జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సిరిసిల్ల
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్ష స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 16 మంది స్కౌట్స్ మరియు 16 మంది గైడ్స్ దీక్ష స్వీకారం చేశారు. పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా వారికి స్కౌట్స్ అండ్ గైడ్స్ దుస్తులను పంపిణీ చేయడం జరిగింది.
స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణ, ప్రకృతి మరియు జంతువుల పట్ల దయాగుణం, వృద్ధుల పట్ల సేవాభావం వంటి మంచి విలువలను పెంపొందించడం.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శారదా మేడం, అనురాధ మేడం, తిరుపతి సార్, గైడ్ టీచర్ కొండికొప్పుల మంజుల గారు, స్కౌట్ మాస్టర్ తడుకల సురేష్, మరియు ఇతర ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
