ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ ఎత్తున నిరసన

ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ ఎత్తున నిరసన

ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలన్నీ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

ఉపాధ్యాయులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న పిఆర్సి డిఏలు వెంటనే ప్రకటించాలని అలాగే పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్, పి ఆర్ టి యు ప్రధాన కార్యదర్శి బీరం జనార్దన్ రెడ్డి, డిటిఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య, యుటిఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీను, టీ పస్ అధ్యక్షులు రాజు, టి ఆర్ టి యు నాయకులు సత్యనారాయణ లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కేసముద్రం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అన్ని సంఘాల ఉపాధ్యాయులు, మండల పరిషత్ మరియు తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు గుండు సురేందర్, చీకటి వెంకట్రాంనర్సయ్య, బీరం జనార్దన్ రెడ్డి భూక్య శ్రీను, కీర్తి నాగయ్య, సత్యనారాయణలు రాజు లు మాట్లాడుతూ ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం,ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి

 

పెండింగ్‌లో ఉన్న పి ఆర్ సి ను వెంటనే అమలు చేయాలని,
పెండింగ్ కరువు భత్యం లు తక్షణమే ప్రకటించాలని,
సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని,
పెండింగ్‌లో ఉన్న జీపీఫ్ బకాయిలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని,
రిటైర్ అయ్యే ఉద్యోగులకు అదే రోజున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని,
ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని,
కేజీబీవీ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందించాలని,
2008 డి ఎ స్సీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తమ న్యాయమైన డిమాండ్ల సాధన కై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రాం నర్సయ్య తో పాటు టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, బి మదన్మోహన్, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కుమార్, టిపిటిఎఫ్ సీనియర్ నాయకులు, స్టేషన్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, టిపిటిఎఫ్ మండల కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊట్కూరు ప్రణయ్ కుమార్, అరుణ్ కుమార్, మేరుగు శ్రీనివాస్, రాజన్న,నర్సింహా స్వామి ముదిగిరి సదయ్య, జి శ్రీనివాస్, బొల్లెద్దు చందర్, టి రమేష్ , అప్పాల నాగరాజు, రామ్ చందర్ కే . శ్రీనివాస్, సౌరం సుధాకర్, కపిల్,కత్తి శ్రీశైలం, పి ఆర్ టి యు సభ్యులు కుర్నా హరినాథ్, విజయ్,నాయుడు,కే.రమేష్. డిటిఎఫ్ డి సి గంగుల శ్రీనివాస్, యుటిఎఫ్ సభ్యులు బద్రా సింగ్,భద్రు, స్వప్న, మండలంలోని పలు శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version