మండల వ్యవసాయాధికారి గిరి రామకృష్ణ
కాటారం నేటి ధాత్రి
కాటారం మండల రైతులకు 60% సబ్సిడిపై జీలుగ విత్తనాలు పంపిణి చేయడానికి, ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం కాటారం వద్ద బస్తాలు అందుబాటులో ఉంచడం జరిగిందని కాటారం మండల వ్యవసాయాధికారి గిరి రామకృష్ణ బుధవారం ప్రకటనలో తెలిపారు. 30 కిలోల బస్తా పూర్తి ధర రూ. 2,790/-, సబ్సిడిపై రైతు చెల్లించ వలసిన ధర రూ. 1,116/అని తెలిపారు.
విత్తనాలు కావలసిన రైతులు ఆధార్, పట్టా పాస్ బుక్ తో రైతు వేదిక వద్ద ఏఇఓ తో పర్మిట్ నెంబర్ తీసుకోని, ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం కార్యాలయం లో బస్తాలు తీసుకోవాలని తెలిపారు.
జీలుగ విత్తనాలు వాడి భూసారం పెంచుకొవచ్చని, రసాయన ఎరువుల ఖర్చును తగ్గించవచ్చాన్నారు.
అదేవిధంగా యాసంగి లో వరి వేసిన రైతులు, పంట కోత అనంతరం మిగిలిన వరి కొయ్యలను నేలలోనే ఖచ్చితంగా కలియదున్ని భూసారం పెంచుకోవాలన్నారు.
కలియదున్నిన తరువాత త్వరగా కుళ్ళడానికి 3 బస్తాలు సింగిల్ సూపర్ పాస్పెట్ వాడాలని అన్నారు. అలాకాకుండా వరి కొయ్యలు కాల్సితే భూములు చౌడుగా మారుతాయని, కావున ఏ ఒక్క రైతు కూడా వరి కొయ్యలు కాల్చకూడదని సూచించారు.