కాలి నడకన దారూర్ జాతర వెళ్తున్న భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించిన యువకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నుండి దారూర్ జాతరకు కాలి నడకన వెళ్తున్న భక్తులందరికీ బంటారాం గ్రామం వద్ద జహీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు . పాదయాత్ర గా వెళ్తున్న వారికి మార్గ మధ్యలో భోజనానికి మంచి నీళ్లకు ఇబ్బంది కలగకుండా భోజనాలు పండ్లు మంచి నీళ్లు సౌకర్యం అందుబాటులో పాదయాత్రగా వెళుతున్న భక్తులకు ఇబ్బందులు కలగాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు, దారూర్ వెళ్లే భక్తులను జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాల సంతోషంగా జీవించాలని దేవునితో ప్రత్యేక ప్రార్థనలు చేయాలన్నారు,
ఈ కార్యక్రమంలో తిమోతి, ప్రభాకర్, వినోద్ భాను, భాస్కర్, యువరాజ్ రాజు తదితరులు పాల్గొన్నారు,
