ప్రపంచ మలేరియా దినోత్సవం…
జహీరాబాద్. నేటి ధాత్రి:
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కోహిర్ మండల్ బిలాల్ పూర్ గ్రామ ప్రాథమిక వైద్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించి డాక్టర్ బి నరేందర్ మాట్లాడుతూ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి ఒక ప్రయత్నం.ప్రతి సంవత్సరం 25 న ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.ఈ ప్రపంచ ఆరోగ్య సవాలును పరిష్కరించడంలో, నిర్మూలించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా అనేది నివారించదగిన వ్యాధి.ఇది చికిత్సతో నిర్ములించుకోవచ్చు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, జీవితాలను ప్రభావితంప్రకారం చేసే సమస్య. కనుక దీనిని నివారించడానికి సరైన దిశలో చర్యలు తీసుకోవాలన్నారు.ఇటి కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ సోనీ, ల్యాబ్ టెక్నీషియన్ జె వాసంత్రావు యమ్ పి హెచ్ ఏ నిరంజన్, సూపర్ వైసర్ శోభారాణి ఆశ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.