ములుగు జిల్లా కేంద్రంలో గాడిలో పెడుతున్న గండ్ర కోట అనే శీర్షికతో నేటి రోజున పెయిడ్ ఆర్టికల్ రాయించుకొని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న గండ్ర కోట సుధీర్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్న విషయంలో పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్న ములుగు మండల కమిటీ మరియు ప్రజా ప్రతినిధులు ఒక ఎంపీపీ భర్త అయ్యుండి తన స్వలాభం కోసం తాను చేస్తున్న భూకబ్జాలను మరియు ఇతర సొంత పనులను ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం పత్రికలను వాడుకొని పత్రికలకు పెయిడ్ ఆర్టికల్స్ కు డబ్బులు ఇస్తూ పార్టీ పరువును దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్న సుదీర్ పై పార్టీ క్రమశిక్షణ చర్యల కింద షోకాస్ నోటీసులు ఇచ్చి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ములుగు మండల పార్టీ కమిటీ మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఏకగ్రీవంగా తీర్మానించి జిల్లా అధ్యక్షునికి నేటి రోజున సుదీర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది.
పార్టీ నుండి తక్షణమే తొలంగిచాలి
సంక్షేమ పథకాలను ఆసరా చేసుకుని అక్రమ వసూలు
పార్టీ ప్రతిష్టానం దెబ్బతీస్తున్న ఎంపిపి భర్త
భూకబ్జాలను కప్పిపుచ్చుకునేందుకే పేడ్ ఆర్టీకల్స్
ఆరోపణలు చేస్తున్న మండల నాయకత్వం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆసరా చేసుకుని మండలంలోని పలువురికి పథకాలను వర్తింపచేస్తానని అక్రమ వసూళ్లకు పాల్పడుతూ పార్టీ ప్రతిష్టతను దెబ్బతీస్తున్న ములుగు ఎంపిపి గండ్రకోట శ్రీదేవి భర్త సుధీర్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలతో సహా ప్రజలను మబ్యబెడుతూ మద్య వర్తులను ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ములుగు జిల్లా కేంద్రంలోని పలువురు అమాయకుల భూములను కబ్జా చేసి ప్రజలకు తెలియకుండా పత్రికల్లో పేడ్ ఆర్టికల్ వ్రాయించకుంటున్నారని అన్నారు. పార్టీ క్రమ శిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుండి తక్షణమే తొలగించాలని ఆయన అన్నారు. భార్య పదవిని అడ్డుపెట్టుకుని భూ బాదితులను పోలీసుల సహాకారంతో, తన ప్రైవేట్ వ్యక్తులతో భయబ్రాంతులకు గురి చేస్తూ యధేచ్చగా భూ కబ్జాలకు పాల్పడుతూ పార్టీ పటిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. పార్టీ జిల్లా నాయకత్వం ఈ విషయాన్ని పరిశీలించి క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు పోరిక విజయ్ రామ్ నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు భూక్య పాప నాయక్ , ఎంపీటీసీలు గొర్రె సమ్మయ్య,లాల్, మాచర్ల ప్రభాకర్, అరెందుల రాధిక- కుమార్ లు, సర్పంచులు పంచోత్కుల పల్లి సర్పంచ్ మాలోతు రవీందర్ , జాకారం సర్పంచ్ దాసరి రమేష్, నర్సింగారావు, మదనపల్లి సర్పంచ్ రామ్ నాయక్, ఇంచర్ల మోరే రాజన్న,రామచంద్రపూర్ హట్కర్ కల్పన రూప్ సింగ్, మరియు మండల యూత్ ప్రెసిడెంట్ బైకాని సాగర్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రాజా హుస్సేన్, మండల బీసీ సెల్ అధ్యక్షులు మామిడి అశోక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చుంచు వెంకటేష్,మండల ఎస్టీ అధ్యక్షులు వాంకుడోత్ రాందాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బల్గురి నవీన్, పైడిమల్ల గోపికృష్ణ,మాధం సాగర్, సురేందర్, భద్రయ్య, పార్టీ ముఖ్య నాయకులు తదితరుల పాల్గొన్నారు.
`అవినీతి సంపాదనకు ఎగబడిన వారికి రాజకీయాల మీద మోజు.
`ఈ రోజుల్లో రాజకీయాలంటే మాటలు కాదు…నోట్ల కట్టలు!
`అంతంత సంపాదన అధికారులకు ఎక్కడిది?
`ఎంతటి రాజకీయ నాయకుడైనా రియలెస్టేట్ చేయాల్సిందే…సంపాదించి రాజకీయాలలో ఖర్చు చేయాల్సిందే!
`మరి అధికారులు ఏం చేసి కూడబెట్టారో కూడా చెప్పాలి.
`వచ్చే ఎన్నికలలో తెలంగాణలో పోటీకి 15 మంది అధికారులు రెడీ!
`ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ రాజకీయాలలోకి…
`ఉద్యోగంలోనే ప్రజలకు సేవ చేయని వాళ్లు రాజకీయాలకొచ్చి ఉద్దరిస్తారా?
`ఉద్యోగం వెలగబెట్టిన నాడు ప్రజలను చీదరించుకొని…ఇప్పుడు అక్కున చేర్చుకుంటారా?
`ప్రజలను నమ్మమంటారా?
`గతంలో నిజాయితీకి మారుపేరైన అధికారులను పార్టీలు ఆహ్వానించేవి?
`ఇప్పుడు ఖర్చుకు సిద్ధమని అధికారులే పార్టీల ప్రదక్షిణాలు చేస్తున్నారు?
`అయితే కారు…అందిస్తామంటే చేయి.
`ఈ రెండూ కాదంటే కమలం…
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయం…ఈ పదం ప్రపంచంలో ఏ మూలననున్న దేశమైనా అనుసరించాల్సిందే…ఏ గ్రామంలోనైనా వినాల్సిందే…రాజరికమైనా అమలు చేయాల్సిందే…అంతే…అదేదాని గొప్పదనం… ప్రజలకు చేరువుగా వుండేది…ప్రజలను పీడిరచుకు తినేది…ప్రజలతో ప్రతిక్షణం ముడిపడి వుండేది రాజకీయమే…అది లేకుండా ప్రజా సమూహాన్ని ఊహించుకోలేము…! అది గొప్పదో….నీతి మాలిందో ఇప్పటికీ అర్ధం కాదు…అదే రాజకీయం…దాని పరిధిని గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ అవతారులు, తనువు చాలించేదాకా తమకే, తమదే అధికారం అన్నట్లు, మాదే రాజకీయం అన్నట్లు సాగుతున్నారు. రాజకీయాన్ని రొంపి రొంపి అంటూనే తరతరాలు రాజకీయ రంగు వేసుకుంటూనే వున్నారు. సమాజంలో ఒక మెట్టు పైనే బతుకుతున్నారు. తాము ప్రత్యేకం అన్నట్లు పెత్తనం చెలాయిస్తున్నారు. ముందు సేవా ముసుగులో అడుగులు మొదలు పెడతారు…తర్వాత పెత్తనం అడుగులు ప్రజల నెత్తిన పెడతారు…ఇదే నేటి రాజకీయం…ఇదే మన సమాజంలో సమ సమాజామని చెబుతూనే, మేం కాస్త ఎక్కువ సమాజం అనుకునే లోకం…రాజకీయ కులం…! ఆ కులం వాసన చూసిన వారు ఎప్పుడూ వదిలేయలేరు.
పదవికి అలవాటు పడిన వారు ఎప్పుడూ దాన్ని కోల్పోవడానికి ఇష్టపడరు. ఆస్ధులమ్ముకొనైనా సరే..వున్నదంతా ఊడ్చిపెట్టుకొనైనా సరే పోటీకి దిగుతారు..గెలిచే వరకు గజనీ దండయాత్రలు చేస్తూనే వుంటారు..ఒక్కసారి గెలిచి కుర్చీలో కూర్చున్నాక, ఆ కుర్చీ వైపు ఎవరూ చూడకుండా సర్వం, సకలం తనకే సొంతమని భావిస్తుంటాడు…అది రాజకీయ మాయో.. మందో, మర్మమో గాని ఒక్కసారి రాజకీయం ఒంట బడితే వదలలేరు… అది వరమో…వదిలిపోని జబ్బో కాని, అనుక్షణం రాజకీయంలోనే మునిగి తేలుతుంటారు…ప్రజల్లో ఒక మెట్టు పైన వుంటూ, ఆనందంలో గడుపుతుంటారు..ఎన్ని కష్టాలైనా ప్రజా నాయకుడినన్న ధైర్యంలో బతుకుంటారు.. ఇదంతా దగ్గరుండి చూసే అధికారుల్లో కూడా ఈ మధ్య నేనుందుకు రాజకీయాల్లో చేరకూడదనే ఆశ పెరుగుతోంది…! రాజకీయమంటే పైకి కనిపించే హంగూ ఆర్భాటమే చూసి, నాలుగు రూపాయలు పడేసి పార్టీ టిక్కెట్టు తెచ్చుకొని, ఓటర్లు కొనేసి గెలుద్దామనుకునే వారు తెలంగాణలో ఓ పది హేను మంది తయారైతున్నట్లు సమాచారం… రాజకీయ నాయకుల హంగూ ఆర్భాటం, దర్పం చూసి రాజకీయమంటే ఇంతేనా…అని తొందరపడి అడుగులు వేయడానికి కొందరు అవినీతి అధికారుల సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
కాని ఇక్కడో విషయం చెప్పుకోవాలి. రాజకీయ నాయకుడి కష్టం పగోడికి కూడా రాకూడదు. ఎందుకంటే పదవి లేకుండా పది నిమిషాలు వుండలేడు. పది మంది కనిపించకుంటే అడుగు బైట పెట్టలేడు. పది మందితో కలిసి తినలేకపోతే ఆకలే వద్దనుకుంటాడు…పది మందిలో సంతోషంగా కనిపించినా, లోలోన పడే మధనం పైకి కనిపించనీయని వాడు..ప్రతి క్షణం, మరుక్షణం కోసం ఆలోచించే వారే రాజకీయ నాయకులు. మనసు, శరీరం రెండూ ఎప్పుడూ పరుగెత్తుతూనే వుండాలి. ఎవరు వచ్చి, ఏదడిగినా లేదనకూడదు…నా వల్ల కాదనకూడదు…నేను చేయలేననొద్దు…ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం నాయకుడికి పురిటినొప్పులే…ఆ తిప్పలే ఎంతో ఆనందం..సంతోషం…బిపిలు పెరిగినా సరే…షుగర్లు వచ్చినాసరే…పోలీసు కేసులైనా సరే…జిందాబాద్ పదం వినకపోతే నిద్ర పట్టదు..! మరి నిన్నటి దాకా అధికారులుగా ప్రజలకు దూరంగా అధికారంచెలాయించిన ఉద్యోగులు ఒక్కసారిగా రాజకీయ అవతారం ఎత్తితే సరిపోతుందా? ఈ రోజుల్లో రాజకీయం అంటే నోట్ల కట్టలు..
ఎన్ని కట్టలైనా సరే…అప్పులు చేసైనా సరే…ఒక్క ఓటు ఎక్కువ సంపాదించేందుకు ఎన్ని కోట్లు ఖర్చైనా పెట్టాల్సిందే…వున్నదంతా ఊడ్చిపెట్టుకోవాల్సిందే…గెలిస్తే సరి..ఒక వేళ ఓడిపోయినా మళ్లీ ఎన్నికలు ఎప్పుడొస్తాయా? అని ఎదురుచూడాల్సిందే…రాత్రనక, పగలనక ప్రజల కోసం పనిచేయాలి. తన సొంత పనులు చూసుకోవాలి. ఆస్ధులు సంపాదించాలి. వ్యాపారాలు చేయాలి. రియలెస్టేట్‌లో ఆరి తేరాలి. ప్రజలకు ఎప్పటికప్పుడూ చేరువౌతూ వుండాలి. ఇంత కష్టపడితే గాని రాజకీయాలు చేయడం ఈ రోజుల్లో సాధ్యం కాని పని…ఒక కార్పోరేటర్‌గా పోటీ చేయాలంటేనే కోట్లు కావాలి. అప్పులు చేయాలి…! మరి ఉద్యోగం వెలగబెట్టిన వాళ్లు ఎలా రాజకీయం చేస్తారు..? ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? ఆ సంపాదన అధికారులకెక్కడిది? వచ్చే జీతం ఇల్లు గడవడానికి, ఓ ఇల్లు కొనుక్కొవడానికి, ఓ రెండు కార్లకు, చిన్న చిన్న విలాసాలకు మాత్రమే సరిపోతుంది. మరి ఎన్నికల్లో నిలబడి రోజుకు వేలాదిరూపాయలు ఖర్చు చేసి, ఎన్నికల నాడు కోట్లు కుమ్మరించేంత ఆదాయం ఎక్కడిది? అంత సంపాదన రాత్రికి రాత్రి వచ్చేది కాదు…? వ్యాపారాలు సాగిస్తే తప్ప కూడబెట్టలేరు…? మరి ఎంత అవినీతి చేస్తే అంత సంపాదన పోగౌతుంది. అంతంత సొమ్ముకూడబెట్టాలంటే ఎంత మందిని నుంచి వసూలు చేసి వుండాలి. ఎంత మంది ప్రజలను వంచించి వుండాలి. అవినీతి ఏ రేంజ్‌లో చేస్తే కూడేది…! అధికారిగా కుర్చీలో కూర్చున్న నాడు పని కోసం సామాన్యుడు కార్యాలయాలకు వస్తే కనీసం అప్పాయింటు మెంటు ఇవ్వని అధికారులు అనేక మంది వుంటారు.
నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా కనికరించని అధికారులున్నారు. ఇక పెద్ద స్ధాయిలో ఉద్యోగం చేసేవారు సామాన్యుల వంక చూడడానికి కూడ ఇష్టపడని వారున్నారు. మరి అలాంటి వ్యవహార శైలి వున్నవారు రాజకీయాలలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తారా? ప్రజలను దగ్గరికి రానిస్తారా? ఒళ్లో కూర్చోబెట్టుకున్నంత పని చేస్తారా? కనీసం వారిని దగ్గరకు రానిస్తారా? ఎన్నికల నాడు జనం మందుకు చొచ్చుకొని వచ్చినా, గెలిచినా ప్రజలకు కనిపిస్తారా? ఇక జనానికి దూరంగా ఉద్యోగం వెలగబెట్టిన వారు కూడా రాజకీయాల్లోకి వస్తే ప్రజా సమస్యలు ఎప్పుడు తెలుస్తాయి? ప్రజలకు సేవ ఎలా చేస్తారు? అంతే కాదు ఉద్యోగ ధర్మంలో ప్రజా సేవ చేయలేని వారు, దానికి రాజీనామా చేసి వచ్చి, ప్రజలను ఉద్దరిస్తారా? అలాంటి వారిని ప్రజలు నమ్ముతారా? నిత్యం ప్రజల్లో వుంటూ, ప్రజల కోసం పనిచేస్తూ, కేసులు ఎదుర్కొంటూ, కొట్లాడుతూ, ఐదేళ్ల నాడు వచ్చే ఎన్నికల కోసం నిత్యం కాపు కాచుకొని కూర్చునే నేతలనే జనం నమ్మడం లేదు. అలాంటిది రాత్రికి రాత్రి వచ్చి నాయకులౌతాం…ఎన్నికల్లో పోటీ చేస్తాం…మీకు సేవ చేస్తామంటే నమ్ముతారా? ఓట్లేస్తారా? గెలిపిస్తారా? గతంలో ఉద్యోగ నిర్వహణలో నిజాయితీగా పని చేసిన వారిని పార్టీలే రాజకీయాల్లోకి ఆహ్వానించేవి. ముఖ్యంగా సమాజ నిర్మాణంలో భాగమైన ఉపాధ్యాయులు రాజకీయాలపై ఆసక్తి కనబర్చేవారు. కాని ఇప్పుడు ఉపాధ్యాయులు రాజకీయాలు మాట్లాడేందుకు భయపడుతున్నారు. రాజకీయాలంటే ఆమడ దూరం పరుగెత్తుతున్నారు. కాని ఇతర శాఖలల్లో అవినీతి సంపాదనకు అలవాటు పడి, రోజూ జేబు నిండనిదే కార్యాలయం గడప దాటని అధికారులు, రిటైర్మెంటుకు దగ్గరగా వున్న సమయంలో రాజకీయాల అవకాశాల కోసం వెంపర్లాడుతున్నారు. పార్టీల పంచన చేరుతున్నారు. నాయకుల దృష్టిలో పడి, వారికి ఊడిగం చేసి, ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు..ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామంటున్నారు…టిక్కెట్ల కోసం వేట అప్పుడే మొదలుపెట్టారు…ఎంచుకున్న నియోజకవర్గాలలో ప్రతి చిన్న శుభకార్యామైనా పాలు పంచుకుంటున్నారు. ప్రజలకు చేరువౌతున్నారు. ప్రజలల్లో మంచి పేరు కోసం పాకులాడుతున్నారు. ఆయా నియోజకవర్గాలలో తమ వర్గాలను ఏర్పాటు చేసుకొని వాటిని పోషిస్తున్నారు. నెల నెల లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రచారానికి వాడుకుంటున్నారు. వారి చేత జేజేలు పలికించుకుంటున్నారు..జిందాబాద్‌లు కొట్టించుకుంటున్నారు… నాయకులు కావాలని కలలు గంటున్నారు… ప్రజా ప్రతినిధులమైపోయినట్లు రేపటిని ఊహించుకుంటున్నారు. అయితే ,,,,,కారు..లేకపోతే కాంగ్రెస్సు…అక్కడా సీటు లేదంటే కమలంతో దోస్తీకి….పోటీకి సై అంటున్నారు… వారి వివరాలు మీ నేటిధాత్రిలో వరసగా….త్వరలో…!
`అన్ని వర్గాల అభ్యున్నతి అంటే ఏమిటో కొత్త తరం ఆవిష్కరణతో చూపాలి.
`తెలంగాణ మోడల్‌గా దేశమంతా తీర్చిదిద్దబడాలి
`అంకితభావమున్న నేతలతో దేశ భవిష్యత్తు తీర్చిదిద్దాలి.
`జంభూ ద్వీపంలో స్వర్ణ యుగం రావాలి.
`దేశం పెట్టుబడులకు స్వర్గదామం కావాలి.
`సమాఖ్య స్పూర్తి నిండిన మన దేశంలో సిరి సంపదలు వెల్లివిరియాలి.
`అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ది జరగాలి.
`కేసిఆర్ కలల రూపం నుంచి అభినవ భారత నిర్మాణం జరగాలి.
`దేశ కీర్తి పతాక కేసిఆర్ నాయకత్వంలో రెపరెపలాడాలి.
హైదరాబాద్,నేటిధాత్రి:
అప్పుడు ఒక్కడే…ఇప్పుడూ ఒక్కడే…ఆ ఒక్కడు కేసిఆరే… ఆనాడు అంతే… తెలంగాణ ఉద్యమ రచన చేశాడు… తెలంగాణ అంతా ఏకం చేశాడు. లక్షలాది మంది కేసిఆర్‌లను తయారు చేశాడు. తెలంగాణ సాధించి చూపించాడు. తెలంగాణ వస్తే ఎలా బతుకులు మారుతాయో చెప్పాడు. ఇప్పుడు ఆచరణలో చూపించి, దేశమంతా అబ్బురపడేలా అభివృద్ది చేసి చూపించాడు. చీకట్లో మగ్గిన కొడిగట్టిన దీపంలా వుండే తెలంగాణకు వెలుగులు తెచ్చాడు. తెలంగాణ వస్తే ఇక చీకటి బతుకులే అని ఎద్దేవా చేసిన వారికి గుణపాఠం నేర్పారు. వారి అజ్ఞానాన్ని పోగొట్టి కళ్లు తెరిపించాడు. వారి చేతనే తెలంగాణకు జై అనేలా చేశాడు. తెలంగాణను కరంటు వెలుగులతో నింపాడు. కరంటు ఉత్పత్తికి మార్గాలు వేశాడు. నీటి చుక్క పారకం లేని తెలంగాణలో నీటి సిరుల పరవళ్లు చూపించాడు. తెలంగాణలో సాధ్యం కాదని చెప్పిన ప్రాజెక్టులను నిర్మాణం చేశాడు. కాళేశ్వరం లాంటి అధ్భుతమైన నిర్మాణంతో ప్రపంచానికి కొత్త పాఠం నేర్పాడు. నాయకుడికి చిత్త శుద్ది వుంటే ప్రగతి ఎలా పరుగులు పెడుతుందో ఆవిష్కరించాడు. తెలంగాణలో నీటి పారుదలలో గోదారి పరుగులు చూపించాడు. రిజర్వాయర్ల నిర్మాణంతో నీటిని ఒడిసిపట్టే మంత్రం అమలు చేశాడు. చెరువులు బాగు చేసి, ప్రతి ఊరులో వున్న భూగంగాళం నీటితో కళకళలాడేలా చేశాడు. రైతుకు నీటి గోస లేకుండా చేశాడు. పైరుకు నీటి వాడకం లోటు లేకుండా చేశాడు. పంటలు పుష్కలంగా పండేందుకు కొత్త దారులువేశాడు. తొండలు గుడ్డు పెట్టే భూములని ఎగతాతలి చేసి, ఏవగింపు మాటలు మాట్లాడిన వారి కళ్లముదే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దాడు. అదీ కేసిఆర్ అంటే నిరూపించాడు.ఈనాడు అంతే దేశ రాజకీయ చరిత్ర మార్చబోతున్నాడు. దేశ భవిష్యత్తుకుకొత్త దిశా నిర్ధేశంచేయబోతున్నాడు. దేశానికి కొత్త రాజకీయ శక్తిని ఇవ్వబోతున్నాడు. దేశాన్ని ఏలేందుకు అడుగులు వేస్తున్నాడు. కొత్త రాజకీయ పార్టీ త్వరలో ప్రకటించబోతున్నాడు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు. దేశంలోని అనేక మంది నాయకులకు ఆహ్వానాలు పంపుతున్నాడు. స్వయంగా కేసిఆరేఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. దసరా రోజున తెలంగాణ గడ్డ మీద నుంచి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన, కార్యాచరణ ప్రకటించబోతున్నాడు. దేశ రూపు రేఖలు ఎలా మార్చాలన్నదానిని ప్రజలకు వివరించబోతున్నాడు. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితులను, భవిష్యత్తులో రావాల్సిన మార్పులు స్పష్టంగా సూచిస్తూ, వివరంగా జనం మదిలోకి సరికొత్త నవభారతాన్ని నింపబోతున్నాడు. తెలంగాణ ఒకనాడు ఎలా వుందోచెబుతాడు. ఎలా గోసపడిరదో కూడా చెబుతాడు. ఆ గోస నుంచి తెలంగాణ ఎలా విముక్తి అయ్యిందో చెబుతాడు.తెలంగాణ ప్రగతిలో ఎలా దూసుకుపోతోందో కూడా చెప్పి, దేశంలో కూడా తెలంగాణ సంక్షేమ, ప్రగతి పాలన రావాలంటే దేశ రాజకీయాల్లో మార్పును గురించి ప్రజలకు బోధ చేస్తాడు.
ప్రజలను గత ప్రభుత్వాలు ఎలా వంచించాయి. ఓట్ల రాజకీయాలు ఎలా చేశాయి. ప్రజలను ఎలా మభ్యపెట్టాయి. ఇంకా ఎలా చూస్తున్నాయి. ప్రజలను ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాడు సమానంగా వున్న డాలర్, రూపాయి విలువ ఇప్పుడెందుకు పతనమౌతుందో కూడా ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతాడు. మన దేశ గతిని ఎలా మార్చుకోవాలో కూడా లెక్కలేసి మరీ చెబుతాడు. ఇంత కాలం గత పాలకుల మోసం ఎంత దుర్మార్గమైంతో అంకెలతో సహా చెప్పి కడిగిపారేస్తాడు. మన దేశ ఎకానమీ ఏ దశలో వుందో చెపి, ఏ మార్గంలో పయనిస్తే దేశం దిశ, దశ మారుతుందో చెబుతాడు. తెలంగాణ మోడల్‌గా దేశమెలా ఒక్కొఅడుగు వేయాలో చెప్పి, ఎంత తొందరగా దేశాన్ని ప్రగతి పధంలో పయనింపజేసి చూపిస్తాడు. తెలంగాణ అభివృద్ధి రోల్ మోడల్‌గా దేశ ప్రగతిని నిర్ధేశిస్తాడు. అనేక సంక్షేమ పధకాలు అమలు చేసి, సంక్షేమ రాజ్య నిర్మాణం చేస్తాడు. ఇది కేసిఆర్ మీద సగటు తెలంగాణ వాదికి వున్న బలమైన నమ్మకం. కేసిఆర్ నాయకత్వం మీద విశ్వాసం. ఆయన పట్టుదల మీద వున్న అచంచలమైన సగలు వ్యక్తి ఆత్మవిశ్వాసం. ప్రతి టిఆర్‌ఎస్ కార్యకర్తకే కాదు,తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడెప్పుడా కేసిఆర్ కొత్త పార్టీ ప్రకటన అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కేసిఆర్ ఫ్రధాని అయితే దేశంలో జరగబోయే అభివృద్ధిని ముందే ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కళ్లముందు ఆవిష్కరించిన ప్రగతిని దేశం మొత్తం చూపించడానికి కేసిఆర్‌కు ఎంతో కాలం పట్టదు. అదే నమ్మకం దేశంలోని అనేక మంది నాయకులకు కూడా వుంది. అందుకేకేసిఆర్ దేశ రాజకీయాల్లోకి రాక చారిత్రక అవసంర. కొత్త చారిత్రక నిర్మాణం కోసం అడుగులు వేసేందుకు కేసిఆర్ వడివడిగా కసరత్తు చేస్తున్నాడు.దేశం సస్యశ్యామలం చేయడమే కేసిఆర్ లక్ష్యం.నీళ్లు లేని సాగు, పడావు బడ్డ భూములతో రైతులు పడే వేధన తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్.
ఎందుకంటే కరువు కోరల్లో చిక్కుకొని, వలస సమైక్యపాలకుల నిర్లక్ష్యంలో చిక్కి శల్యమైన తెలంగాణ నేల చుక్క నీటి కోసం ఎంత విలవిలలాడిరదో తెలిసిన నాయకుడు కేసిఆర్. తడారిన తన గొంతులో మంచినీటి చక్క పడితే ఎలా ప్రాణం లేచి వస్తుందో, ఎండిన భూడులో కూడా తడి కనిపిస్తే రైతుకు అంతే సంతోషం వేస్తుంది. తన కష్టం తీరుతుందని కలలు గంటాడు. ఆశలు పెంచుకుంటాడు. చేలో కనిపించేనీటిని కళ్లకద్దుకొని, సంబురపడతాడు. అదే భూమి ఎండితే తన కన్నీటి చుక్కను జారవిడిచి తడి చేస్తాడు. తన కన్నీళ్లతో భూదేవి గొంతు తడుపుతాడు. తడారని భూమని చూసి కుమిలిపోతాడు. తన బాధ దిగమింగు కోలేక, కన్నీటిపర్యంతమౌతాడు. అలాంటి రైతు కంట కన్నీరొలికిన ఏ రాజ్యం బాగుపడదు. అందుకే రైతు సుఖం, సౌఖ్యమే రాజ్య సౌభాగ్యం అని తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్. అందుకే దేశ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కరించేందుకు సరికొత్త రాజకీయ రచన సాగిస్తున్నాడు. దసరా వేడుకనే వేదిక చేసుకొని ప్రకటన కోసం సర్వం సిద్దం చేస్తున్నాడు. సంక్షేమ రాజ్య నిర్మాణం అంటే ఏమిటో చూపించిన ఏకైక నాయకుడు కేసిఆర్. ఎందుకంటే గతంలో ఏ ఒక్క పధకమో ప్రకటించి ఇదే స్వర్గం, అదే సంబరం, అంతా సంతోషం, ఇంతకన్నా లేదు సంక్షేమం అని గొప్పలు చేప్పుకున్న పాలకులున్నారు. కాని ఏక కాలంలో, తనకు పాలించే అవకాశం ప్రజలు ఇచ్చిన సమయంలో కొన్ని వందల పథకాలు అమలు చేసి చూపించడం అంటే మాటలు కాదు. అందుకు నిరంతరమైన ఆలోచనలే కాదు, అమలుపై కూడా శ్రధ్ద కావాలి. అందుకు ఎంతో చిత్తశుద్ది వుండాలి. అంకితభావంతోనే రచన జరగాలి. ప్రజల ముఖాల్లో చిరునవ్వులువిరియాలి. సంతోషం వెల్లివిరియాలి. ఇదంతా జరగాంటే నాయకుడికి ఎంతో ఓర్పు కావాలి. సహనం కావాలి. ప్రజల కోసం నిరంతరం మదిని రంగరించే నాయకుడు కావాలి. అది కేసిఆర్ రూపంలో వుండాలి. అందుకే దేశానికి కేసిఆర్ నాయకత్వంకావాలి.
తెలంగాణ ప్రగతిని దేశమంతా విస్తరించాలి. అది కేసిఆర్‌తోనే సాధ్యం. తెలంగాణ అంటే ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రం. సుధీర్ఘ కాలం పాటు కేసిఆర్ నేతృత్వంలో పోరాటం చేసి, సాధించుకున్న తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో ?చూద్దామని సవాలు చేసిన వాళ్లు కూడా విస్తుపోయేలా కేసిఆర్ పాలన సాగుతోంది. అంతే కాదు ఇంత తక్కువ సమయంలో ఒక రాష్ట్రం అన్ని రంగాలలో ప్రగతి అన్నది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదు. పాలకుల అంకిత భావం ఎంతో ముఖ్యం. అయితే తెలంగాణ సాధన ఉద్యమ కాలంలోనే తెలంగాణ సాధిస్తామన్న నమ్మకం వున్న నేత కేసిఆర్, వచ్చే తెలంగాణకు ప్రగతి బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు. ఇది సామాన్యమైన నేతలకు సాధమయ్యేది కాదు. అలాగే తెలంగాణ అభివృద్దిలోనే ఇన్ని అద్భుతాలు సాధించినప్పుడు దేశ వ్యాప్తంగా ఎందుకు సాధ్యం కాని ఆలోచించి, దేశాన్ని కూడా తీర్చిదిద్దే ప్రయత్నం కేసిఆర్ మొదలు పెడుతున్నారు. తెలంగాణ నినాదం ఎత్తుకున్న నాడు వినిపించిన విరుపులే ఇప్పుడూ వినిపిస్తూనే వున్నాయి. అయినా కేసిఆర్ ఇలాంటి మాటలకు ఆగడు…తన అడుగులు ఆపడు…పయనమే తెసిన బాటసారే దారి కూడా చూపించుకుంటూ వెళ్తాడు. వెనక వచ్చేవారికి మార్గదర్శకుడౌతాడు. దేశానికి దిశా నిర్ధేశకుడౌతాడు. దేశానిభివృద్ధికి దిక్సూచీ అవుతాడు. ఆయననే మూడక్షరాల ప్రభంజనం కేసిఆర్ అంటారు.
`రేవంత్‌ను కాంగ్రెస్ కు పంపి బీజేపీతో చంద్రబాబు రాజకీయం.
`కాంగ్రెస్‌ను ఖాళీ చేయడంలో రేవంత్ నిమగ్నం?
`తెలంగాణలో తెలుగుదేశం శ్రేణులతో కాంగ్రెస్ నింపాలి.
`సీనియర్లను బయటకు తరమాలి.
`గుండుగుత్తగా తెలంగాణ చంద్రబాబు చేతిలో పెట్టాలి.
`గురు దక్షిణ కోసం తెలంగాణ తాకట్టు!
`చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ ప్రజలకు రేవంత్ కనికట్టు?
హైదరాబాద్,నేటిధాత్రి:
తనను తాను నమ్ముకోవడం ఆత్మాభిమానం… తనమీద తనకు వుండే అచెంచలమైన విశ్వాసం నమ్మకం. తను మరొకరిని నమ్ముకొని ప్రయాణం చేయడం ఎక్కడో దాగి వున్న స్వార్ధం. మొత్తంగా ఇతరుల కోసం త్యాగం చేస్తూ, పైకి ఆత్మాభిమానాన్ని ప్రదిర్శించడం తనను తాను మోసం చేసుకోవడం.తన కోసం తానున నిచ్చెన తయారు చేసుకోవడం. తనను నమ్మేవారిని గందరగోళంలోకి నేట్టేయడం… ఏది నిజమో! ఏది అబద్దమో!! తన వాళ్లు కూడా అర్ధం చేసుకోలేని తనాన్ని సృష్టించడం. ఇవన్నీ ఒక వ్యక్తిలో కనిపిస్తే మాత్రం అది పిపిసి. అధ్యక్షుడు రేవంత్ స్వభావం అని అంటున్నారు. ఆయనను చూస్తే రాజకీయశక్తిగా కనిపిస్తారు. కాని వెనకాల చంద్రబాబు కనిపిస్తాడు. అది నిజమే అని రేవంత్ కూడా ఒప్పుకుంటాడు. ఆనక ఈ మధ్యే మరోసారి చంద్రబాబు వదిలిన బాణాన్ని అని ఒప్పుకున్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన నాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు,నేడు చెబుతున్న మాటలకు పొంతన లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడుచుకుపెట్టుకుపోతున్న సమయంలో రేవంత్ రాజకీయ భవిష్యత్తును లెక్కలేసుకున్నాడు. అయితే తెలుగుదేశంలోని సీనియర్లు రేవంత్‌ను దూరం పెడుతూ వచ్చారు. ఒక దశలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ అధ్యక్షుడు కావాలనుకున్నాడు. కాని చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నాడు. ఎల్. రమణనను అధ్యక్షుడిని చేశారు. దాంతో ఇక తెలుగుదేశంలో వుండడం కన్నా, మరో పార్టీని చూసుకుంటేనే బెటర్ అని రేవంత్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నాడు. అయితే తన రాజీనామాను అమరావతికి వెళ్లి, చంద్రబాబుకు ఇచ్చి, ఇంత కాలం తనకు సమున్నతమైన స్దానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడేమో తనకు తానుగానే పార్టీని వదిలిపెట్టానని చెప్పాడు. ఇప్పుడు తాను కాంగ్రెస్‌లోకి చంద్రబాబు పంపిస్తేనే వచ్చానంటున్నాడు. ఇందులో మొదటిది తప్పని తనే ఒప్పుకున్నట్లైంది. తన నిజస్వరూపం మరోసారి రేవంత్ నిరూపించినట్లైంది. అందుకే కాంగ్రెస్ సీనియర్లు రేవంత్‌ను నమ్మకుండా దూరంపెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్నామ్నాయంగానే తెలుగుదేశంపార్టీ నిర్మాణంజరిగింది. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం నుంచి వచ్చి, పార్టీపగ్గాలు చేపట్టేంతదాకా తెచ్చుకున్న రేవంత్ ఏదైనా చేయగలగడు…అనే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్‌ను దూరం పెడుతున్నారు. . ఇల్లు పీకి పందిరేయగల సమర్ధుడు రేవంత్ అన్నది మొదటినుంచి సీనియర్లు చెబుతున్నదే. అదే నిజమౌతుందా? అని సీనియర్లు మధనపడుతున్నారు. స్వయంగా పిపిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే తాజాగా చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు బాగా అర్ధం చేసుకుంటే రేవంత్ రెడ్డి రాజకీయంలో కాంగ్రెస్‌ను కనుమరుగు చేసే ఎత్తుగడే కనిపిస్తోంది.
మునుగోడులో ఈ మధ్య జరిగిన ప్రచార సభలో తెలుగుదేశం శ్రేణుల గురించి ప్రస్తావించారు. మరి తెలుగుదేశం పార్టీనుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరి, పిపిసి అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి తెలుగుదేశం శ్రేణులను ఎందుకు ఆహ్వానించడం లేదు. వారిని కాంగ్రెస్‌లోకి ఎందుకు కలుపుకోవడం లేదు. తెలంగాణలో ఇంకా తెలుగుదేశం బతికి బట్టకట్టేందుకు పరోక్షంగా రేవంతే పనిచేస్తున్నాడా? అన్న అనుమానం రాకమానదు. అయితే రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి పంపిన చంద్రబాబు, తాను మాత్రం బిజేపి వైపు చూస్తున్నాడు. బిజేపికి స్నేహ హస్తం చాస్తున్నాడు. మరి రేపటి రోజున తెలంగాణ కాంగ్రెస్‌ను బిజేపిలో కలిపే పూచీ నాది అని ఏమైనా చంద్రబాబుకు మాటిచ్చి రేవంత్ రాజకీయం చేస్తున్నాడా? అన్నది కూడా చర్చనీయాంశమైపోయింది. రేవంత్ పిపిసి అధ్యక్షుడు అయ్యే దాకా ఎంతో ఓపికను ప్రదర్శించాడు. ఒక రకంగాచెప్పాలంటే నవ్వుతూ నటించాడు. ఇప్పుడు తనలోని మరో నటుడిని చూపిస్తున్నాడు. పిపిసి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నాడే కోవర్టులు వెళ్లిపోవచ్చు…అంటూ కొత్తరాగం అందుకున్నాడు. పరోక్షంగా సీనియర్లకు చుకలంటించాడు. వారికి హెచ్చరిక జారీ చేశాడు. అప్పటి నుంచి సీనియర్లకు, రేవంత్‌కు మధ్య టామ్ అండ్ జెర్రీలొల్లి సాగుతూనే వుంది. గిల్లికజ్జాలు ఆగడం లేదు. అడుగడుడునా రేవంత్ తననోటికి పనిచెప్పడం, సీనియర్లు విభేధించడం…చూస్తూ వున్నదే.ఆ మధ్య బిజేపి నాయకుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రేవంత్‌రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో చూద్దాం?అన్నాడు. అయితే రాజేందర్ టిఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత కలిసి చర్చలు జరిపిన అతి కొద్ది మంది నాయకుల్లో రేవంత్ రెడ్డి వున్నారు. వాళ్లు బిజేపిలో వున్నారు. ఒక్క రేవంత్ మాత్రమే కాంగ్రెస్‌లో వున్నాడు. అందుకే రేవంత్ పైకి కాంగ్రెస్ నాయుకుడిగా కనిపించినా లోన తన రాజకీయ గురువు చంద్రబాబు అడుగు జాడలే కనిపిస్తున్నాయంటున్నారు. ఏదో ఒకనాడు మొత్తం కాంగ్రెస్‌ను ఖాళీ చేయడమో! లేక కాంగ్రెస్‌లో తెలుగుదేశం నాయకులతో నింపి, మరో షిండే అవతారమెత్తడమో చేసే అవకాశంలేకపోలేదంటున్నారు. ఎందుకంటే ఒక వేళ తెలంగానలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, రేవంత్ రెడ్డే సిఎం కావాలని లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో వున్నంత కాలం ఆపార్టీ రాజకీయాలు ఓ పట్టాన ఎవరికీ అర్ధం కావు. అసలే సీనియర్లంటే రేవంత్ రెడ్డికి అసలే గిట్టడం లేదు.
ఆయనంటే సీనియర్లకు నిమిషం పడడం లేదు. ఆయన ముందు కూర్చోవడానికి సీనియర్లకు మింగుడు పడడం లేదు. ఇదిలా వుంటే గతం నుంచి ఓసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పదే పదే కాంగ్రెస్‌లో దుమారాన్ని రేపుతూనే వున్నాయి. కలతలు సృష్టిస్తూనే వున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో రేవంత్ ఒక స్టాండ్ తీసుకుంటే బాగుండేది. కాని మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. అయినా వెంకటరెడ్డి మార్పు రాలేదు. రాదని కూడా వెంకటరెడ్డే స్పష్టం చేశారు. మునుగోడు ప్రచారానికి రానని తెగేసిచెప్పాడు. ఆ సమయంలోనే ఐపిఎస్ ఆఫీసర్లు, హోంగార్డుల లెక్క బెడిసికొట్టింది. మునుగోడు ఉప ఎన్నికల కమిటిని ప్రకటించి, మధుయాష్కిని లెక్క చేయకపోవడంతో అక్కడా తేడా కొట్టింది. తాజాగా రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో మాట్లాడుతూ ఎవరికైనా నేనే టిక్కెట్లు ఇవ్వాలి..నేను సంతకం పెడితే తప్ప టిక్కెట్లు రావన్నారు. ఇది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తగిలినట్లుంది. వెంటనే ఆయన ఆ మాటలపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఇలా కాంగ్రెస్‌లో సీనియర్లందరినీ కెలుక్కుంటూ, పార్టీని ఖాళీ చేసి, తర్వాత తన అనుచరులతో, తెలుగుదేశం నేతలతో నింపాలన్నదే రేవంత్ లక్ష్యం. అప్పుడే రేవంత్ ఆడిరది ఆట, పాడిరదిపాట అవుతుంది. సీనియర్లు అడ్డు వున్నంత కాలం తాను ఏం చేయాలన్నా ముందర కాళ్లకు బంధం పడుతూనే వుంటుంది. తాజాగా మునుగోడు విషయంలోనూ రేవంత్ లెక్కలు చెల్లలేదు. ఆయన టిక్కెట్టు ఇవ్వాలనుకున్నది ఒకరికి. టిక్కెట్టు ఇచ్చింది మరొకరికి. అయినా చెల్లని ఓటు ఎటు పడితేంది? అన్నట్లు మరోసారి నాకు టిక్కెట్టు ఇవ్వాలని పాల్వాయి స్రవంతి కోరకుండా చేశాడు. ఇలా కాంగ్రెస్‌లో తన రాజకీయమే గెలిచే పరిస్దితి తీసుకొస్తున్నాడు. తర్వాత తన ఎత్తుగడలు అమలు చేసేందుకు కాపు కాచుకొని కూర్చుంటున్నాడు. ఒక వేళ తన నాయకత్వంలో అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే, క్రెడిట్ అంతా నాదే అనొచ్చు…లేకుంటే తన వర్గాన్ని తీసుకొని బిజేపిలో చేరొచ్చు. తన గురువు చంద్రబాబుకు గురు దక్షిణ తీర్చుకోవడం కోసం చీల్చిన ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ రాజకీయాలను క్రియాశీలం చేయొచ్చు. మళ్లీ తెలుగుదేశం పార్టీకి నీరు పోయొచ్చు…ఇదీ రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు తెన్నులు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ముగుగోడులో మునిగితే ఓ లెక్క…ఓడిపోతే ఓ లెక్క…ఇప్పటికైతే ఎప్పుడో కాంగ్రెస్ లెక్క తప్పించాడు…మునుగోడును మరో హుజూరాబాద్‌ను చేసి, కాంగ్రెస్‌ను ఖతం పట్టిస్తాడని అంటున్నారు.
`మిమ్మల్ని విడదీసి పాలించి, నిధులు ఆగం చేస్తున్నారు చూడండి?
`పిప్పరమెంటు బిల్ల చేతిలో పెట్టి చాక్లెట్లు కొట్టేస్తున్నారు చూసుకోండి!
`కోట్లు మాయమౌతున్నాయని తెలిసినా, కలిసి కొట్లాడకపోతే లాభం లేదు? న్యాయం జరగదు?
హైదరాబాద్,నేటిధాత్రి:
నిజాన్ని వినలేనప్పుడు తప్పు చేయొద్దు. నిజాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిసిప్పుడు అన్యాయం చేయొద్దు. నిజం జీర్ణించుకోలేనిది. నిప్పుకన్నా గొప్పది. కళ్లముందు మన సమాజంలో కళ్లు లేక, కాళ్లు లేక, చేతులు లేక చేయూత కోసం ఆత్రంగా ఎదురుచూసేవారికి చేయూతనందించాలనిపించాలి. కాని వాళ్లు సొమ్ము కూడా తినాలనిపించకూడదు. ఆ సొమ్ముకు ఆశపడాలనుకోకూడదు. అదేం పలహారం కాదు. అది ఎవరైనా సరే… దివ్యాంగుల సంక్షేమ శాఖలో నిధులు దుర్వినియోగమయ్యాయన్నది నిజం. తప్పు ఎవరు చేసినా తప్పే…నిధులు ఎవరు కాజేసినా నేరమే? అందుకు ఎవరూ మినహాయింపు కాదు. దివ్యాంగుల సొమ్ము ఎవరు తిన్నా పాపమే? నేరమే? అయినా నిధులు గోల్ మాల్ జరిగిందేనేది వాస్తవం. మరి ఎవరిని నిందిద్దాం? తప్పు చేసిన వాళ్లే దర్జా వెలగబెడుతుంటే…తప్పంతా దివ్యాంగులదే అందామా? వారిలో వారికి పుల్లలు పెట్టి, గ్రూపులుగా విడగొట్టి, సంఘాలుగా దూరం చేసిన వాళ్లను వెకకేసుకొద్దామా? దివ్యాంగులలో గ్రూపులు తయారు చేసి, నాయకత్వాలు అప్పగించి, నా మాటే వేదం అనుకునేలా చేసి, వారి ఆఫీసు మెట్లెక్కకుండా చేస్తున్నది ఎవరు? కనీసం కనికరం చూపకుండా చూస్తున్నదెవరు? అందరూ దివ్యాంగులపై జులూమే ప్రదర్శిస్తే వారిని అక్కున చేర్చుకునేదెవరు? వారికి న్యాయంగా రావాల్సిన సదుపాయాల కల్పను చేయకుండా చేస్తున్నదెవరు? నిధులు దారి మళ్లిస్తున్నదెవరు? దివ్యాంగులంటే అందరికీ ప్రేమ…వారి నిధులు పంచుకొని పలారం చేసుకుంటున్నది వాళ్లే…మరి దివ్యాంగులకు మిగులుతున్నదేమిటి? అదేదో సినిమాలో రాజు ఐసు ముక్కను చేతికిచ్చి, అందరికీ పంచమంటే ఆఖరుకు, అందాల్సిన వారికి దగ్గరకు వచ్చేసరికి మిగిలి నీటి బొట్టు కూడా ఆవిరైపోయిందన్న సంగతి అందరికీ తెలుసు. మరి దివ్యాంగులకు అందాల్సిన నిధులు కూడా చెందాల్సిన వారికి చెందకుండా, దోచుకునేవారికి చేతికి చేరుతుంటే దివ్యాంగులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి. తమ బాధ ఎవరితో పంచుకోవాలి. వారిలో లేని ఐక్యతను సొమ్ము చేసుకుంటూ దివ్యాంగుల సంక్షేమం అందరూ కలిసి విస్మరిస్తున్నారు. నిధులు దిగమింగుతున్నారు. తీరని అన్యాయానికి ఒడిగడుతున్నారు. విడివిడిగా ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. జేబులు నింపుకుంటున్నారు. ఇది ఎవరో అంటున్న మాట కాదు. వారిలో వాళ్లే చెప్పుకుంటున్న మాటలు. కమీషనర్ వల్ల నిధులు ఇంత దుర్వినియోగమైనట్లు కొందరు చెబుతుంటే…చైర్మన్ వల్ల ఇంత దుబారా అయ్యిందని అంటున్నారు. అది కూడా మళ్లీ దివ్యాంగుల నోటినుంచే చెప్పిస్తున్నారు. ఇదేమైనా న్యాయంగా వుందా? దివ్యాంగులను మోసం చేస్తున్నామన్న కించిత్ బాధ కూడా లేదా? ప్రధానంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ పర్యవేక్షణ అనగానే గుర్తుకొచ్చేది ఇద్దరే…
ఆ ఇద్దరూ ఇద్దరే అన్నట్లు సాగుతుంటే, అన్యాయమైపోతున్నది దివ్యాంగులే…వారికి న్యాయం చేద్దామన్న ఆలోచన ఇద్దరిలో లేకపోతే నలిగిపోతున్నది దివ్యాంగులే… వారికి అందాల్సిన సౌకర్యాలు అందకుండా పోతే అడిగేది ఆ ఇద్దరినే…ఆ ఇద్దరే అన్యాయం చేస్తున్నారని తెలిసి, వారి గోడు ఎరికి చెప్పుకుంటారు? వారికి జరుగుతున్న అన్యాయం ఎలా చెప్పుకుంటారు. సంబందిత మంత్రికి దివ్యాంగులు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయిందని బాధపడుతున్నారు. ఇక ఎవరు వారి బాధలు తీర్చాలి. న్యామjైున హక్కుల పరిరక్షణకే దిక్కులేకపోతే, ఇక వాళ్లు మరిన్ని అవకాశాల కోసం ఎవరిని ప్రశ్నించాలి. ఎవరి మీద పోరాటం చేయాలి. దివ్యాంగులే మంత్రికి పట్టడం లేదన్న మాటలు మాట్లాడుతుంటే, ప్రభుత్వం పరువు పోదా? గతంలో దివ్యాంగులకు లేని అనేక అవకాశాలను కల్పిస్తున్న ప్రభుత్వమే అబాసుపాలు కావడానికి కారణం ఎవరన్నది మంత్రికి తెలుసుకోవాల్సిన అసవరం లేదా? దివ్యాంగులకు అందాల్సినవి అందకుండా పోయిన విషయం నిజామా? కాదా? అన్నదైనా తెలుసుకోకపోతే ఎలా? అసలు మంత్రి సంబంధిత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా? మీరంటే మీరు అనుకొని శాఖలోని పెద్దలు ఒకరి మీద ఒకరు అబాండాలు వేసుకుంటున్నట్లు మంత్రికి కనిపించడం లేదా? అసలు ఎవరికి ఎవరి మీద అసంతృప్తి వుంది? అన్నది కూడా ముందు దివ్యాంగులు తెలుసుకోవాలి.
సంఘాలున్నాయి సరే…మీరంతా ఐక్యతగా వున్నారా? లేదా? అన్నది కూడా ముఖ్యం. గాలి వాటంలాగా దారి తప్పిపోకూడదు. నిజంగా ఎక్కడ అన్యాయం జరుగుతోంది? ఎవరు అన్యాయం చేస్తున్నారన్నదానిపై కూడా దివ్యాంగులకు స్పష్టత వుండాలి. అసలు దివ్యాంగులు పోరాటం చేస్తోంది? ఎవరిపైనా? మీడియాలో వచ్చిన కథనాలు, దివ్యాంగులు మీడియా ముఖంగా చెప్పినవే…ధర్నా చేసింది నిజమే… కమీషర్ మూలంగానే తమకు అన్యాయం జరుగుతోందని ధర్నా చేస్తున్న దివ్యాంగులు అబద్దమా? లేక తెలంగాణ వికలాంగుల ఆర్ధిక సహాకార సంస్ధ చైర్మన్ అన్యాయం చేస్తున్నారనేది నిజామా అనేది కూడా దివ్యాంగులే చెప్పాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ఓ వైపు భహిరంగంగా దివ్యాంగులు సంక్షేమశాఖ కార్యాలయం ముందు ధర్నా చేసింది అందరికీ కనిపిస్తోన్న అంశం. మరి అదే చైర్మన్‌పై వస్తున్న ఆరోపణలు నిజమని చెప్పగలిగే వారు కూడా కావాలి. కమీషనర్ అన్యాయం చేస్తుందని చెబుతున్నవాళ్లు దివ్యాంగులే…చైర్మన్ గురించి చెబుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలు దివ్యాంగులు చెప్పినవే…అయితే ఏది నిజం? ఏది అబద్దం? రెండూ నిజమైతే? దివ్యాంగులు ఎందుకు ఏకం కావడం లేదు? మీ హక్కుల కోసం ఎందుకు కలిసి పోరాటం చేయడం లేదు? వారి వారికి కొమ్ముకాసే పనిలో దివ్యాంగుల యూనియన్లు వున్నాయా? ఈ లెక్కన ఇద్దరు చూసేది వెలుగులోకి తేవాలంటే దివ్యాంగులే కదలాలి. మీ కోసం మీరు ఆలోచిస్తే తప్ప, మీకోసం ఎవరూ ముందుకు రారు? ఆక్టివా వెయికిల్స్, బ్యాటరీ ట్రై సైకిల్స్ కొనుగోలులో గోల్ మాల్ జరిగిందా? లేదా? అన్నది కూడా దివ్యాంగులు చెప్పాల్సిన అవసరం వుంది. ముందు దివ్యాంగుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన ఓ జేఏసిగా ఏర్పాటై, రైండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేసి, జరిగిన వ్యవహారమంతా వెలుగులోకి తేస్తేతప్ప విసయాలు ప్రపంచానికి తెలియవు. ప్రభుత్వం దృష్టికి వెళ్లవు. దివ్యాంగులు నిధులు ఎవరు కాజేశారన్నది ముందు తెలియాలి. ఎలా దుర్వినియోగం చేశారన్న లెక్కలు తేలాలి. అప్పుడు అసలు దోషులెవరు? అన్నది తెలుస్తుంది. అందరూ అందరే…అందరూ కలిసి దోచుకుంటుందే అన్నది తేలితే తప్ప ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదు. కమీషనర్ కార్యాలయం సాక్షిగా జరిగిన ధర్నా విషయంలో ఇప్పటి వరకు కమీషనర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దివ్యాంగులకు న్యాయం చేస్తామన్న మాట కూడా ఇంతవరకు చెప్పలేదు. అంటే ఆమెకు బాధ్యత లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం. ఒక వేళ దర్నా రోజు దివ్యాంగులు చేసిన ఆరోపణలు తప్పని చెప్పని చెప్పే అవకాశం కమీషర్‌కు వుంది. అయినా ఆమె ఏదీ చెప్పలేదు. ఎలాంటి ప్రకటన చేయలేదు. దివ్యాంగులతో ఇప్పటి వరకు చర్చ జరిపినట్లు లేదు. అలాంటప్పుడుదివ్యాంగులకు న్యాయం జరిగేదెలా? వారి సమస్యలు వారికి తెలిసేదెలా?
నేటిధాత్రి ఎవరికీ వంతపాడదు. దివ్యాంగులకు అన్యాయం జరుగొద్దనేదే నేటిధాత్రి చెబుతోంది. అందులో శషబిషలకు తావులేదు. ఎవరైనా ఒకటే…ఎంతటి వారైనా సరే…అన్యాయం చేసిన వాళ్లను నేటిధాత్రి వదిలిపెట్టదు…అవినీతి వెలికి తీయకమానదు…అన్యాయాన్ని అన్యాయం అనడమే మీడియా కర్తవ్యం…తప్పు చేసిన వారిని ఎండగట్టడమే నేటిధాత్రి ధైర్యం… దివ్యాంగులంతా ఒక్కటైన నాడు వారి సొమ్ము మీద ఎవరి కన్నూ పడదు. వారికి అన్యాయం చేయాలన్న ఆలోచన కూడ ఎవరూ చేయరు. ముందు దివ్యాంగులు ఒక్కటి కండి…ఊరు, ప్రాంతం, ఆధిపత్యం వదిలేయండి…నాయకులు దగ్గర అన్నది మర్చిపోండి. అందరి కోసం పోరాటం చేయండి. మీ హక్కులను మీరు కాపాడుకోండి.
`ఇరవై నాలుగు గంటల వైద్యం అంటారు? ఒక్క డాక్టర్ అందుబాటులో వుండరు?
`కాస్త క్రిటికల్ అని తెలియగానే హైదరాబాద్ కు రిఫర్ చేస్తారు?
`అక్కడి ఆసుపత్రులతో కమీషన్లు మాట్లాడుకుంటారు?
`ప్రభుత్వ ఆసుపత్రులలో కనీసం నాలుగోవంతు భవనాలు కూడా వుండవు?
`నలుగురు డాక్టర్ల పేర్లు బోర్డులో రాసి, రండి రండి అని ప్రచారం చేసుకుంటారు?
`నిలువు దోపిడీకి అడ్డాలుగా మార్చుకుంటున్నారు?
`తరతరాలకు తరగని ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు?
`వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నారు?
`ఉమ్మడి జిల్లాలలో వందలాది ఆసుపత్రులు?
`నరకానికి చాలా వరకు నకళ్లు?
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి రావడం మంచి పరిణామమే…ఏ రంగంలో నైనా కాంపిటీషన్‌తో ధరలు తగ్గుతాయి. ఒక్క వైద్య రంగంలో మాత్రమే కొత్త ఆసుపత్రులు రావడంతో మరింత ధరలు పెరుగుతుంటాయి. వైద్య విధానంలో సరికొత్త పుంత పేరుతో ఇచ్చే మందులు అవే అయినా, చికిత్సకు మాత్రం భలే డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ నగరంతోపాటు, ఉమ్మడి జిల్లాలు, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు ఆసుప్రతుల ఏర్పాటు జరుగుతోంది. గతంలో కనీసం పట్టణాలలో కూడా సరైన వైద్య సదుపాయం అందుబాటులో వుండేది కాదు. అలాంటిది చిన్న చిన్న పట్టణాలలో కూడా పెద్దఎత్తున ఆసుపత్రులు వెలుస్తున్నాయి. ప్రత్యేకంగా కొన్ని వారాలలో స్పెషలిస్టులను తీసుకొచ్చి మరీ వైద్యం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడే లాజిక్ వుంది. వైద్యం ముసుగులో వ్యాపారం మిలితమై వుంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసేందుకు, కొంత కాలం పాటు శిక్షణా కాలం ముగిసిన తర్వాత పల్లెల్లో వైద్యం చేయమంటే మాత్రం ససేమిరా? అంటారు. కాని ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేయడానికి వైద్యులు ముందుంటారు. ప్రజల సొమ్ముతో చదివిన వాళ్లుకూడా పేదలకు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక లక్షలు పెట్టి సీట్లుకొని చదువుకున్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలతోపాటు, ఉమ్మడి జిల్లాల్లో పనిచేసేందుకు డాక్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు కారణాలున్నాయి. గతంలో ఏ వైద్యుడైనా ఒక్కడే సొంతంగా క్లినిక్ ఏర్పాటుచేసుకునేవారు. ఎంత సమయమైనా సరే ఓపి ఓపిగా చూస్తుండేవారు. తప్పని పరిస్ధితి అయితే తప్ప ఆసుపత్రిలో జాయినింగ్ చేసుకొని, చికిత్సలు చేసేవారు. మందులతో తక్కువ కాదు అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీలు చేస్తూ వుండేవారు. కాని కాలం మారింది. డాక్టర్ల తీరు కూడా మారింది. వైద్య విద్య పూర్తయిన వెంటనే ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు. అందుకు కూడా కారణాలున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ అనుభవంతోపాటు, ఆసుపత్రుల నిర్వహణపై కూడా అవగాహన వస్తుంది. నలుగురు కలిసి ఆసుపత్రి పెట్టేందుకు అసవరమైన స్నేహాలు కూడా అక్కడే చిగురిస్తాయి. దాంతో నలుగురు వైద్యులు కలిసి జిల్లా కేంద్రాలతోపాటు వరంగల్, కరీంనగర్, వంటి పాత జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని నామకరణంతో ఆసుపత్రులు ఏర్పాటుచేస్తున్నారు. అద్దాలతో కూడిన హాలు, మూడు నాలుగు అంతస్థులంటే చాలు, ఇరుకు భవమైనా సరే…తెల్లారేసరికల్లా ఆసుపత్రులౌతాయి. స్ధానిక నాయకులతోపాటు, జిల్లా స్దాయి నాయకులతో రిబ్బన్ కట్ చేయించారంటే చాలు పబ్లిసిటీ కూడా వస్తుంది. ఇక కార్పోరేట్ వైద్యం అంటూ మొదలుపెడుతున్నారు.
ఇక అనుభజ్ఞులైన కొంత మంది డాక్టర్లు కలిసి సూపర్ స్పెషాలిటీ, మల్లీ సూపర్ స్పెషాలిటీ అంటూ అందమైన బోర్డులు ఏర్పాటు చేస్తారు. చౌరస్తాలలో పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిసిటీ కూడా బాగానే ఇస్తారు. దాంతో జనానికి ఎప్పుడూ కొత్తొక వింతే… ఏ కొత్త ఆసుపత్రి వచ్చినా ఎవరి చేతిలో ఏం మహిమ వుందో అని అమాయక ప్రజలు వెళ్తుంటారు. ఇక ఓపి ఫీజులు కూడా తక్కువేం వుండవు. ఒక్కసారి డాక్టర్ చేతికి మన చేయి వెళ్లిందంటే చాలు, ఎన్ని రకాల వైద్య పరీక్షలు రాస్తారో అన్నది ఆ సమయానికి వారు వున్న మానసిక పరిస్దితి మీద కూడా ఆధారపడి వుంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు. ఇంతా జరిగాక, ఇక్కడ అన్ని సదుపాయాలు లేవు. స్పెషలిస్టులు లేరు. హైదరాబాద్‌కు రాస్తున్నామంటూ చేతులు దులుపుకుంటారు. తాంబూలాలిచ్చామని వదిలేస్తారు. ఇక వైద్యం వంతు హైదరాబాద్‌కు …. అక్కడ ఆసుపత్రిలో చేరగానే వైద్యం మొదలు కాదు. మళ్లీ టెస్టులు. ఒకరోజు ముందు రిఫర్ చేసిన ఆసుపత్రి టెస్టులైనా సరే. హైదారాబాద్ లో మళ్లీ చేయాల్సిందే… పంపిన ఆసుపత్రికి వాటాలు పంపాల్సిందే…ఇలా అందినకాడికి దోచుకోవడం మాత్రం ఆసుపత్రులకు బాగా అలవాటైపోయింది.
స్కూళ్లకు గతంలో టెక్నో స్కూల్ అంటూ రకరకాల పేర్లు జత చేస్తుండేవారు.ప్రభుత్వం ఇకపై స్కూళ్లకు ఏ విధమైన అదనపు పదాలు జోడిరచొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడా కూడా అలాగే వ్యాపారం జరిగేది. పేర్ల మార్పుతో కొంత మారింది. ఇప్పుడు ఆసుపత్రుల పేర్లలో కూడా ఇవన్నీ తొలగిస్తే గాని ఆసుపత్రుల దోపిడీ ఆగదు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఇలా ఉమ్మడి జిల్లాలలో అనే పెద్ద పెద్ద ఆసుపత్రులున్నాయి. పైగా వైద్య కళాశాలలున్నాయి. అద్దాల మేడల్లాంటి పేరు మోసిన ఆసుపత్రులకు పేరే నిండుదం. వైద్యం శూన్యం అన్నట్లు జిల్లాల నుంచి నిత్యం కొన్ని వందల ఆంబులెన్సులు హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులకు వస్తుంటాయి. పేషెంట్లను తీసుకొస్తుంటాయి. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి కొన్ని వందలాది అంబులెన్స్‌లు హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులకు వస్తుంటాయి. మరి జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులని ఏర్పాటు చేసిన వాటిలో అందరూ స్పెషలిస్టులే అంటారు. అంతే కాదు ఆసుపత్రిలో 24 గంటల వైద్య సదుపాయం. అన్ని రకాల వైద్య పరికరాలు, వైద్యులు అందుబాటులో అంటూ ప్రకటిస్తారు. ఎంతో నైపుణ్యం వున్న వైద్యులు అంటారు. కాని ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఒక రోజు వైద్యం చేయడం రెండో రోజు హైదరాబాద్ పంపేయడం ఇది బాగా అలవాటుగా మారింది. డెంగీ వంటి జ్వరాల చికిత్సలో ముంచుకొచ్చేదాకా చూడడం, హైదరాబాద్‌కు పంపేయం ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇక హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో తక్కువలో వైద్యం చేసే ఆసుపత్రులే లేవు. లక్షల మాట తప్ప, వేల మాట అసలే మాట్లాడే పరిస్దితి వుండదు. జనం పెరుగుతున్నారు. వైద్యావసరాలు పెరుగుతున్నాయి.
సీజనల్ వ్యాధులు ఎప్పటికప్పుడు విజృంభిస్తూనే వుంటాయి. వీటికి తోడు కరోనా సమస్యలు. ఇతర సమస్యలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. దాంతో కొత్తగా ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుంటున్నవారికి నగరాల నడిబొడ్డులో చిన్న భవనం దొరికితే చాలు..బైటకు దానికి హంగూ ఆర్భాటాలు చేస్తే చాలు…అదో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అవుతుంది. ఉమ్మడి జిల్లాలున్నప్పుడు ఆయా జిల్లాలకు ప్రజలు నిత్యం వస్తుండేవారు. ఇక తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరగడంతో పెద్ద నగరాలకు జనం తాకిడి తక్కువైంది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు తక్కువయ్యారు. నాయకులు కూడా ఉమ్మడి జిల్లాలకు రావడం కూడా తగ్గింది. దాంతో గతంలో మూడు పువ్వులు,ఆరు కాయలుగా సాగిన లాడ్జింగుల వ్యాపారం ఒక్కసారిగా కుప్ప కూలింది. దాంతో నగరం నడిబొడ్డులో వున్న అనేక లాడ్జింగుల్లో కొత్త ఆసుపత్రులు ఏర్పాటౌతున్నాయి. వాటిలో ఎలాంటి కనీస సౌకర్యాలు వుండవు. ఫైర్‌సేప్టీ అంతకన్నా వుండదు. కాని రాత్రికి రాత్రే ఆసుపత్రులు వెలుస్తున్నాయి. పర్మిషన్లు కూడా వస్తున్నాయి. వరంగల్‌లో ఇలా బస్టాండ్ దగ్గరలో ఎన్నో కొత్త ఆసుపత్రులు వచ్చాయి. వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ ఆసుపత్రులు నరకానికి నకళ్లుగా మారాయంటున్నారు. ఇలా ఏర్పాటైన ఆసుపత్రుల్లో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ప్రాణాలు కూడా పోతున్నాయి. కాని అవి వెలుగులోకి రావడంలేదు. అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం ఆ ఆసుపత్రులు ఎవరి పేరు మీద పర్మిషన్లు ఇస్తున్నారోకూడా తెలియడం లేదు. ఇటీవల ఓ మహిళ మరణించిన సంఘటనపై నేటిధాత్రి అనేక కధనాలు రాసింది. కాని ఆ ఆసుపత్రుల మీద చర్య తీసుకున్నవారు లేదు. కొత్త ఆసుపత్రులకు పర్మిషన్లు ఆగడం లేదు. ప్రజల జీవితాలతో ఆటలాడుకోకుండా వుండడం లేదు. వైద్యో నారాయణ హరిః కాస్త…హరీ! అనే దాకా వస్తున్నాయి. ప్రజల జీవితాలు చాలా చిన్నవైపోతున్నాయి. ప్రాణాలు వైద్యుల చేతుల్లో రూకలైపోతున్నాయి.
`జిల్లా స్థాయిలో స్కానింగ్ మిషన్లతో సహా , ఉచిత అనేక సదుపాయాలు.
` ప్రైవేటుకన్నా మెరుగైన వైద్యం!
`జిల్లాలలో మరింత అందుబాటులో ప్రభుత్వ వైద్య సేవలు?
`పెద్ద ఎత్తున వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు
`భూపాలపల్లి లాంటి ఆసుపత్రుల్లో కూడా మోకాలి ఆపరేషన్లు
`మంత్రి హరీష్ రావు చొరవతో ఆసుపత్రులకు పూర్తి సౌకర్యాలు
`రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే….
`వరంగల్ లో రెండు వేల పడకల ఆసుపత్రి నిర్మాణ దశలో…
` ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ….
` ప్రభుత్వ వైద్యం అందరికీ అందుబాటులోకి…
`హైదరాబాదు చుట్టూ నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులు…
`ఇప్పటికే వందలాది బస్తీ దవఖానాలు…
` ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ వైద్యం…
`తప్పని పరిస్థితి ప్రైవేటు వైద్యానికి ఎల్ ఓసి సాయం..
` సిఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు మరో వరం…
`తెలంగాణ ప్రభుత్వంలో పేదలకు మేలైన ఉచిత వైద్యం.
హైదరాబాద్,నేటిధాత్రి:
మందులు గోలీలు మంచి సూదులు ఇస్తున్రంట..అత్తోపోదాం రావే…మన ఊరి దవఖానకు అన్న పాట వచ్చి నలభై ఏళ్లవుతోంది. ఆ పరిస్ధితి ఇప్పుడు తెలంగాణలో నిజమౌతోంది. తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. అన్ని రకాల వైద్య చికిత్సలు కూడా జిల్లా స్ధాయి ఆసుపత్రులలో కూడా అందుతోంది. తెలంగాణలో ప్రభుత్వ వైద్యం ఎంతో వేగంగా అందుబాటులోకి వచ్చింది. ఒకనాడు ప్రభుత్వ వైద్య సదుపాయాలు ఎలా వుండేవో గుర్తు చేసుకుంటే గగుర్భాటు కలగకమానదు. మండల కేంద్రాలలో పశు వైద్యశాలలు పనిచేసినంతగా , ప్రజలకు వైద్య సేవలు అందేవి కాదు…! అందుకే అప్పట్లో ప్రభుత్వ వైద్యం అన్నది అందని ద్రాక్షగా వుండేది. ఒక దశలో ప్రభుత్వ వైద్యం ప్రజలు ఉచితంగా అందించిడం సాధ్యం కావడంలేదన్న మాట కూడా ప్రభుత్వాలనుంచి వినపడిరది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వైద్యం ప్రభుత్వాసుపత్రుల్లో అందించాలంటే కొంత ఫీజు వసూలు చేయాలని నిర్ణయించి, అమలు చేసిన రోజులున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలా ఉచిత వైద్యానికి మంగళం పాడారు. ప్రజలు, ప్రతిపక్షాలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తెల్ల కార్డు దారులకు మినహాయించి, మిగతా ప్రజల నుంచి ప్రభుత్వ వైద్యసేవలకు ఫీజులు వసూలు చేసిన సందర్భం కూడా వుంది. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యమే అంతంత మాత్రమంటే, పేదల నుంచి సైతం ఫీజులు వసూలు చేసిన దుర్మార్గం ఆనాటి పాలకుల ఘనకార్యం. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యం దూరం చేశారు. ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. దానికి చంద్రబాబు నాయుడు హయాంలో బీజంపడిరది. ఇది రాజకీయంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉపయోగపడిరది. కాని వైఎస్ కూడా అదే దారిలో నడిచారు. ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన మరిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో ప్రభుత్వ వైద్యం ఐసియూకి చేరేదారా వెళ్లింది. ఆరోగ్య శ్రీ అనే పధకం తెచ్చి, పేదలకు కార్పోరేట్ వైద్యం అందించారు. లక్ష్యం మంచిదే కాని, అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే బాగుండేది. కాని ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు వేలాది కోట్ల రూపాయలు దోచిపెట్టారు. అదే సొమ్మును ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి, వైద్యుల నియామకాలకు, సౌకర్యాల కల్పనకు వినియోగిస్తే ఇప్పటికే మరింత ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వచ్చేది. కాని అలా చేయలేదు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు దూరం చేయడానికే ప్రాదాన్యమిచ్చారు. ఒక్క రూపాయికే వైద్యం చేసినట్లు చెప్పుకున్న వైఎస్ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణను పక్కనపెట్టి, ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలిసేందుకు మార్గం వేశారు. ఆరోగ్య శ్రీ సేవల పేరుతో కోట్లాది రూపాయల బిల్లులు వసూలు చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర వైద్య సేవలకు ప్రజలనుంచి జలగల్లా వసూలు చేసుకొని, బ్రాంచిల మీద బ్రాంచీలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రావడం, కేసిఆర్ ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ ప్రజా వైద్యానికి మంచి రోజులొచ్చాయి.
ప్రతి జిల్లాకు ఒక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తోంది. వరంగల్ లో సుమారు 2వేల పడకల ఆసుపత్రి నిర్మాణం వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. త్వరలో వాటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో కరోనా సమయంలో టిమ్స్ అందుబాటులోకి తెచ్చారు. కరోనా ఉచిత వైద్యం పేదలకు అందించారు. కొన్ని వందలాది బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశారు. పేదల కాలనీలకే వైద్యం తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్దాసుపత్రి నిర్మాణం జరిగింది. ఇప్పటికే అనేక జిల్లాలో వైద్య శాలలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నియోకవర్గ స్ధాయిలో ముప్పై పడకల ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. పేదలకు ప్రభుత్వ వైద్యం ఎంతో అందుబాటులోకి వచ్చింది. తాజాగా భూపాల పల్లిలో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యానికి వెళ్లిన గర్భిణీకి బస్సులో పురిటి నొప్పులు వస్తే, ప్రభుత్వ వైద్యులు ప్రసవం చేసి, తల్లి బిడ్డను రక్షించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలకు ఒక మార్గ దర్శకంగా మారాయి. ప్రజలకు వైద్య సేవల్లో ప్రభుత్వ వైద్యులు ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారో ఈ ఒక్క సంఘటనతో తేలిపోయింది. ప్రజల్లో భరోసా నింపింది. తెలంగాణలో ప్రభుత్వ వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ వైద్యం పేదలకు మరింత అందుబాటులోకి వస్తోంది. పల్లెలతోపాటు, మండల, నియోకవర్గ, జిల్లా స్ధాయిల్లో మెరుగైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి తోడు మాతా శిశుసంరక్షణ కేంద్రాల పేరుతో ఏర్పాటైన ఆసుపత్రుల్లో గర్భిణీలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో మహిళ గర్భం దాల్చిన నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు నెల నెల పరీక్షలకు వెళ్లేవారు. అవి జలగల్లా ఫీజులు వసూలుచేసేవి. పైగా నార్మల్ డెలివరీ చేస్తే, ఫీజులు వసూలు చేయడం కుదరదని, ప్రజలను డెలివరీ కష్టమౌతుందని చెప్పి, సిజేరియన్లు చేసేవారు. వేలాది రూపాయలు వసూలు చేసేవారు. కాని ఇప్పుడు పరిస్ధితి మారింది. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేవారే కరువయ్యారు. నెల నెల వైద్య పరీక్షలకు కూడా గర్భిణీలు ప్రభుత్వాసుత్రికే వెళ్తున్నారు. ప్రతి నెల రికార్డు స్ధాయిల్లో డెలివరీలు చేస్తున్నారు. తల్లి బిడ్డలను సంరక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ అయితే తప్ప, అన్నీ నార్మల్ డెలివరీలేచేస్తున్నారు. దాంతో మహిళకు మరింత ఆరోగ్య భద్రత చేకూరుతోంది. కేసిఆర్ కిట్‌తోపాటు, అబ్బాయి పుడితే రూ.12 వేలు, అమ్మాయి పుడిత రూ.13వేలు నగదును అందజేస్తోంది. కేసిఆర్ కిట్‌లో బేబీ ఆరోగ్య సంరక్షణ కోసం ఏడాదికి అవసరమైన వస్తువులన్నీ అందజేస్తారు. డెలివరీ అయిన వారిని ఉచిత రవాణ సౌకర్యం ఏర్పాటు చేసి, ఇంటికి చేర్చుతున్నారు. ఇలాంటి వైద్య సేవలు కనీసం ఊహించామా?
వైద్య శాఖ మంత్రిగా హరీష్‌రావు బాద్యతలు స్వీకరించిన నుంచి వైద్య రంగంలో వినూత్నమైన మార్పులే కాదు, ఊహించని విజయాలు చూస్తున్నాం. సహజంగా హరీష్‌రావు అంటేనే పరి రాక్షసుడు అని ముద్దుగా పిలిచుకుంటారు.ఆయన కాలుకు బలపం కట్టుకొని తిరడం అన్నది అందరికీ తెలిసిందే. అలాంటిది వైద్యం రంగం రూపు రేఖలు మార్చకుండా ఆయన ఊరుకుంటాడా? ప్రతి జిల్లా తిరుగుతున్నారు. ఆసుపత్రులు సందర్శిస్తున్నారు. పర్యటనలు సాగిస్తూ, రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకుంటున్నారు. ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ప్రజలనుంచి వ్యక్తమౌతున్న విషయాలను అమలు చేస్తున్నారు. ఆసుపత్రులకు అవసరమైన సౌకర్యాల కల్పన చేపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య చికిత్సలు మరింత అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతి జిల్లాలో వంద పడకల ఆసుపత్రుల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. వైద్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఆసుపత్రికి 23 మంది డాక్టర్లు,అందులోనూ స్పెషలిస్టులను నియామకం చేశారు. మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ స్కానింగ్ సెంటర్లు, ఇతర అన్ని రకాల పరీక్షల పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. టెస్టులకు , చికిత్సలకు అవసరమైన ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ప్రజలు రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల టెస్టులను కూడా ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉచితం చేస్తున్నారు. త్వరలో జిల్లాల్లోనూ కూడా కార్డియాటిక్ వైద్య సేవలు, మోకాలు శస్త్ర చికిత్సలు, ఈ అండ్ టీ సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. అందుకు వైద్యుల నియామకాలు కూడా పూర్తి చేశారు. చాలా చోట్ల ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇవి ఇలా వుంటే ప్రభుత్వాసుపత్రిలో వైద్యం విషయంలో ఏదైనా ఇబ్బంది ఎదురై, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన వారికి ఎల్‌వోసి రూపంలో లక్షలాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలా ఎంతో మందికి వైద్య సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. అంతే కాకుండా అప్పో,సొప్పో చేసి, ప్రైవేటు వైద్యం చేయించుకున్న పేదల జీవితాలకు మళ్లీ చేయూత నందించేందుకు పెద్దఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి గతంలో ఎన్నడూ చూడని విధంగా సాయం అందిస్తున్నారు. ఓ వైపు పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో మేలైన వైద్యం అందుబాటులోకి తేవడమే కాకుండా, ప్రైవేటులో వైద్యం అవసరమైన సందర్బాలలో కూడా ప్రజలను ఆదుకుంటూ, ప్రజారోగ్యానికి , జీవితానికి భరోసా కల్పించడం అన్నది గతంలో ఎన్నడూ లేదు. ప్రభుత్వ డాక్టర్లూ…ఈ ఒక్క పనిచేస్తారా? ప్రజల్లో ప్రభుత్వ వైద్యం మీద మరింత నమ్మకం కలగాలంటే ఒక్క పనిచేయండి. ప్రభుత్వ ఆసుపత్రి అంటే కేవలం పేదలే కాదు, అన్ని వర్గాల ప్రజలు రావాలి. అప్పుడే ప్రజలకు మరింత భరోసా కల్గుతుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎప్పుడో అప్పుడు అరుదైన చికిత్సలు చేయాల్సిన అవసరం రావొచ్చు. వాటిని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేయొచ్చు. వ్యక్తుల ప్రాణాలకాపాడొచ్చు. అలాంటి అరుదైన సంఘటనల విజయాలపై ఎప్పటికప్పుడు కనీసం మీడియాకు సమాచారం అందించండి. దాంతో మన ప్రభుత్వాసుపత్రిలో అలాంటి వైద్య సేవలు కూడా అందుతున్నాయన్న భరోసా ప్రజల్లో కల్గుతుంది. ప్రభుత్వం మీ మీద పెట్టుకున్న ఆశలకు న్యాయం జరుగుతుంది. పేద ప్రజలకు మరింత ప్రభుత్వ వైద్యం అందుతుంది. ప్రైవేటు ఆసుపత్రులు నడుపుకునే వైద్యులు కూడా మేం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు చేస్తామని ముందుకొచ్చేందు వీలుపడుతుంది. ప్రైవేటు దోపడి ఆగుతుంది. పేదల జీవితాలకు అండగా నిలిచినట్లౌతుంది. ఇప్పుడున్న కాలంలో వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి సామాన్యుడు వెళ్తే జీవితంలో సంపాదించుకున్నదంతా ఊడ్చుకోవడం తప్ప మరేం లేదు. వైద్యులు దేవుళ్లు… ప్రభుత్వ వైద్యులు అంతకన్నా ఎక్కువ అని కొలువబడాలి. అందుకు మీరే ప్రభుత్వాసుపత్రులను కాపాడాలి. ప్రజలకు ప్రాణాలు పోయాలి.
డిప్యూటి తహశీల్దార్ సివిల్ సప్లై సర్కిల్ డి ఎం అబ్దుల్ రజాక్
మొగుళ్ళపల్లి నేటిధాత్రి
పౌర సరఫరాల కమిషనర్ హైదరాబాద్ ఆదేశముల మెరకు మొగుళ్ళపల్లి మండలము లోని మహాత్మా గాంధీ జ్యోతి బాబు పూలే బాలుర వసతి గృహమును తనిఖీ చేసిన డిప్యూటి తహశీల్దార్ సివిల్ సప్లై అధికారి. ఈ తనిఖీ లో హాస్టల్ లో విద్యార్థులు భోజనం చేసే బియ్యం నిలువ, బియ్యం నాణ్యత ను, విద్యార్థుల హాజరు పట్టికను భోజనం తీసుకున్న విద్యార్థుల సంఖ్య ను డిప్యూటి తహశీల్దార్ సివిల్ సప్లై చిట్యాల సర్కిల్ డి ఎం అబ్దుల్ రజాక్ పరిశీలించి హాస్టల్ లో విద్యార్థులకు సరైన నాణ్యత తో భోజనం అందిస్తున్నారని కానీ నిలువ ఉన్న బియ్యంలో 16 బియ్యం బస్తాలలో పురుగులు ఉన్నవని గుర్తించి వాటిని మార్చుటకు చూచించారు.
`విద్యా, ఉపాధి అవకాశాలు రాకుండా, లేకుండా చేస్తున్న కమీషనర్ వ్యవహార శైలిపై దివ్యాంగులతో చర్చలు జరపండి?
`కోట్లాది రూపాయల మాయం కథలు వెలికితీయండి?
హైదరాబాద్,నేటిధాత్రి:
సబ్బుబిల్ల, కుక్కపిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితకనర్భం అని శ్రీశ్రీ అన్నాడు. కాదేదీ అవినీతికనర్హం…ఏ శాఖైతేనేమీ…అని కొందరు అవినీతి అధికారులు నిరూపిస్తున్నారు. దివ్యాంగుల కోసం కేటాయించిన సొమ్మును కూడా మింగేయడానికి వెనుకాడడం లేదని సమాచారం. ఏళ్ల తరబడి తిష్ట వేసుకొని కూర్చొని, శాఖలో లొసుగులన్నీ ఆసరా చేసుకొని, ప్రశ్నించడానికి వీలులేని స్ధితిని కల్పించుకుంటున్నారు. స్ధాన చలనం లేకుండా, స్ధాన బలం పెంచుకొని, శాఖలో అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. వినడానికే విడ్డూరంగా వుంది. అంతకన్నా దౌర్భాగ్యముంటుందా? దుర్మార్గం మరొకటి వుంటుందా? గతంలో దివ్యాంగులకు నెలకు రూ.500 పెన్షన్ అమలయ్యేది. అది అప్పుడు ఎంతో గొప్ప. కాని తెలంగా ణ వచ్చాక వారి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు తెచ్చే ప్రయత్నం చేసింది. తెలంగాణ కోసం దివ్యాంగులు కూడా చేసిన పోరాటం మరువలేనిది. తెలంగాణ సాధనలో వారి పాత్ర తక్కువేం కాదు. ఎంతో మంది దివ్యాంగులు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వాళ్లున్నారు. అలాంటి వారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పెన్షన్ రూ.3500 వస్తోంది. దివ్యాంగులు ఎవరి మీద ఆధారపడి, ఎవరి దయాక్షిణ్యాల మీద బతకాల్సిన పనిలేకుండా వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఫించన్ పెంచారు. ఇదిలా వుంటే తెలంగాణలో దివ్యాంగులైన విద్యార్ధులు, స్వయం ఉపాధి కల్పన చేసుకునేవారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయంలో ఆ శాఖ కమీషనర్ కోతలు విధించడమే కాదు, అమలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె దివ్యాంగులకు అందిస్తున్న ట్రైకిల్స్, ఆక్టివాలలో చెప్పే లెక్కలకు, అందిస్తున్న వాటికి తేడా వుంటుందని విమర్శిస్తున్నారు. కమీషనర్ శైలజ వ్యవహార శైలితో విసిగి వేసారిన దివ్యాంగులు దీక్షలు చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. మంత్రి స్పందించని పక్షంలో దీక్షలు చేస్తున్న దివ్యాంగులదే తప్పని స్వయంగా మంత్రే నిరూపించినట్లౌవుంది. ఆ అపవాదు మంత్రి భరిస్తారా? లేక కమీషనర్ చేస్తున్న ఆగడాలను అడ్డుకుంటారా? ఆమెను తప్పిస్తారాలేదా? అన్నది తేలాల్సివుంది. కొన్ని లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశమిది. రాజకీయ పరంగా కొన్ని వేల కుటుంబాలను ప్రభావితం చేసే అవకాశం వుంది. ఎవరి స్వార్ధంవాళ్లు చూసుకుందామనుకుంటే, టిఆర్‌ఎస్ పార్టీకి మొదటికే మోసం తెచ్చిపెట్టినట్లౌంది. అందుకే మంత్రి స్పందన కోసం కూడా దివ్యాంగులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి దివ్యాంగుల కోసం ఎంత చేస్తున్నా, మంత్రి, కమీషనర్ పట్టించుకోవడం లేదన్న అపవాదును మోయాల్సివుంటుంది. ఇక ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్ధకు హెడ్ అయిన చీఫ్ సెక్రెటరీ కూడా దివ్యాంగుల ఆందోళన వైపు ఓసారి చూడాల్సిన అవసరం వుంది. కమీషనర్ చేతి వాటం మూలం అవినీతి తారా స్ధాయికి చేరుకుంటోందని అంటున్నారు. పైగా కమీషనర్ కార్యాలయంలో సిసి కమెరాలు ఏడాది కాలం పనిచేయకుండా పోవడం వంటివి వాటి వెనుక అనేక రహస్యాలు దాగి వున్నాయని దివ్యాంగులు అంటున్నారు. కమీషనర్‌కు ఎదురైన దివ్యాంగులు నిలదీసే అనేక వ్యవహారాలు సిసి కెమెరాల్లో రికార్డు కాకుండా ఏడాది కిందటే వాటిని తొలగించారని విమర్శలున్నాయి. వందలాది వెయికిల్స్ కొనుగోలు చేసినట్లు లెక్కలున్నా, దివ్యాంగులకు అందిన వాటికి, సరఫరా అయిన వాటికి లెక్కల్లో పొంతన లేదని తెలుస్తోంది. వాటిపై కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. 2016 నుంచి ఇంతవరకు ఎలాంటి ఆడిటింగ్ కూడ జరగలేదని తెలుస్తోంది. ప్రొడక్షన్ సెంటర్ ఎందుకు మూసేయాల్సివచ్చింది? ఇలాంటి అనేక విషయాలు వెలుగులోకి రావాల్సిన అవసరం వుంది. అందుకే సంబంధిత మంత్రితోపాటు, చీఫ్ సెక్రెటరీ కూడా జోక్యం చేసుకోకపోతే, దివ్యాంగులకు న్యాయం చేసేవారే వుండరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషనర్ శైలజ నెలకు కనీసం నాలుగు రోజులు కూడా విధులకు హజరు కారు. దివ్యాంగులకు అందుబాటులో ఉండరు.
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జిల్లాలనుంచి అనేక సార్లు రావడం వారికి ఎంతో కష్టమైన పని. సుమారు ఓ పదిసంవత్సరాల నుంచి కమీషనర్ ఏ ఒక్క హాస్టల్ సందర్శించిన దాఖలాలు లేవు. దివ్యాంగుల హస్టల్ విద్యార్ధులు కోరుకునేది రెండే అంశాలు. ఒకటి వారికి రవాణ వసతి, భోజన వసతి. ఇంతకు మించి వాళ్లు కోరుకునేది ఏమీ వుండదు. వాటిని కూడా పట్టించుకోకపోతే ఎలా? వారికి వాహనాలు అందించడంలో అలసత్వం ఏల? పైగా దివ్యాంగులకు అందజేయాల్సిన ట్రై సైకిల్ విత్ బ్యాటరీ కమీషనర్ రూ. 40వేలుతో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కాని అవే ట్రైసైకిల్స్ శాఖకు చెందిన ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్‌లో తయారు చేస్తే కేవలం రూ.29వేలే ఖర్చవుతుందట. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో రెండు సెంటర్లున్నాయి. వికాలంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ సెంటర్ నిర్వహణ జరగాలి. కాని అందులో పనిచేసే ఉద్యోగులను డిప్యూటేషన్ మీద ఇతర శాఖలకు పంపించారని సమాచారం. ఇలా ఉద్యోగులను ఇతర శాఖలకు పంపించి, ట్రైసైకిళ్లను టెండర్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అలా టెండర్ ద్వారా కొనుగోలు చేస్తే ఇంతా తక్కువ ధరకు ట్రైసైకిల్ రావాలి. కాని రూ.40వేలు చెల్లిస్తున్నారు. ఇదిలా వుంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒక ట్రైసైకిల్ అదే విద్యార్ధులకు అందజేయాలి. కాని అందజేసిన సందర్భాలే కనిపించడం లేదు. కాని రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయంటున్నారు. ఇక కాలేజీ విద్యార్ధులకు ట్రైవీల్ ఆక్టివా అందజేయాలి. కాని ఏడాదికి వంద మాత్రమే అందజేస్తూ మిగతా వారికి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని చెబుతున్నారు. వికలాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డి వచ్చాక మొదటిసారి ఒకే ఏడాదిలో 900 ఆక్టివాలు అందజేయడం జరిగింది. కాలేజీవిద్యార్థులందరికీ ఆక్టివాలు ఇవ్వాల్సిన అసవరం వుంది. కాని అది అమలు చేయడంలేదు. 2014 నుంచి ట్రైసైకిల్ సెంటర్‌ను పూర్తిగా మూసేయడం జరిగింది. గ్రామీణ విద్యార్ధులకు బ్యాటరీ ట్రైసైకిల్ కావాలని కోరుకుంటారు. వాళ్లు కమీషనర్ కార్యాలయం చుట్టూ తిరిగీ, తిరిగి విసిగిపోతున్నారు. శాఖకుచెందిన ప్రొడక్షన్ సెంటర్ మూసేసిన తర్వాత ఏటా ఓ 500 వందల ట్రైసైకిల్స్ అర్డర్ పెడితే, ఎన్ని ట్రైసైకిల్స్ వచ్చాయన్నదానిపై ఎక్కడా లెక్కలుండవు.
వాటిపై ఆడిటింగ్ అన్నది ఎప్పుడో మర్చిపోయారు. పైగా ట్రైసైకిల్ ట్రాన్స్‌పోర్టుకు కూడా కమీషనర్ రూ.500 అదనంగా చార్జిలు వేసినట్లు కూడా లెక్కలున్నాయి. ఆక్టివా కొనుగోలు గోల్ మాల్ అంతా ఇంతా కాదు. మార్కెట్‌లో ఆక్టివా ధర రూ.69వేలు వున్నట్లు తెలుస్తోంది. కాని కమీషనర్ ఒక్కొ ఆక్టివాకు రూ.89వేలు చెల్లించినట్లు రసీదులున్నాయి. పైగా వీటి ట్రాన్స్‌పోర్టు చార్జీల పేరుతో రూ.10వేలు అదనంగా లెక్కలు చూపిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా విచిత్రమేమిటంటే దివ్యాంగులకు అందించే ఆక్టివాలకు రోడ్ ట్యాక్స్ వుండదు. జిఎస్టీ లేదు. కాని ఈ రెండు ట్యాక్స్‌లు కూడా కమీషనర్ లెక్కల్లో చూపుతోంది. గత ఏడెనమిది సంవత్సరాలుగా ఒకే వ్యక్తికి టెండర్ ఇవ్వడం జరుగుతోంది. సుశీల్ అనే కంపనీకే ప్రతిసారి ఇస్తూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే 500 ఆక్టివాలు కొనుగోలు చేసినట్లు లెక్కలు వున్నా, అసలు పంపిణీ చేసేది 350 మించి వుండవని తెలుస్తోంది. ఇలా వికలాంగుల సంక్షేమ శాఖను కమీషనర్ లూటీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దివ్యాంగుల దినోత్సవం పేరుతో పెద్దఎత్తున సమావేశాలు నిర్వహించి, హంగూ ఆర్భాటం చేయడంతో ఆమె దివ్యాంగుల శాఖకు కోసం ఎంతో శ్రమిస్తోందన్న సంకేతాలు పంపుతుందటున్నారు. అంతే కాదు ఇలాంటి ఫంక్షన్లు మళ్లీ కాంట్రాక్టర్ల చేతనే నిర్వహించి, ఆ ఖర్చు కూడా తన ఖాతలో వేసుకుంటుంటుందని సమాచారం. ఇలా ఏడాదిలో వృద్దుల దినోత్సవం, దివ్యాంగుల దినోత్సవం, ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమాల పేరుతో జరిగే కార్యక్రమాలకు కూడా పెద్దఎత్తున ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తుందని అంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో దివ్యాంగులు, వయసు మళ్లీన వారు పోలింగ్ కేంద్రానికి చేరవేసే వీల్ చైర్ల కుంభకోణం కూడా వెలుగుచూసింది. ఒక్కొ వీల్ చైర్ రూ.3500 వుంటుంది. కాని ఆ వీల్ చైర్‌ను రూ.4800కు కొనుగోలు చేసినట్లు లెక్కలున్నాయి. ఈ కేసు ఇప్పటికీ లోకాయుక్తలో కొనసాగుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు ఆడిటింగ్ జరక్కుండా కమీషనర్ అడ్డుకుంటోందని తెలుస్తోంది. ఆడిటింగ్ విభాగంతో లోపాయి కారి ఒప్పందంతో ఆడిటింగ్ జరగడం లేదని సమాచారం. ఇలా ఆడిట్ జరకపోవడం మూలంగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. తన స్వార్ధం కోసం, తాను చేసిన గోల్ మాల్ అంతా బైటపడుతుందని, దివ్యాంగులకు నిధులు రాకుండా కమీషనర్ చేస్తోందని విమర్శలున్నాయి. 2016 నుంచి కొత్తగా సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో ఎంతో మంది విద్యార్దులు అడ్మిషన్లు కోల్పోయారు. 2016 చట్టం ప్రకారం 21 రకాల దివ్యాంగులు గుర్తింపు పూర్తి చేయాలి. వారికి సర్టిఫికెట్లుజారీ చేయాలి. కాని ఆ పని కూడా పూర్తి కాలేదు. నిధులు గోల్ మాల్ మాత్రం జరుగుతున్నాయి. పనులు మాత్రం కావడంలేదు. దివ్యాంగులకు న్యాయం జరగడం లేదు. ఇక శాఖలో రిటైర్డ్ అయిన వారిని తిప్పించుకుంటూ వారి ఉసురు కూడా కమీషనర్ పోసుకుంటున్నట్లు విమర్శలున్నాయి. 20 మంది పెన్షన్ దారులను కూడా ఇబ్బందులకు గురి చేయడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు కమీషనర్ మూలంగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం దివ్యాంగులు సంక్షేమ శాఖపై దృష్టిపెట్టకపోతే పెద్దఎత్తున వ్యతిరేకత ఎదరుయ్యే ప్రమాదం లేకపోలేదు.
మొరంచ పల్లి ఎస్ ఎం కొత్తపల్లి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మొగుళ్ళ పల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన పంచనేని మనోహర్ రావు సుమారు (55) తండ్రి చంద్రయ్య చిట్యాల మండలం నైన్ పా క గ్రామానికి చెందిన పాలడుగుల సతీష్ (32) తండ్రి బక్కయ్య ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేస్తున్న మనోహర్ రావు మరియు ఎదురు వాహన వ్యక్తి సతీష్ డి కొని అక్కడికక్కడే మరణించారు. మృతుల కుటుంబ సభ్యులకు ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో అందుబాటులో ఉన్న స్థానికులు హుటాహుటిన 108 కి కాల్ చేసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతుల కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్తితి తెలియాల్సి ఉంది.
బతుకమ్మ విశిష్టతను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచం నలుదిశలా చాటి చెప్పారు: ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర
ముఖ్యమైన పండుగల సందర్భంగా మహిళలకు పెద్ద ఎత్తున చీరలను బహుకరిస్తున్నం:ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్షా 116 రూపాయలు సాయం చేస్తున్నం:ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర
కేసీఆర్ సుపరిపాలనలో మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నరు:ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర
ఖమ్మం:ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.
మహిళల భద్రత, సంక్షేమం,ఉన్నతికి పలు పథకాలు రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు.బతుకమ్మ పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని 10వ డివిజన్, జిల్లాలోని రఘునాథపాలెంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో టిఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులతో కలిసి రవిచంద్ర మహిళలకు చీరలు బహుకరించారు.బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భాలలో కేసీఆర్ పేద వర్గాల వారికి దుస్తులు,చీరలను బహుకరిస్తున్నారని తెలిపారు.తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నేతన్నలకు చేతినిండా పని కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం కూడా ఈ చీరల పంపిణీ పథకంలో ఒక భాగమన్నారు.ఈ ఏడాది ఇందుకోసం 350 కోట్లు ఖర్చు చేసినట్లు,ఈ బతుకమ్మతో కలిపి సుమారు 5కోట్ల 90లక్షల చీరలు అందించినట్టవుతుందని వద్దిరాజు వివరించారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్..బతుకమ్మ పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ,దీని విశిష్టతను,మన సంస్కృతి,సంప్రదాయాలను ప్రపంచం నలుదిశలా చాటి చెబుతున్నారన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయలు సాయమందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.దీంతో,బాల్య వివాహాలు పూర్తిగా తగ్గడమే కాక,మహిళల కోసం పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన గురుకులాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారని రవిచంద్ర చెప్పారు.మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో నేరాలు, ఘోరాలు పూర్తిగా తగ్గిపోయాయని వివరించారు.
హనుమకొండ జిల్లా గీసుగొండ మండలం లోని 18 మంది లబ్దిదారులకు 18,02,088 రూపాయాల కళ్యాణ లక్ష్మి చెక్కులను పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు హనుమకొండలోని అయన నివాసంలో అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… పేద ఆడపడుచులకు అండగా సీఎం కేసీఆర్ గారు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే భారంగా తల్లిదండ్రులు భావిస్తే, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆలోచనతో ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులు దైర్యంగా చేస్తున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెడుతుంటే… ప్రతిపక్షాలు ఓర్వక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గ్రామాల్లో తిరిగే ప్రతిపక్ష నాయకులను నిలదీయాలన్నారు. బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏ సంక్షేమ పథకాలు ఆమలవుతున్నాయో బిజెపి నాయకులను ప్రశ్నించాలన్నారు. ఇంకా ఇలాంటి గొప్ప పథకాలు ఎన్నో రావాలంటే సీఎం కేసీఆర్ గారే మళ్ళీ అధికారంలో ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
`దివ్యాంగుల సంక్షేమ శాఖకు కమీషనర్ గా వుండి వారి సంక్షేమం పట్టకపోతే ఎలా?
`కమీషనర్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఎందుకు జరుగుతోంది?
`హక్కుల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం చూశాం…మొదటి సారి కమీషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు?
`ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి?
`నిధులు మంజూరు చేశామని చేతులు దులుపుకోవద్దు?
`దివ్యాంగుల సంక్షేమం పట్టని అధికారుల పని కూడా పట్టండి?
`కనీసం దివ్యాంగుల మీద జాలి లేని కమీషనర్ ను ముందు తప్పించండి?
`దివ్యాంగుల సొమ్ము కూడా తింటున్న కమీషనర్ ను సాగనంపండి?
`నెలలో నాలుగు రోజులు కూడా పని చేయని కమీషనర్ వుండి ఏం లాభం?
`ఒక్కసారి రోడ్డెక్కిన దివ్యాంగుల గోడు వినండి!
`కమీషనర్ దివ్యాంగుల మీద వేధికల మీద జాలి నటించాల్సిన అవసరం లేదు?
`వారి న్యాయమైన హక్కులు అమలు చేస్తే చాలు!
హైదరాబాద్,నేటిధాత్రి:
పుట్టుకలోనే దేవుడు అన్యాయం చేసి, పుట్టిన తర్వాత సమాజం అన్యాయంచేసి, కళ్లులేక , కాళ్లు లేక, చేతులు లేని దివ్యాంగుల సమస్యలు మాటల్లో చెప్పలేనివి. వారు అనుభవించే వ్యధలు రాతలకందనివి. మన చుట్టూ కొందరు చూడలేకపోతున్నారు. రంగుల ప్రపంచం చూడలేక, చీకటి జీవితాలను జీవితాంతం అనుభవిస్తున్నారు. అయినా ఆత్మస్ధైర్యంతో ప్రతి అడుగును చాలెంజ్ చేసుకొని జీవితంలో పరుగెడుతున్నారు. నడవాలని వున్నా, నడిచే అవకాశం లేక, నడిపించేవారు లేక జీవితం అవిటితనంతో వెళ్ల దీస్తున్నవారు ఎంతో మంది వున్నారు. చేతులు లేక చేవలేక, చేతులతో చేసుకోవాల్సిన పనులు కాళ్లతో చేసుకుంటూ, జీవితం చేతికందనిదైనందుకు కన్నీళ్లను కూడా తుడుచుకోలేని ధీన స్ధితిలో బతుకుతున్నారు. ఇలాంటి పదాలు వింటుంటేనే మనసు చివుక్కుమంటోంది. అలాంటిది అనుభవిస్తున్న వారి జీవితాలు ఎలా వుంటాయో! కళ్లున్న సమాజం కుళ్లును పక్కన పెట్టి ఒక్కసారి చూడండి? నడవలేక , చేతులు పనిచేయక కొందరు నానా తిప్పలు పడుతుంటే జాలి లేదా? పాలకులు అయ్యే పాపం అన్నా, అధికారులు పట్టీపట్టనట్లు వుంటే వాళ్ల గోడు ఎవరికి చెప్పుకోవాలి. ఎవరు పట్టించుకోవాలి. వారి గోడు ఎవరు తీర్చాలి. ఎందుకు పుట్టామా? అని ఏడుస్తూ …ప్రతి క్షణం కుంగిపోతూ…నిలబడి బతకలేమా? అని తమను తాము నిందించుకుంటూ, పుట్టించిన దేవుణ్ని శపించుకుంటూ, కన్నవాళ్లు పడుతున్న గోసను చూసుకుంటూ బతుకుతున్నవారు ఎంతో మంది మన చుట్టూ వున్నారు. వారి గురించి అయ్యో అనడం అందరూ చేసేదే! కాని చేయూతనిచ్చేవారేరీ! బాధ్యత కల్గిన వారు అనుసరిస్తుదేమిటి? వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సినస్ధానంలో కూర్చున్నవారు చేస్తున్నదేమిటి? మనలో ఏదో ఒక సమస్య అనుకోకుండా ఎదురై, ఓ క్షణం పాటు కాళ్లు చేతులు ఆడకపోతేనే విలవిలలాడిపోతాం… జీవితం అంతా శూన్యంగా అనిపిస్తుంది. బతుకంటే భయం వేస్తుంది. రేపటి గురించి అప్పుడే దిగులు మొదలౌతుంది. అలాంటిది జీవితాంతం మా బతుకులింతే అని కనుగుడ్డు తెరిచిన నాటి నుంచే అనుభించేవారి పరిస్ధితి ఎలా వుంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? కాలుకో చేయికో దెబ్బ తగిలితే పడే ఇబ్బందినే నరకంగా భావిస్తాం…అలాంటిది కండ్లులేక,కాళ్లు లేక, చేతులు పనిచేయక, నడుము వంగి పుట్టకతోనే నరకాన్ని తోడు తెచ్చుకున్నవారిపట్ల కనీస మానవత్వం ప్రదర్శించాలి. వారిని అక్కున చేర్చుకోవాలి. వారికి చేయూతనివ్వాలి. ఆకలి తీర్చాలి.నీడనివ్వాలి. వారి జీవితాలకు భరోసా కల్పించాలి. ఇది కదా! ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నతమైన కుర్చీలలో కూర్చున్నవారు చేయాల్సింది! నిజానికి ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏ దివ్యాంగుడు సమాజం నుంచి సానుభూతి కోరుకోవడంలేదు. వారి జీవితాలను కూడా చాలెంజ్‌గా తీసుకునేలా ప్రోత్సహించేవారు కావాలనుకుంటున్నారు.
అందుకే అధికారులు దివ్యాంగుల మీద వారి దయాదాక్షిణ్యాలు చూపించమని వేడుకోవడం లేదు. వాళ్లు కూడా జీవితాలాను ఛాలెంజింగ్ తీసుకుంటామనే అంటున్నారు. అందుకు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలు వారికి అందిస్తే చాలు…వారిని అందాల్సిన న్యాయమైన హక్కులను అమలు చేస్తే చాలు…ప్రభుత్వాలు అందజేస్తున్న సౌకర్యాలు సకాలంలో కల్పిస్తే చాలు…దివ్యాంగుల కోరికలేమో! గొంతెమ్మ కోరికలు కాదు…ప్రభుత్వాలు కల్పించిన అవకాశాలు కల్పించమంటున్నారు. వాటిని అమలు చేయమంటున్నారు. ఇది దివ్యాంగుల సంక్షేమ శాఖ కమీషనర్ శైలజకు నచ్చడం లేదట! తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కమీషనర్ శైలజ మూలంగా దివ్యాంగులకు అందాల్సినవి పధకాలు చేకూరకుండా, చేయూత లేకుండా, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందకుండా, న్యాయమైన హక్కులు పొందకుండా పోతున్నామని గోడు వెల్లబోసుకుంటున్నారు.గోస పడుతున్నారు? దివ్యాంగులు నిరసన దీక్షలు చేస్తున్నారు. కమీషనర్ అర కొర ప్రతిపానలు పంపిస్తూ, దివ్యాంగులకు న్యాయం చేయడం లేదంటున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు అందకుండా చేస్తున్నారని, వారి జీవితాలతో శైలజ ఆటలాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తమ జీవితాలకు, ఆమె చేసే ఉద్యోగానికి కూడా న్యాయం చేయకుండా కమీషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. అంతే కాదు వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దివ్యాంగులు నిరసన చేస్తున్న సమయంలో పిలిచి వారి సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి, సెలవులు పెట్టి వెళ్లిపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా ఆమెకు దివ్యాంగుల మీద వున్న చిత్తశుద్ది అని అడుగుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలు శైలజ అమలు చేయడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ జీవోలు కూడా అమలు చేయలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల వసతీ గృహాలు కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు కమీషనర్ దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లినా, వాటిని పరిష్కరించలేదని, కనీసం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రంలోని ఏ ఒక్క వసతీ గృహాన్ని ఆమె సందర్శించలేదని అంటున్నారు. ఈ విషయంలో హైకోర్టు కూడా సీరియస్ అయినా కమీషనర్ కదలకపోవడం గమనార్హం. గతంలో ఇలాంటి పరిస్దితి ఎప్పుడూ లేదని వాపోతున్నారు. దివ్యాంగుల హక్కులను కాపాడాల్సినస్ధానంలో వున్న శైలజ వారి హక్కులను కాలరాస్తోందని ఆరోపిస్తున్నారు. ఓ వైపు దివ్యాంగులు ఇంత కాలం తమ సమస్యలను పరిష్కరించమని చెప్పీ, చెప్పి విసిగిపోయి, ఇక ఆందోళనకు దిగితే, కమీషనర్ సెలవులు పెట్టి వెళ్లిపోతే సమస్య పరిష్కారమౌతుందా? ఓ వైపు దివ్యాంగులు నిరసన వ్యక్తం చేస్తుంటే వారిని పోలీసులతో అరెస్టులు చేయించడం, వారిని బెదిరిస్తున్నట్లు విమర్శలున్నాయి. జివోనెం.8,10 ప్రకారం దివ్యాంగుల పట్ల ఉద్యోగులు, సమజం ఎలా వుండాలో సూచించే ప్రభుత్వ ఉత్తర్వులు తెలిసిన కమీషనరే దివ్యాంగులపై పోలీసులను ఉసిగొల్పుతున్నట్లు విమర్శలున్నాయి. అంతే కాదు దివ్యాంగులకు కమీషనర్ కార్యాలయంలో ఎదురౌతున్న చీత్కారాలు, దాష్టికాలు వెలుగులోకి రాకుండా ఏడాది కాలంగా సిసి కెమెరాలు పనిచేయకుండా చేశారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అందాల్సిన అనేక పథకాలలో ఎంతో అవినీతి జరుగుతోందని వాటిపై ప్రభుత్వం విచారణ జరపాలని కోరుతున్నారు. నెలలో కనీసం 4 రోజులు కూడా సరిగ్గా కార్యాలయానికి రాని కమీషనర్ శైలజ దివ్యాంగుల జీవితాలను ఏం పట్టించుకుంటుందని అంటున్నారు.సహజంగా సమాజంలో ఏ వర్గమైన ప్రభుత్వాల మీద ఆరోపణలు చేస్తాయి. విమర్శలు గుప్పిస్తాయి.
కాని కమీషనర్‌ను తొలగించాలని, వెంటనే కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్లు చేయడం చాలా అరుదు. అంటే దివ్యాంగుల సంక్షేమ శాఖ కమీషనర్ శైలజ వ్యవహార శైలి ఎలా వుందో ఈ ఒక్క ఆందోళనతో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సిన అసవరం వుంది. ప్రభుత్వ నిర్ధేశిత లక్ష్యాలను, దివ్యాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు,అవకాశాలను మృగ్యం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న కమీషనర్ వ్యహారంపై వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరం వుంది. అసలు దివ్యాంగుల సంక్షేమ శాఖకు కమీషనర్‌గా వుండి వారి సమస్యలు పట్టని కమీషనర్ వుండి ఏం లాభం? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే నిధులను కూడా దుర్వినియోగం చేస్తూ, కమీషనర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. నేటిధాత్రి పరిశోధనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దివ్యాంగుల జీవితాలతో ఆడుకుంటున్న కమీషనర్ అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగాలు, ఉద్యోగపరమైన నిర్వాకాలు ఒక్కొక్కటి వరసగా మీ నేటిధాత్రిలో రేపటి నుంచి…!
`ఒక్కడిని చేసి ఎలా గెలిపిస్తాడో చూద్దామని లెక్కలేసి!
`ఇదే అదును దెబ్బ పడితే…ఇక అంతే!
`రేవంత్ కథ కంచికే!
హైదరాబాద్,నేటిధాత్రి:
పాత్రదారులకు చిత్త శుద్ధి లేదు. సూత్రదారులకు దిక్కులేదు. పిపిసి అధ్యక్షుడు ఒంటరి ప్రయాణానికి దారి కనిపించడం లేదు. మిగతా సీనియర్లంతా కలిసి సాగుదాం…పార్టీకేమైతే మనకేంది? మనం పార్టీలో వున్నా చేసేదేముంది? అవకాశాలొస్తే కనిపిస్తాం…ప్రజలు దీవిస్తే గెలుస్తాం…సీనియర్లమన్న గుర్తింపు చెదిరిపోయేది కాదు… కొత్త వాళ్లెవరొచ్చినా ఎదిరించేది లేదు..పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు. పార్టీని గెలిపించే పలుకుబడి ఎవరికీ లేదు. గొప్ప లీడర్ అని చెప్పుకునేంత పేరు ఎవరికీ లేదు. నా మాట చెల్లుబాటు కావాలన్నంత హుకూం జారీ చేసేంత సీన్ అసలేలేదు. ఎవరికి వారే…యమునా తీరే…ఇది నూటా ముప్పై ఏళ్ల పార్టీయే…వచ్చేవారు వస్తుంటారు..పోయే వారు పోతుంటారు..పార్టీ బతికి బట్టకడితే వుంటాం….లేకుంటే సైలెంటుగా వుంటాం…ఇంతకు మించి మేం చేసేదేమీ లేదు…చేయాల్సిన పని కూడా లేదు…ఎందులో వేలుపెట్టినా ఫలితం దక్కేది లేదు…పేరొచ్చినా పెట్టే కిరీటం లేదు…ఏ మాత్రం ముందడగుడు వేసినా క్రెడిట్ ఇతరుల ఖాతాలో వేసేంత విశాల హృదయం ఎవరికీ లేదు…ఇదీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు…!మునుగోడులో పార్టీని ముంచి రాజగోపాల్ వెళ్లిపోయాడు. పార్టీ ఎన్ని అవకాశాల్చినా మోసం చేసి వెళ్లిపోయాడు. ఇలాంటి తరుణంలో పార్టీని ఎలాగైనా గెలిపించుకొని పార్టీకి ఆదరణ తగ్గలేదని నిరూపించుకుందామన్న సోయి ఎవరికీ లేదు….మునుగోడు మనదే అన్న నమ్మకం అంతకన్నా లేదు….గెలిపించుకుందామన్న పట్టుదల లేదు. ఐక్యత అంత కాన్న లేదు…కొత్తగా వచ్చిన పిసిసి. అధ్యక్షుడి ముందు జీ హుజూర్ అనే పరిస్ధితి అసలే లేదు…మీకు మీరే…మాకు మేమే…సీనియర్లమంతా ఒక్కటే…రేవంత్ ఎంత కాలమైనా ఒంటరే…ఇదే కాంగ్రెస్‌లో వినిపిస్తున్న మాట…ఎంత కాలం విన్నా ఇదే మాట…ఎవరు చెప్పాల్సివచ్చినా ఇదే మాట…ఇంతకు మించి చెప్పాల్సినంది లేదే మాట! అయితే మేమే వుంటాం… మాకు మేం కొట్లాడుకుంటాం…కొత్తవారొస్తే మాత్రం అందరిదీ ఒకటే గొంతై అరుస్తాం…నిందిస్తాం…నిలాపనిందలేసి నీరు గారేలా చేస్తాం…తట్టుకొని నిలబడితే నిలబడనీ…పోతే పోనీ…అని మేం కూడా అంటాం…..కోవర్టులు అన్న మాట మాట్లాడిన రేవంత్‌నే వెళ్లగొట్టకుండా వుండలేమన్నదే సీనియర్ల ఆట….అప్పటిదాకా ఇంతే…గట్టిగా చెప్పాల్సివస్తే…అంతే…రేవంత్ దిగిపోయేదాక అంతు చూడడమే! దించేయడమే…పారిపోయేలా చేయడమే!! ఇదే సీనియర్లు కట్టుకున్న కంకణమే!!! అందుకే ఇంత కాలం ఒకే దారిలో , ఒకే వేదికలో కనిపించిన కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరూ కనిపించడం లేదు… ఎవరు ఏం చేస్తున్నారో అసలే చెప్పడం లేదు. మునుగోడు వైపు చూడడమే మానేశారు…. వెళ్తే రేవంత్ రెడ్డి మాత్రమే వెళ్లాలి…ఆయన వెంట ఎవరూవెళ్లకూడదు…పిసిసి అధ్యక్షుడిగా ఆయనదే బాధ్యత…అంటూ ఆయనపై పూర్తిగా తేసేసినట్లే వున్నారు. దాంతో రేవంత్ పట్టు పెరుగుతోందా? తగ్గుతోందా? అన్నది కూడా తేలిపోతుంది. ఒక వేళ పార్టీపై రేవంత్ పట్టు పెరుగుతున్నట్లు కనిపిస్తే మళ్లీ వచ్చి జట్టులో చేరొచ్చు. లేకుంటే పట్టు జారిపోయేదాకా రెవంత్‌ను ఇబ్బంది పెట్టొచ్చు… ఇదీ కాంగ్రెస్‌పార్టీలో కనిపిస్తున్న వింత ధోరణి. రగిలిపోతున్న మధుయాష్కీ..
ఇప్పటికే అనేక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వూలలో మధుయాష్కీ తాను ఎంత అసహనంగా వున్నాడో చెప్పకనే చెబుతున్నాడు. తాను మునుగోడు వైపు చూడననే చెబుతున్నాడు. తనకు ప్రాధాన్యత లేకుండానే చేస్తున్నారని వాపోతున్నాడు. రేవంత్‌పై గుర్రుగా వున్నాడు. తనను సంప్రదించకుండానే రేవంత్ అన్ని తానై చేసుకుపోతున్నాడు. ఇక నేను చేసేదేముంది? అని మధుయాష్కీ అంటున్నాడు. మునుగోడులో ఏర్పాటు చేసిన సభ నుంచి మొదలు, ఆఖరుకు అభ్యర్ధి ఎంపికలో కూడా తన ప్రమేయం లేకుండానే రేవంత్ రెడ్డి చూసుకున్నారు. తనకు ప్రచార బాద్యతలు అప్పగించినట్లే చేసి, తనతో ఏం సంప్రదించకపోతే…ముందుకెళ్లేదెలా? అంటున్నాడు. తనను ముందు పెట్టినట్లే పెట్టి, తనను కావాలనే రేవంత్ పక్కన పెడుతున్నాడని కూడా యాష్కీ అన్నట్లు తెలుస్తోంది. పైగా సీనియర్లను ప్రతి సందర్భంలోనూ రేవంత్ కించపరస్తున్నాడన్న అసహనం వ్యక్తం చేస్తున్నాడు. మేం లేకుండా మునుగోడులో ఎలా గెలిపిస్తాడో చూస్తాం…సమయం వచ్చినప్పుడు రేవంత్ అంతు చూస్తామన్నట్లుగానే మధుయాష్కి అంతరంగంగా వుంది. ప్రచారానికి రాను…అని ఇప్పటికే పలు మార్లు వెంకటరెడ్డి తేల్చేశాడు…తాజాగా మారోసారి కూడా చెప్పేశాడు.. మీడియా పదే పదే అడుతూనే వుంది…వెంకటరెడ్డి అదే మాట చెబుతూనే వున్నారు…అయినా కాంగ్రెస్ పార్టీలో ఆశ చావడం లేదు. నేను రాను మొర్రో అని వెంకటరెడ్డి ఓ వైపు చెబుతుంటే వస్తాడు నారాజు…ఈ రోజు అన్నట్లు కాంగ్రెస్‌నేతలు చెప్పుకోవడం వింతగా వుంది. అంతే కాదు మునుగోడు అభ్యర్ధిగా బరిలో దిగుతున్న పాల్వాయి స్రవంతి కూడా ఇటీవల తనకు మద్దతుగా ప్రచారం చేయడానికి కోమటిరెడ్డివెంకటరెడ్డి వస్తాడని అమాయకంగా చెప్పడంచూస్తే ఆశ్చర్యమేస్తుంది. వెంకటరెడ్డి ప్రచారానికి రాడని ఆమెకు తెలుసు. నియోజకవర్గంలోని నేతలందరికీ తెలుసు. సీనియర్లందరికీ తెలుసు. అయినా ఎవరిని మోసం చేయడానికి వాళ్లంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జపం చేస్తున్నారన్నది అర్ధం కావడంలేదు. అసెంబ్లీ సమావేశాలు తప్ప…మిగతా సమయాల్లో సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క…తన పూర్తి స్ధాయి సమయాన్ని నియోజకవర్గంలోనే గుడపుతున్నారు. ఎవరెట్ల పోతేనాకేంటి? నా నియోజకవర్గంలో పట్టు తప్పకుండా చూసుకుంటే చాలని అనుకుంటున్నారని పార్టీలో కొందరు అంటున్నారు. అలాంటప్పుడు సిఎల్పీ పదవిలో కొనసాగడమెందుకు అన్నంత మాట కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే పిసిసి. పదవి కన్నా, సిఎల్పీ పదవి ఏం తక్కువ కాదు. పిపిసి అధ్యక్షుడికి ఎంత బాధ్యత వుంటుందో అంతకన్నా ఎక్కువ బాధ్యత సిఎల్పీపై కూడా వుంటుంది. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి కేవలం 26సీట్లు వచ్చాయి. ఆ సమయంలో సిఎల్పీ లీడర్‌గా వున్న పి. జనార్ధన్‌రెడ్డి పార్టీకోసం ఆయన అప్పటి ఉమ్మడి రాష్ట్రమంతా పర్యటనలు చేసేవారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. కార్యకర్తలో ఉత్సహం నింపేవారు. అదీ సిఎల్పీ నాయకుడిగా తీసుకోవాల్సిన బాధ్యత. కాని భట్టి విక్రమార్క మాత్రం అంటీ ముట్టనట్టుగానే వుంటున్నాడని అంటున్నారు.
అదేంటో హనుమంతరావు కూడా ఈ మధ్య సైలెంటుగానే వుంటున్నాడు. వద్దన్నా…ఏదో ఒక వివాదం రేపుతూ, నిత్యం వార్తల్లో వుండే హనుమంతరావు కూడా ఈ మధ్య ఎక్కడా నోరు విప్పుతున్నట్టు లేదు. బైటకు రావడం కూడా మానేశాడు. ఒక వేళ హనుమంతరావు మునుగోడులో ప్రచారం చేయాలనుకుంటే, బాధ్యత తీసుకోవాలనుకుంటే పెద్ద సమస్య కాదు. ఒక దశలో మళ్లీతనకు పిపిసి ఇస్తే , రాష్ట్రమంతా తిరుగుతా? పార్టీని బలోపేతం చేస్తా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా? అని హనుమంతరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే…మరి అలాంటి హనుమంతరావు మునుగోడు వైపు ఎందుకు చూడడం లేదు. రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు విమర్శించడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తప్పని ఎందుకు నిలదీయడం లేదు? ఎందుకు సైలెంట్ అయ్యాడు. హైదరాబాద్‌కు మునుగోడు అతి సమీపంలో వుండే నియోజకవర్గం. రాష్ట్రమంతా పర్యటిస్తా…అని చెప్పిన హనుమంతరావు మునుగోడుకు నిత్యం వెళ్లి ప్రచారం చేయడానికి అభ్యంతరమేమిటి? పార్టీ అభ్యర్ధి ఎంపిక జరిగిపోయింది? అయినా హనుమంతరావు ఎందుకు కదలడం లేదు? ఇదే అదును రేవంత్ మీద మునుగోడు దెబ్బపడితే ఇక రేవంత్‌కథ కంచికే అన్నది సీనియర్ల ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
`సున్నితమైన అంశాలను కదిలించడమంటే..కాంగ్రెస్ ఖతంపట్టించే పనే!
`తెలంగాణ అస్తిత్వం మీద దాడి మొదటికే మోసం!
`తెలంగాణ తల్లి విగ్రహ వివాదం తెరమీదకు…
`టిఎస్ మార్పు టిజి చేర్పు కుదరని అంశం.
` టిఎస్ మార్పు రాష్ట్ర పరిధిలోని కాదు.
`టిఎస్ నామకరణం చేసిందే కాంగ్రెస్…
`తెలంగాణ తల్లి విగ్రహం టిఆర్‌ఎస్ పార్టీ సృష్టి మాత్రమే కాదు.
`తెలంగాణ సమాజమంతా అంగీకరించిన స్వరూపం.
`తెలంగాణ ఉద్యమకారులందరి ఐక్యతకు నిదర్శనం.
`ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నేతల మొక్కులన్నీ మొక్కుబడేనా!
`అస్తిత్వాన్ని సాంస్కృతిక పరంగా చిన్నభిన్నం చేసే పన్నాగమేనా!
`ప్రజల్లో వున్న ఆ మాత్రం నమ్మకం పోగొట్టుకోవడమే…
`విశ్వాసం వీసమంత లేకుండా చేసుకోవడమే!
`సీమాంధ్రుల కనుసన్నల్లో రేవంత్!
`తెలంగాణ వ్యతిరేక మీడియా నీడలో రేవంత్ రాజకీయం!
`ఎల్లో మీడియా చెప్పింది విని చంద్రబాబు బాగుపడలేదు….
`ఎల్లో మీడియాను నమ్ముకొని రేవంత్ గెలిచేది లేదు!
`తెలంగాణ సంస్కృతి మీద దాడిని ఎవరూ హర్షించరు!
హైదరాబాద్,నేటిధాత్రి:
కాంగ్రెస్‌ను ఎవ్వరూ ఓడిరచాల్సిన అవసరం లేదు అని కొన్ని దశాబ్ధాలుగా చెప్పుకుంటున్న సామెత..కాదు నిజం..! ఎవరో వచ్చి, ఏదో పార్టీ వచ్చి కాంగ్రెస్‌ను ఎండగట్టాల్సిన అవసరం లేదు. ఓడిరచాల్సిన అవసరం అంతకాన్నా లేదు. కాంగ్రెస్ నేతల చేతలు, చేష్టలే ఆ పార్టీ చాలు… ఆ పార్టీ శంకరగిరి మాణ్యాలు పట్టడానికి… ఇప్పుడు ఆ పార్టీ నేతల వేషాలే పాతాళం దాకా తీసుకెళ్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ పెద్దలు అంతే…రాష్ట్రంలో నేతలంతే…! తెలంగాణ ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేదు. తెలంగాణ ఇస్తామన్న మాటను దాట వేసి, దాట వేసి, ఇక తప్పదు అని నిర్ణయానికి వచ్చాగ కాని, తెలంగాణ ప్రకటన రాలేదు. అప్పటికే కాంగ్రెస్ మీద ప్రజలకు పీకలదాకా కోపం పెరిగిపోయింది. 2004 ఎన్నికల సమయంలోనే తెలంగాణ ఇస్తామని చెప్పింది. అవసరమైతే సెకెండ్ ఎస్సార్సీ వేస్తామని చెప్పింది. 2001లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేల తెలంగాణ లేఖ రాజకీయం మొదలైంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ బతకి బట్ట కట్టాలంటే, అధికారంలోకి రావాలంటే, టిఆర్‌ఎస్‌తో పొత్తు తప్పని పరిస్ధితైంది. కాని ఎన్నికల్లో గెలచిన ఏడాదికి మాట దాటేసింది. కొంత కాలం సన్నాయి నొక్కులు నొక్కుతూ కాలం గడిపింది. కాని 2005 వచ్చే సరికి కాంగ్రెస్ మాట తీరు మారింది. తెలంగాణ ఇవ్వడం అన్నది కుదరదన్నంత దాకా వెళ్లింది. తెలంగాణ ప్రజలు ఆ మోసాన్ని తట్టుకోలేకపోయారు. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవానికి చెందింది. న్యాయం తెలంగాణ వైపు వుంది. అందుకే 2009 డిసెంబర్‌లో కేంద్రం తెలంగాణ ప్రకటన చేయాల్సివచ్చింది. 2014లో తెలంగాణ ఇవ్వాల్సివచ్చింది. ఇంతవరకు బాగానే వుంది. కాని 2014లో తెలంగాణ మేమే ఇచ్చామని కాంగ్రెస్ ఎంత చెప్పుకున్నా తెలంగాణ ప్రజలు నమ్మలేదు. వారిని విశ్వసించలేదు. ఒక వేళ కాంగ్రెస్‌కు ఓటేసి, గెల్పించినా సీమాంధ్ర నాయత్వ పెత్తనం తెలంగాణలో ఆగదని తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ వచ్చినా, తెలంగాణ ముఖ్యమంత్రి పాలించినా, సీమాంధ్ర నేతల కనుసన్నల్లో పాలన సాగిస్తారని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించలేదు. ఇప్పటికీ తాము ఎందుకు ఓడిపోయామన్న సోయి కాంగ్రెస్ నేతలకు లేదు. ఇంత కాలమైనా ఇంకా సీమాంధ్ర నాయకుల కనుసన్నల్లోనే కాలం గడుపుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ప్రజలు కొంత నిలుస్తారన్న అంచనాలు కనిపించాయి. సరే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒకసారి అవకాశం ఇస్తే బాగుటుందేమో! అన్న మార్పు ప్రజల్లో కనిపించినట్లే అనిపించింది. కాని కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చేయడంతో కాంగ్రెస్ నిండా మునిగింది. సీమాంధ్ర నేతల నీడ లేకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాజకీయం చేతకాదని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. 2014 ఎన్నికలకు మించి సీట్టిచ్చి గెలిపించారు. 2018లో మరోసారి టిఆర్‌ఎస్‌కు తిరుగులేని పట్టం కట్టారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వానికి ఎదురులేదని నిరూపించారు.
కాంగ్రెస్ నేతల్లో మార్పు రాదని, వారిని నమ్మినా ఎప్పటికైనా మళ్లీ తెలంగాణను తాకట్టు పెడతారని అర్ధమైంది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో బలమైన పార్టీగా వేళ్లూనుకుపోయిన తెలుగుదేశం పార్టీనే ముఖ్యమంత్రి కేసిఆర్ కూకటివేళ్లతో పెకిలించినంత పనిచేశాడు. తెలంగాణలో ఆనావాలు లేకుండా చేశారు. ఆఖరుకు తెలుగుదేశం అన్న పదం వినపడకుండా చేశాడు. ఆ పార్టీని నిర్వీర్యం చేశాడు. అలాంటి కేసిఆర్ ముందు రాజకీయాలు చేయాలంటే అంత ఆశామాషీ కాదు. అయినా కాంగ్రెస్ నేతల కుప్పిగంతులు ఆగడం లేదు. అందులోనూ రేవంత్ రెడ్డి వింత చేష్టలకు అంతు లేదు. సీమాంధ్ర నాయకుల పెత్తనానికి దూరంగా రాజకీయం చేయడం కాంగ్రెస్ నేతలకు ధైర్యం లేదు. అందులో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాజకీయం చంద్రబాబు తెలియకుండా జరగదు. చంద్రబాబు చెప్పింది చేయకుండా రేవంత్ వుండడు…ఇదే ఇప్పుడు మళ్లీ టిఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశం కాకమానదు. ఒక్కసారి ముఖ్యమంత్రి కేసిఆర్ సంక్షేమ పాలన గురించి పక్కన పెడదాం… ఎందుకంటే ప్రజల గుండెల్లో గూడుకట్టుకొని పోయిన కేసిఆర్ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చే రాజకీయం రేవంత్ వల్ల సాధ్యం కాదు. రేవంత్ ఒంటెద్దు పోకడలు, చంద్రబాబు ఆదేశాలు.. ఎల్లో మీడియా సూచనలు కలిసి మరోసారి కాంగ్రెస్‌ను నిండా ముంచడం ఖాయంగానే కనిపిస్తోంది. కనీసం గతంలో వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్‌కు రావన్నది తేలిపోతోంది. రేవంత్ తీసుకుంటున్న తిక్క తిక్క నిర్ణయాలు కాంగ్రెస్‌ను ప్రజల ముందు దోషిగా నిలబడే ప్రమాదాన్ని కొనితెస్తోందని చెప్పడంలో సందేహ ంలేదు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం స్ధానంలో కాంగ్రెస్ రూపకల్పన చేసిన విగ్రహం అన్నది తెలంగాణ అస్ధిత్వాన్ని దెబ్బతీసేదిగా వుంది. ఏ కొడుకైనా తన తల్లి దేవతలా వుండాలని కోరుకోవాలి. తన తల్లిని గొప్పగా ఊహించుకోవాలి. తన తల్లి దైవస్వూరూపంగానే పూజించుకోవాలి. అంతే కాని తన తల్లిని దిక్కులేనిదాన్ని చేసినట్లు, కట్టూబొట్టులో కూడా వెలితి చూపించడం ఏ కొడుకు చేయాల్సిన పని కాదు. ఇప్పుడు రేవంత్ చేసిన పని అదే…! ఏ కొడుకు చేయకూడదని పని రేవంత్ చేశాడు. కాంగ్రెస్ ప్రోత్సహిచింది. ఇదంతా రేవంత్ ఆలోచన కన్నా, చంద్రబాబు కుట్రగానే తెలంగాణ సమాజం భావిస్తుంది. మనం కొలిచే తల్లితోపాటు, ఏ దైవమైనా సరే చేయేత్తి మొక్కేలా వుండాలి. అమ్మను చూస్తే కడుపు నిండేలా వుండాలి. మనసు ప్రశాంతమైపోవాలి. అమ్మ చెంత కాసేపు సేద దీరేలావుండాలి. అమ్మను కొలుస్తూ నిండుగా అలంకరణ జరపాలి. అంతే గాని అమ్మను అనాధగా రూపకల్పన చేసి, ఎన్ని హంగులు తొడిగినా, ఎన్ని పూల మాలలు వేసిన ఆ దైవత్వం సిద్ధించదు. తెలంగాణ తల్లి స్ధానంలో మరో తల్లి రూపకల్పన అన్నది తెలంగాణ సమాజం హర్షించదు.తెలుగు తల్లి విషయానికే వద్దాం..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు తల్లి విగ్రహ నిర్మాణం ఎప్పుడు జరిగిందనేదానిపై వివాదాలే లేదు. ఎవరికీ పెద్దగా శషబిషలు లేవు. అభ్యతంరాలు అంతకాన్న లేవు. ఇన్నేళ్లు గడిచిన తెలుగుతల్లి విగ్రహంలో ఎలాంటి మార్పులు చేర్చబడలేదు. తెలుగుతల్లి విగ్రహంకాంగ్రెస్ హయాంలో రూపకల్పన జరిగింది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ తల్లి విగ్రహంలో మార్పులు జరగలేదు. కొత్త తెలుగుతల్లి విగ్రహం తయారు కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కారులంతా కలిసి, రూపకల్పన చేసి, కొలిచి మొక్కిన తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడం అనే ఆలోచనే దుర్మార్గమైంది. ఎంతో మంది మేధావుల ఆలోచన స్వరూపమే తెలంగాణ తల్లి విగ్రహం. ఇలాంటి సున్నితమైన అంశాలలో రేవంత్ రాజకీయం ప్రజలు సహించరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ అస్ధిత్వం మీదే దాడిగా ప్రజలు బావించాల్సివస్తుంది. నిజానికి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన అన్నది టిఆర్‌ఎస్ సృష్టికాదు. టిఆర్‌ఎస్ కూడా రూపకల్పన హక్కులు మావే అని చెప్పలేదు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వాదుల మదిలో పురుడు పోసుకొని, ఎన్నో చర్చోప చర్చలు సాగాఆయి. తెలంగాణ ఉద్యమ కారుడు, రచయిత, బిఎస్ రాములు కొన్ని నమూనాలు రూపొందించారు .దానిని కంపూటర్‌పై బివిఆర్ చారి రూపమిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా వుండాలన్నదానిపై కొంత కాలం పాటు సుధీర్ఘమైన చర్చలు సాగాయి. అందులో తెలంగాణ అమర వీరుల స్ధూప నిర్మాణ కర్త ఎక్కా యాదగిరి, ప్రముఖ రచయిత దుర్గం రవీందర్, ప్రముఖ చిత్ర కారుడు కాపు రాజయ్య, కార్టునిస్ట్ ఏలె లక్ష్మణ్, ఇలా అనేక మంది ఉద్యమ కారుల ఆలోచన రూపమే తెలంగాణ తల్లి విగ్రహ రూపం. ఆఖరుకు అందరి సూచనలు సలహాలతో కూడిన పరిపూర్ణమైన రూపం తెచ్చింది ప్రొఫెసర్ గంగాధర్. ఇంత మంది కలిసి సృష్టించిన అధ్భుతమైన కళ. తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి రూపకల్పనలో ముందు పేద రూపంలో వున్న తల్లి విగ్రహం ఎలా వుంటుందన్న ఆలోచన కూడా చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని రేవంత్‌రెడ్డికి ఈ విషయం తెలియదు. ఆయన అందులో పాల్గొన్నది లేదు. అందుకే కొత్తగా ఏదో తాను కనిపెట్టినట్లు, తెలంగాణ తల్లి రూపం మార్చి మరో కొత్త ప్రపంచం సృష్టించినట్లు ప్రచారం చేసుకోవడం అన్నది ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని తెలంగాణ వాదులు అంటున్నారు. ఇక టిఎస్ అన్న పదం మార్చుతారట.. ఇదెలా వుందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు జగన్‌మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఓ హమీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తానని ప్రకటించారు. ఎన్నికలకు వెళ్లారు. ఇదేదో బాగుందనుకున్న ఉద్యోగులు వైసిపికి పూర్తి మద్దతిచ్చారు. గెలిపించారు. తీరా ఇప్పుడు పాత విధానం అమలు చేయడం సాధ్యం కాదని చావు కబురు చల్లగా జగన్ ప్రభుత్వం చెప్పింది. పాత పెన్షన్ పద్దతి సాధ్యం కాదని ఉద్యోగులకు కూడా తెలుసు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తెలుసు. అయినా ఉద్యోగులు జగన్ చెప్పింది నమ్మారు. ఇప్పుడు సాధ్యం కాదంటే నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. తెలంగాణలో టిఎస్ మార్పు అన్నది కూడా అంతే…ఉద్యమ కాలంలో అందరూ టిజి అనే సంబోధించారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులో మాత్రం టిఎస్ అంటూ రూపకల్పన చేసింది. అదేదో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన, అమలు అన్నట్లుగా రేవంత్ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. కనీసం రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపిఏ ప్రభుత్వం తయారు చేసిన చట్టంలో ఏమని వుందో రేవంత్‌కు తెలుసా? జయరాం రమేశ్ నేతృత్వంలో తయారు చేసిన విభజన చట్టంలో టిఎస్‌ను పొందు పర్చారు. ఆ సంగతి కూడా తెలియకుండా టిజి చేర్చుతామని ప్రగల్భాలు పలికి ప్రజల్ని నమ్మిస్తామని చూస్తే వెర్రివెంగలప్పలయ్యేది కాంగ్రెస్ నేతలే…పరువు పోగొట్టునేది ఆ పార్టీనే…తలా తోక లేని ఆలోచనలు , తలతిక్క నిర్ణయాలు తీసుకుంటే నిండా మునిగేది కాంగ్రెస్‌నాయకులే….ఇక తేల్చుకోండి…! నిజం తెలుసుకోండి!!
`అన్ని వర్గాల అభ్యున్నతి అనేది ఒక్క కేసిఆర్ హయాంలోనే చూస్తున్నాం
`ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్ పాలన స్వర్ణ యుగం.
`గిరిజన ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలౌతున్నాయి.
`పోడు సాగుకు కూడా రైతు బంధు అనేది విప్లవాత్మక నిర్ణయం
`గిరిజన ప్రజలకు గిరిజన బంధు అమలుతో ఆ వర్గాల జీవితాలలో వెలుగులు నిండుతాయి.
`రిజర్వేషన్లు పెంచితే విద్య, ఉద్యోగ రంగాలలో అనేక అవకాశాలు వస్తాయి.
`ఒక్క తెలంగాణే కాదు దేశమంతా గిరిజన ప్రజల జీవితాలలో మార్పులు రావాలి.
`అందుకు కేసిఆర్ జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర కావాలి.
`కేసిఆర్ ప్రధాని అయితే దేశ రాజకీయాలలో కూడా మార్పులొస్తాయి.
`దేశమంతా తెలంగాణలో అమలౌతున్న పథకాలు అందుబాటులోకి వస్తాయి.
`ఒక్క మాటలో చెప్పాలంటే దేశం సుభిక్షమౌతుంది.
`అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తుంది.
`గుప్తుల కాలం మర్చిపోయి కేసిఆర్ కాలం స్వర్ణ యుగమని చెప్పుకుంటారు.
`సమాజం గురించి కేసిఆర్ అంత తపన పడే నాయకుడిని ఎక్కడా చూడలేదు.
`దేశం కోసం ఇంతలా ఆలోచిస్తున్న నాయకుడు ఈ తరంలో లేడు…
`అందుకే కేసిఆర్ గ్రేట్ లీడర్…
హైదరాబాద్,నేటిధాత్రి:
ముఖ్యమంత్రి కేసిఆర్ లాంటి ఉదాత్తమైన నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. ఆయన లాంటి ఉత్తమైన నాయకుడు మరొకరు కనిపించరు. ఇది అతిశయోక్తికాదు. ఎంతో దూరదృష్టి వుంటే తప్ప అంతటి నాయకుడు ఎవరూ కాలేరు. సంపూర్ణమైన నాయకుడు అంటే కేసిఆర్. ఆయనను చూసి భవిష్యత్తు తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఒక నాయకుడికి ప్రజలంటే ప్రేమ వుండాలి. ప్రజలకు ఏం కావాలో తెలియాలి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అంచనా వేయగలగాలి. ప్రజలు నాయకులనుంచి ఏ ఆశిస్తారన్నది బాగా తెలిసి వుండాలి. నిత్యం ప్రజలకు అందుబాటులో వుండాలి. నిత్యం ప్రజల గురించే నాయకుడు ఆలోచిస్తూ వుండాలి. ఇలాంటి ఉత్తమైన గుణగణాలన్నీ కేసిఆర్‌లో వున్నాయి. అందుకే ఆయన తెలంగాణ సాధించగలిగారు. అసలు తెలంగాణ ఉద్యమమంటే అందరూ చేసేదేలే…ఇప్పుడు కొత్తగా ఏముంటుందిలే…అన్నవాళ్లే చాలా మంది. కాని తెలంగాణ జెండా ఎత్తి, కొత్త తరం రాజకీయ ఉద్యమ పోరాటాన్ని మిలితం చేసిన కేసిఆర్ తెలంగాణ సాధించడం అన్నది ఎవరూ ఊహించింది కాదు…..అందుకే తెలంగాణ ఉద్యమం అన్నది చరిత్రలో ఒక సువర్ణాక్షరమైతే…కేసిఆర్ ఉద్యమ జీవితం ఒక సువర్ణాధ్యాయం. అంటున్న మహాబూబాబాద్ ఎంపి. మాలోతు కవితతో ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు మాటా…మంతి! తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు అందరూ తెలంగాణ వస్తే చాలు అనుకున్నారు. ఎందుకంటే ఆనాడు ఆత్మగౌరవం మాత్రమే వినపడేది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారన్న భావన సర్వత్రా వ్యక్తమయ్యేది. అలా సామాన్య ప్రజలైనా, నాయకులైనా అంతే…సీమాంధ్ర నాయకత్వం ఏదైనా సరే…అందరూ తలూపాల్సిందే…తలొంచాల్సిందే.. తెలంగాణలో వారిని ఎదిరించి మాట్లాడే శక్తి వున్న నాయకులే లేని రోజులవి. అలాంటి సమయంలో తెలంగాణ అనే పదమే మాట్లాడేందుకు వీలు లేని పరిస్ధితి. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేదించారు. వెనుకబడిన ప్రాంతం అనాల్సివచ్చేది. అయితే ఇది కూడా తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహదం చేసింది. తెలంగాణ అనొద్దన్న ఉమ్మడి రాష్ట్ర పాలకులే వెనుకబడిన ప్రాంతం అనొచ్చన్నారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అంటే తెలంగాణ ప్రజల దృష్టిలో వెనక్కి నేట్టేబడిన ప్రాంతంగా మనసుల్లో ముద్రపడిపోయింది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ జెండా ఎత్తిన కేసిఆర్ ప్రజలను కదలించిన విధం మాత్రం అపురూమనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమం అంటే చాలు..ముందు నిట్టూర్చేవాళ్లే ఎక్కువ. తర్వాత భయపడేవారు కూడా ఎక్కువే. జై తెలంగాణ అంటే నక్సలైట్ అనే ముద్ర వేసే రోజులవి. అలాంటి సమయంలో దిక్సూచీలా మారి, తెలంగాణను ఒక దివిటీగా మారి, చైతన్య దీప్తిగా మారి వెలుగు వైపు ప్రజలను నడిపించిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలంతెలంగాణ వస్తే చాలనుకున్నాం.
మన నిధులు మనకే అంటే సరే ఎంతో కొంత మన అభివృద్ధి మనమే చేసుకోవచ్చు అనుకున్నాం. కాని తెలంగాణ వస్తే ఇంత ప్రగతి సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఇంత తక్కువ సమయంలో తెలంగాణ రూపు రేఖలు ఇంత గొప్పగా ఆవిషృతమౌతాయని ఎవరూ అనుకోలేదు. తెలంగాణ చరిత్ర తెసిన వారు కూడా ఊహించలేకపోయారు. తెలంగాణ వచ్చిన ఇంత అతి తక్కువ కాలంలో కోటి ఎకరాల మాగాణ అవుతుందని అనుకున్నామా? తెలంగాణ సస్యశ్యామలం కావాలనుకున్నాం. అందుకు కనీసం ఓ ఇరవై ముప్పై ఏళ్లు పడుతుందేమో అనే అందరూ అనుకున్నారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్భుతాలు సృష్టించారు. అన్ని వర్గాల అభ్యున్నతి సాధించింది. కేవలం ఆరు నెలల్లో చిమ్మ చీకట్ల నుంచి తెలంగాణలో వెండివెలుగులు ఆవిష్కారమాయ్యయి. ఒకనాటి తెలంగాణ పరిస్ధితి గుర్తు చేసుకుంటే, ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా అన్నది తెలిసిపోతుంది. సహజంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేయాలన్నదానిపై కొన్ని పమితులలోనే ఆలోచన చేశారు. అంతటితో అవే గొప్ప పధకాలు అని ప్రచారం చేసుకున్నారు. కీర్తించుకున్నారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్ ఏక కాలంలో ఇన్ని రకాల పధకాలు అమలు చేసి, తెలంగాణలో సమస్యలు లేని కాలాన్ని సృష్టిస్తాడని ఎవరూ అనుకోలేదు. అసలు దేశంలో తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలలో కనీసం ఒక్క శాతం కూడా అమలు కావడం లేదు.గత కొన్ని దశాబ్ధాలుగా దేశమంతా అమలౌతున్న రేషన్ బియ్యం, వృద్థులకు పెన్షన్ ఇవి తప్ప మరే పథకాలు ఇతర రాష్ట్రాలలో లేవు. అయితే ఇక్కడ కూడా తెలంగాణ ప్రత్యేకమే. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతటి ప్రజా నాయకుడో అర్ధం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో సీలింగ్ లేని రేషన్ అందిస్తున్నాం. పైగా ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఇవ్వడం జరుగుతోంది. వీటికి తోడు చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? అసలు కళ్యాణ లక్ష్మి అనే పథకం పేదింటి ఆడపిల్ల జీవితానికి ఒక వరంగా మారింది. ఆడ పిల్ల పెళ్లి చేయడం అంటే సగటు తండ్రికి ఎంత కష్టమో! కళ్లారా చూసిన ముఖ్యమర్రతి కేసిఆర్ అధికారంలోకి రాగానే ప్రకటించారు. అంటే ఆయన తెలంగాణ వస్తే, అందులోనూ అధికారంలోకివస్తే ఎలాంటి పధకాలు అమలు చేసుకోవచ్చో అన్నవి ముందే నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఇంత ముందుచూపు వున్న నాయకుడు ప్రపంచంలో ఎవరైనా వున్నారా? ఒక్క కేసిఆర్ తప్ప మరెవరూ కనిపించరు. అంత గొప్ప నాయకుడు కేసిఆర్.తెలంగాణ ప్రజలు గత ఎనమిది సంవత్సరాల కాలంలో అనుభవిస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశం మొత్తం అమలు కావాలి.
ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, కేంద్రంలో అధికారంలోవున్న బిజేపి, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసిఆర్‌లా ఆలోచించలేదు. పనులు అమలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన నుంచి తెలంగాణలో ఏమేమి అమలౌతున్నాయో! కేంద్రంలోపాటు, అన్ని రాష్ట్రాలూ చూస్తున్నవే…కాని మన రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయా రాష్ట్రాలు అనుకోవడం లేదు. దేశం మొత్తం అమలు చేయొచ్చని కేంద్రం అనుకోవడం లేదు. ఈ పార్టీలు అధికారంలో వున్నంత కాలం తెలంగాణ పధకాలు దేశంలో అమలుకావు. అందుకే దేశమంతా తెలంగాణలాగా ప్రగతిని సాధించాంటే, దేశమంతా సస్యశ్యామలం కావాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్ దేశ నాయకుడు కావాల్సిందే. కేసిఆర్ దేశానికి ప్రధాని కావాల్సిందే…! ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు..దేశంలోని కోట్లాది మంది ప్రజలు, వేలాది మంది నాయకులు కోరుకుంటున్న మాట. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఎంత సేపు పన్నులెలా వేయాలి. ప్రభుత్వ ఆస్ధులెలా అమ్మాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎలా దోచిపెట్టాలి. సామాన్యుడి నడ్డి ఎలా విరువాలి. ఎన్ని రకాలుగా ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేయాలి. నల్ల దనం పేరు చెప్పి, నోట్ల రద్దు చేసి దేశాన్ని అతలాకుతలం చేశారు…నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను ఆగం చేస్తున్నారు. ఎంతో గొప్ప పని చేసినట్లు అర్ధరాత్రి పార్లమెంటులో జిఎస్టీ అమలు చేస్తున్నట్లు చెప్పి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తాయని నమ్మించారు. ఇప్పుడు పాలు, పెరుగు మీద కూడ పన్నులేసి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అసలు బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చెప్పుకోవడానికి ఒక్కంటే ఒక్క పధకమైనా ప్రారంభించారా? అమలు చేశారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? పాత పధకాలకు పేర్లు మార్చుడం, కొత్త పన్నులు వేయడం తప్ప మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదు…మత రాజకీయాలు తప్ప, మానవత్వాన్ని ప్రదర్శించింది లేదు. పేదలను ఆదుకున్నది లేదు. ఆ పరిస్ధితి పోవాలి. కొత్త తరం నాయకత్వం దేశానికి కావాలి. అందుకు కేసిఆర్ నాయకత్వం కావాలి. దేశమంతా సాగునీటితో కళకళలాడాలి. దేశమంతా సస్యశ్యామలం కావాలి. దేశంలో అవకాశం వున్న ప్రతీ చోట కాళేశ్వరం ఆలాంటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. నదుల నీటిని ఒడిసిపట్టాలి. పొలాలకు మళ్లించాలి. అందుకోసం అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరగాలి. చెరువులు పునరుద్దరన సాగాలి. దేశంలోని ప్రతి ఊరికి సురక్షితమైన మంచినీరు అందాలి. తెలంగాణలో విజయవంతమైన మిషన్ భగీరధ కార్యాక్రమం దేశమంతా అమలు కావాలి. ప్రతి గడపకు మంచినీరు చేరాలి. ఇలా అనేక సంక్షేమకార్యక్రమాలు దేశమంతా అమలుకావాలి. అందుకు కేసిఆర్ దేశ ప్రధాని కావాలి. దేశానికి దిశా నిర్ధేకుడై స్వర్ణ యుగం తేవాలి. గుప్తుల కాలం స్వర్ణయుగమని ఇంకా చెప్పుకుంటున్న మనం…కేసిఆర్ కాలం మరో స్వర్ణయుగమని చెప్పుకునే రోజులని భవిష్యత్తులో తరతరాలుచెప్పుకోవాలి. కేసిఆర్ హయాంలోని అందే దీర్ఘకాలిక ప్రణాళికల ప్రయోజనాలు తరతరాలు అందాలి. దేశం సగర్వంగా తలెత్తుకోవాలి.
జీ తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన హెల్త్ కాంన్ క్లేవ్ అండ్ అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. వైద్య రంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వైద్యులను,వైద్య సిబ్బందిని మంత్రి సన్మానించి సత్కరించారు.
కరోనా సమయంలో వైద్యులు అందించిన సేవను గుర్తుచేసి మంత్రి అభినందించారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వైద్యరంగ నిపుణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:
ఇటీవలి కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రజారోగ్యం మీద బాగా అవగాహన పెరిగింది. ప్రజలు, ప్రభుత్వాలు ప్రజారోగ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాయి. ప్రభుత్వ రంగంలో గాని, ప్రయివేటు రంగంలో గాని పెద్ద ఎత్తున ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి అవసరమైన అన్ని వసతులు సమకూర్చుకుంటున్నాయి.
మరి ముఖ్యంగా కరోనా సమయంలో సేవలందించిన వైద్యుల పైన వైద్యరంగం పైన ప్రజలకు అపారమైన నమ్మకం గౌరవం పెరిగాయి.
ఇక మైనది ఎందుకంటే ఇందులో వైద్యులు ఇది వృత్తిలా కాకుండా బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి.
చాలా సందర్భాల్లో పర్సనల్ లైఫ్ ని ఫ్యామిలీ లైఫ్ ని కూడా పక్కనపెట్టి ధర్మాన్ని బాధ్యతగా నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అవార్డు పొందే డాక్టర్లే కాదు యావత్ వైద్యులకు వైద్య సిబ్బందికి సిబ్బందికి నా యొక్క అభినందనలు.
తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్ల కృషికి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు తగ్గాయి.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆరోగ్య సూచికలలో కూడా గణనీయమైన పురోభివృద్ధి సాధించాం. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది. వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించింది.
నగరాల్లో పట్టణాల్లో స్లమ్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్తీల సుస్తీ పొగొట్టాలని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. 390 బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు వైద్యం అందే ప్రయత్నంలో ఉన్నాం. జీహెచ్ఎంసీ పరిధిలోఇప్పటికే 259 బస్తీ దవాఖానాల ద్వారా వైద్యం అందుతోంది.
తెలంగాణలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల కృషి చేస్తున్నాము, ఎక్కడైనా వైద్యరంగంలో మంచి విధానాలు ఉంటే వాటిని సమీక్షించి అధ్యయనం చేసుకొని తెలంగాణ ప్రజలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది.
ఎంత సంతోషంగా కేసిఆర్ సభకు వచ్చారో…అంతకు రెట్టించిన ఆనందంతో తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమైన గిరిజనులు.
తెలంగాణలో మరో కొత్త పధకం అమలు కాబోతోంది. గిరిజన, ఆది వాసీ ప్రజలకు ఒక శుభవార్త అందింది. ముఖ్యమంత్రి కేసిఆర్ మదినుంచి జాలు వారింది. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవం రోజు ముఖ్యమంత్రి కేసిఆర్ నోటి నుంచి త్వరలో గిరిజన బంధు అనే పధకం ప్రకటన వెలువడిరది. ఇప్పటికే తెలంగాణలో దళిత బంధు అమలౌతోంది. త్వరలో గిరిజన బంధుకు శ్రీకారం జరగనుంది. ఈ విషయం గత కొద్ది రోజుల ముందే నేటిధాత్రి చెప్పింది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనల్లో గిరిజన బంధు అమలు ఆలోచన మొదలైందని నేటిధాత్రి చెప్పింది. ఈ ప్రకటన కూడా అతి త్వరలో వెలువడనుందన్న సంగతి కూడా నేటిధాత్రి రాసింది. అన్నట్లుగానే హైదరాబాద్‌లో గిరిజన, ఆది వాసీ, బంజారా భవన్‌లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన అశేష జనవాహిని గిరిజన ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనం సభలో గిరిజన బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. అంతే కాకుండా ఆ వర్గాలకు మరిన్ని వరాలు కురిపించారు. ఇంత కాలం వున్న పోడు సమస్యలు త్వరలో తీరుతాయన్నారు. అందుకు కమిటీ వేసినట్లు వెల్లడిరచారు. అలాగే పోడు సాగు చేసుకునే గిరిజన రైతులకు ఇక నుంచి రైతుబంధు సాయం కూడా అందిస్తామన్నారు. అలాగే తెలంగాణలో వున్న పది శాతం గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఒకేరోజు గిరిజనులకు మూడు వరాలు కురిపించారు. ఆ వర్గాలకు మరింత మేలు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటికే తండాలను ప్రత్యేక పంచాయతీలు చేశారు. గ్రామ పరిపాలనలో వారిని కూడా భాగస్వామ్యం చేశారు. తండాల అభివృద్దికి మార్గం వేశారు. ఎన్నోఏళ్లుగా అపరిషృతంగా వున్న ఆ సమస్యను తీర్చారు. ఇప్పుడు గిరిజనుల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపే గిరిజనబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గిరిజన బంధుతో వారి జీవితాలకు దశ, దిశ చూపించనున్నారు. 10శాతం రిజర్వేషన్లతో వారికి మరిన్ని విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. వారం రోజుల్లో జీవో విడుదల చేస్తామన్నారు. తెలంగాణలోని రైతులందరికీ అందుతున్నట్లే పోడు సాగు చేసుకునే గిరిజనుందరికీ రైతు బంధు అమలు చేస్తామని చెప్పడంతో గిరిజన వర్గాలోహర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఒక్కసారిగా ఎన్టీఆర్ స్టేడియంలో ఉద్వేగ భరితమైన వాతావరణం నెలకొన్నది. గిరిజన ఆదివాసీల కరకళ ద్వానాలతో సభ మారు మ్రోగిపోయింది. కేసిఆర్ జిందాబాద్ అంటే నినాదాలు మిన్నంటాయి. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ సంతోషాన్ని ఆపుకోలేక ముఖ్యమంత్రి కేసిఆర్‌కు పాదాభివందనం చేశారు.
ఎన్టీఆర్ మైదానంలో లక్షలాది మంది గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ ప్రకటనలు చేసి, వారిని సెప్టెంబర్ 17 కానుకగా అందించారు. తెలంగాణ ఒక సంక్షేమ రాష్ట్రంగా అవతరిస్తోంది. తెలంగాణ ఒక సంక్షేమ జీవనానికి వేధికౌతుంది. అందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన ఒక స్వర్ణయుగం కానున్నది. అసలు ఇలాంటి పధకాలు గురించి ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. అమలు చేయలేదు. కనీసం ఊహలకు కూడా అందని పధకాలను కలలో కూడా కలగనలేదు. మార్గదర్శకుడంటే కేసిఆర్‌లా వుండాలి. మార్గ నిర్ధేశకుడు కేసిఆర్ ఆలోచించాలి. సంక్షేమ వాది కేసిఆర్‌లా నిర్ణయాలు తీసుకోవాలి. సంక్షేమ సారధి కేసిఆర్‌లా అమలు చేయాలి. మొత్తంగా ప్రజల సుసంపన్న జీవితాలను కాంక్షించే నేతలు కేసిఆర్‌లా వుండాలి. కేసిఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కేసిఆర్‌లా పాలించాలి. అప్పుడు దేశం సుభిక్షంగా వుంటుంది. ప్రజలంతా నిత్యం పండగలా గడుపుతారు. ప్రతి రంగం అభివృద్ధి చెందుతుంది. ప్రతి సామాజిక వర్గం ఉన్నతంగాజీవిస్తుంది. ఎవరూ ఊహించని దెబ్బ కొట్టడమే కేసిఆర్ రాజకీయ చాణక్యమని మరోసారి నిరూపించారు. సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయం చేయాలనుకున్న బిజేపి ఆశలు ఆవిరిచేశారు. ఇప్పటికే అమలౌతున్న దళిత బంధు మీద రకరకాల కామెంట్లు చేస్తూ, దళిత వర్గాలకు దూరమైన బిజేపిని గిరిజనులకు, ఆదివాసీలకు దూరం చేసే స్కెచ్ కేసిఆర్ వేశారు. అదును చూసి సెప్టెంబర్ 17న ప్రకటించారు. దాంతో ఆయా వర్గాల ఓట్లను గంప గుత్తగా తన ఖాతాలో వేసుకునేందుకు కేసిఆర్ వేసిన ఎత్తు ముందు బిజేపి చిత్తైందనే చెప్పాలి. ఇలాంటి ప్రకటన చేస్తాడని బిజేపి అంచనా వేయలేకపోయింది. అందులోనూ సెప్టెంబర్ 17న కేసిఆర్ గిరిజన బంధు ప్రకటన చేస్తాడని అసలే ఊహించలేకపోయింది. అంతే కాకుండా ఏకంగా మూడు రకాల వరాలు కూడా ఒకే వేధిక మీద నుంచి కేసిఆర్ ప్రకటించాడు. బిజేపిని చిక్కుల్లో పడేశారు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా బిజేపికి మార్గం లేకుండా చేశారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచి అమలు చేస్తాం…అందుకు సహకరిస్తారా? లేదా? అని సవాలువిసిరారు. దాంతో రాష్ట్ర బిజేపి నేతల్లో పచ్చి వెలక్కాయ పడ్డంత పనైంది. నిజానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నామన్న సంతోషంలో బిజేపి వుంది. కాని ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ వాతావరణం మారిపోయేలా, బిజేపిని ఉక్కిరి బిక్కిరి చేసేలా కేసిఆర్ వేసిస పథకంతో దిమ్మ తిరిగిపోయిందనే చెప్పాలి. కేంద్ర హోం మంత్రి రాజకీయం కూడా తుస్సుమన్నది అని చెప్పకతప్పదు. ఇదిలా వుంటే గిరిజనులు, ఆదివాసీలకు రైతు బంధు అమలు చేయడం అన్నది ఒక సంచలన నిర్ణయమని చెప్పకతప్పదు. గిరిజన రిజర్వేషన్లు పెంచుకోవడం అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం. తెలంగాణ ప్రతిపాదనను బిజేపి అంగీకరిస్తుందా? దళిత వర్గాల ముందు దోషిగా నిలబడుతుందా? అన్నది త్వరలో తేలిపోతుంది. దాంతో బిజేపి రాజకీయానికి తెలంగాణలో స్కోప్ లేకుండాపోతుంది. వున్న స్పేస్ కూడా కనుమరుగౌతుంది. బిజేపిలో వున్న గిరిజన, ఆదివాసీ నేతలు కూడా టిఆర్‌ఎస్ వైపు అడుగులేయక తప్పని పరిస్దితిని కేసిఆర్ సృష్టించారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఊపిరిసల్పకుండా చేద్దామనుకున్న బిజేపికి ఊహించని గిఫ్ట్‌ను కేసిఆర్ ఇచ్చినట్లైంది. తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చూస్తుంటే చూస్తూ ఊరుకోనని కేసిఆర్చెబుతూనే వస్తున్నాడు. కాని బిజేపియే పెడ చెవిన పెట్టింది. తమ రాజకీయం ముందు అందరూ దిగదుడుపే అని అనుకున్నది. కాని కేసిఆర్ కొట్టే రాజకీయ కౌకు దెబ్బల రుచి బిజేపికి ఇప్పుడిప్పుడే మొదలైందని తేలిపోయింది.
గిరిజన ఆది వాసీ ఆత్మీయ సమ్మేళనానికి లక్షలాదిగా తరలి వచ్చిన వారినిద్దేశించి కేసిఆర్ మాట్లాడారు. ఒకడు కులం పేరుతో, మరొకడు మతం పేరుతో తెలంగాణలో విద్వేశాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి విద్వేశాలకు తెలంగాణలో తావివ్వొద్దని సిఎం కేసిఆర్ కోరారు. తెలంగాణ కోసం కులమతాలకతీతంగాం 58 సంవత్సరాలు కొట్లాడాం…తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ 5శాతం వుండేది. తెలంగాణలో వారి జనాభా 10శాతం వుంది. తెలంగాణలో గిరిజనులక 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం వుంది. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లు 50శాతానికి మించి లేదని రాసి లేదన్నారు. తమిళనాడులో అమలౌతున్న రిజర్వేషన్ చట్టాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆదివాసీ బిల్లును ఆమోదించాలని కోరారు. త్వరలో పోడు భూముల సమస్య పరిష్కారానికి అవసరమైన కమిటి ఏర్పాటు జరిగింది. అందుకు జివో. నెంబర్140 కూడా జారీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో గిరిజన సంస్కృతిని కాపాడుకుంటున్నామన్నారు. అచ్చం పేటలో అడవుల్లో వుండే చెంచులతో సహా, ఆదిలాబాద్‌లో వుండే ఆదివాసీలకు కూడా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గిరిజన, ఆదివాసీల పండుగలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. తెలంగాణ స్వరాష్ట్రం కావడం వల్లనే ఇవన్నీ సాద్యమౌతున్నాయని కేసిఆర్ చెప్పారు. అలాగే వచ్చేరోజుల్లో గిరిజన రిజర్వేషన్లు 10శాతం అమలు చేసుకుంటామని కేసిఆర్ వెల్లడిరచారు. సబ్బండ వర్గాలన్నీ కలిసి కొట్లాడిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
`త్యాగధనుల త్యాగాలను సైతం మలినం చేయాలని చూస్తున్నాయి.
`రెప్ప పాటు కాలం కూడా ఆదమర్చిపోవద్దు.
`చైతన్య వంతమైన తెలంగాణ సమాజంలో సంకుచితాలకు తావులేదు.
`సంక్షేమ తెలంగాణలో చిచ్చుపెట్టాలని చూస్తున్న వారి ఉచ్చులో యువత పడొద్దు.
`పెడదారిలో రాజకీయం చేయాలని చూస్తున్న వారి మాయలో పడొద్దు.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒక్కసారి చేసిన పొరపాటు 58 సంవత్సరాల పాటు అనుభవించాం. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిరది. ఆనాడే మనం మోసపోయాం. దోపిడీకి గురయ్యాం. శాపగ్రస్త జీవితాలు అనుభవించాం. తెలంగాణ కోల్పోయిన అస్ధిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతో కాలం పోరాడాల్సివచ్చింది. ఎంతో మందిని కోల్పోవాల్సివచ్చింది. ఎంతో మంది త్యాగాలు చేయాల్సివచ్చింది. తెలంగాణ కొన్ని తరాలు వేధన అనుభవించింది. ఈ చరిత్రంతా మన కళ్లముందే కనిపిస్తోంది. వాటిని తల్చుకుంటే ఇప్పటికీ నా కళ్లలో నీటి సుడులు తిరుగుతుంటాయని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ ఎన్నటికీ తెలంగాణలో అశాంతి, అలజడులు రావొద్దు. కళ్లోలంలోకి జారి పోవద్దని తెలంగాణ సమాజానికి సూచించారు. ఎంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామో, అంతే వేగంగా ప్రగతిని కొనసాగించాలన్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర గొప్పగా ఆవిషృతం కావాలి.అందుకు తెలంగాణ ఉజ్వల పాత్రను పోషించాలి. భారత జాతి సమైక్యత, సమగ్రత కోసం , అభ్యున్నతి కోసం మన వంతు కృషి చేద్దామని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు. పచ్చగా, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి. సంకుచిత రాజకీయ శక్తులు కాచుకొని కూర్చున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చీలికకు దుష్టపన్నాగం పన్నుతున్నాయి. సామాజిక సంబంధాల మధ్య ముళ్ల కంపలు నాటుతున్నాయి. మనుషుల మధ్య విద్వేశపూరిత మంటలు రగిలిస్తున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. జాతి జీవనాడిలో కలకలం రేపుతున్నాయి. మానవత్వాన్ని కబలించే కుట్రలు చేస్తున్నాయి. జాతీయ సమైక్యతకుప్రతీకగా నిలవాల్సిన సెప్టెంబర్ 17ను సైతం వక్రీకరిస్తున్నారు. చరిత్రను కలుషితం చేస్తున్నారు. విచ్చిన్న కరశక్తులుగా మారుతున్నారు. చిల్లర రాజకీయాల కోసం ప్రజల మధ్య దూరం పెంచే కుయుక్తులు పన్నుతున్నారు. ఘనమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించే కుటిల రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ త్యాగాలను సైతం మలినం చేస్తున్నారు. ఎంతో క్రియాశీలకమైన, చైతన్యవంతమైన మేధో సంపత్తి కల్గిన తెలంగాణ సమాజాం అప్రమత్తంగా వుండాల్సిన సమయమిది. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా వుండాలి. రెప్ప పాటు కాలం ఆదమర్చినా తెలంగాణ సమాజం కల్లోలంలోకి కూరుకుపోయే ప్రమాదం వుందని ముఖ్యమంత్రి కేసిఆర్ హెచ్చరించారు.ఒకసారి కాదు, మూడు సార్లు తెలంగాణ సమాజమంతా ఏకమై పోరాటం చేసిన చరిత్ర ప్రపంచంలో ఒక్క తెలంగాణదే.
భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటంతోపాటు, ఇండియా జాయిన్ ఉద్యమం, 1969 ఉద్యమం, తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో సాగిన ఉద్యమాల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావిచారు. తెలంగాణ అస్తిత్వ, రైతాంగ పోరాటాన్ని ప్రారంభించిన రావి నారాయణ రెడ్డి నుంచి మొదలు కొని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎంతో మంది తెలంగాణ వీరులను ముఖ్యమంత్రి కేసిఆర్ స్మరించుకున్నారు. ఆదిలాబాద్‌లో జల్, జంగిల్, జమీన్ పేరుతో పోరాటం సాగించిన తెలంగాణ యోధుడు కొమరంభీమ్, వరంగల్ జిల్లాలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాటాలు గుర్తు చేశారు. తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేసి, జాయిన్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన రామానంద తీర్ధ రగిలించిన స్వాతంత్య్ర ఉద్యమాలను ప్రస్తావించారు. గ్రంధాలయ ఉద్యమంలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిలించిన మట్టి మనుషులు పుస్తకం రచయిత వట్టికోట అల్వారు స్వామితో చైతన్యం గురించి వివరించారు. తెలంగాణ టైగర్ నల్లా నర్సింహులు, భీమ్ రెడ్డి నర్సింహారెడ్డి వంటి యోధుల పోరాటాలను, త్యాగాలను ముఖ్యమంత్రి కేసిఆర్ గుర్తు చేశారు. వారి త్యాగాలను కొనియాడారు. వారి పోరాట స్పూర్తి రగిలించిన చైతన్యం మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఎంత ఉపయోగపడిరదో చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను చేసిన పోరాటం గురించి వివరించారు. తానే స్వయంగా పూరించిన తెలంగాణ పోరాట శంఖం మరోసారి గుర్తు చేశారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి, మరణం అంచుల వరకు వెళ్లి తెలంగాణ సాధించిన విధం ప్రజల కళ్లముందే వుందని గుర్తు చేశారు.
తెలంగాణ సాధించున్నాక తెలంగాణ రాష్ట్రంలో అమలౌతున్న ప్రగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ వివరించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా పురోగమిస్తోతందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ముందు ప్రజలు ఏం కలలు గన్నారో, ఆ తెలంగాణ ఆవిషృతమౌతోందన్నారు. తెలంగాణ సిద్ధించిన తొలి ఏడాదిలోనే తెలంగాణలో చిమ్మచీకట్లను పారద్రోలిన, విద్యుత్ వెలుగులు నిండిన తెలంగాణ ఆవిషృతం గురించి వివరించారు. దేశానికే తెలంగాణ ఒక టార్చి బేరర్‌గా నిలిచిందన్నారు. తాగు, సాగు నీటిరంగంలో ఎదురైన సవాళ్లును తెలంగాణ ఎలా అధిగమించిందో చెప్పారు. ప్రజా సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికి ఎలా ఆదర్శంగా నిలుస్తుందో వివరించారు. పారిశ్రామిక, ఐటి, ఫార్మా రంగాలలో తెలంగాణ ఎన్ని అధ్భుతాలను సృష్టించిందో చెప్పారు. సంపదనను పెంచాలి.
ప్రజలకు పంచాలనే లక్ష్యంతో పేదిరిక నిర్మూలన, సమసమాజ నిర్మాణం పేరుతో సంక్షేమ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిన సంగతిని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో అతి తక్కువ కాలంలో తెలంగాణలో ఆవిషృతమైన విజయం దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఆరు నెలల కాలంలో రైతాంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసిఆర్ అన్నారు. అంతే కాదు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అని అన్నారు. అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణలో నేడు సస్యశ్యామల తెలంగాణగా వర్ధిల్లుతోందని సిఎం అన్నారు. అనేక రైతు విధానాలను అమలు చేయడం వల్ల తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు సాగుతుండడం మనందరికీ గర్వకారణమన్నారు. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి, తెలంగాణ సమృద్ధి రాష్ట్రంగా విలసిల్లుతోందన్నారు. విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసకొచ్చిన ఘనత కూడా మనదే అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే కాదు, ఆరోగ్య రంగంలో తెలంగాణ అధ్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. ఇలా తెలంగాణ అన్ని రంగాల్లో అధ్భుతమైన ప్రగతితో దూసుకుపోతుంటే బిజేపి చేస్తున్న రాజకీయ కుయుక్తుల గురించి పరోక్షంగా ప్రస్తావించి ఆ పార్టీని తూర్పారపట్టాడు. అసలు తెలంగాణలో జాతీయ సమైక్యత ఆవశ్యకతను వివరిస్తూనే తెలంగాణ గురించి పూర్తి చరిత్రను ప్రజల ముందుంచారు. భూస్వాముల కాలం నుంచి పోరాట యోధులను పోరాటాలను గుర్తు చేస్తూ, ప్రజల్లో చైతన్యం నింపిన చైతన్య దీప్తిలాంటి నాయకుల సేవలు స్మరిస్తూ వచ్చారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా వర్ధిల్లుతున్న సమయం నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణను ఆంధ్రలో కలపడం మూలంగా తెలంగాణకు జరిగిన నష్టం గురించి వివరించారు. 58 ఏళ్లపాటు పడిన కష్టాల గురించి, అనుభవించిన గోసల గురించి సిఎం. ఏకరుపెట్టారు. తర్వాత 1969లో ఉద్యమం, 2001 టిఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉద్యమాలను గుర్తుచేసుకున్నారు.తెలంగాణసాధించి సాగింగిన ప్రగతిని మన కళ్లముందు ఆవిష్కరించారు. బిజేపి చేస్తున్న రాజకీయ విన్యాసాలను కూడా వివరించారు. ప్రజలను అప్రమత్తంగా వుండాలని కూడా సూచించారు. చైతన్యం నిండిన తెలంగాణ సమాజాన్ని ఎవరూ మోసం చేయలేరని కూడా సిఎం చెప్పారు.
టిపిసిసి అధ్యక్షులు శ్రీ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు (17-09-2022) హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో జాతీయ జెండా హనుమకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు ఎగరవేశారు.*
1948, సెప్టెంబర్ 17న నిజాం నవాబు పాలిస్తున్న రాచరిక పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అత్యంత కీలకమని, బ్రిటిష్ రాచరిక పాలన ను అంతమొందించేందుకు జాతీయ కాంగ్రెస్ ప్రజా మద్దతుతో అనేక పోరాటాలు,
ఉద్యమాలు చేసి వందలాది మన మహా నేతలు నెలల తరబడి జైల్లో మగ్గి, సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటాల ఫలితంగా బ్రిటిష్ పాలకులు 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు
దేశంలో అంతర్భాగంగా ఉన్న 560 సంస్థానాలను అప్పటి ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, అప్పటి హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లు దేశంలో విలీనం చేసుకున్నారు. అలాగే అప్పట్లో మహారాష్ట్ర, కర్ణాటక లోని కొన్ని ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ సంస్థానం కూడా దేశంలో విలీనం చేయాలని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. కానీ నిజాం సర్కార్, రజాకార్ల హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్ర దేశంగా కానీ, పాకిస్తాన్ లో విలీనం అనే ప్రతిపాదనలు తెచ్చారు. అప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా వ్యవహరించి జాతీయ కాంగ్రెస్ నాయకులతో మన కాంగ్రెస్ నాయకులు రామనంద తీర్థ, జమలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు తదితర మహా నాయకులు చర్చించి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, అప్పటి హోమ్ శాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ లతో చర్చలు జరిపి ఆపరేషన్ పోలో ద్వారా హోమ్ శాఖ మంత్రి శ్రీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ కి వచ్చి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశం లో విలీనం చేసుకొని హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని అందించారు.తర్వాత బాషప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లో భాగంగా ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాలు ఏర్పడడంతో హైదరాబాద్ రాష్ట్రం మూడు భాగాలుగా విడిపోయి 10 జిల్లాల్లో తెలంగాణ గా, మూడు జిల్లాలు కర్ణాటక, మూడు జిల్లాలు మహారాష్ట్రలో కలిసిపోయాయి. తర్వాత 60 ఏళ్లపాటు మళ్ళీ 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలయిందని ఆ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ గౌరవించి 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ ను కూడా కేంద్రంలోని శ్రీమతి సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014 లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్ధాలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా దేశానికి స్వాతంత్రం తెచ్చింది,
హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛ వాయువులు అందించి రజాకార్ల నుంచి విముక్తి అందించిందని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
ఇంత గొప్ప ప్రజాసరాలను తీర్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న పెద్దఎత్తున కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయాలని నేడు టిఆర్ఎస్ బిజెపి పార్టీలు చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఈ దేశానికి రాష్ట్రానికి స్వాతంత్రం ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఎవరు అపహాస్యం చేయాలని చూసిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు మాజీ నగర మేయర్ శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ గారు మహ్మద్ అయూబ్ బంక సరల బొమ్మతి విక్రం అజీజుల్లా బేగ్ పెరమాండ్ల రామకృష్ణ బంక సంపత్ యాదవ్ పులి రాజు అంకూస్ రాహుల్ రెడ్డి సతీష్ సారంగం రమేశ్ తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.