10టీవీ రిపోర్టర్ పొనగంటి స్వామి రావుకు ఘన సన్మానం
హనుమాన్ మాల దీక్ష స్వాముల ఆధ్వర్యంలో వరల్డ్ ప్రెస్ దినోత్సవం వేడుకలు
నర్సంపేట, నేటిధాత్రి:
వరల్డ్ ప్రెస్ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో హనుమాన్ మాల దీక్ష స్వాముల ఆధ్వర్యంలో జర్నలిస్టు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, 10టీవీ నర్సంపేట విలేకరి పొనగంటి స్వామి రావును పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం జర్నలిస్ట్ గురుస్వాములు అందేశ్వర స్వామి, కోల ప్రవీణ్ స్వామి సమక్షంలో నిర్వహించగా మాజీ సర్పంచ్, గురుస్వామి ఆలకుంట సురేందర్ మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా జర్నలిజాన్నే ధ్యేయంగా సమాజంలో సేవ చేయాలనే తపనతో మండల స్థాయి విలేకరి నుంచి జిల్లా స్థాయి విలేకరిగా అంచెలంచెలుగా ఎదిగిన సీనియర్ జర్నలిస్టు పొనగంటి స్వామి అని కొనియాడారు. సమాజ సేవలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్తా సేకరణ చేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటున్నారని, ఆయనకు జర్నలిస్టు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో దొరికిన రమేష్, చీపురు మల్లయ్య, ప్రశాంత్, సూర్యప్రకాష్, మూడు ప్రేమాకర్, సిద్దు, అనిల్, దుర్గయ్య, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
