జూన్ లో యశ్ వర్సెస్ రామ్ చరణ్ లాభమా? నష్టమా?

జూన్ లో యశ్ వర్సెస్ రామ్ చరణ్
లాభమా? నష్టమా?

సాధారణంగా సమ్మర్ సీజన్ అంటే టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పెద్ద పండగ లాంటిది. అయితే ఈ ఏడాది లెక్కలు పూర్తిగా మారిపోయాయి. వేసవి సెలవుల్లో థియేటర్లను షేక్ చేయాల్సిన కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు పలు కారణాల వల్ల జూన్ నెలకు షిఫ్ట్ అయ్యాయి. దీంతో జూన్ బాక్సాఫీస్ ఇప్పుడు ఒక పెను సవాల్‌ను ఎదుర్కోబోతోంది. అగ్ర హీరోలందరూ ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో అంచనాలు హై రేంజ్‌లో ఉన్నా, మరోవైపు ఒకే నెలలో ఇన్ని సినిమాలు రావడం పెద్ద రిస్క్ అనే చర్చ కూడా నడుస్తోంది. అటు నిర్మాతలకు ఇటు ప్రేక్షకులకు ఈ జూన్ నెల ఒక అగ్నిపరీక్షలా మారబోతోంది.

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ఈ ఏడాది మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమాలు. వాస్తవానికి ఈ రెండు సినిమాలు ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పుడు జూన్​కు షిఫ్ట్ అయ్యాయి. యశ్ టాక్సిక్ జూన్ 4న వస్తుండగా, రామ్ చరణ్ పెద్ది ఏప్రిల్ 30 నుంచి జూన్​కు వాయిదా పడింది. ఈ రెండు చిత్రాలు వేల కోట్ల బిజినెస్‌తో ముడిపడి ఉన్నాయి. ఒకే నెలలో రెండు పాన్ ఇండియా చిత్రాలు రావడం వల్ల వసూళ్ల పరంగా కొంత చీలిక వచ్చే అవకాశం ఉంది.

అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ సినిమా నిజానికి మే 1న రావాల్సి ఉంది. రామ్ చరణ్ పెద్ది సినిమా ఏప్రిల్ 30న వస్తున్నట్లు ప్రకటించడంతో పోటీ రాకూడదనే ఉద్దేశంతో అఖిల్ తన సినిమాను జూన్ 26కు వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు చరణ్ పెద్ది ఏప్రిల్ నుంచి వాయిదా పడింది. ఇది జూన్ 25 లేదా 27కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో అఖిల్​కు మళ్లీ క్లాష్ తప్పేలా లేదు. చరణ్‌తో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ అఖిల్ తన సినిమాను వెనక్కి జరిపినా, బాక్సాఫీస్ లెక్కల ప్రకారం జూన్ నెలాఖరులో ఈ రెండు సినిమాలు ఎదురెదురుగా క్లాష్ అయ్యే ఛాన్స్ ఉండడంతో ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

యశ్, రామ్ చరణ్, అఖిల్ మాత్రమే కాకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ కూడా జూన్ నెలను టార్గెట్ చేసింది. ఈ సినిమా జూన్ 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతేడాదే ప్రకటించారు. కానీ, ఈ సినిమాకు వర్క్ ఇంకా చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో ఇది వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది.

తెలుగు, కన్నడ హీరోలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 కూడా జూన్ రేసులో ఉందనే వార్తలు వస్తున్నాయి. జూన్ 12న ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల టాక్. ఒకవేళ రజనీకాంత్ కూడా బరిలోకి దిగితే బాక్సాఫీస్ వద్ద పరిస్థితి మరింత వైరల్‌గా మారుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version