ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా సునీల్ కు సన్మానం .
చిట్యాల, నేటిధాత్రి ;
వరల్డ్ పీస్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్వర్యంలో హన్మకొండ అశోక హోటల్ లో జరిగిన కార్యక్రమంలో చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కవి రచయిత మ్యాదరి సునీల్ ను సన్మానించడం జరిగింది,సునీల్ ఇప్పటికే ఎన్నో పాటలు రాస్తూ జిల్లాలో మంచి పేరు పొందుతున్నాడు సునీల్ సామాజిక కోణంలో గాని సినిమా పరంగా గాని అనేక అంశాల మీద గాని సందర్భాన్ని బట్టి రాసే కవి మ్యాదరి సునీల్ అందులో భాగంగా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రపంచానికి కవులు ఏమవుతారు అనే అంశం మీద సునీల్ తనదైన శైలిలో పాటను రాయడం జరిగింది అందుకు గాను ఆ సంస్థ అధ్యక్షులు మహమ్మద్ సిరాజుద్దిన్ మరియు ముఖ్య అతిథి వరంగల్ సైబర్ క్రైమ్ కూజ విజయ్ కుమార్ ఆచార్య రవికుమార్ విప్పనపల్లి రవి కుమార్ మ రియు ప్రముఖుల చేతుల మీదుగా కవి రచయిత మ్యాదరి సునీల్ కి ఘనంగా సన్మానం చేయడం జరిగింది జూకల్ గ్రామ ప్రజలు కూడా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ సంస్థ ఇదివరకు
ప్రజా కవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ప్రోపేసర్ జయశంకర్ సర్ లాంటి మహనీయులకు సన్మానం చేసిన సంస్థ నాకు చేయడం పూర్వజన్మ సుకృతంఅని అన్నారు,