శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా హన్మకొండ జిల్లాల కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో ఉన్నటువంటి యువ యూత్ ఆధ్వర్యంలో
మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ మహా అన్నదాన కార్యక్రమానికి సుమారుగా 500 మంది హాజరుకాగా, తొమ్మిది రకాల వంటకాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వి.శివాజీ , ఉపసర్పంచ్ చిరంజీవి, బూర్గుల సాయి కిషోర్, గునిశెట్టి చంద్రకాంత్, బెజ్జంకి శ్రీనాథ్, బండ్ల ప్రశాంత్, అల్లాటి క్రాంతి, అఖిలేష్, గౌడ గాని రమేష్, ఆకుల ప్రశాంత్, అన్వర్, బాసిరి నాగరాజు అన్నదాతలు నల్లెల రాజు, ఎలగందుల విష్ణు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు కూడా పెన్షన్లు
విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్
ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
ఊరురా తిరిగి పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి:
పేదలకు గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించేందుకే ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, సిఎం కెసిఆర్ చొరవతో 57 ఏండ్లకు వయో పరిమితి తగ్గించడంతో కొన్ని లక్షల మందికి కొత్తగా అవకాశం వచ్చిందని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వృద్ధులు,దివ్యాంగులకు మాత్రమే పెన్షన్లు ఇస్తుంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు,దీర్ఘకాలిక రోగులకు కూడా పెన్షన్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ తమ దృక్పథాన్ని చాటుకున్నారని ఎమ్మెల్యే అన్నారు.టిఆరెస్ ప్రభుత్వం మానవత్వం ఉన్న మన ప్రభుత్వం సిఎం కెసిఆర్ ప్రభుత్వమని వివరించారు. గతంలో 70 రూపాయలతో మొదలై 200 రూపాయల దగ్గర ఆగిన పెన్షన్లను 2016, 3016 రూపాయల వరకు పెంచారని చెప్పారు.ఇంత పెద్ద మొత్తం పెన్షన్ గా ఇస్తున్న రాష్ట్రాలు కూడా దేశంలో లేవేన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా, సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, బీసీల అభివృద్ధికై ఎంతో కృషి చేస్తుందని అన్నారు.మన సీఎం కెసిఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి,సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవనీ సాగునీరు,పంటల పెట్టుబడులు,పంట రుణాలు, రుణ విముక్తి,రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ వంటి అనేక పథకాలను ప్రజలకు వివరించారు.బిజెపి,కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడా కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్,జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి,వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు ఎండి నజీర్,ఊకంటి యాకోబు రెడ్డి, దామర కొండ ప్రవీణ్ కమటం శ్రీను,ఎటు రోజు మహేశ్వరాచారి,బండారు గోపీనాథ్,ఎలబోయిన సారయ్య,కొంటెడి శ్రీవాణి రవీందర్ రెడ్డి,జల్లె సైదమ్మ విజెంధర్,వీరు నాయక్,వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు,వార్డు మెంబర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
`ఆడిటింగ్ సెక్షన్‌లో ఓ రిటైర్డు ఉద్యోగితో లెక్కలు తారు మారు బాగోతం…
హైదరాబాద్,నేటిధాత్రి:
తాను తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. పరిస్దితులు గతంలో లాగా లేవు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్‌రావు వచ్చారు. గత ఏడాది కాలంగా వైద్య శాఖ ప్రక్షాళనలో సీరియస్‌గా వుంటున్నారు. చిన్న చిన్న తప్పులు చేసిన వారినే వదలడం లేదు. అలాంటిది ఏకంగా ఎనమిదేళ్లుగా నిమ్స్‌ను భ్రష్టుపట్టించిన తనను ఎలాగూ వదిలిపెట్టరు? ఈ మధ్య వైద్యశాఖలో మరింత సీరియస్‌గా అన్ని వ్యవస్ధలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పైగా తనపై అనేక పిర్యాధులు కూడా అందుతున్నాయి. ఇక తప్పుకోవడం మేలు…అలా అని వైదొలుగుతానని చెప్పలేడు….! ఏం చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలోనే నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌ను గుండె నొప్పి కాపాడిరది. అందుకు గుండెపోటు కలిసొచ్చింది. ఇదే అదును వేటు వేయించుకునేందుకు… ఇదే సరైన సమయం. ఈ సమయంలో ఎలాగూ గుండెచికిత్స అవసరం. అందుకు నిమ్స్‌లో కాకుండా ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే చాలు…తాను నిమ్స్‌కు అప్రదిష్ట తెచ్చానని ముందూ వెనుక ఆలోచించకుండా ప్రభుత్వమే తప్పిస్తుంది…ఉద్యోగం నుంచి తొలిగిస్తుంది…! ఒక వేళ అదే జరిగితే అంతా మాఫ్…అంతా సాఫ్…అండ్ సేఫ్…! చేసిన తప్పులన్నీ తూచ్…అవినీతి సంపాదన అంతా గప్‌చుప్…ఎలాంటి ఎంక్వౌరీలు వుండవు. వాటి ఆలోచనకే ఆస్కారం లేదు. సాగనంపే సమయంలో అవకతవకలు చూడరు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిమ్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ వైద్యుడు మనోహర్ . ఆడిరది ఆట పాడిరది పాటగా సాగింది.
ఈ ఎనమిదేళ్లు ఎలాంటి ఎదరు లేదు. నిజానికి నిమ్స్ డైరెక్టర్ పదవి అన్నది రెండు సంవత్సరాలు మాత్రమే. కాకపోతే ఓ ఏడాది పొడిగింపుకు కూడా అవకాశం వుంటుంది. కాని మనోహర్ మాత్రం ఎనమిదేళ్లుగా ప్రభుత్వం వద్ద మంచి మార్కులు కొట్టేస్తూ పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. అందుకు సిఎంవోలో వున్న గంగాధర్ పూర్తి సహాకారంతో సాగుతోందన్నది నిమ్స్ ఉద్యోగులు అనే మాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముగ్గురు ఆరోగ్య శాఖ మంత్రులు మారారు. కాని నిమ్స్ డైరెక్టర్ మాత్రం మారలేదు. అలా అందర్నీ మేనేజ్ చేస్తూ వచ్చారు. కాని ఇప్పుడు కుదడం లేదు. కాలం కలిసి రావడం లేదు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రులతో అందిన సహాకారం ఇప్పుడు అందడం లేదు. తన ఆటలు చెల్లుబాటు కావడం లేదు. ప్రతి విషయంలోనూ మంత్రి హరీష్‌రావు బాధ్యతలు చేపట్టాక డేగకళ్లలో నిఘా పెరిగింది. మనోహర్ లాంటి వారికి ఊపిరి సలపడం లేదు. ఎప్పటికప్పుడు నిమ్స్ విషయంలోనూ సమీక్షలు జరుగుతున్నాయి. పాత ఫైళ్లు ముందుట పడుతున్నాయి. పాపాల చిట్టా బైటపడేలా వుంది. ఇక తన వంతు వచ్చేలా వుంది. ఎందుకైనా మంచిది ముందే తప్పుకుంటే మేలు…ఎనమిదేళ్లుగా దోచుకున్నదంతా తెలిసిపోయేలా వుంది. ఇలాంటి సమయంలో సానుభూతి పొందడం అన్నది దుర్లభం. ప్రభుత్వ పెద్దలు చీదరించుకుంటేనే మేలు…ఉన్న ఫలంగా సాగనంపితేనే మరింత మేలు. మెడలు పట్టి బైటకు పంపినా సరే…కాని పాత గోతులు తవ్వకపోతే సరి… ఎలాగూ గుండెకు స్టెంటులు వేశారు. కొంత కాలం పాటు రెస్టు ఎంతో అవసరం.
ఈ సమయంలో తనను ప్రశ్నించడానికి ఎవరూ రారు…మానవతా దృక్పధం వుంటుంది…ఇదే సమయంలో తనను పరామర్శించడానికి వచ్చిన నిమ్స్ ఉద్యోగులతో ఏం జరుగుతుందో అన్నది ఎప్పటిప్పుడు తెలుసుకోవచ్చు. మరింత జాగ్రత్త పడొచ్చు. ఇదీ నిమ్స్ డైరెక్టర్ మనోహర్ వేసిన అధ్భుతమైన స్కెచ్…వినడానికి వింతగా వున్నా లోతుగా అవగాహన చేసుకుంటే గాని అర్ధం కాదు. జులాయి అనే సినిమాలో ఓ అధ్భుతమైన సన్నివేశం మనోహర్ విషయంలో రుజువైనట్లు కనిపిస్తోంది. ఓ సన్నివేశంలో ఎంతో టెన్షన్‌గా వుండే రాజేంద్ర ప్రసాద్‌కు అల్లు అర్జున్ ఓ విషయం చెబుతాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇంత టెన్షన్‌లో ఆ విషయం ఎలా తట్టిందని ప్రశ్నిస్తాడు. క్లాస్ రూంలో వున్నప్పుడు ఎవడైనా సమాధానం చెబుతాడు…పరీక్షల్లో గుర్తుకొచ్చి ఆన్సర్లు రాసిన వాడే టాపర్ అవుతాడు…అంటాడు….ఇది ఇక్కడ నిజమైందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది సరిగ్గా అమలు చేసి సక్సెస్ అయ్యాడు. నిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వ పెద్దలు, ప్రజల ఆలోచనలు మరో వైపు మళ్లించాడు. ఎంత సేపు మనోహర్ నిమ్స్ డైరెక్టర్‌గా వుంటూ ఎలా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తారు? నిమ్స్ డైరెక్టరే ఆ ఆసుపత్రిని నమ్మకపోతే ఇక సామాన్యులు ఎలా నమ్ముతారు? జనంలో నమ్మకం ఎలా ఏర్పడుతుంది. ఒక్క సంఘటనతో మొత్తం నిమ్స్ పరవు తీశాడు. వెంటనే మనోహర్‌ను పదవి నుంచి తొలిగించాలి? అనే డిమాండ్ సర్వత్రా ఎదురౌతుంది. తాను చేసిన తప్పులన్నీ ఈ ఒక్క తప్పులో కొట్టుకుపోతాయన్నది మనోహర్ వేసిన ఎత్తుగడ… ఈ ఎనమిదేళ్ల కాలంలో నిమ్స్‌లో సుమారు వందల కోట్ల రూపాయల గోల్ మాల్ .జరిగిందనేది అక్కడి ఉద్యోగుల మాట.
ఎనమిదేళ్ల కాలంలో నిమ్స్‌లో అనేక వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక మరమ్మత్తులు చేపట్టారు. కొత్త నిర్మాణాలు మాత్రం కాదు…పాత వాటికే కొత్త పూతలు పూయడం అన్న మాట…ఇలా పావుల పైసల కూరకు ముప్పావుల మసాలా ఖర్చు అన్నట్లు కొత్త నిర్మాణాలకయ్యే ఖర్చుకన్నా, అనేక రెట్లు మరమ్మత్తుల పేరుతో ఖర్చు చేశారన్నది ప్రధాన అరోపణ. అది కూడా కొన్ని వందల కోట్ల ఖర్చుకు లెక్కా పత్రం లేకుండా చేశారన్నది ప్రధాన విమర్శ. తాను చేసిన అడ్డమైన పనులకు అండగా నిలిచేందుకు వరంగల్ ఎంజిఎంలో రిరైర్డ్ అయిన అరవింద్ రెడ్డి అనే డాక్టర్, మధుసూదన్ అనే మరో రిటైర్డు ఉద్యోగిని తెచ్చి తన అనుచరులుగా ఔట్‌సోర్సింగ్‌లో నియామకాలు చేయించాడు. అంతే కాకుండా నిమ్స్‌లో జరిగే ప్రతి నిర్మాణాలను స్వయాన తన సోదరుడి కనుసన్నల్లోనే జరిగేలా చూసుకున్నాడు. నిమ్స్ పరిధిలో చేపట్టే అనేక నిర్మాణపు పనులకు ఎలాంటి టెండర్లు వుండవు. ఒక వేళ వేసినా వాటిని రద్దు చేస్తారు. మనోహర్ సోదరుడి పర్యవేక్షణలో అనేక మరమ్మత్తులు చేపట్టారు. వందల కోట్లు ఖర్చు చేశారు…కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. కాదు..కాదు దోచుకున్నారంటే బాగుంటుందేమో! ఇది ఏ నిమ్స్ ఉద్యోగిని కదిలించినా చెప్పే మాటే… నిమ్స్ డైరెక్టర్‌గా మనోహర్ నియామకం జరిగిన నాటి నుంచి నేటిధాత్రి అనేక కధనాలు రాసింది.
ఒక దశలో అనుకూలమైన మంత్రుల కనుసన్నల్లో జరిగిన అవకతవకలపై సాక్ష్యాధారాలతో సహా ప్రచురించింది. అయినా మనోహర్ మాటే చెల్లుబాటైంది. కాకపోతే ఇప్పుడు పాపం పండిరది. ఏదో ఒకనాడు చేసిన తప్పులు బైట పడాల్సిందే…అవి వెలుగు చూడాల్సిందే…జనానికి తెలియాల్సిందే…కాకపోతే కొంత సమయం పట్టొచ్చు. అంతేగాని అవినీతి పరుడు ఎప్పుడూ నీతి పరుడు కాలేడు…! అయినా మనోహర్ తప్పించుకోవాలని చూశాడు..కాని కుదరలేదు…సానుభూతి పొందుదామని చూశాడు…కాని నిమ్స్ ఉద్యోగులే ప్రశ్నించారు. మనోహర్‌కు గుండెసంబంధమైన విషయంలో ఆయన ఆసుపత్రిలో చేరిన వెంటనే అత్యవసర చికిత్స ఏమీ జరగలేదు. ఒక వేళ ఆయన తప్పని పరిస్ధితుల్లో అపోలో హైదర్‌గూడలో చేరినా , తర్వాత గుండె సంబంధమైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించే అవకాశం వుంది. కాని అలా జరగలేదు. అంటే ఒక స్ధిర నిర్ణయంతోనే ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడనేది స్పష్టమౌతోంది. తాను నిమ్స్ పరువు దిగజార్చినట్లు ప్రజలు, ప్రభుత్వం స్పందిస్తేగాని, ఈ ఉచ్చునుంచి బైటపడలేని స్దితి. అందుకే ఈ కొత్త నాటకంతో అందరిచేత అయ్యో! అనిపించుకుకోవాలనుకున్నాడు…కాని కాలం ఎదురు తిరిగింది…తను తలిచింది నిజమైనా… అంతలోనే కథ అడ్డం తిరిగింది…అయితే ప్రభుత్వం అప్పటికే కొత్త డైరెక్టర్‌ను నియమించాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు మనోహర్‌కు తెలిసింది. కొత్త డైరెక్టర్ వచ్చి, పాత ఫైళ్లన్నీ తిరగదోడితే కథ మొదటికొస్తుంది. పీకల మీదికొస్తుంది…అందుకే ముందుజాగ్రత్త చర్య…ఎంతో నిపుణుడైన డాక్టర్‌కు గుండెపోటుకు చికిత్స!
ఈరోజు తాడ్వాయి మండలంలోని గంగారం గ్రామపంచాయతీలో టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆకుల బిక్షపతి గారి దశదినకర్మ కి హాజరై వారి ఫోటోకి నివాళులర్పించడం జరిగింది
దామెరవాయీ లో TRS పార్టీ కార్యకర్త మోరే చిన్న సమ్మయ్య గారి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది.
టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని అండగా ఉంటుందని చెప్పడం జరిగింది .
వీరితో పాటుగా మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొర్నిబెల్లి శివయ్య గంగారం సర్పంచ్ గౌర బోయిన నాగేశ్వరరావు దామెరవాయిసర్పంచ్ గంగారం టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు యాలం విక్రమ్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ను శెట్టి రమేష్ రంగు సత్యం ఇంద్రారెడ్డి సోమనాగమ్మ చందా నారాయణ తదితరులు పాల్గొన్నారు
గతంలో ఎంతో మంది గవర్నర్లు రాష్ట్రంలో పనిచేశారు వారితో రాని ఇబ్బంది ప్రస్తుత గవర్నర్ తమిళ సై తో ఎందుకు వస్తుంది. ఆమెకు గవర్నర్ పదవీ ఎలా అర్హత ఉంది అంటూ రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఫెయిర్
అయ్యారు.హైదరాబాద్ డిఎస్ఎస్ భవన్ లో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు దూరం ఎక్కడ పెరగలేదని అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ ఎప్పుడు రావాలి అన్నది ఆయన ఇష్టంమేదే ఆధారపడి ఉంటుందన్నారు.రాష్ట్రంలో భారీ వర్షాలకు వరదలు వస్టే ఆడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని వరద ప్రాంతాల్లో పరిశీలనకు వెళ్లారు అక్కడ మీకేం పని అని గవర్నర్ పై సెటైర్స్ వేశారు.రాష్ట్రంలో
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ వివరిస్తున్నట్లు కనిపిస్తోందని,గవర్నర్ గా ఉంటారో పార్టీ నేతగా వ్యవహరిస్తారో తేల్చుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు.గతంలో బీజేపీ అధ్యక్షురాలుగా పోటీ చేసి ఓడిపోయిన తమిళ సై ఇంకా అధ్యక్షారాలుగానే వ్యవహరిస్తోందని ఆరోపించారు.తెలంగాణ చరిత్ర తెలియని గవర్నర్ భాజపా నాయకుల మాటలతో తెలంగాణ విమోచన దినోత్సవం అని మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో లేని సమస్యలను ఉన్నట్టు చూపడం సమంజసం కాదని ,గవర్నర్ తన వైఖరి ఇప్పటికైనా మార్చుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య,గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు,ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్,డిసిసి చైర్మన్ రమావత్ వాల్యనాయక్ పాల్గొన్నారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనమే కారణమని సొసైటీ సభ్యుల ఆందోళన.
విషపూరిత రసాయనాలతో తయారైన విగ్రహాల నిమజ్జనమే తమకు జీవనాధారం లేకుండా చేసిందని వారి ఆవేదన.
నిమజ్జనం అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని సొసైటీ సభ్యులకు పోలీసుల హెచ్చరికలు.
తమను ఆదుకోవాలని సొసైటీ సభ్యుల వేడుకోలు.
అది కోకాపేట కొత్త చెరువు. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో ఆ చెరువులో చేపలన్నీ మృత్యు వాత పడ్డాయి. కొన్ని వేల చేపలు చనిపోయాయి. చెరువులో చేపల పెంపకమే జీవనాధారమైన కుటుంబాలకు కష్టం, నష్టం ఎదురైంది. ఒక్కసారిగా కొన్ని వేల చేపలు చనిపోవడంతో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ ఆ చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగలేదు. మొదటి సారి నిర్వహించారు. అప్పటికీ చెరువులో చేపల పెంపకం దారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసు అధికారులకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వినిపించుకోలేదు. ప్రభుత్వానికి చెప్పుకోండి అని దురుసు సమాధానం చెప్పినట్లు చేపల పెంపకం దారులు చెబుతున్నారు. రకరకాల రసాయనాలు, విషపూరిత రంగులతో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల చేపలన్ని మరణించాయి. నీటిపై తేలాయి. అలా విషపూరిత రసాయనాలతో నిండిన చెరువులో మళ్ళీ చేప పిల్లలు వేసినా బతుకుతాయన్న నమ్మకం లేదు. చెరువులో చేపల పెంపకం మీద ఆధారపడి సుమారు 60 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. కేవలం చేపలు పట్టే వృత్తి తో జీవితాలు గడిపే తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. నష్ట పరిహారం చెల్లించాలంటున్నారు. భవిష్యత్తులో ఈ చెరువులో విగ్రహాల నిమజ్జనం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చెరువులోని చేపలన్నీ ఓ వైపు ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ గురించి ఎంత చెబుతున్నా, మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచిస్తున్నా ప్రజలు పట్టించుకోకపోవడానికి నిదర్శనం ఇది.
కేసులు నమోదు చేస్తాం: పోలీసుల హెచ్చరికలు.
కోకా పేట కొత్త చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నట్లు మత్స్య సొసైటీ అధ్యక్షుడు గణపురం సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని సొసైటీ ఇతర ముఖ్యులైన రమేష్, అనిల్ కోరారు.
నెక్కొండ, నేటి ధాత్రి: బుధవారం నెక్కొండ మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షుడు జాటోత్ రమేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ఎక్కువ శాతం గైరాజా కావడంతో
సమావేశం మొక్కుబడిగా సాగింది. 23 అంశాలపై సభ జరగాలని ఆయా శాఖల ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వగ ఇందులో చాలా మంది అధికారులు గైరాజరయ్యారు. ముఖ్యమైన అంశాలలో ఒకటి ఎక్సైజ్ శాఖ నుండి ఎవరు రాకపోవడంతో పలువురు ప్రజాప్రతినిధులు నిస్సహాయత వ్యక్తం చేశారు .
ప్రభుత్వం మండల కేంద్రంలో నాలుగు బ్రాండి షాపులకు అనుమతిస్తే ఆ షాప్ ల యజమానులు ఐదు షాపులు నిర్వహిస్తున్నారని అందులో ఒకటి హోల్సేల్ అంటూ బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు, బెల్ట్ ల షాపు నిర్వాహకులు మరికొంత పెంచి నియోగదారులకు అమ్ముతుంటే వినియోగదారుడు తీవ్రంగా
నష్టపోతున్నారని ఇదంతా ఎక్సైజ్ అధికారులకు తెలియకుండానే జరుగుతుందా ? ఈ విషయమై అధికారులను నిలదీయాలంటే రాకపోయా అని ప్రజాప్రతినిధులు చర్చించుకుంటూ సమావేశం దృష్టికి తెచ్చారు. మండల వ్యవసాయ అధికారి నాగరాజు సభకు తన నివేదికలో రైతు బంధు 13వేల ఎనిమిది వందల తొంబై ఆరు మంది రైతులకు అర్హత పొందారని వీరి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు జమ అవుతున్నదని అలాగే 13 896 మంది రైతులకు బీమా ప్రభుత్వం చేసిందని ఇప్పటివరకు మండలంలో వివిధ కారణాలతొ 172 మంది రైతులు మృతిచెందగా వారి కుటుంబాలకి 8 కోట్ల ఆరు లక్షల బీమా డబ్బులు అందించమని అలాగే పిఎం కిసాన్ కింద 1123 మంది రైతులకు ఏట ఆరువేల రూపాయలు చొప్పున వస్తున్నాయని, ఈ కేవైసీ మండలంలో 82% పూర్తి చేశామని జిల్లాలోనే మండలం ముందున్నదని మిగతావారు ఈ కేవైసీ చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ రెండవ పంటకు 5000 ఎకరాలకు వేరుశనగ ,ఐదు వందల ఎకరాలకు నువ్వుల,కు సబ్సిడీ కావాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని ఆయన తెలిపారు. డిప్యూటీ తహసిల్దార్ రాజ్ కుమార్ మాట్లాడుతూ రైతులు వారి భూముల సమస్యలపై 33 రకాల ఆప్షన్స్ మీ సేవలో ప్రభుత్వం ఇచ్చిందని భూ సమస్యలకొసం మీసేవ ధార దరఖాస్తు చేసుకోవాలని, ఇంకా 6,800 సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం అనుమతించగానే అవి పరిష్కరిస్తామని, అలాగే నూతన రేషన్ కార్డులు, మార్పులు, మీసేవ లో దరఖాస్తు చేసుకోవాలని సభకు తెలిపారు. గ్రామాల్లో ప్రస్తుతం ఆధార్ ఓటర్ కార్డ్ అనుసంధాన కార్యక్రమం జరుగుతున్నదని ప్రతి ఒక్కరూ ఆధార్ నెంబర్ ఇచ్చి సహకరించాలని ఇందుకోసం గ్రామాలలో సర్పంచులు ,ఎంపీటీసీలు, కూడా ప్రజలను చైతన్యపరిచి ఆధార్ నెంబర్ ఇచ్చేలా చూడాలని ,ప్రస్తుతం 25 శాతం మాత్రమే ఆధార్ ఓటర్ అనుసంధానం అయిందని ఈనెల 15లోగా మొత్తం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి అధికారి తన నివేదిక చదివి సభ పూర్తి అయ్యేంతవరకు ఉండకుండా వెళ్లిపోవడం జరిగింది . సర్వసభ్య సమావేశానికి 16 మంది అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కు సమాచారం అందించగా 12 మంది గైరాజ కావడం సభ సమావేశంపై వారికి ఏ విధమైన గౌరవం ఉందో అర్ధమవుతుంది. సమావేశంలో ఎం పీ ఓ రవి, ఎంపీటీసీ సంఘని సూరయ్య ,సర్పంచులు యమునా రంజిత్ రెడ్డి ,ఆలకుంట సురేందర్, వినోద తదితరులు పాల్గొన్నారు.
* నీటి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటున్న ప్రిన్సిపాల్
*బిల్డింగ్ నిర్మాణానికి ఉన్న నీరు విద్యార్థులకు ఎందుకు లేవు..?
*పూర్తిగా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే అంటున్న విద్యార్థులు
* కొన్ని నెలల క్రింద ఇది కేటీఆర్ ప్రారంభించాల్సిన గురుకుల పాఠశాల
* బోరు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆర్ధిక సహాయం చేస్తా అన్నారు
* ప్రతి విద్యార్థి తల్లిదండ్రి 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు
మొగుళ్లపల్లి నేటిధాత్రి
మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో గత కొన్ని రోజుల నుండి నీటి కొరత ఉంది. ఇక్కడ నీటితో కనీస అవసరాలు కాళ్ల కృత్యాలు మరియు త్రాగునీరు కూడా దొరక్కపోవడం ఆశ్చర్య పడాల్సిన విషయం. ఈ గురుకుల విద్యాలయం ప్రారంభమై మొదటి సంవత్సరం కూడా పూర్తి కాలేదు. విద్యార్థులు కనీస అవసరాల కోసం కూడా ఇబ్బందులకు గురవుతున్నారు అంటే ఇది కాంట్రాక్టర్ తప్ప లేక ప్రిన్సిపల్ నిర్లక్ష్యమా అని విద్యార్థులకు అర్థం కాక ఎవరిని అడగాలో తెలియక విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ట్యాంకర్లతో నీటిని తెప్పించడం వల్ల సరిగ్గా స్నానాలు చేయలేకపోతున్నామని కనీసం త్రాగడానికి నీళ్లు కూడా ఉండటం లేదని ఒక్కొక్క విద్యార్థి నాలుగైదు రోజుల నుండి స్నానాలు చేయకపోవడంతో విద్యార్థులకు దురదలతో కంతులు లేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో మొగులపల్లి స్థానిక ఎస్సై శ్రీధర్ విద్యార్థులకు నచ్చజెప్పడంతో విద్యార్థులు ఎవరి క్లాస్ రూమ్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో గత కొద్ది రోజులుగా నీళ్ల సౌకర్యం సరిగా లేదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని ఇకనైనా వెంటనే అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని కోరారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో రఘునాథ పాలెం మండలం కోటపాడు గ్రామం మాచినేని చెరువులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి చేప పిల్లల్ని వదిలారు.బురహాన్ పురంలో వృద్ధులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేసిన
కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపి పాల్గొన్నారు.అలాగే, పట్టణంలోని వైరా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరై దాని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.ఎంపి రవిచంద్ర తన చేయూతతో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు,అర్చనలు చేశారు.మేదర్ బజార్ లో అంకమ్మ తల్లి ఆలయం, గణేష్ మండపాలలో కొబ్బరి కాయలు కొట్టారు.రమణగుట్ట,24గంటల పంపు,మామిళ్ల గూడెం రామాలయం సెంటర్,బోసు బొమ్మ సెంటర్,గాంధీ నగర్,జహీర్ పుర లంబాడీ తండ, అగ్రహారం, అగ్రహారం గేట్,ఆదిత్య థియేటర్ ఎదురుగా జమ్మిబండ రోడ్డు తదితర చోట్ల ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు.పలుచోట్ల అన్నదానం కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు,గాంధీ నగర్ 3వ వీధిలో భక్తులతో కలసి భోజనం చేశారు.వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు.రవిచంద్ర వెంట ఉన్న యువకులు “జై గణేశ జై జై గణేశ, గణేష్ మహరాజుకీ జై,జైజై గణేష్ మహరాజ్ “అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు,టపాసులు పేల్చారు.
`మేము నాయకులమౌతామని పార్టీలు పెట్టిన వాళ్లున్నారు?
`పాలకులు నచ్చక ఉద్యోగం వదిలేసిన వాళ్లు కూడా వున్నారు?
`నాయకులను గడగడలాడిరచిన వాళ్లు వున్నారు?
`పాలకులు తప్పు చేస్తుంటే సరి చేసిన వాళ్లున్నారు?
`వాళ్లెంత కష్టపడ్డా ప్రజలు సంతోషంగా వుంటే చాలనుకుంటారు?
`అప్పుడప్పుడు సవాళ్లు ఎదుర్కొంటారు!
`పాలకుల చిన్న చూపును భరిస్తుంటారు!
`సమాధానం చెప్పలేక, వాళ్ల వద్ద లేక కాదు, పాలకుల పరువు కాపాడేందుకు మౌనం వహిస్తుంటారు?
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒకప్పుడు ఐఏఎస్ అధికారులంటే సమాజంలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ ఎనలేని గౌరవం వుండేది. ఉద్యోగ పరంగా వారి హోదాకు కూడా ఎంతో విలువుండేది. జిల్లా కలెక్టర్ వస్తున్నారంటే ఎమ్మెల్యేలు సైతం పరుగెత్తుకెళ్లేవారు. ఎంపిలు కూడా కలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూసేవారు. కాని ఇప్పుడు పరిస్ధితి దేశ వ్యాప్తంగా మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు అంత గౌవరం వుండేది కాదు. ఒకప్పుడున్న అపరిమితమైన అధికారాలు ఇప్పుడూ వున్నాయి. కాని రోజులే మారాయి. రాజకీయ పరిస్ధితులు మారుతున్నాయి. పాలకుల తీరు మారుతోంది. వారి ఆలోచనలకు తగ్గట్టు ఐఏఎస్, ఐపిఎస్‌లు పనిచేయాలని చూస్తున్నారు. వారి కనుసన్నల్లో వుండేలా చూసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అపరిమితమైన అధికారాల స్వేచ్ఛ చుట్టూ అల్లిన పంజరంలో వుంటున్నారు. పేరుకు పెద్ద ఉద్యోగం. పాలకులు చెప్పిందే చేయాలి. వారికి నచ్చే విధంగా నడుచుకోవాలి. పాలకల మాటను తుచ తప్పకుండా పాటించాలి. పాలకులు కోరుకుంటున్న రీతిలోనే వారు పనులు చేయాలి. వారి సూచనలు కూడా ఆ దిశగానే వుండాలి. అంతే తప్ప పాలకులు అడగకముందే వారి ఆలోచనలు చెప్పొద్దు. అసలు ఐఏఎస్‌లు మర మనుషులుగా మాత్రమే పనిచేయాలి. ఇది ఏ ఒక్క రాష్ట్రానికి పరితమైంది కాదు…ఏ రాష్ట్రంలోనూ ఇందుకు భిన్నంగా రోజులు లేవు. టెక్నాలజీ పెరిగింది. మరింత చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతోంది. రాజకీయ నాయకుల పలుకుబడి మాత్రమే పెరుగుతోంది. అధికారుల స్వేచ్ఛకు ముళ్లకంచెలు పడుతున్నాయి. ఆ మధ్య ఓ ఉత్తరాధి రాష్ట్రంలో బిజేపి ఎంపి.
అక్కడి ఎస్పీని పది మందిలో కొట్టిన సంఘటన పెద్ద వైరల్ అయ్యింది. అసలు జిల్లాకు ఎస్పీ అంటే ఎంతో హడల్. అలాంటి వారిని ఎంపిలు, ఎమ్మెల్యేలు తమ చెప్పుచేతుల్లో వుంచుకునేందుకు పోటీ పడుతున్నారు. రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించుకొని వారిపై పెత్తనం చేస్తున్నారు. ముఖ్యంగా బిజేపి పాలిత రాష్ట్రాల్లో ఐఏఎస్‌లపై పెత్తనం మరింత ఎక్కువగా వుందన్న ఆరోపణలు కూడా వుంటున్నాయి. గతంలో ఐఏఎస్, ఐపిఎస్‌ల గౌరవం ఎంతో గర్వంగా వుండేది. ఇప్పుడు నానాటికీ తీసికట్టు నాగం బొట్టు అన్నట్లు తయారైందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎంత సేపు పాలకులు చెప్పే వాటిని మాత్రమే అమలు చేయాల్సిన పరిస్ధితి ఎదరౌతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్. రాజశేఖరరెడ్డి పాలన నుంచి ఐఏఎస్‌లను తమ కంట్రోల్‌లో పెట్టుకోవడం మొదలైందనే చెప్పాలి. అంతకు ముందు కొన్ని విషయాలు చర్చించుకుంటే ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న సమయంలో బోళ్ల బుల్లిరామయ్య అనే మంత్రి వుండేవారు. ఆయన సీనియర్ నాయకుడు. ఎంపి ఎన్నికల్లో సూపర్ కృష్ణను ఓడిరచిన నాయకుడు. అలాంటి నాయకుడి దగ్గరకు ఓ అధికారి తన ప్రమోషన్ కోసం వచ్చి కలెక్టర్‌కు ఒక్క మాట చెబితే పని అయిపోతుందన్నాడు. బోళ్ల బుల్లిరామయ్య చాలా సేపు సంశయించాడు. పని చేసిపెట్టకపోతే అసమ్మర్ధ నాయకుడౌతాడు. తాను చేసినసిఫారసు కలెక్టర్ పట్టించుకోకపోతే పరువు కాస్త తనకు తానే తీసుకున్నట్లౌవుంది. తన వద్దకు వచ్చిన అధికారి కోసం రూపొందించిన సిఫారసు లెటర్‌ను చించేసి, డస్టుబిన్‌లో పడేసి, రేపు మరోసారి వచ్చి కలువు అన్నాడట. ఆ సాయంత్రం కొంత ధైర్యం కూడదీసుకొని కలెక్టర్‌కు ఫోన్ చేసి, ఆ పని చేసిపెట్టమని రిక్వెస్టు చేశాడట. ఇదీ ఒకప్పుడు నాయకుల్లో నిబద్దత…ఐఏఎస్‌లకు వున్న విలువ. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆయన వద్ద పనిచేసిన జయప్రకాశ్ నారాయణతో ప్రతి విషయాన్ని ఎన్టీఆర్ కూలంకుషంగా చర్చించేవారట.
వారి సూచనలు , సలహాలు తప్పకుండా స్వీకరించేవారట. అలా ఉమ్మడి రాష్ట్రంలోపూర్వపు ముఖ్యమంత్రులందరూ ఐఏఎస్ అధికారుల సమావేశాలు ఏర్పాటు చేసి, వారి సూచనలు తీసుకుంటూ వుండేవారు. సమీక్షలు నిర్వహించి, ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరవేసేందుకు వారిని రిక్వెస్టు చేసేవారు. కాకపోతే తమకు నచ్చని అధికారులను, తమకు సహకరించని అధికారులను పక్కన పెట్టడం అప్పుడూ వుంది…ఇప్పుడూ వుంది…కాకపోతే ట్రీట్ మెంటులో కొంత తేడా వుంది. ఒకప్పుడు ఎమ్మెల్యేలు సైతం ఐఏఎస్‌లకు కొంత భయపడేవారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏది చెబితే, అది కలెక్టర్లు చేయాల్సిందే…లేకుంటే ట్రాన్స్‌పర్ కావాల్సిందే…ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలలో వున్నదే…కాకపోతే ఇప్పటికీ ఎంతో కొంత గౌరవం ఐఏఎస్‌లకు తెలంగాణ రాష్ట్రంలో వుందని కూడాచెప్పొచ్చు. అక్కడక్కడా ఇక్కడ కూడా కొన్ని వివాదాలు ఎదరైన సందర్బాలు కూడా వున్నా, ఐఏఎస్‌లను ఎంతో గౌరవంగా చూసుకుంటున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఎందుకంటే పరిపాలనా విషయాల్లో అనుభవం వున్న అనేక మంది రిటైర్టు ఐఏఎస్ అధికారులను కూడా తిరిగి వారి విధులను వినియోగించుకుంటున్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఐఏఎస్ అధికారులు, ఐపిఎస్ అధికారులు అధికారాలే కాదు…
కనిపించని అవమానాలు కూడా ఎదుర్కొంటున్నారు. అందుకే కొందరు సర్వీసులను కూడా వదిలి వెళ్లిపోతున్నారు. ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ప్రజలను చైతన్యం చేసే పని పెట్టుకుంటున్నారు. కొందరు రాజకీయాల్లో చేరుతున్నారు. పార్టీలకు నాయకత్వాలు వహిస్తున్నారు. పాలకులు ఐఏఎస్‌ల మాటలు వినాలన్న రూలేం లేదు. పాలకులు చెప్పినట్లే ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు చేయాలి. అయితే ప్రజాశ్రేయస్సు కోసం మాత్రం ఐఏఎస్‌లు ఆలోచించాలి. పాలకులు చెప్పిన ప్రతి దానికి తలూపడం కూడా చేయకూడదు. కాని అదే వైఎస్ హయాంలో ఎంతో మంది ఐఏఎస్‌ల కొంప ముంచింది. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి విషయంలో ఐఏఎస్‌లు జైలుకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురైంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కారణమన్న దానిపై అనేక చర్చలు సాగిన మాట తెలిసిందే. అయితే ఓసారి జగన్ కోర్టుకు హజరైన సందర్భంలో ఓ మహిళా ఐఏఎస్ అధికారి జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందని అప్పట్లో పెద్దఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలియంది కాదు. ఎంతో నిజాయితీ పరురాలుగా పేరున్న ఓ మహిళా ఐఏఎస్ జైలు జీవితంలో కనీసం నడవలేని స్ధితికి చేరుకున్న సందర్భం చూశాం. ఇదంతా పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి చేసుకున్న స్వయంకృతాపరాధంగా కూడ చెప్పొచ్చు. అయినా ప్రభుత్వం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేయడం వల్ల జరిగిన పరిణామాలను చూసైనా ఐఏఎస్ అధికారులు కొంత జాగ్రత్తగా వుండాలని అంటుంటారు. ఏ ఐఏఎస్ అధికారైనా తాను ప్రభుత్వంలో మంచి శాఖలో పనిచేసి, ఆ శాఖకు మంచి పేరు తేవాలనే కోరుకుంటాడు. సంస్కరణలు అమలు చేయించి, ఆ శాఖను తీర్చిదిద్దాలనుకుంటాడు. తనకు మంచి పేరు వస్తుందా? రాదా? అన్నది ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మార్కెట్ యార్డుల నిర్మాణం వంటి ఓ వినూత్నమైన కార్యక్రమం ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన సూచనల మూలంగా చేపట్టారు. అవి దేశ వ్యాప్తంగా ఆదర్శమయ్యాయి. నాయకులను గడగడ లాడిరచిన ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఉన్నారు.
అయితే సహజంగా ప్రతిపక్షాలలో వున్న నాయకులపై సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు ఇటీవల అనుసరిస్తున్న తీరు కూడా కొంత వివాదాస్పదమౌతోంది. అది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా చూసిందే…!అప్పటి పాలకుల ఒత్తిళ్ల మూలంగా తమకు ఇష్టం లేకున్నా, తెలంగాణ ఉద్యమం మీద గౌరవం వున్నా, కొన్ని సార్లు అంతరాత్మ ప్రభోదంగా కాకుండా పనిచేసిన సందర్భాలున్నాయి. అప్పుడప్పుడూ ఇలాంటి సవాళ్లు అనేకం ఎదుర్కొంటుంటారు. ఒక్కొసారి చిన్న చూపుకు కూడా గురౌతుంటారు. ఎదిరించే శక్తి వున్నా, మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తుంటారు. దటీజ్ సివిల్ సర్వెంట్స్….!
డిగ్రీ లెక్చరర్ రాధిక భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో ఆప్టిక్స్ విధానంలో పలు అంశాలపై ఆమె పరిశోధన గ్రంథం రూపొందించారు. రాధిక నారాయణ గూడలోని బాబూ జగ్జీవన్ రాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర శాఖాధిపతిగా, వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. ఈ పరిశోధన రాధికకు కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. ఆర్. సాయన్న పర్యవేక్షణలో జరిగింది. ఈ పరిశోధనకు సహకరించిన కాలేజీ ప్రిన్సిపాల్ పి.వి.గీతాలక్ష్మి, సహా అద్యాపకులు పట్నాయక్, కో గైడ్ గా వ్యవహరించిన నిజాం కాలేజీ అధ్యాపకులు డాక్టర్. ఎం. కేశవులు గౌడ్, కుటుంబ సభ్యులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
`పిడిఎస్ కు సంబంధించిన చట్టంలో ఏముందో కేంద్ర మంత్రికి తెలుసా?
`ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చదివింది ఎవరు ఏది చెప్పినా వినడానికా?
`కేంద్ర మంత్రి అయినంత మాత్రాన అంత హూంకరింపు అవసరమా?
`వాళ్లు ఐఏఎస్‌లు అనుకుంటున్నారా?
`కిరాణ షాపుల్లో గుమస్తాలనుకుంటున్నారా?
`పది మందిలో ఐఏఎస్ లను నిలదీస్తారా?
`తప్పు చేస్తే కడిగేయండి…కానీ నేతల అసహనం కలెక్టర్లపై చూపడం సరైందా?
` రేషన్ షాపుల్లో ఫ్లెక్సీలు పెడితే కాపాడాల్సిన పని కలెక్టర్లదా?
`అరగంటలో మళ్ళీ వస్తాను? అని కలెక్టర్ కు బెదిరింపులు సబబా?
`ఒక్క ముక్క పట్టుకొని కలెక్టర్ ను అవమానకరంగా చూస్తారా?
`ఇలాంటి విషయంలో ఐఏఎస్‌ల ఐక్యత ఎందుకు కొరవడిరది?
హైదరాబాద్,నేటిధాత్రి:
వాళ్లు ఉన్నత విద్యావంతులు…ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష రాసి పాసైన వారు. సమాజంతోపాటు, ప్రపంచ జ్ఞానం తెలిసినోళ్లు. ఐఏఎస్ కోసం పడే శ్రమ అంత ఇంతా కాదు. కొన్ని వందల సంవత్సరాల పూర్వం జరిగిన సంఘటనలతోపాటు, పాలనలో పద్దతులు, నేటి తరం దాకా అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలు కూడా తెలిసిన వాళ్లు. ప్రభుత్వ నిర్వహణ అంతా తెలిసిన వాళ్లు…నిర్వహించేవాళ్లు…మన ప్రజాస్వామ్య దేశంలో నాయకులు తీసుకునే నిర్ణయాలను అమలు చేసేవాళ్లు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చే హామీలు గెలిచిన తర్వాత వాటి అమలుకు వీరి మీదే ఆధారపడతారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో ఐఏఎస్‌లదే కీలక పాత్ర. ప్రభుత్వ నిర్వహణలు సరిగ్గా సాగాలన్నా వాళ్లదే కీలక భూమిక. రాష్ట్రాలలోనైనా, కేంద్రంలోనైనా ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల పాత్ర అనన్య సామాన్యమైంది. వారు విధి నిర్వహణ కోసం పడే తపన, చేసే శ్రమ పైకి కనిపించకపోయినా, కాలం ఎటుపోతుందన్నది కూడా చూసుకోకుండా పనిచేయాల్సి వుంటుంది. అలా అంకితభావంతో పనిచేయడమే వారికి తెలుసు. ఎందుకంటే ఐఏఎస్ చదువు అన్నది ఒక కల. ఆ కల నెరవేర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కొన్ని సంవత్సరాల పాటు కఠోర శ్రమ చేసి, సమాజానికి సేవ చేయాలన్న తపనతో వస్తారు. సమాజంలో ఉన్నతమైన గౌరవం వున్న ఉద్యోగం అన్న ఆలోచనతో కొందరు వస్తారు. కొందరు జీవిత లక్ష్యం ఐఏఎస్ కావాలన్న కోరికతో వస్తారు. ఎలా వచ్చినా వారు ఐఏఎస్ అన్నది కావాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి. ఎంత కష్టపడినా ఒక్కొసారి అనుకున్న ర్యాంకు రాకపోతే, మళ్లీ మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టి సక్సెస్ సాధిస్తారు. అలాగే జీవితంలోనూ సక్సెస్ సాధించాలని, గొప్ప అధికారి అని పేరు కోసంపనిచేస్తారు. పేదల సంక్షేమం కోసం పనిచేస్తారు. పేదలకు సేవ చేస్తారు. సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తారు. ఏసి గదుల్లో వుంటారని కూడా అనుకుంటుంటాం…కాని సమాజానికి విపత్తు ఎదురైతే అందరికంటే ముందు అక్కడ ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు వుంటారు. అలాంటి అంకితభావంతో చేసే ఉద్యోగం. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, రాజకీయ నాయకుల పెత్తనాలు, పార్టీలకు చెందిన నేతల వేధింపులు కూడా చూస్తుంటారు. అయినా ఎక్కడా తొనకరు. నోరు మెదపరు. ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయరు. ప్రభుత్వన్ని అభాసు పాలు చేయరు. అన్నింటినీ దిగమింగుకొని, ఐఏస్‌ఎస్ పూర్తయిన తర్వాత చేసే ప్రతిజ్ఞను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉద్యోగ జీవితం గడుపుతుంటారు…ఐఏఎస్ పూర్తయిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ వేసినా వెళ్తారు. కొండ కోనల్లో వుంటే జిల్లాల్లో కూడా పనిచేస్తారు. అంతటి అంకితభావం వున్నవాళ్లు…వాళ్లే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉద్యోగులు…! అలాంటి ఓ కలెక్టర్‌పై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతా చర్చిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మాజీ ఐఏఎస్ అధికారులు సైతం నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. ఐఏఎస్ అధికారులంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో ఎంత వాటా ఇస్తుంది? ఎంత ఖర్చు చేస్తుంది? ఈ వాటల సంగతి ఏమిటి? అన్నదానిపై కలెక్టర్‌కు అవగాహన వుండకపోవడం అంటూ వుండదు. కొన్ని సమయాల్లో కేంద్ర మంత్రులు గాని, రాష్ట్ర మంత్రులు గాని కొన్ని సందర్భాలలో వారి సమాధానాన్ని ఇష్టపడరు. అందుకే చాలా సమయాల్లో ఐఏఎస్‌లు ప్రభుత్వ పెద్దలతో సమీక్షల్లో వున్నంత కలుపుగోలు తనంగా ప్రజల్లో వున్నప్పుడు వుండరు. అందుకే రాష్ట్ర ప్రభుత్వపెద్దలైనా, కేంద్ర ప్రభుత్వ పెద్దలైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు చాలా కూల్‌గా సమాధానం చెప్పడానికే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాలలో ఏం సమాధానం చెబితే ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్టవుతారో అన్న అనుమానంతో కూడా నోరు మెదపరు. ఇదే ఇక్కడ జరిగి వుండొచ్చు. అయినా ఓ కలెక్టర్‌ను పది మందిలో అందులోనూ ఓ రేషన్ దుకాణం వద్ద నిలదీయం ఏమిటి? సమీక్ష సమావేశాల్లో ఇలాంటి ప్రశ్నలు వేశారంటే వేరు విషయం? అంతే గాని రాజకీయ ప్రత్యర్ధులపై విరుచుకుపడినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్ మీద ఆక్రోశంతో మాట్లాడడాన్ని ప్రజలు కూడా హర్షించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో రేషన్ షాపుల ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తారని ఒక కేంద్ర మంత్రి చెప్పడం ఏమిటి?
ఇప్పటి వరకు ఏ కేంద్ర మంత్రికి ఇలాంటి ఆలోచన రాలేదేమో! ప్రజా పంపిణీ వ్యవస్ధ ఏమైనా భారతీయ జనతాపార్టీ ఏర్పాటు చేసిన వ్యవస్ధనా? ప్రధాన మంత్రి మోడీ ఫోటోను రేషన్ షాపుల ముందు పెట్టడం అంటే ఆయన పరువు పెంచినట్లౌవుందా? తగ్గించినట్లౌవుతుందా? పైగా కలెక్టర్లు ఆ ప్లెక్సీలు వున్నాయా? లేదా? ఎవరైనా తొలగించారా? అంటూ వాటిని మానిటరింగ్ చేస్తూ వుండాలా? రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించినట్లు, గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా వున్న సమయంలో అప్పటి ప్రధాని మన్మొహన్ సింగ్ ఫోటో పెట్టారా? పైగా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రేషన్ సరుకులు అందజేత విషయంలో అదంతా రాష్ట్ర ప్రభుత్వ క్రెడిట్ అంటూ చేసిన వీడియోను కూడా టిఆర్‌ఎస్ విడుదల చేసింది. అంటే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం అబద్దమని రుజువైనట్లే కదా? ఆ మధ్య ఉల్లి రేటు విపరీతంగా పెరిగింది? మార్కెట్‌లో ఉల్లి రేటు ఎంత వుందో తెలుసా?
అంటూ నేషనల్ మీడియా ప్రశ్నిస్తే నేను ఉల్లిపాయ తినను అంటూ సమాధానం దాట వేశారు. కాని బాధ్యత కల్గిన మంత్రికి ఉల్లి రేటు ఎంతో తెలియదని చెప్పడం, సమాధానం దాట వేయడం ఔచిత్యమేనా? అలాంటిది ఎప్పుడో చేసిన పిడిఎస్ చట్టంలోని అంశాలపై ప్రతి కలెక్టర్‌కు అవగాహన వుండాల్సిన అవసరం లేదు. సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రికో, సెక్రెటిరికో అవగాహన వుంటే చాలు…! రేషన్ షాపులకు సరఫరా అవుతున్న వస్తువులన్నీ ప్రజలకు చేరువౌతున్నాయా? లేదా? అన్నది కూడా ఎవరైనా ఫిర్యాధు చేస్తే తప్ప కలెక్టర్లకు తెలియకపోవచ్చు. అంతే గాని రేషన్ షాపుల్లో ఏం జరుగుతుందన్నదాని మీదే కలెక్టర్లు శ్రద్దపెడుతూ కూర్చుంటే ఇక వారు చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసుకోవాల్సిందే… ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పరిపాలనవిభాగంలో ముఖ్య పాత్రదారులా? లేక కిరాణ షాపుల్లో గుమస్తాలా? అన్నది నాయకులు తెలుసుకోవాలి. అయినా ఒక కలెక్టర్ మీద కేంద్ర మంత్రి అంత హూంకరింపు అవసరమా? అన్నది సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల్లో సీరియస్‌గా జరుగుతున్న చర్చ. రాజకీయ అసహనం కలెక్టర్ల మీద చూపించడం అన్నది సరైందేనా? పైగా వారికి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా చులకనగా చూడొద్దు. అందుకే కొంత మంది ఐఏఎస్‌లు తాము నాయకులు కావాలన్న ఆలోచన రావడానికి కారణాలు కూడా ఇలా నాయకులు చేసే పెత్తనాలే కారణమన్నది కూడా చెప్పుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లుగా, మంత్రిత్వ శాఖల కమీషనర్లుగా ఐఏఎస్‌లు ఏదైనా తప్పు చేస్తే వారిని కడిగేయడంతో తప్పు లేదు.
కాని ఏ తప్పు లేని సందర్భం..ప్రజల్లో ఏదో ఒక సంచలనం కోసం కేంద్ర మంత్రి చేసిన పని తప్ప అందులో మరేం లేదు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌ను కేంద్ర మంత్రి అవమానించడాన్ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తప్పుపట్టారు. ఐఏఎస్‌లకు సంఫీుభావం తెలిపారు. అయితే ఐఏఎస్‌లలో ఐక్యత లేకపోవడం కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గుజరాత్‌లో ఇటీవల జైలు నుంచి అత్యా చారం, హత్య కేసుల్లో నిందితులు విడుదల కావడాన్ని తప్పు పడుతూ సిఎంవో సెక్రెటరీ స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలపై బిజేపి శ్రేణులు పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా ఆమెకు ఐఏఎస్‌లు సంఫీుభావం వ్యక్తం చేయడం లేదు. సివిల్ సర్వీసెస్‌లో వున్నప్పుడు ప్రభుత్వాల మీద ప్రకటనలు చేయొద్దు. కాని ఒక మహిళగా సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని స్మితా సబర్వాల్ గుర్తు చేయడాన్ని కూడా తప్పంటే ఎలా? ఆమె ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన సమాజంలో ఆడవారి మీద జరిగే అన్యాయాలపై, అకృత్యాలపై కూడా నోరు మెదపొద్దా?
ఈ సమాజంలో సామాన్య మహిళల ప్రశ్నలకు అంత గుర్తింపు వుండదు. ఉన్నత విద్యావంతులైన మహిళల మాటలకు ఎంతో గుర్తింపు వుంటుంది. వారి ప్రశ్నలపై సమాజంలో చర్చ జరుగుతుంది. ఆ ప్రశ్న సమాజంలో చైతన్యానికి ఒక వేధికౌతుంది. ఆమెను కూడా రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సరైందికాదు. ఇక గతంలో ఉమ్మడిరాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించలేక, వారి ఒత్తిళ్లను అడ్డుకోలేక మహిళా ఐఏఎస్‌లైన శ్రీలక్ష్మి లాంటి వారు ఎంతటి శిక్షలను అనుభవించారో తెలియందికాదు. అందుకే తప్పు చేస్తే ఎంతటి స్ధాయిలో వున్న అధికారినైనా ప్రశ్నించే హక్కు, అధికారం పాలకులకు వుంటుంది. కాని తమకు సంబంధం లేని విషయాల్లో కూడా వారినిదోషులను చేసినా, వారిపై విరుచుకుపడినా, పది మందిలో చులకన చేసినట్లు మాట్లాడినా ఐఏఎస్ అధికారుల సంఘం ఉపేక్షించడం కూడా మంచిది కాదు. ఇలాంటి సందర్భాలలో వారికి ఐక్యత ఎంతో అవసరం. ఎవరైతే చిన్న చూపు చూడబడ్డారో వారికి మిగతా ఐఏఎస్ అధికారులు వారికి అండగా నిలబడడం కూడా ఎంతో ముఖ్యం.
విమోచనమే అయితే నిజాంను రాజ్ ప్రముఖ్ ఎలా అయ్యారు?
`సెప్టెంబరు17న విలీనం జరగడం మూలంగానే తెలంగాణ ఇండియాలో కలిసింది!
`తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం వ్యతిరేక పోరాటం కాదు!
`నిజాం కు వ్యతిరేకంగా ఎంతో మంది ముస్లింలు పోరాటం సాగించారు.
`తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఒక దశలో అప్పటి ఇండియన్ ఆర్మీతో కూడా పోరాడారు!
`బిజేపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం, హిందూ పోరాటంగా అర్థమొచ్చే ప్రచారం చేయొద్దు!
`నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో షోయాబుల్లా ఖాన్ వంటి జర్నలిస్టు వున్నాడు!
`తొలి అమరుడు షేక్ బందగీ ముస్లిమే!
`తెలంగాణ ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే, నిజాం ప్రపంచ కుభేరుడెలా అయ్యాడు!
`సర్థార్ వల్లభ్ భాయ్ తెలంగాణ విమోచనమే చేయిస్తే నిజాంను శిక్షించాలి కదా!
`ఏడాదికి లక్ష రూపాయల భరణంతో రాజ్ ప్రముఖ్ గా గౌరవించారు?
`ప్రజలను గందరగోళ పర్చకండి!
`చరిత్రకు మరకలద్దకండి!
`ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక కీలక ఘట్టం!
`ప్రపంచానికి ఒక చైతన్యం నింపిన ఘట్టం.. దోపిడీ వ్యవస్థకు గుణపాఠం!
`తెలంగాణలో మువ్వన్నెల జాతీయ జెండా ఎగిరిన రోజు….దేశ సమైక్యతలో, సమగ్రతలో తెలంగాణ భాగమైన రోజు…?
హైదరాబాద్,నేటిధాత్రి: విత్తు ముందా…చెట్టు ముందా? అన్నదానికి ఇప్పటికీ సమాధానం లేనట్లే, తెలంగాణ విషయంలోనూ సెప్టెంబర్ 17 అనేది విలీనమా? విమోచనమా? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏ రకంగా అన్వయించినా ఏదో లోపం కనిపిస్తూనే వుంటుంది. విమోచనం అని నిర్ధారిస్తే వందల ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. విలీనమంటే కూడా అనేక ప్రశ్నలు కళ్ల ముందు మెదులుతాయి. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ సందిగ్ధతను నివృత్తి చేసిన వారు లేరు. ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటైనా 1952 తొలి ఎన్నికలు జరిగేదాకా కూడా జరిగిన సైనిక పాలన, పౌర పాలనల్లో కూడా అనేక వివాదాలున్నాయి. మేజర్ జనరల్ జేఎస్. చౌదరి నేతృత్వ సైనిక పాలన తెలంగాణ ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసిందనేది కూడా ఓ చరిత్ర. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పటి గవర్నరైన ఎంకే. వెల్లోడి నేతృత్వంలో పౌర ప్రభుత్వం ఏర్పాటు చేశాక తెలంగాణలో పోలీసు చర్యలు తగ్గాయి. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలకు ముందు సాగించిన సైనిక పాలన తెలంగాణలో 40 వేల మంది రైతుల మరణానికి కారణమైనట్లు అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు రావడంతోనే ఎంకే. వెల్లోడి పాలన వచ్చింది. ఎం.కే. వెల్లోడి కేరళకు చెందిన ఓ ఐపిఎస్ అధికారి. ఆయనను హైదరాబాద్ రాష్ట్ర పౌర ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పనిచేస్తే అందులో బూర్గులు రామకృష్ణారావు వున్నారు. 1952 ఎన్నికల తర్వాత బూర్గుల ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పుడు కూడా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా చేసుకున్నట్లు ఆధారాలు లేవు. ప్రభుత్వం కుదురుకోకముందే అప్పటి కేంద్ర ప్రభుత్వం బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలంగాణ 9 జిల్లాలుగా, మరో 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో కలపడంతో అసలు హైదరాబాద్ రాష్ట్ర ఉనికే లేకుండాపోయింది. కాకపోతే మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు 1957 నుంచి హైదరాబాద్ విలీన దినోత్సవాలను నిర్వహిస్తున్నాయి. కాని ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 17ను గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. ఆనాటి నుంచి కమ్మూనిస్టు పార్టీలు ఎంత పోరాటం చేసినా అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించలేదు. అప్పటికీ నైజాం రాజ్యం ఇండియాలో కలపడం అన్నది విలీనమా? నైజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి కావడం విమోచనమా? అన్నదానిని కూడా ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వలేకపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి నవంబర్ 1నే రాష్ట్రావతణ దినోత్సవంగా జరుపుకోవడం ఆనాయితీగా వచ్చింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ పార్టీ సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని కోరింది. కాని విమోచనం అన్నదానిపై ఆ పార్టీ కూడా విముక్తి దినోత్సవంగా జరపాలనే కోరింది. తెలంగాణ వచ్చాక మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం విముక్తి దినోత్సవాన్ని నిర్వహించేలేదు. ప్రతిపక్షాలు ఎంత అడిగినా ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ పరంగా చేసుకోవడానికి అనుమతినిచ్చాడే గాని, ప్రభుత్వం తరుపున జరపలేదు. ఉద్యమ కాలంలో మాత్రం సెప్టెంబర్ 17ను ఒక రాజకీయ అస్త్రంగా టిఆర్‌ఎస్ మల్చుకుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు బిజేపి అదే దారిలో నడుస్తోంది.
బిజేపిలో తెలంగాణ విమోచనం అంటున్నా , ప్రజల్లో గందరగోళం ఇప్పటికీ వుంది. దానిని నివృత్తి చేయడం గత డెబ్బై ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాలేదు. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే, దేశ స్వాతంత్య్రం వచ్చే నాటికి 612 చిన్న చిన్న సంస్ధానాలు స్వపరిపాన సాగిస్తున్నాయి. అందులో కొన్ని పెద్ద రాజ్యాలు కూడ వున్నాయి. వాటిలో హైదరాబాద్ రాజ్యమనేది అన్నింటికన్నా పెద్దది. చిన్న చిన్న సంస్ధానాలన్నీ స్వాతంత్య్రం రాగానే దేశంలో విలీనమయ్యాయి. కాని హైదరాబాద్ నిజాం రాజ్యం మాత్రం విలీనం కాలేదు. ఇండియాలో విలీనం కావడాని నిజాం ససేమిరా? అన్నాడు. దాంతో ఆపరేషన్ పోలో అనేది నిర్వహించి, హైదరాబాద్‌ను కేవలం 5 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకున్నది. లొంగిపోయిన నిజాంను అప్పటినుంచి 1964 వరకు రాజ్ ప్రముఖ్‌గా( ప్రస్తుతం గవర్నర్) నియమించింది. ప్రతి ఏటా లక్ష రూపాయల భరణం కూడా ఇస్తూ వచ్చింది. ఒక వేళ ఆనాడు కేంద్ర ప్రభుత్వం అప్పటి హైదరాబాద్‌ను నిజాం నుంచి విముక్తి చేశారనుకుంటే ఆయనకు రాజ్ ప్రముఖ్‌గా పదవి ఇచ్చేవారు కాదు. విలీనం చేసుకున్నామన్న భావనతో, లొంగిపోయిన నిజాం రాజుకు గౌరవం ఇచ్చి సత్కరించినట్లే లెక్క. అంతే కాదు నిజాం లొంగిపోయినా, తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తున్న ఆనాటి రైతాంగం మీద సైనిక చర్యలు ఆగలేదు. హైదరాబాద్ రాష్ట్రంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో నిజాం, రజాకార్ల మూలంగా 10 వేల మంది రైతులు మరణిస్తే, కేంద్ర ప్రభుత్వం అణిచివేత వల్ల సుమారు 40 వేల మంది రైతులు మరణించారని చరిత్ర లెక్కలు చెబుతోంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పటి హైదరాబాద్ ప్రజలకు విలీనమే బహుమతిగా ఇచ్చినట్లు లెక్క. కేంద్రం విమోచనమే బహుమతి చేస్తే 40 వేల మంది రైతులు మరణించేవారు కాదు. కేంద్ర సైనిక చర్యల్లో భాగంగా రజాకార్ల నాయకుడు కాశిం రజ్వీని బంధించి అప్పటి వరంగల్ జైలుకు తరలించిన కేంద్ర ప్రభుత్వం నిజాం సూచన మేరకు ఆయనను విడుదల చేసింది. కాశిం రిజ్వి పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అంటే ఈ సంఘటన కూడా తెలంగాణ విమోచనమని చెప్పడానికి కూడా వీలు లేకుండాచేసింది.
సరే మంచో చెడో ఇన్నేళ్లకైనా ఒక అడుగు ముందుకు పడిరదనే అనుకుందాం…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమైకత్యా దినోత్సవం అంటోంది. బిజేపి విమోచన దినోత్సవం అంటోంది. ఈ రెండు ప్రభుత్వాలలో బలమైన కేంద్రంలో అధికారంలో వుండి నిర్ణయాత్మక శక్తిగా వున్న బిజేపి తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిసి ఏడు మండలలాను తిరిగి మళ్లీ తెలంగాణకు ఇస్తామని చెప్పగలరా? అంతే కాకుండా ఇప్పటికీ అటు కర్నాటకలోనూ, ఇటు మహారాష్ట్రలోనూ విలీన దినోత్సవాలు జరుపుకుంటున్న ఎనమిది జిల్లాలను తిరిగి తెలంగాణలో కలిపే ప్రకటన ఏదైనా చేస్తారా? అదే జరిగితే నిజంగా బిజేపి చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారు. కాని కేవలం రాజకీయాల కోసం మాత్రమే సెప్టెంబర్ 17ను వాడుకుంటామంటే ప్రజలు స్వాగతిస్తారని అనుకోలేం. ఎందుకంటే బిజేపి చెబుతున్న విషయాలు అన్నీ వాస్తవాలు కావు. రజకార్ల దాష్టికాలనే ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాలని చూస్తే, ఇప్పటి వరకు గ్రామాల్లో వున్న ముస్లిం, హిందువుల ఐక్యతకు బీటలు వారుతుంది. ఇది తెలంగాణ సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకుంటే హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో హిందువులే కాదు, ముస్లింలు కూడా వున్నారు. నిజాం బాధితుల్లో అనేక మంది ముస్లింలు కూడా వున్నారు. అందులో తొలి అమరుడుగా చెప్పుకోవాల్సిన వారిలో షేక్ బందగీ వున్నాడు. కలాన్ని ఖడ్గంగా చేసి నిజాం ప్రభుత్వం మీద అక్షరాలను సంధించిన షోయబుల్లా ఖాన్ కూడా ముస్లిమే. ఆయనను చాదర్‌ఘాట్ వద్ద చేతులు, కాళ్లు నరికి అత్యంత కిరాతకంగా చంపింది నిజాం ప్రభుత్వమే…అంతే కాదు నిజాం కు వ్యతిరేకంగా కామ్రేడ్స్ అసోసియేషన్ అనే సంస్ధ స్ధాపించిన ముగ్ధుం మొహినుద్దీన్ కూడా ముస్లిమే…ఇలా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లింలు వున్నారు. అంతే కాదు నిజాం రాజ్యంలో హిందువులకు తీరని అన్యాయం జరిగిందనో, చేశారని చెప్పడానికి కూడా వీలు లేదు. ఆనాటి ఉస్మానియా యూనివర్సిటీలో రామానంద తీర్ధ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి జన్మదిన వేడుకలకు అనుమతినిచ్చింది కూడా నిజామే…! అందువల్ల తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 అన్నది ఒక చారిత్మ్రాక ఘట్టమే…కాదని ఎవరూ అనలేరు. కాని దాన్ని ఓ వర్గానికి ముడిపెట్టడమే సరైంది కాదు. పైగా అది విమోచనం అనడానికి కూడా వీలు లేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు పది లక్షల ఎకరాలు నాటి భూస్వాముల చెర నుంచి రైతులు విడిపించుకున్నారు. మరి భూములు సైనిక పాలన కాలంలో మళ్లీ భూస్వాముల చేతుల్లోకి వెళ్లాయి. ఏ విస్నూర్ దొర మీద తెలంగాణ ప్రజలు పోరాటం చేసి, జనగామ రైల్వే స్టేషన్‌లో అంతమొందించారో…ఆయన కుమారుడినే తెలంగాణ ప్రజలు అసెంబ్లీకి పంపారు. మరి దీన్నే మంటారు…! అందువల్ల తెలంగాణ ఇండియాలో విలీనమైన రోజుగానే సెప్టెంబర్ 17ను భావించాలే గాని, విమోచన అనడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఏది ఏమైనా ఆనాటి నుంచి సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాలకు వేధికగానే వుంది. ఇప్పుడూ అదే వేధికగా రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారుతోంది.
*సగం జీతాలకే గంటల తరబడి విద్యార్థుల భవిశ్యత్ కోసం కష్ట పడుతున్నాము*
*గ్రామ సర్పంచ్ పిల్లల నుండి దేశ నాయకుల పిల్లలు చదువు నేర్చుకునేది ఫ్రైవేట్ ఉపాద్యాయుల దగ్గరే కదా*
*చివరికి ప్రభుత్వ ఉపాద్యాయుల(ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహితలు) పిల్లలు కూడ చదువుకునేది ఈ ప్రైవేట్ ఉపాద్యాయుల వద్దే కదా*
*పదవ తరగతి ఉత్తీర్ణతలో ప్రభుత్వ శాతం ఎంత…? ప్రైవేట్ శాతం ఎంత..?*
*తెలంగాణ రాష్ట్రంలో 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 3 లక్షల మంది ఉపాద్యాయులు పనిచేస్తున్నారు*
*ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాద్యాయుల శ్రమ ను గుర్తించి, సత్కరించాలి.*
*తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ )వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ చౌహన్ డిమాండ్*
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న, ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి,సత్కరించాలని *”తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ “* వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ చౌహన్ . మాట్లాడుతూ, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యకు ఉన్నతమైన ప్రాధాన్యం ఇవ్వాలని, నాణ్యమైన విద్యను అందించేలా, విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ప్రైవేటు పాఠశాలల్లో 3 లక్షల మంది ఉపాధ్యాయులు, 30 లక్షలకు పైగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. తక్కువ జీతాలతో రోజుకు 8 గంటల నుండి 12 గంటలకు పైగా పనిచేస్తూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, వారి విద్యాభివృద్ధి కోసం, వివిధ బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షల్లో రాణించడం కోసం, ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతూ ఫలితాలను రాబడుతున్నారు. వీరు పని చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం గుర్తింపునిస్తుంది, అందులో చదివే పిల్లలను కూడా ప్రభుత్వం గుర్తించి, వివిధ బోర్డు, పోటీ పరీక్షలకు, స్కాలర్ షిప్ లకు ఎంపిక చేస్తుంది. కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం, తక్కువ జీతాలతో అధికంగా పనిచేస్తూ, అర్ధాకలితో అలమటిస్తూ, విద్యా-బోధనే ఏకైక వృత్తిగా, ఆహోరాత్రులు పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు అనేదే మా ప్రశ్న. కరోనా, లాక్ డౌన్ సమయంలో కూడా, వేలాది మంది ఉపాధ్యాయులు సగం జీతాలకే ఆన్లైన్లో గంటల తరబడి తరగతులు నిర్వహించి, విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల,రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల పిల్లలకు విద్యను బోధించేది ఈ ప్రైవేటు ఉపాధ్యాయులే. తరగతుల బోధనే కాకుండా, ఎంతోమంది ఉపాధ్యాయులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, సమాజానికి సేవ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు, రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అలాంటి ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదు..?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 5 న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాయి. ఆ రోజున ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి, సత్కరిస్తుంది. ప్రైవేటు ఉపాధ్యాయులను ఎందుకు గుర్తించవు..?సత్కరించవు…? ఈ ప్రభుత్వాలు… అనేదే ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుడి ప్రశ్న. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులే…అందులో తేడాలోద్దు. ఉపాధ్యాయ దినోత్సవం కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులదే కాదు, ప్రైవేట్ ఉపాధ్యాయులది కూడా. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావాల్సిన అన్ని అర్హతలు ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఉన్నాయి. కావున సెప్టెంబర్ 5 న నిర్వహించు గురుపూజోత్సవం సందర్భంగా ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి, సత్కరించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల పక్షాన, *”తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ “(TAPTA)* ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
బడి ఒక ఆలయం అయితే, ఆ ఆలయంలో దేవుడు గురువు విద్యార్థులకు నైవేద్యం ఇచ్చే మాధవుడు గురువు అజ్ఞాన తిమిరాన్నించి విజ్ఞాన కాంత్రులు ప్రసరింపజేసేవాడు ఉపాధ్యాయుడు ఆ ఆంద యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఉపాధ్యాయుడే ఋషి.మానవ జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర ప్రదాత,సమాజ దేవాలయానికి నిజమైన పరిరక్షకుడు ఉపాధ్యాయుడు, అందుకే మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకు ఇవ్వడం జరిగింది. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు అయితే, నడక నేర్పిన నాన్న రెండవ గురువు, ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యాబుద్ధులు అందించే మహోన్నత వ్యక్తి మూడో గురువు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చే గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన గురువు శ్రేష్టుడు, మేధావి, విద్యావేత్త రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి వారసులమని చెప్పుకోడానికి మాకు గర్వకారణము.
జాతి కుల మత వర్గాలకు అతీతంగా విశ్వమానవ సౌభ్రాతృత్వానికి మేధస్సుకు దగ్గరగా ఉండే మన విద్యా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల అధీనంలో ఉంది. ఈ రెండు రంగాలలో ప్రైవేట్ వ్యవస్థదే పైచేయి అని చెప్పవచ్చు.
దేశంలో ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో మన తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది ఈ విషయాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ 2019 -20నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను కేంద్రం తాజాగా విడుదల చేసింది నివేదికలో ప్రైవేట్ పాఠశాలల సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు, పాఠశాల కార్యక్రమాలు మరియు షెడ్యూల్ ని అందిస్తాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కంటే ఎక్కువ గంటల పాఠశాలకు హాజరు అవుతున్నారు అని అర్థం. దీనర్థం ఇబ్బందిలోకి రావడానికి తక్కువ సమయం, మరియు కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. అందుకే రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతుంది.
ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుడి బహుముఖ పాత్ర.
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమో గానీ, ప్రైవేట్ ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండదు ఇది యధార్థం. కొందరుంటారు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా లభిస్తుందని. ఇది నాణెంలో ఒక భాగమే రెండో భాగం ఉంది అదే ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు శరవేగంగా దూసుకు పోతున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు చాలా మంది తమ రంగంలో నిపుణులు మాస్టర్స్,మరియు డాక్టర్ డిగ్రీలను కలిగి ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ ఉపాధ్యాయులు భావోద్వేగాలకు ఎన్నో ఒత్తిళ్ళకు లోనవుతు కూడ కొత్త కరిక్యులమ్ ఉపోయోగించి బోధనలో సృజనాత్మకతను, శాస్త్రీయతను జోడిస్తూ ప్రభావవంతంగా బోధిస్తారు విద్యార్థుల భవిష్యతే లక్ష్యంగా పరమావధిగా భావిస్తూ రోజుకు 9 గంటల నుండి 10 గంటలు వెచ్చిస్తారు,ఆదివారం కూడా అడ్డు చెప్పకుండా వెళ్తారు. విద్యార్థుల బంగారు సౌధానికి నిచ్చెనలు వేస్తూ ప్రోత్సహించేవారు లేక అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులు.
విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడే ఈ ప్రైవేటు ఉపాధ్యాయుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా విధానాలు సక్రమంగా లేవు ఉపాధ్యాయులు సంక్షేమం పట్ల శ్రద్ధ చూపడంలేదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఉపాధ్యాయుల పట్ల సవతి ప్రేమ చూపిస్తున్నది. ఇదీ సరైంది కాదు ఉపాధ్యాయుడు ఎక్కడైనా ఉపాధ్యాయుడే, అది ప్రభుత్వ ఉపాద్యాయుడా లేక ప్రైవేట్ ఉపాధ్యాయుడా ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల వివక్షను విడనాడాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ప్రైవేటు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి వారి యొక్క ఉపాధ్యాయు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చూడాలని మనవి చేస్తూ ఈ ప్రైవేటు ఉపాధ్యాయులు….
ఏ ముహూర్తాన కాంగ్రెస్ లో చేరిండో గాని అంతా ఆగమాగమే!
టిడిపిలో వున్నప్పుడే నయముండే!
పిసిసి పదవిలో వున్నా వినేవారెవరూ లేరాయే!
మాట చెల్లుతలేదాయే!
టిఆర్‌ఎస్, బిజేపి మధ్య కాంగ్రెస్ నలిగిపోవట్టే!
రోజు రోజుకూ పార్టీ చిక్కి శల్యం కాబట్టే?
`ఎటు చూసినా లుకలుకలేనాయే!
`మునుగోడులో మునుగుడో తేలుడో తెలువలేకపోవట్టే!
`ఎవరు ముంచుతున్నారో తెలిసినా చేసేదేమీ లేదాయే!
`కాలం కలిసొచ్చేలా లేదాయే!
`గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోవట్టే!
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏమేమో…! అనుకుంటాం..అన్నీ అవుతాయా..ఏంటి? ఇది ఓ సినిమాలో డైలాగ్. ఇప్పుడు సరిగ్గా ఇది పిపిసి ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డికి సూటౌతోంది. కాంగ్రెస్ పార్టీలో అందరూ పిసిసి అధ్యక్షులు కావాలనుకుంటారు. కాని ఏ కొందరికో అవకాశం వస్తుంది. అది కూడా వేళ్లమీద లెక్కపెట్టేంత మందికి మాత్రమే ఆ అవకాశం వరిస్తుంది. అందులో రేవంత్‌రెడ్డి లాంటి వారికి పిపిసి ప్రెసిడెంటు పదవి అన్నది బంపర్ ఆఫర్ లాంటిదే. కాకపోతే దాని ఫలితాలు అనుకున్న రీతిలో రావడం లేదు…ఇదే ఇక్కడ పెద్ద మైనస్..అంగట్లో అన్నీ వున్నా…అన్నది ఇక్కడ నిజమౌతోందని కూడా చెప్పొచ్చు. గతంలో పిసిసి ప్రెసిడెంటు పదవి అన్నది గొప్ప వరంగా భావించేవారు. అలా అదృష్టం కూడ కలిసొచ్చేది. అప్పుడు ఆ పదవి పెద్ద కొండ. నాయకత్వానికి పెద్ద అండ. అదేంటో గాని తెలంగాణ వచ్చాక పిసిసి పదవి అన్నది గుడిబండగా మారింది. పిసిసి అధ్యక్షుడు కావాలనుకున్న వారికి కలిసి రావడంలేదు. పదవి వచ్చిన వారికి అసలే కలిసి రావడంలేదు. ఇప్పుడు పిపిసి పదవి అన్నది ముళ్ల కిరీటైమైపోయింది. కోరికోరి పదవి కావాలనుకునేవారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం కూడా ఎదురుకానున్నది. తెలంగాణ రాగానే నాకంటేనాకు పిసిసి అని చాలా మంది కోరుకున్నారు. ఆ రేసులో పొన్నాల లక్ష్మయ్య గెలిచారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినట్లే అనుకున్నాడు. తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడయ్యాకు పొన్నాల లక్ష్మయ్య, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి నేనే అన్నంతగా కలలుగన్నాడు. కాని పాపం ఆయనే జనగామలో గెవలేదు. ఆశలు బోల్తా కొట్టాయి. ఆపై పదవి బరువైంది. తాను మోయలేన్నంత దాకా వచ్చింది. భారమెక్కువైంది. పార్టీని నడపడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదని తెలుసుకున్నాడు. ఖర్చుపెట్టాలంటే చుక్కలు లెక్కబెట్టాల్సివస్తుందని గుడ్లుతేలేశాడు. నెల నెల పార్టీ కోసం సొమ్ము నీళ్లలా ఖర్చు చేయడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. పదవి తనకు తాను వద్దనుకున్నాడు. వదులుకున్నాడు.
సహజంగా పిసిసి అధ్యక్ష పదవిలో వున్నవారు ఎప్పుడు దిగిపోతారా? మాకు ఎప్పుడు అవకాశం వస్తుందా? అని ఎదురుచూస్తారు. పొన్నాల మాత్రం ఎప్పుడు దిగిపోతాడా? అని ఎవరూ చూడలేదు. అది కూడా పొన్నాలకు రంది తెచ్చిపెట్టింది. ఎలాగో అలాగా ఆఖరకు పదవి వదిలించుకొని ఫ్రీ బర్డ్ అయ్యాడు. రెండో కృష్ణుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చాడు. ప్రజలు, పార్టీ నేతలు ఆయనపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. పైగా ఆయన అప్పటికే కోవర్టు అన్న ముద్రను వేసుకున్నారు. అలా జరిగిన ప్రచారాన్ని ఆయన ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. నేను కోవర్టును కాదని కూడా ఆయన ఏనాడో తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. ఆఖరుకు ప్రభుత్వం మీద పెద్దగా యుద్దం చేసింది లేదు. ఆఖరుకు తన సోదరుడు కౌషిక్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లోకి వెళ్తుంటే ఆపలేదు. కాకపోతే ఆయనే పంపాడని అనేవారు అంటారు. అది ఎంత వరకు నిజమో! కాదో!! ఆయన ఏనాడు చెప్పలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్‌రెడ్డి వస్తూ వస్తూనే జాక్ పాట్ కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంటు అయ్యారు. ఫైర్ బ్రాండ్ అన్న బిరుదును నిలబెట్టుకుంటారని అందరూ అనుకున్నారు. కాని గత 2018 ఎన్నికల్లో ఓడిపోయి, తానేం తీస్మార్ ఖాన్‌ను కాదని నిరూపించుకున్నారు. కాకపోతే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగో టిక్కెట్టు తెచ్చుకొని గెలిచి, పోయిన పరువును నిలబెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆశలు పెంచుకొంటూ, ఎన్నో అవాంతరాల మధ్య పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకున్నాడు. అప్పటి నుంచి రేవంత్‌రెడ్డికి పాపం కంటి మీద కునుకు లేకుండాచేసుకున్నాడు. స్వయంకృతాపరాధం చూపించే ఫలితం చేదు రుచి చూస్తున్నాడు. పాపం మొదటినుంచి రేవంత్‌ది రాజకీయాల్లో ఒంటరి ప్రయాణమే…
ఒకనాడు టిఆర్‌ఎస్‌లో వున్నా తనదైన శైలి రాజకీయాలతో ముందుకు సాగాలని అక్కడా ఒంటరి తనాన్నే భరించాడు. తర్వాత టిడిపిలో చేరినా తెలంగాణ ఉద్యమం, ఆపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో టిడిపిలో కూడా ఒంటరి రాజకీయ ప్రయాణమే దిక్కయ్యింది. ఆఖరకు కాంగ్రెస్‌లో చేరి, పిపిసి అధ్యక్షుడైనా ఇప్పుడూ ఒంటరి పోరు చేయాల్సి వస్తోంది. రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందు ఆయనను అడుగడుగునా పార్టీలో అడ్డుకున్నవారే…ఆయనను పిసిసి కాకుండా అనుక్షణం అడ్డంకులు సృష్టించిన వారే…దాంతో ఆనాడైనా, ఈనాడైనా ఆయనకు ఒంటరి ప్రయాణమే దిక్కౌవుతోంది. సీనియర్లు ఆయననెక్కడ నెగలనిస్తారు? కొంత కాలం విహెచ్ రూపంలో, మరి కొంత కాలం జగ్గారెడ్డి రూపంలో, ఇందులో ఆది నుంచి కోమటిరెడ్డి సోదరుల రూపంలో రేవంత్‌కు సీనియర్లు ఊరిపిసలుపనివ్వడంలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేల నాకిస్తున్నారు. తన ప్రమేయం లేకున్నా సరే ఆఖరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్ధితి వచ్చింది. నోటిదురుసు ఆయనను ఇంత దూరం తీసుకొచ్చింది. అదుపు తప్పకపోతే ఒక తంటా…తప్పితే ఒక తంటా అన్నట్లు తయారైంది. ఆఖరుకు ఇటీవల మునుగోడులో పర్యటిస్తున్న సందర్భంలో కొందరు మహిళలు రేవంత్‌ను ఎందుకొస్తున్నారని ముఖం మీదే అడగడం, వద్దు వద్దు రావొద్దంటూ చెప్పడంతో ఆయన పరువు మరింత పోయిందనే చెప్పాలి.
మునుగోడును ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చూసినా, ఎక్కడిక్కడ ఏదో ఒక అడ్డంకి ఎదురౌతూనేవుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన రెండో రోజుకే మునుగోడులో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసి, సక్సెస్ చేస్తే తన ఇమేజ్ అమాంతం పెరుగుతుందని ఆశించాడు. కాని గ్రాఫ్ ఒక్కసారిగా వున్నది కాస్తా పడిపోయింది. అసలు ఇంత తొందరగా సభ పెట్టాల్సిన అసవరం ఏమొచ్చిందన్న ప్రశ్నలే మిగిలాయి. ఆఖరుకు కోమటిరెడ్డి సోదరుల మీద చేసిన వ్యాఖ్యలకు వివరణిచ్చుకోవాల్సివచ్చింది. సంచనలం సృష్టిస్తాననుకున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్పాడు. జూనియర్లు, జిల్లా నేతలు ఎటువైపో కూడ ఇప్పటికీ రేవంత్‌రెడ్డికి ఓ క్లారిటీ లేదు.
పార్టీలో సీనియర్లు పని గట్టుకొని పగబట్టినంత రాజకీయాలు చేస్తుంటే కనీసం జిల్లా స్ధాయి నేతలు, జూనియర్లనైనా చూసి ధైర్యం తెచ్చుకుందామంటే అక్కడా ఆశలు నెరవేరడం లేదు. జిల్లా స్ధాయిలో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు లేకుండాపోతున్నాయి. వాళ్లు ఎటు నిలుస్తారో అన్నది తెలియకుండాపోతోంది. ఆ మధ్య సికింద్రాబాద్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు శిక్షణా కార్యక్రమాలలో అనేక జిల్లాల నాయకులు రేవంత్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం చూసిందే… ఏ ముహూర్తానా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిండో కాని ఆనాటి నుంచి ఆగమాగమే…ఇక్కడ ఒక్కటే ఆయన అదుపు చేసుకోవాల్సింది! జనం కనిపించగానే నోరు గంగవెర్రులెత్తడం ఆపుకోవాలి. ఏం మాట్లాడుతున్నాడో కూడా గుర్తెరిగి మాట్లాడాలి. నాయకుడన్న తర్వాత మానసిక సంఘర్షణ సహజం. అందులో పార్టీని లీడ్ చేసే స్ధాయిలో వున్నప్పుడు మాట కన్నా, మౌనం ఎక్కువ మంచింది.
ఎందుకంటే గతంలో ఏ పిపిసి ప్రెసిడెంటు కూడా నిత్యం మీడియా ముందుకు వచ్చేవారు కాదు. ఏదైనా సీరియస్‌సమస్య వున్నప్పుడో, లేక వారానికి ఒకసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చేవారు. దాంతో వారి వ్యాఖ్యలకు ప్రాధాన్యత వుండేది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు నిత్యం ప్రజల్లో వుంటున్నామన్న భ్రమల్లో మీడియా ముందు వుంటున్నారు. మీడియాలో నిత్యం కనిపిస్తే జనంలో వున్నట్లే అన్న భావనలో రాజకీయం నెరుపుతున్నారు. ఇదే వారి వైఫల్యాలకు కారణమౌతోంది. ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా ఏదో ప్రత్యేక సందర్భంలోనే మీడియా ముందుకు వచ్చేవారు. కాని రేవంత్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుబాటలో నడుస్తున్నాడు. నిత్యం మీడియాలో వుండడానికే ఇష్టపడుతున్నాడు. కాంగ్రెస్‌లో నగుబాటుకు గురౌతున్నాడు. టిఆర్‌ఎస్, బిజేపిల రాజకీయాల మధ్య నలిగిపోతున్నాడు. పార్టీలో మాట చెల్లుబాటు లేదు…ప్రజల్లో ఫైర్ బ్రాండ్ అన్న పేరు రోజు రోజుకూ తగ్గవట్టే…పార్టీలో లుకలుకలు…భవిష్యత్తుకు నీలి నీడలు…పాపం రేవంత్…అనుకుంటున్నారు.
`ఎన్ని బోర్లేసినా చుక్క కళ్ల చూడని మల్లారెడ్డి గోస చూసిన కేసిఆర్.
`చెరువుల్లో నీళ్లు లేక, పొలాలకు నీరందక ప్రతి ఏడు ఎండుడే!
`తెలంగాణ వస్తే తప్ప సాగు కష్టాలు కడతేరవని జెండా ఎత్తిన నాయకుడు కేసిఆర్
`రైతు బంధు అందులో భాగమే
`ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సాగు రంగంలో తెలంగాణ నెంబర్‌వన్ కోసమే
`తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతా అమలు చేయాలి.
`దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కేసిఆర్ కల.
`దేశంలోని రైతులందరికీ రైతు బంధు, రైతు భీమా అమలు కావాలి.
`దేశమంతా మంచినీటి సమస్య తీరాలి.
`గఇవన్నీ దేశమంతా అమలు కావాలంటే దేశానికి కేసిఆర్ నాయకత్వం రావాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
సాగు సల్లగుండాలే..రైతు సంతోషంగా వుండాలి. ఆనందంగా వుండాలి. సుభిక్షంగా వుండాలి. పెదవులుపై చిరునవ్వులు తొనికిసలాడాలి. కాలం కావాలని మొగులు వైపు, కరువు రావొద్దని కాలం వైపు, పంటలెండిపోవద్దని మధనపడొద్దు. సాగు నీటి కటకట అసలే రావొద్దు. పల్లె పచ్చగుండాలి. పాడి పంటలతో కళకళలాడాలి. చేనంతా పచ్చని పైట కప్పుకోవాలి. రైతులకు బంగారు సిరులు పండాలి. వృత్తులు పునరుజ్జీవం కావాలి. మావన వనరుల అభివృద్ధికి మళ్లీ జీవం పోయాలి. దేశమంతా రైతుకు ఆసరా కావాలి. ప్రభుత్వాలు భరోసా కావాలి. రైతును ఆదుకునే పాలకులు కావాలి. రైతును అడుగడుగనా అండగా నిలిచే ప్రభుత్వాలే వుండాలి. రైతు పెట్టుబడి కష్టం రాకుండా చూసుకోవాలి. అందుకు ప్రభుత్వాలే పెట్టుబడి సాయం అందించాలి. తెలంగాణలో అమలౌతున్న రైతు బంధు దేశమంతా అమలు కావాలి. రైతు ఒకరి సాయం కోసం అర్దించే పరిస్ధితి రావొద్దు. అప్పుల పాలు కావొద్దు. ఈ సాగు మా వల్ల కాదని వ్యవసాయం వదిలేయొద్దు. రైతు ఏడ్చే రోజు అసలే రావొద్దు. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యం. ఇది తెలంగాణలో నెరవేరిన స్వప్నం. అంటే నిజమైన కల. ఆ కల దేశమంతా కలగా మిగిలిపోకూడదు. తెలంగాణలో రైతు ఎంత సుభిక్షంగా వున్నాడో దేశమంతా అలాగే రైతు ఆనందంగా వుండాలి. గతంలో అంతో ఇంతో రైతు సంక్షేమం మీద కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించేవి. కాని కేంద్రంలో బిజేపి వచ్చిన తర్వాత రైతు గోసలు మరింత పెరిగాయి. ఈ ఏడెనెమిదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు. తెలంగాణలో కాలం అబ్బురపడేలా, ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా మూడేళ్లలో కాలేశ్వరం…ఆరేళ్లలో మల్లన్న సాగర్ తోపాటు, అనేక రిజర్వాయర్లు పూర్తి చేసుకున్నాము. తెలంగాణలో నీటి గోస లేకుండా చేసుకున్నాము…మరి దీన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాయి.అందుకు కారణం దేశంలోని అనేక మెజార్టీ రాష్ట్రాలలో బిజేపి ప్రభుత్వాలు వుండడమే కారణం. అరవై ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఏనాడూ సమైక్య పాలకులు తెలంగాణ కోసం ఆలోచించలేదు.
తెలంగాణకు అన్యాయం చేయకుండా వుండలేదు. 1956 నుంచే అన్యాయం చేస్తూ వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏకమైన సమైక్య రాష్ట్ర్రం ఏర్పాటు అయిన సమయంలోనే తెలంగాణ రెండుకోట్ల మిగులు బడ్జెట్ వున్న రాష్ట్రం. 4 కోట్లు లోటుతో వున్నది అప్పటి ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం. తెలంగాణ నిధులన్నీ ఆంధ్రకు తరలించారు. అక్కడ ప్రాజెక్టులు, కాలువలు కట్టుకున్నారు. తెలంగాణ ఎండబెట్టారు. ప్రాజెక్టులకు మొండిచేయి చూపారు. ఆనాడు ప్రశ్నించిన కొందరు నాయకులే గాని, నిలదీసిన నాయకులు లేరు. ఎదిరించి నిలబడిన నాయకులు లేరు. తెలంగాణలో ఉద్యమ స్వరూపం సాగుతున్నా, ఉవ్వెత్తున సాగేంత కొండంత అండ నాయకత్వం తెలంగాణ లేదు.2001లో కేసిఆర్ రూపంలో ఒక ఉద్యమ స్వరూపం ఎవరెస్టు శిఖరమంత బలమైంది ప్రజల ముందు నిలబడిరది. మనిషి బక్క పల్చనే కాని, బలం వెయ్యేనుగుల బలమంతది అని ప్రజల నమ్మారు. కేసిఆర్ వెంట నడిచారు. ఆ సమయంలో కేసిఆర్ చూసిన తెలంగాణ సాగు గోసలు అన్నీ ఇన్నీ కావు. తలాపున గోదారి పారుతున్నా ఉత్తర తెలంగాణ ఎప్పుడూ ఎండడమే తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్ద కాలువ అంటూ చెప్పుకోవడానికి తప్ప, నీరు పారడానికి వీలు లేకుండా కాకతీయ కాలువను మార్చారు. కాలువ తప్ప నీరు లేకుండా చేశారు. మరి ఇప్పుడు ఏడాది మొత్తం ఆ కాలువ కళకళలాడుతుంటోంది. నిజామాబాద్ నుంచి ఖమ్మం సరిహద్దు దాకా సాగునీరు మోసుకెళ్తోంది. కాళేశ్వరంలో ఉత్తర తెలంగాణలోని ప్రతి పల్లెలో నీటి సిరులు జళజళ పారుతున్నాయి. ప్లోరైడ్‌ను తరిమేసేలా అటు ఖమ్మంతోపాటు, ఇటు నల్లగొండలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచీనీరు అందుతోంది…తెలంగాణ సాధిస్తే ఇవన్నీ సాధ్యమా? అని అనుకున్నవారు కూడా ఆ నిజాన్ని కల్లారా చూస్తున్నారు…తెలంగాణ ప్రగతిని చూసి మురుస్తున్నారు. అందుకే నిన్నటి గోసనుమర్చిపోవద్దు. నిన్న పడిన కష్టం కల అనుకోవద్దు.
నిలిచి గెలిచిన తెలంగాణను మళ్లీ ముంచేవాళ్లు కాచుకొని కూర్చున్నారు. అసలు ప్రగతి అంటే అర్ధం కూడా తెలియని నాయకులు ప్రతిపక్షాలలో మాటల గారడీ నేర్చుకున్నారు. మాయ మాటలు చెప్పే వారిని నమ్మొద్దు. తెలంగాణ సరిహద్దులు కూడా సరిగ్గా తెలియని వాళ్లంతా మాకు ఒక్కసారి చాన్స్ ఇవ్వండంటున్నారు. వచ్చిన తెలంగాణను మూడేళ్లులోనే ఆగం చేసేందుకు సీమాంధ్ర నేతల కనుసన్నల్లో పనిచేసి ఓటుకు నోటు కేసులో ఇరుకున్నవాళ్లు వాళ్లు కూడా తెలంగాణను పాలిస్తామంటున్నారు. పరాయి వాళ్ల చేతుల్లో తెలంగాణను పెట్టేందుకు దాసోహం అంటున్నారు. తెలంగాణ గురించి కనీసం ఉచ్చరించే అర్హత లేని వాళ్లంతా ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ఏనాడు తెలంగాణ జెండా మోసిన దాఖలాలు లేని వాళ్లంతా తెలంగాణలో పెత్తనం కోసం నయవంచన కపట నాటకాలాడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. వారి మాయల్లో పడొద్దు. కుప్ప మీద పడి తినాలని చూస్తున్నారు. దోచుకొని తినాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. నీరు పెట్టి, దుక్కి దున్ని, విత్తు నాటి, పంట పండిరచి, కుప్ప నూడ్చాక కుప్ప మీద పడి తినడానికి గోతి కాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు. కుప్ప నూడ్చడానికి కష్టపడ్డవారిని ప్రజలు మర్చిపోవద్దు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే వాళ్లుంటారు. సమాజం గురించి సోయి లేని వారు పార్టీల పేరు చెప్పుకొని నయవంచన కోసం వస్తుంటారు. అధికారంలోకి రావాలని తంటాలుపడుతుంటారు. ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో కనిపించని వాళ్లంతా ఇప్పుడు తెలంగాణ మీద పెత్తనం కోసం అర్రులు చాస్తున్నారు. ఒక్కనాడు జై తెలంగాణ అనేందుకు నోరు రాని వాళ్లు, ఆనాడు నోరు లేని వాళ్లు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద నోరేసుకొని మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క దూం..ధాం కార్యక్రమంలో పాల్గొన్న చరిత్ర లేని వాళ్లంతా దద్దమ్మమాటలు మాట్లాడుతున్నారు. పచ్చగా వున్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారు. అభివృద్ధి అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని వాళ్లు, ఆ మాటలు చెబితే ఎలాగూ తెలంగాణ ప్రజలు వినరని తెలుసు.
వారిని నమ్మరని తెలుసు. వారిని దగ్గరకు రానియ్యరని తెలుసు. అందుకే కులం చిచ్చు ఒక వైపు, మతం మత్తు ఒకవైపు నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. దేవుని పేరు చెప్పి, మనుషులను చీల్చి రాజకీయం చేయాలనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త అన్నది జనం అందరూ గమనించాలి. తెలంగాణ సాగు రంగంలో వేస్తున్న విప్లవాత్మక అడుగులు ఎలా వున్నాయో చూసేందుకు అనేక రాష్ట్రాలనుంచి రైతు నాయకులు వచ్చారు. రెండు రోజుల పాటు ప్రగతి భవన్‌లో వున్నారు. తెలంగాణలోరైతులకు అందుతున్న సంక్షేమ పథకాలు తెలుసుకున్నారు. రైతు బంధు విశిష్టతను స్వయంగా చూసి ఎంతో సంతోషంగా కొనియాడారు. రైతు భీమా వంటి వినూత్నమైన పధకం గూర్చి చర్చ చేశారు. పంట కొనుగోలు లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ, ముఖ్యమంత్రి కేసిఆర్ విజన్ తెలుసుకున్నారు. మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి , వాటికి పూర్వ వైభవం ఎలా వచ్చింది. ఇప్పుడు వాటి పరిస్దితి ఎలా వుంది. తెలంగాణ ఎలా కరువును దూరం చేసుకున్నది. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని,ఇంటింటికి ఎలా అందించుకుంటోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలలో ఈ పధకాలు ఎందుకు అమలు కావడంలేదు? అన్నదానిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా ఎలా సాధ్యం? తెలంగాణ ఎలా సుసాధ్యం చేసింది? దేశమంతా ఎందుకు అమలు కావడంలేదు. అక్కడి పాలకులకు ఎందుకు చిత్తశుద్ది లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఆ సోయి ఎందుకు లేదు? ఇవన్నీ పొరుగు రాష్ట్రాల రైతులు కళ్లారా చూసి, ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజెంటేషన్‌తో తెలుసుకున్నారు. దేశానికి కేసిఆర్ ఎలా ఆదర్శం కావాలో, దేశానికి కేసిఆర్ నేత అయితే ఎలా వుంటుందో అన్నది ఆ రైతు నాయకులే ఆయా రాష్ట్రాలలో చెప్పడానికి సిద్దంగా వున్నారు. దేశంలో వినూత్నమైన మార్పు కేసిఆర్ నాయకత్వం నుంచే మరో కొత్త తరం ఆవిష్కరణ జరగనుందని భవిష్యత్తు చెబుతోంది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.