బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి.

Education

బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి.

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల ఏబీవీపీ చిట్యాల శాఖ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కి ఏబీవీపీ నగర కార్యదర్శి బుర్ర అభిజ్ఞ గౌడ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న
తెలంగాణ ప్రాంత హాస్టల్స్ కన్వీనర్
వేల్పుల రాజ్ కుమర్ మాట్లాడుతూబడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి..
పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.*
విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.*
ఏ ఎఫ్ ఆర్ సి తన ఫీజుల పెంపు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి.*
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తున్నది.విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తున్నది. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించి, వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదు.అని అన్నారు
వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!