప్పటి దాకా పిసిసి మీద ఆశలు పెట్టుకున్న నిత్య అసమ్మతి వాది కోమటి రెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మాణికం ఠాకూర్‌ కు రూ. 50 కోట్లు ఇచ్చి రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడయ్యాడు అని ప్రకటించాడు. ఇక రేవంత్‌ రెడ్డి అధ్యక్షుడుగా వున్నంత కాలం తాను గాంధీ భవన్లో అడుగుపెట్టనన్నాడు. రేవంత్‌ రెడ్డి పిసిసి కావడాన్ని కాంగ్రెస్‌ లో వున్న సీనియర్లు ఎవరూ ఆహ్వానించలేదు. తొలుత చూద్దాం…ముందు ముందు ఏం జరుగుతుందో అనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు రేవంత్‌ రెడ్డి మీద అగ్గి మీద గుగ్గిలమౌతున్నారు. జగ్గారెడ్డి నుంచి మొదలుపెడితే దామోదర రాజనర్సింహ దాకా ఎప్పుడెప్పుడు రేవంత్‌ రెడ్డి ని మార్చే ప్రయత్నం చేద్దామా అని ఎదురు చూస్తూనే వున్నారు. ఇంత కాలానికి కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్‌ మాణికం ఠాకూర్‌ ను మార్చడం సీనియర్లుకు కొండంత బలమొచ్చినట్లైందనే మాటలు వినిపిస్తున్నాయి. మరి రేవంత్‌ రెడ్డి గతంలో మాణికం ఠాకూర్‌ ను బుట్టలో వేసుకున్నట్లే ఠాక్రేను కూడా కమ్మితే అనే అనుమానాలు కూడా అప్పుడే వ్యక్తమౌతున్నాయి. 

సీనియర్ల వైపా…రేవంత్‌ వైపా!

 కొత్తగా వచ్చిన ఠాక్రే పని తీరు ఎలా వుంటుందో అన్నది పార్టీలో ఆసక్తిని రేపుతోంది. అసలు మాణికం ఠాకూర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కొన్ని సార్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌ అధిష్టానం ప్రియాంక గాంధీని పర్వవేక్షకురాలిగా పంపుతారని కూడా ప్రచారం జరిగింది. కొత్తగా ఠాక్రే వచ్చాడు. 

ఠాకూర్‌ ను అధిష్టానం పంపించడంలో సీనియర్లు సఫలమా!

 రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి రేవంత్‌ తోపాటు ఠాకూర్‌ ను కూడా సీనియర్లు టార్గెట్‌ చేస్తూ వచ్చారు. అధిష్టానం దూత అని ఆయనపై వ్యాఖ్యలు చేయడం తగదని అసలే తగ్గలేదు. పైగా ఆయన నేతృత్వంలో సాగిన సమావేశాలుకు డుమ్మా కొడుతూ వచ్చారు. నిరసన గళం వినిపిస్తూనే వస్తున్నారు. ఠాకూర్‌ వచ్చారని తెలిసినా కనీసం మర్యాద పూర్వకంగా కలిసేందుకు కూడా సీనియర్లు గాంధీ భవన్‌ వెళ్లకపోయేవారు. అంతేకాకుండా ఠాకూర్‌ ను కూడా తప్పించాలనే వాళ్లు మొదటి నుంచి పట్టుపడుతున్నారు. మొత్తం రేవంత్‌ రెడ్డి మనిషి గా వ్యవహరిస్తున్నాడనేది సీనియర్ల ప్రధాన ఆరోపణ. ఏది ఏమైనప్పటికీ సీనియర్లు అనుకున్నది జరిగింది. 

వచ్చేది రేవంత్‌ కు గడ్డుకాలమా! 

ఇంత కాలం అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోకపోతేనే సీనియర్లు ఆగలేదు. ఇప్పుడు అధిష్టానం ఎంతో కొంత సీనియర్ల మాటలకు విలువ ఇస్తోందని తెలిసిన తర్వాత ఆగుతారా? డిల్లీ వెళ్లి పితూరీలు చెప్పకుండా వుంటారా? ఇలాంటి అవకాశం కోసమే సీనియర్లు ఇప్పటి దాకా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా రేవంత్‌ రెడ్డి ని ఆడుకుందామనే చూస్తున్నారు. ఠాక్రే ఏ మాత్రం వారికి అవకాశం ఇచ్చినా సీనియర్లు చెలరేగిపోతారని మాత్రం సమాచారం. 

సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గిందా?

 ఏఐసిసి కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. గతంలోనే ఒక వార్త వినిపించింది. రేవంత్‌ రెడ్డి మీద ఇన్ని ఫిర్యాదులు ఎందుకొస్తున్నాయని కామెంట్‌ కూడా చేసినట్లు తెలిసిందే. అదే సమయంలో కొంత మంది సీనియర్లు డిల్లీకి వెళ్ళి కొత్త అధ్యక్షుడు ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా దొరికిన అవకాశం వినియోగించుకున్నట్లున్నారు. ఇన్చార్జ్‌ మాణికం ఠాకూర్‌ మీద, రేవంత్‌ రెడ్డి వ్యవహారం మీద బాగానే ఖర్గేకు వివరించినట్లున్నారు. సహజంగా ఎవరైనా ఒక్కరు ఏ వ్యక్తి గురించి పితూరిలు చెబితే నిజమా? అనుకుంటారు. వరుసబెట్టి ఎంతో మంది అదే పనిగా ఆ వ్యక్తి గురించి చెబితే నిజమే అని నమ్ముతారు. ఇక్కడ ఇదే నిజమైంది. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రెడ్డి వర్గం అనే ముద్ర వున్న నేతలకు అధిష్టానంతో అంత చనువు లేదు. అంత కలుపుగోలు తనం లేదు. గుర్తింపు అంతకన్నా లేదు. కానీ సీనియర్ల విషయంలో అలా కాదు. ఏఐసిసి కార్యాలయం సంగతులన్నీ తెలుసు. అందుకే తెలంగాణలో సీనియర్ల పప్పులు ఉడకకపోయినా, డిల్లీలో ఉడుకుతుంటాయి. అదీ సీనియర్లు అంటే.

సీనియర్లు కోరుతున్నట్లు బిఆర్‌ఎస్‌ తో పొత్తు సాధ్యమామేనా?

 నిజంగానే సీనియర్లు ఇది కోరుకుంటున్నారా? అన్నదానిలో మాత్రం క్లారిటీ లేదు. కానీ ప్రచారం మాత్రం జనంలోకి వెళ్లిపోయింది. ఈ విషయం గురించి రేవంత్‌ రెడ్డి అభిప్రాయం ఎలా వుంటుందని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఈ విషయంలో రేవంత్‌ వర్గం అభిప్రాయంతో పని లేదన్నట్లేనా! అన్నది దానిపై కూడా బాగానే చర్చ సాగుతోంది. ఒక వేళ సీనియర్ల సూచన ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌ తో పొత్తు పొడుపు కనుక జరిగితే సీనియర్ల అడుగులు పిడుగులేనా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. సహజంగా కాంగ్రెస్‌ రాజకీయాలు విచిత్రంగా వుంటాయి. ఆ పార్టిని గెలిపించాలంటే ప్రజలు. ఓడిరచాలంటే నాయకులు. అని సరదాలోనే సీరియస్‌ గా చెప్పుకుంటారు. దేశ రాజకీయాలలో బిఆర్‌ఎస్‌ తో కాంగ్రెస్‌ కు అవసరం అన్నది సీనియర్లు చెప్పుకుంటున్న మాట. అందుకే కేవిపి. రామచంద్ర రావు గాంధీ భవన్‌ లో ప్రత్యక్షమయ్యారని కూడా ప్రచారం. సీనియర్లలో చాలా మంది కోవర్టులు అనే అపవాదును ఎలాగూ మోస్తున్నారు. అదే నిజం చేద్దామనుకుంటున్నారు. అనేది కొందరి వాదన. ఇక రేవంత్‌ కు చుక్కలేనా? అన్న చర్చ కూడా మొదలైంది. 

బిఆర్‌ఎస్‌ తో కాంగ్రెస్‌ పొత్తు అంటే రేవంత్‌ కు పొగేనా! 

 సీనియర్ల లక్ష్యం నెరవేరుతుందా! రేవంత్‌ ను కూరలో కరివేపాకును చేసినట్లేనా? సంకేతాలు చూస్తే రేవంత్‌ మాటలకు కళ్లెమేనా? అయినా మారకపోతే సీట్లో నుంచి దింపుడేనా! ఇంటికి పంపుడేనా!! థాక్రే రాకతో గెలిచిన ఆనందం సీనియర్లది! అయినా రేవంత్‌ కు సహకరిస్తారన్న నమ్మకమేది! ఇప్పటికైనా కాంగ్రెస్‌ లో కుంపట్లాగేనా? కుమ్ములాటలు సమసిపోతాయా? అని శ్రేణులు ఆశలు పెట్టుకోవడం కూడా అత్యాశే అవుతుందేమో!

సామాన్య ప్రజలంటే మరీ చులకన!

`అడిగితే నువ్వెవరు అంటుంది?

`ప్రశ్నిస్తే గద్దిస్తుంది?

`పలకరింపే కోపంగా వుంటుంది?

`హై కోర్టు ఆర్డర్‌ కూడా లెక్క చేయనంటుంది?

`కలెక్టర్‌ మాట వినేదేంది అంటుంది?

`బాధితులను చూస్తే చాలు చిర్రుబుర్రులాడుతుంది?

`అక్రమార్కులకు అండగా వుంటుంది?

`సామాన్యులను అసహ్యించుకుంటుంది?

`తను ఇష్టానుసారం వ్యవహరిస్తుంది?

`నస్పూర్‌ తహసీల్దారు ఇష్టా రాజ్యం!

`అక్రమార్కులకు అందలం…పని కోసం వచ్చే వారిపై తిట్ల దండకం!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 ఆమె బాధ్యతగల్గిన ఉన్నత ఉద్యోగురాలు. నస్పూర్‌ మండల తహసీల్దారు జ్యోతి. నిత్యం వందలాది మంది కార్యాలయానికి వస్తుంటారు. సహజంగా మహిళా అధికారి అంటే ఎంతో సౌమ్యంగా వుంటారు. కానీ ఈ తహసీల్దారు మాత్రం సామాన్య ప్రజలంటే ఆమెకు మరీ చులకన అని ప్రజలంటున్నారు. ఆమె మాట్లాడటంలోనే కోపం ధ్వనిస్తుంది. సామరస్యం అన్న మాట వుండదు. తమ పని కోసం వచ్చిన వారు ఎంత మర్యాదగా మాట్లాడినా సరే…చీదరించుకుంటూనే వుంటుంది. అలాంటి పరిస్థితులు చూసి, చూసి విసిగిపోయిన వాళ్లు ఏదైనా అడిగితే చాలు అసలు మీరెవరు? అంటుంది. అసలు ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగురాలుగా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన వుందా? లేదా? అన్న అనుమానం కలగక మానదు. ఆమెను ఎవరూ ప్రశ్నించొద్దు. ఒక వేళ ప్రశ్నిస్తే గద్దిస్తుంది? తహసీల్దారుగా తన అధికారాలు వినియోగిస్తానని బెదిరిస్తుంది. మహిళా అధికారి కావడంతో పనుల కోసం వచ్చే వారు ఎంతో ఓపికతో, ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. ఏళ్ల తరబడి పనులు కాకపోయినా గత్యంతరం లేక కార్యాలయం ముందు పడిగాపులు పడుతుంటారు. ఎప్పుడైనా కనికరించకపోతారా? అని ఎదురుచూసే వారికి నిరాశే మిగులుతోంది. పని కోసం వచ్చే వారి కాళ్లు అరిగిపోవాలే గాని పని కాదట. అంతలా పని మీద నిర్లక్ష్యం వున్నప్పుడు ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్లు అని కూడా ప్రజలంటున్నారు. ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అధికారులపై మీడియా ప్రజల తరుపున కథనాలు రాస్తే మహిళాధికారులు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా అవసరమైతే కులాన్ని కూడా ముందుకు తెచ్చే వారు కూడా వున్నారు. చేయాల్సిన పనులు సకాలంలో, సక్రమంగా చేస్తే ప్రజలే చేతులెత్తి దండం పెడతారు కదా! జీవితాంతం గుర్తుంచుకుంటారు కదా!! అది వదిలేసి పనుల కోసం వచ్చే వారిని ఏళ్లకేళ్లు తిప్పుకుంటే ఏమొస్తుంది. ప్రజల్లో అసహనం పెరిగేదాకా చూడడమెందుకు? వారి చేత శాపనార్థాలు పెట్టించుకోవవడం ఎందుకు? ఆమె పలకరింపే కోపంగా వుంటే ప్రజలు తహసీల్దారు కార్యాలయానికి ఎలా వస్తారు ? అంటే తహసీల్దారు కార్యాలయానికి ఎవరూ రావొద్దన్నట్లా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

ఇంతకీ ఏం జరిగింది? 

నస్పూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి తన భూమిలో ఇతరులు అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారని, ఆ స్థలం తనకు చెందినది ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించాడు. హైకోర్టును కూడా ఆశ్రయించాడు. అతనికి ఫేవర్‌ గా కోర్టు కూడా స్టేటస్‌ కో జారీ చేసింది. ఆ స్టేటస్‌ కో అమలు చేయాలని సదరు వ్యక్తి కలెక్టర్‌ ను కలిసి వినతిపత్రం అందించాడు. స్పందించిన కలెక్టర్‌ సంబంధిత ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఆర్డీవో నస్పూర్‌ తహసీల్దారుకు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయమై సదరు భూ యజమాని గత ఏడాది కాలంగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తనకు చెందిన స్థలంలో ఇతరులు అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. నాకు న్యాయం చేయండని వేడుకున్నాడు. అయినా ఆమె కరగలేదు. ఒక దశలో మేడం హై కోర్టు ఆదేశాలు కూడా అమలు కాకపోతే మేం ఎవరికి చెప్పుకోవాలి…మీరే కాపాడాలి మేడం…నాకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా స్థలంలో అక్రమ కట్టడాలు ఇప్పటికే నాలుగయ్యాయి.అని ఎంత మొత్తుకున్నా …హై కోర్ట్‌ ఆర్డర్‌ అయితే అమలు చేయాలా? అంటూ కోర్టు దిక్కరణకు కూడా తహసీల్దారు పాల్పడిరదని పిర్యాదు దారుడు నేటిధాత్రికి వివరించాడు. అంతే కాకుండా కలెక్టర్‌ ఆదేశాలు కూడా వున్నాయి. ఈ విషయాన్ని సదరు వ్యక్తి తహసీల్దారు కు గుర్తు చేశాడు. నేను కలెక్టర్‌ మాట వినేదేంది? కలెక్టర్‌ ఆదేశాలు పాటించాలా? అంటూ ఆ వ్యక్తిపై తహసీల్దారు జ్యోతి చిర్రుబుర్రులాడిరదని, నీ దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరింపులకు దిగిందట. ఇలా న్యాయం చేయాల్సిన తహసీల్దారు అన్యాయం చేస్తున్న వారిని వెనకేసుకురావడం ఏమిటి? హై కోర్టు ఆదేశాలు పాటించకపోతే ఉద్యోగం ఊడిపోతుందని తెలిసినా తహసీల్దారు కదలకపోవడం అంటేనే, ఆమె వల్ల ఎంత మంది సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్‌ ఆదేశాలు అమలు చేయను అని తహసీల్దారు మాట్లాడడం, తన పరిధి దాటడమే..! హైదరాబాదు నుంచి ఏడాది కాలంగా తన స్థలం కోసం తిరుగుతున్న వ్యక్తి విసిగిపోయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు? బాధ్యత వహిస్తారో? ఉన్నతాధికారుల చెప్పాల్సిన అవసరం వుంది. వృత్తిలో ఇంత నిర్లక్ష్యంగా వుంటున్న తహసీల్దారుపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. తన బాధ్యతలు నిర్వర్తించాల్సింది పోయి, పై అధికారుల ఆదేశాలు పెడ చెవిన పెట్టే తహసీల్దారు సామాన్యులను ఎంత ఇబ్బందులకు గురి చేస్తారో అర్థం చేసుకోవచ్చు.

ప్రగతి రాజ్యం…సంక్షేమ భారతం!

`దేశమంతా సస్యశ్యామలం చేద్దాం!

`దేశంలో సాగు విప్లవం తీసుకొద్దాం.

`వ్యవసాయ రంగంలో తిరుగులేని శక్తిగా మారుద్దాం!

`దేశమంతా సాగుకు ఉచిత విద్యుత్‌ అమలు చేద్దాం.

`నదుల నీళ్లను పొలాలకు మళ్లిద్దాం.

`ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందిద్దాం.

`దళితుల జీవితాలలో వెలుగులు నింపదాం.

`అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ఐక్యంగా సాగుదాం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సంకల్ప సాధకుడు దేశంలో సాగు విప్లవ శంఖం పూరిస్తున్నాడు. బిజేపిపై రాజకీయ సమర నాదం మొదలుపెట్టాడు. దేశంలో ప్రగతి శీల భావనలు నిండాలి. నాయకులలో అంకిత భావం పెంపొందింప బడాలి. మత పరమైన రాజకీయాలు కాదు,మానవత్వం నిండిన రాజకీయాలు కావాలి అన్నదే భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ లక్యం. బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటన తర్వాత తొలిగా మరో తెలుగు రాష్ట్రంలో పార్టీ కార్యవర్గం ప్రకటన జరిగింది. ఆంద్రప్రదేశ్‌ నుంచి వందలాది మంది నాయకులు, వేలాది మంది కేసిఆర్‌, బిఆర్‌ఎస్‌ అభిమానులు హైదరాబాదు వచ్చారు. తెలంగాణ భవన్‌ లో బిఆర్‌ఎస్‌ పార్టీ లో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి జరగాలన్నా అది కేసిఆర్‌ తోనే సాధ్యమౌతుందని ప్రజలు నమ్ముతున్నారనేది ఆ నాయకుల చేరికతో తేలిపోయింది. తోట చంద్రశేఖర్‌ అధ్యక్షుడు గా, మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు, పార్థసారథి లాంటి వాళ్లు బిఆర్‌ఎస్‌ లో చేరారు. దేశంలోని 4123 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయడానికి ఇప్పుటి నుంచే అడుగులు పడాలి. బిఆర్‌ఎస్‌ దేశమంతా విస్తరించాలి. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ గెలవాలి. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడాలి. కేసిఆర్‌ నేతృత్వంలో దేశ పాలనలో సుభిక్షం కావాలి. లక్ష కిలోమీటర్ల పయనమైనా ఒక్క అడుగుతోనే మొదలవ్వాలి. ఎంతటి లక్ష్యమైనా సాధించే పట్టుదల కావాలి. బిఆర్‌ఎస్‌ దేశ పురోగతికి కొత్త మార్గం కావాలి. ఒకనాడు ప్రజలు కలుగన్న తెలంగాణ ను ఎలా ఆవిష్కరించాడో…దేశాన్ని కూడా కేసిఆర్‌ అలాగే సంక్షేమ, ప్రగతి విప్లవాలు ఆవిష్కరించాలి. 

ప్రగతి రాజ్యం…సంక్షేమ భారతం! 

నిర్మాణం జరగాలి. అందుకు ప్రజల మద్దతు కావాలి. నాయకుల ప్రోద్బలం వుండాలి. దేశ సమైక్యత, సమగ్రత ఎంత ముఖ్యమో దేశ ప్రగతి కూడా అంతే ముఖ్యం. పైకి మేకిన్‌ ఇండియా అని గొప్పలు చెప్పుకొని ఎల్ల కాలం రాజకీయాలు చేయాలని చూసే నాయకులు వుండడం దౌర్భాగ్యం. ఓ వైపు దేశంలో ఉపాధి అవకాశాలు మృగ్యమైపోతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్భనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచం మాంద్యం బారిన పడే అవకాశాలున్నాయి. ఇవన్నీ వదిలేసి మతపరమైన అంశాలతో దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న బిజేపిని అధికారం నుంచి తొలగించితే తప్ప ముక్తి లేదు. మన దేశంలో అనేక వనరులున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో వున్నారు. మానవ వనరులకు కొదువ లేదు. అయినా ఇప్పటికీ చైనా లాంటి దేశాల మీద ఆధారపడి జాతీయ జెండాలు కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏమిటని కేసిఆర్‌ ప్రశ్నించారు. ఎనభైవ దశకంలో మన దేశం కన్నా చాలా వెనుకబడిన దేశం చైనా. మరి ఇప్పుడు ప్రపంచమంతా చైనా ఆధారపడే స్థితి చేరుకున్నది. మనం మాత్రం ఎదుగూ, బొదుగూ లేకుండా అక్కడే వున్నాము. మేకిన్‌ ఇండియా పేరు మాత్రమే. వచ్చే వస్తువులు అన్నీ చైనా నుంచే..! ఈ పరిస్థితి మారాలి. దేశమంతా ఒకే పన్ను అని పన్నుల మీద పన్నులు వడ్డిస్తున్నారు. సామాన్యుల నడ్డీ విరుస్తున్నారు. జిఎస్టీ పేరు చెప్పి కొన్ని లక్షల చిన్న తరహా పరిశ్రమలు మూత పడేలా చేశారు. కొన్ని కోట్ల మందికి ఉపాధి లేకుండా చేశారు. చైనా నుంచి సరుకులు దిగుమతి చేసుకొని, మన పొట్ట మనమే కొట్టుకునేలా? చేయడమేనా పాలన అని కేసిఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు మూలంగా ఒరిగింది లేదు. దేశం కోసం, ధర్మం కోసం అని బిజేపి చెప్పే మాటల్లో నిజం లేదన్నది ప్రజలు అర్థం చేసుకునేలా చేయడానికి కేసిఆర్‌ తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లనున్నారు. పాలకులకు సంక్షేమ రాజ్య భావన వుండాలి. అది కేసిఆర్‌ నాయకత్వంలా వుండాలని ఇప్పటికే అనేక రాష్ట్రాల నాయకులు కేసిఆర్‌ ను కొనియాడుతున్నారు. 

దేశమంతా సస్యశ్యామలం చేద్దాం!

 తెలంగాణ సస్యశ్యామలం చేసి చూపించాడు. కేసిఆర్‌ ఎప్పుడూ మాటలు చెప్పడు. పట్టు పడితే సాధించే వరకు వదలడు. అసలు తెలంగాణ రావడమే గగనమని అనుకున్నాం. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటయ్యాక అనేక ఉద్యమాలు జరిగాయి. చప్పున చల్లారిపోయాయి. కారణాలు ఏవైనా కావొచ్చు. లక్ష్యం కోసం అన్నీ త్వజించిన నాయకులు లేరు. పదవులకు లొంగిపోయారు. కానీ కేసిఆర్‌ పదవులను గడ్డిపోచలుగా వదులుకున్నాడు. తెలుగు దేశం పార్టీ మీద గెలిచిన పదవి వదిలేశాడు. ఇండిపెండెంట్‌ గా సిద్దిపేట నుంచి గెలిచి, తెలంగాణ సత్తా చాటాడు. తెలంగాణ సాధించాడు. కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడుగా వున్నప్పుడు అప్పటి మంత్రి సత్యనారాయణ సవాలును స్వీకరించి రాజీనామా చేశాడు. కేంద్ర క్యాబినెట్‌ మంత్రి పదవి వదులుకున్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఇవన్నీ గతంలో ఎవరూ చేయలేదు. కొంతవరకు చేసినా జీవిత పర్యంతం కొట్లాడడానికి ఎవరూ సిద్ధ పడలేదు. అందుకే చరిత్రలో కేసిఆర్‌ ఒక్కడే తెలంగాణ కోసం కనిపిస్తాడు. పదవులకు రాజీ పడలేదు. బెదిరింపులకు అదరలేదు. తెలంగాణ సాధించాడు. తెలంగాణ గోస తీర్చాడు. అందులో సాగు రంగాన్ని పండగ చేశాడు. రైతుకు సంతోషం నింపాడు. అసలు తెలంగాణలో ప్రాజెక్టులే కట్టడం కుదరదన్న చోట నీటి పరవళ్ల సయ్యాటలు చూపించాడు. ఎండిన పొలాల గొంతు తడిపాడు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ చేశాడు. ఇప్పుడు దేశంలో సాగుకు అనువైన ప్రతి ఎకరాన్ని పంటలకు అనుకూలంగా మార్చుతానంటున్నాడు. దేశంలో సాగు విప్లవం తీసుకొద్దామని ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. తెలంగాణ లో సాగుతున్న సాగు విప్లవం దేశమంతా విస్తరించేందుకే బిఆర్‌ఎస్‌ అడుగులేస్తుంది. మన దేశాన్ని వ్యవసాయ రంగంలో తిరుగులేని శక్తిగా మారుద్దాం! అనేదే కేసిఆర్‌ నినాదం. టిఆర్‌ఎస్‌ విధానం. 

దేశమంతా సాగుకు ఉచిత విద్యుత్‌ అమలు చేద్దాం.

 ఎనిమిదేళ్ళ క్రితం వరకు తెలంగాణలో విద్యుత్‌ ఒక మిధ్య. ఒక కల. కరంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తెలంగాణ రైతాంగం కరంటు కోసం నిత్యం ఎదురుచూపులే…నిద్రలేని రాత్రులు గడపడమే…బావుల దగ్గర నిద్రలు చేయడమే…ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకడమే….తెలుగు దేశం ప్రభుత్వం పాలన సాగినంత కాలం బిల్లులు వసూలు చేసినా సరిగ్గా కరంటు ఇచ్చింది లేదు. పంటలు పండిరది లేదు. ఏటా పంటలు ఎండిపోవడమే…ఆరు గాలం కష్టం ఆవిరి కావడమే…అప్పులు పెరిగి, వాటిని తీర్చడానికి వలసలు వెళ్లడమే…తెలంగాణ బతుకును చిన్నాభిన్నం చేశారు. రైతును చిద్రం చేశారు. ఇక ఉచిత విద్యుత్‌ పేరుతో తెలంగాణ రైతులను మోసం చేసి, కాంగ్రెస్‌ ఇచ్చిందేమీ లేదు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాడు. ఒకనాడు వ్యవసాయ కరంటు కనెక్షన్‌ అంటే గగనం. ఒకప్పుడు పొలాలలో బోర్లు వేయాలంటే వాల్టా చట్టం అడ్డం. ఇప్పుడు రైతు ఎన్ని బోర్లు వేసుకున్నా, ఎన్ని మోటార్లు పెట్టుకున్నా అంతా ఉచితమే…ఇదే దేశమంతా అమలు చేయాలని కేసిఆర్‌ చూస్తున్నాడు. 

నదుల నీళ్లను పొలాలకు మళ్లిద్దాం.

 దేశంలో అనేక నదుల నీళ్లు లక్షల టిఎంసిలు వృధాగా సముద్రం పాలౌతున్నాయి. వాటిని పొలాలకు మళ్లించాలి. దేశంలో అవసరమైన అన్ని ప్రాంతాలలో ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం జరగాలి. దేశంలోని ప్రతి ఎకరానికి సాగునీరందాలి. అంతే కాదు. దేశంలోని అన్ని గ్రామాలు, నగరాలలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందాలి. తమిళ నాడు మొత్తం సముద్రం ఆవహించి వుంది. చెన్నై నగరంలో మంచినీటి కరువు. దేశ రాజధానిలో నీటి కటకట. మనం ఎంతో గొప్పగా చెప్పుకునే సింగపూర్‌ చుట్టూ సముద్రమే…ఆ దేశం మంచి నీటిని మలేషియా కు అమ్ముతుంది. తెలంగాణ లోని హైదరాబాదు చుట్టూ వున్నా ఔటర్‌ రింగ్‌ రోడ్డు విస్తరణ అంత దేశం సింగపూర్‌. ప్రపంచంలో అత్యంత ధనిక దేశం. ఇలా ఏమీ లేని చోట అధ్భుతాలు సృష్టించారు. కానీ దేశమంతా నదీ జలాలున్నా మంచినీటి కొరత మనం ఎదుర్కొంటున్నాము. ప్రజల దాహార్తి తీరాలి. అంటే బిఆర్‌ఎస్‌ రావాలి. ఇదే ఇప్పుడు దేశం కోరుకుంటోంది.

చారిటబుల్ ట్రస్ట్.మేగా జాబ్ మేళా కరపత్రాలు విడుదల చేసిన డి.ఎస్.పి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డి.ఎస్.పి వెంకటేశ్వరబాబు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ మరియు డాక్టర్.జి.ఎస్ ఆర్. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా.గడల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన(జనవరి 7న శనివారం) ఉచిత మేగా జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేసినారు.ఈ జాబ్ మేళాను నియోజవర్గ నిరుద్యోగ యువతీ, యువకులు ఉపయోగించుకోవాలని డి.ఎస్.పి.కోరినారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కో ఆర్డినేటర్ మోదుగు జోగారావు,ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి.అంజి,ప్రభాకర్, ట్రస్ట్ సభ్యులు కంకణాల ఉజ్జివ్ రావు,లావుడ్య. నరేష్ తదితరులు పాలుగొన్నారు.అనంతరం డి.ఎస్పి ని.ని జాబ్ మేళా రోజున లా.ఆర్డర్ ను కంట్రోల్ చేపించగలరని ట్రస్ట్ సభ్యులు కోరినారు

తెలంగాణ రాష్ట్రంలో 29 మంది IPSల బదిలీలు

జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం…

హైదరాబాద్ నేటిధాత్రి

29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం…

స్వాతి లక్రాను టిఎస్ఎస్ పీఎస్ ఏడీజీగా నియామకం…

ప్రస్తుత ఏసీబి డైరెక్టర్ గా ఉన్న శిఖా గొయల్ ను ఉమెన్ సేఫ్టీ ఏడీజీగా నియామకం…

ఐజీ నాగిరెడ్డి ఫైర్ సేఫ్టీ డీజిగా నియామకం…

విజయ్ కుమార్ గ్రే హౌండ్స్ ఏడీజీగా నియామకం…

శివధర్ రెడ్డి ఏడీజీ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీగా నియామకం…

అభిలాష్ బిస్తా ఏడీజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ అండ్ హోమ్ గార్డ్స్ నియామకం…

కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఏడీజీ లీగల్ అండ్ స్పెషల్ ఆపరేషన్ ఏడీజీగా నియామకం…

సందీప్ శాండిల్య ఏడీజీ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీగా నియామకం…

సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్ తో పాటు తెలంగాణ స్టేట్ ఆంటీ డ్రగ్స్ నార్కోటిక్ బ్యూరో ఏడీజీగా నియామకం…

రాజీవ్ రతన్ తెలంగాణ స్టేట్ పోలీస్ హోసింగ్ కోపరేషన్ ఏడీజీగా నియామకం…

వివి శ్రీనివాస్ రావు కంప్యూటర్ సర్వీస్ ఏడీజీగా నియామకం…

స్టిఫిన్ రవిద్ర సైబారాబాద్ పోలీస్ కమిషనర్ తో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరోగా నియామకం…

సుధీర్ బాబు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ గా నియామకం…

తరుణ్ జోషి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపీ ఆఫీస్…

కమల్ హాసన్ రెడ్డి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపీ ఆఫీస్…

షన్వాజ్ కాశీమ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్ -11…

చంద్ర శేఖర్ రామగుండం కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్ -1…

రమేష్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ జైలు అండ్ లేజిస్టిక్స్…

కార్తికేయ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటిలిజెన్స్…

రమేష్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజన్న జోన్…

శ్రీనివాసులు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్…

తఫీర్ ఇక్బాల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్…

గజరావు భూపాల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ…

రెమా రాజశ్వరి నల్గొండ ఎస్పీని యాదాద్రి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియామకం…

ఎల్ ఎస్ చౌహన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జోగులాంబ జోన్…

నారాయణ్ నాయక్ జాయింట్ కమిషనర్ అఫ్ సైబారాబాద్ ట్రాఫిక్…

పరిమళ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ అడ్మిన్…

భాస్కరన్ సూపర్ డెంట్ అఫ్ పోలీస్ సీఐ సెల్…

నూతనంగా జిల్లాకు అపాయింట్మెంట్ అయినటువంటి వైద్యాధికారులందరికీ కంగ్రాట్యులేషన్స్ తెలపడం జరిగింది

ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఏటూర్ నాగారం అంకిత్ అధ్యక్షత వహించడం జరిగింది.

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ సమావేశ మందిరంలో వైద్యాధికారులకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఏటూర్ నాగారం అంకిత్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈనాటి సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్ మాట్లాడుతూ నూతనంగా జిల్లాకు అపాయింట్మెంట్ అయినటువంటి వైద్యాధికారులందరికీ కంగ్రాట్యులేషన్స్ తెలపడం జరిగింది. అనంతరము వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉన్నతమైన సేవలు అందించాలని, సేవాభావంతో ఇక్కడి గిరిజన ప్రజలకు నిరంతరము సేవలందించి మన్ననలు పొందాలని తెలిపారు. సమయపాలన పాటించాలని, ప్రతి ఒక్క వైద్యాధికారి ములుగు వెలుగు ఆప్ నందు తమ యొక్క అటెండెన్స్ వేయాలని ఆదేశించారు. ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చు రోగుల పట్ల ప్రేమ చూపాలని, వారికి నాణ్యమైన వైద్యం అందించాలని,

 ఎప్పటికప్పుడు అత్యవసర మందులు నిల్వలు చూసుకుంటూ ఉండాలని, ఆస్పత్రుల్లో నిర్వహించు పరీక్షల కొరకు రీ ఏజెంట్స్ సమకూర్చుకోవాలని తెలిపారు. రెండవసారి చేపట్టనున్న ఈ హెల్త్ ప్రొఫైల్ కు ఉన్నతమైన సేవలు అందించాలని కోరారు. అనంతరము డెంగు, మలేరియా కేసులు జిల్లాలోని పరిస్థితి గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య గారిని అడిగి తెలుసుకున్నారు .ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత గారు వైద్యాధికారులను ఉద్దేశించి జిల్లాలో ప్రభుత్వ కానుపులను పెంచాలని, వాటిలో సి సెక్షన్ డెలివరీ కాకుండా, సాధారణ కానుపులను ప్రోత్సహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య జిల్లా యొక్క ముఖచిత్రమును నూతనంగా వచ్చిన వైద్యాధికారులకు తెలియజేయడం జరిగింది.

 ఈ యొక్క కార్యక్రమంలో నూతనంగా అపాయింట్మెంట్ అయినా వైద్యాధికారులు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది డెమో తిరుపతయ్య, హెచ్ ఈ సంపత్, భాస్కర్, హెల్త్ సూపర్వైజర్ వెంకట్ మొదలగు వారు పాల్గొన్నారు.

తాసిల్దార్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన రేషన్ డీలర్స్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లానేటి ధాత్రి 

చుంచుపల్లి మండల రేషన్ డీలర్స్ మండల అధ్యక్షులు బానోత్ బాలు ఆధ్వర్యంలో చుంచుపల్లి తాసిల్దార్ కృష్ణ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి బొకే అందజేసిన రేషన్ డీలర్స్ చుంచుపల్లి మండల అసోసియేషన్. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండల రేషన్ డీలర్స్ మండల అధ్యక్షుడు బానోతు బాలు చందు పూల్ సింగ్ బాలాజీ రాజ్ కుమార్ శివ వెంకన్న పండు నాని తదితర డీలర్స్ పాల్గొన్నారు

సింగరేణి ఆల్టైం రికార్డుగా బొగ్గు ఉత్పత్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

కొత్తగూడెం టౌన్ :డిసెంబర్ ఒక్క నెలలోనే 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి గత ఏడాది డిసెంబర్ నెల ఉత్పత్తిపై 19 శాతం వృద్ధి రోజుకు సగటున 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో మరో ఆల్టైం రికార్డు ఇదే ఒరవడితో వార్షికాంతానికి 34 వేల కోట్ల టర్నోవర్, అత్యధిక లాభాల దిశగా సింగరేణి సింగరేణి చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించనున్నాం ఇకపై రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలి అన్ని ఏరియాల జీఎంల సమీక్ష సమావేశంలో సింగరేణి సి అండ్ ఎండి. ఎన్. శ్రీధర్ సింగరేణి భవన్, హైదరాబాద్, తేది : 2023.01.3.

 

సింగరేణి సంస్థ 2022 డిసెంబర్ నెలలో తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ ఉత్పత్తిగా 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిందనీ, ఇది గత ఏడాది డిసెంబర్ నెలలో సాధించిన దానికన్నా 19 శాతం అధికమని, అలాగే సగటున రోజుకు 2 లక్షల 18 వేల టన్నుల బొగ్గు రవాణా జరిపి మరో ఆల్టైం రికార్డును నెలకొల్పిందని, ఇదే ఒరవడితో మిగిలిన 3 నెలల కాలంలో ఉత్పత్తి, రవాణా సాధించాలని ఛైర్మన్ అండ్ ఎండి.ఎన్. శ్రీధర్ కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం నాడు ఆయన సింగరేణి డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో డిసెంబర్ నెల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

గత 2021 డిసెంబర్లో 56.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్లో 19 శాతం వృద్ధితో 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. అలాగే గత డిసెంబర్లో 37.37 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్లో 24.47 శాతం వృద్ధితో 47 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించామని తెలిపారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలి ఉన్న 80 రోజులు చాలా కీలకమని, రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని, తద్వారా సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా నమోదు చేయనున్నామని, తద్వారా అత్యధికంగా 34 వేల కోట్లకు పైబడి టర్నోవర్, అత్యధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మణుగురు, కొత్తగూడెం, రామగుండం రీజియన్, అడ్రియాల ప్రాజెక్టుల నుండి గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి రవాణా జరగడం పైన తన సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ఏరియాలు ఇదే ఒరవడితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సమావేశాన్ని ప్రారంభిస్తూ ఆయన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది మరింత వినూత్నంగా, చారిత్రకంగా నిలిచిపోయే ప్రగతిని, వృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ నెలలో సాధించిన ప్రగతిపై ఆయన హర్షం ప్రకటిస్తూ కార్మికులు, అధికారులకు తన అభినందనలు తెలిపారు. 

ఈ సమావేశంలో ఇంకా డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ పా.ఎస్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్.ఎన్. బలరాం, డైరెక్టర్ ఇ అండ్ ఎం డి. సత్యనారాయణ రావు, ఈడీ కోల్ మూమెంట్ జె. ఆల్విన్, అడ్వయిజర్ మైనింగ్ డి.ఎన్. ప్రసాద్, అడ్వయిజర్ ఫారెస్ట్రీ.సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం. సురేష్, జనరల్ మేనేజర్ (పి అండ్ పి) సి.హెచ్. నర్సింహ రావు, జనరల్ మేనేజర్ మర్కెటింగ్ కె. సూర్యనారాయణ, కొత్తగూడెం ఏరియా జి. ఎం..జక్కం రమేష్, మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

డాక్టర్ జిత్తు రామ్ కి రుద్రంపు డిస్పెన్సరీ లో ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

చుంచుపల్లి మండలం: రుద్రంపుర్ స్టాఫ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన.టీబీ.జీకే.ఎస్.వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ సన్మాన గ్రహితను 

 సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సౌజన్యంతో ఉన్నత చదువులు చదివి జనరల్ సర్జన్ అయినందుకు,వారిని అభినందించారు, కార్మికులకు వారి కుటుంబాలకు ఇంకా మరిన్ని సేవలు అందించాలని మరెన్నో ఉన్నత హోదాలు చేపట్టాలని ఆయన కాంక్షించారు. డాక్టర్ మాట్లాడుతూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.సన్మాన కార్యక్రమంలో డాక్టర్ పరుశురాం,గోవర్ధ్ని,కృపారాణి, వీరభద్రమ్, నవీన్ హరినాథ్, ముక్తార్, చేరిపెల్లి నాగరాజు,గోపుకుమర్,విద్యాసాగర్, గాదం శివరాం ,స్పోర్ట్స్ కొడినేటర రాజశేఖర్ ,శ్రీనివాసరెడ్డి అశోక్,వినయ్ , దిల్దర్ ఖాన్, యాదమ్మ, విజయలక్ష్మి, నస్రిన్ సుల్తానా, శ్రీదేవి, స్వప్న ,సాయి తదితరులు

 పాల్గొన్నారు.

కంటి వెలుగును ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలి

జనవరి 18 నుంచి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం ప్రారంభం ఈ నెల 12 లోగా జిల్లా ఇంఛార్జి మంత్రి సమక్షంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం.

వంద పని దినాలలో నిర్దేశిత తేదీలలో ప్రతి గ్రామం, 

వార్డుల వారీగా కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించాలి

 

ములుగు జిల్లా నేటిధాత్రి

 

ములుగు జిల్లా కేంద్రంలో కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ లు, అధికారులతో వీడియో సమావేశంలో దిశా నిర్దేశం చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుండి నిర్వహించు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. 

 

మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , సి.ఎస్. సోమేష్ కుమార్, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ లు, సంభందిత జిల్లా అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. 

 

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ,

 ప్రజల కంటి సమస్యలు తొలగించుటకు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని, ఇందులో భాగంగా రెండవ విడత కార్యక్రమం ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నందున షెడ్యూల్ రూపొందించుకొని పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామాల్లో, వార్డులలో ప్రజలంతా కంటి వెలుగు శిబిరాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

 

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించు అతి పెద్ద కమ్యూనిటీ స్క్రినింగ్ ను విజయవంతంగా పూర్తి చేసి గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు సాధించాలని మంత్రి తెలిపారు.  

 

కంటి వెలుగు శిబిరాల్లో సమాచారం నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ట్యాబులను అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో గతంలో 827 బృందాలు కంటి వెలుగులో పని చేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచినట్లు, జిల్లాలో గల జనాభాకు అనుగుణంగా వంద పని దినాలలో నిర్దేశిత తేదీలలో నిర్వహించే విధంగా శిభిరాలు నిర్వహించాలి అన్నారు.

 

ప్రతి కంటి వెలుగు బృందంలో 1 మెడికల్ అధికారి, 1 అప్తామాలజిస్టు, 2 ఎఎన్ఎం, 3 ఆశా,1 డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారని, వీరికి కార్, అవసరమైన కంటి పరీక్షల యంత్రాలు సిద్దం చేసామని అన్నారు. వైద్య బృందంలో రోజుకు 1500 రూపాయల చోప్పున భోజనవసతి సౌకర్యం కోసం అందించడం జరుగుతుందని, బృందం సభ్యులు స్థానికంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ లు చేయాలని మంత్రి సూచించారు.

 

కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేయడానికి ప్రతి రోజూ వెయ్యి రూపాయల చోప్పున పంచాయతీలకు, మున్సిపాల్టీలకు ముందుగానే విడుదల చేయడం జరుగుతుందని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి కలెక్టర్ లకు సూచించారు. 

 

జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేస్తూ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించాలని, మండల పరిషత్, మున్సిపల్ సమావేశాలు నిర్వహించి షెడ్యూల్ అందజేయాలని మంత్రి తెలిపారు. 

 

గ్రామాల్లో, మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ప్రజలు కంటి వెలుగు శిబిరాల్లో పాల్గోనేలా ముందస్తు సమాచారం అందించాలని, స్వశక్తి మహిళా సంఘాలు, మెప్మా బృందాల సహకారంతో ప్రజలను మొబిలైజ్ చేయాలని సూచించారు.

 

కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని, రీడింగ్ కళ్ళద్దాలను జిల్లాలకు పంపుతామని, వాటిని పి.హెచ్.సి ద్వారా బృందాలకు పంపిణీ చేయాలని తెలిపారు.

 

సాధారణ వైద్యసేవలకు అంతరాయం కలుగకుండా 927 డాక్టర్ లను నియమించడం జరిగిందని, ప్రజలకు అందుబాటులో, అనువైన స్థలాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే జిల్లాలో కంటి వెలుగుకు అవసరమగు ఆఫ్తామాలజిస్టుల, డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు శిక్షణ కల్పించడం జరిగిందని, రీడింగ్ కళ్లద్దాలు పరీక్ష చేసిన అదే రోజు, డిస్టెన్స్ స్పెసిఫిక్ కళ్ళద్దాలు నెల రోజుల్లో ప్రజలకు అందజేయనున్నట్లు తెలిపారు.

 

కంటి వెలుగు శిబిరాల నాణ్యత పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10 బృందాలను, ప్రతి జిల్లాలో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

 

జిల్లాలో విస్తృతమైన ప్రచారం కల్పించడంతో పాటు ఏ రోజు ఏ గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అనే విషయం ప్రజలకు ముందుగా తెలియజేయాలని సూచించారు.

 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని అన్నారు. గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు కంటి వెలుగు దోహద పడుతుందని , దానిని విజయవంతం చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, అధికారులు, డి.ఆర్. డి. ఏ విభాగం వాళ్ళు కలిసి పని చేయాలని అన్నారు. కంటి వెలుగు క్యాంప్ జరిగే రోజు అందుబాటులో ఉంటూ కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయించాలని అన్నారు. 

 

కంటి వెలుగులో అందిస్తున్న అద్దాలు కూడా చాలా బాగున్నాయని, అవసరం ఉన్న అందరికీ ఇవి అందేలా మనం కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు.

 

సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, కంటి వెలుగు పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో సిద్ధం చేసుకున్న షెడ్యూల్ కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. పంచాయతీ, మున్సిపాలిటీలో ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని, ప్రజలు అడిగే వివిధ సందేహాలు నివృత్తి కోసం ఎఫ్.ఎక్యు తయారు చేసుకోవాలని సూచించారు. 

 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మునిసిపల్ శాఖ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ, కంటి వెలుగు అమలు చేసేందుకు మున్సిపల్ శాఖ ఉత్తర్వు సంఖ్య 779 జారీ చేసిందని, క్యాంపులో ఏర్పాటుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అనువైన ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలలో ఉన్న మెప్మా, మహిళా సంఘాలు, రిసోర్స్ పర్సన్స్ వినియోగిస్తూ క్యాంపులో నిర్వహణపై విస్తృత ప్రచారం కల్పించి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

 

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి 

జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఐటీడీఏ పిఓ అంకిత్, డిఎంఅండ్ హెచ్ ఓ అప్పయ్య, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, జెడ్పిసిఈఓ ప్రసూన రాణి, డిపిఓ వెంకయ్య, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version