చీరలొద్దంటున్న చెల్లెండ్లు… 2500 ఎప్పుడిస్తరని అడుగుతుండ్రు?

`కాంగ్రెస్ నాయకులకు చుక్కలు చూపిస్తుండ్రు?

`ఎక్కడికక్కడ మహిళల నిలదీత.. నాయకులకు ఉక్కపోత?

`మంత్రులనే ప్రశ్నిస్తున్న మహిళా లోకం!

`బతుకమ్మ చీరలు అప్పుడే పంచితే అయిపోయేది?

`ఇప్పుడు పంచితే ఎన్నికల కోసమే అన్నట్లుంది?

`పంచాయతీ ఎన్నికల ముందు చీరలు పంచారు?

`మునిసిపల్ ఎన్నికల ముందు మళ్ళీ పంచుతున్నారు?

`ఇప్పుడు అడగకపోతే ఇక ఇవ్వరు?

`ఆరు గ్యారెంటీలు అమలు చేయరు?

`ఇప్పుడు తప్పితే మళ్ళీ దొరకరు.. జనం ముఖం కూడా చూడరు?

`తర్వాత అని చెప్పి తప్పించుకుంటారు?

`మళ్ళీ ఎన్నికల దాకా జనాన్ని దేఖరు?

`ఓట్ల కోసమోచ్చినప్పుడే అడగాలే… ఇస్తేనే ఓట్లు వేయాలే?

`మున్సిపల్ ప్రాంతాల మహిళల్లో వచ్చిన చైతన్యం?

`పథకాలు తప్పించుకునేందుకే హడావుడి ఎన్నికలు?

`వచ్చే సర్వత్రిక ఎన్నికల దాకా ఉండవు తిప్పలు?

`సీఎం నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని భావిస్తున్నాను కాంగ్రెస్

నాయకులు?

`భవిష్యత్తులో కాంగ్రెస్ అంటే నమ్మకం లేకుండా పోతుందని నాయకుల్లో దిగులు?

`కాంగ్రెస్ ఒక్క సారి మాట ఇస్తే అమలు చేస్తుందని నమ్మిన ప్రజలు?

`ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్న పాలకులు?

`గతంలో ఇచ్చిన హామీలు ఎప్పుడూ కాంగ్రెస్ తప్పించుకోలేదు?

`అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించారు?

`మంత్రులు, ఎమ్మెల్యే లు నోరు తెర్వకపోతే మొదటికే మోసం రావొచ్చు?

`కాంగ్రెస్ శ్రేణులు ఆగం కావచ్చు.. రాజకీయంగా పార్టీకి కోలుకోలేని పరిస్థితి రావచ్చు?

`బీఆరఎస్ గద్దెలు కూలితే కాంగ్రెస్ గద్దెలు కట్టాలి?

`టీడీపీ జెండాలు ఎగరాలని సీఎం అంటే కాంగ్రెస్ నాయకులకు సోయి రాలేదు?

`కాంగ్రెస్ మీద ప్రజలకున్న నమ్మకం తుడుచుకు పోతోంది గ్రహించండి?

`ఇప్పటికైనా మించి పోయిందేమి లేదు కాంగ్రెస్ ను కాపాడుకోండి!

హైదరాబాద్, నేటిధాత్రి:

తెలంగానలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చి, రేవంత్ సర్కారు ఏర్పాటై రెండేళ్ల కాలం పూర్తయ్యింది. అదే సమయంలో కాంగ్రెస్‌లో అంతర్యుద్దం మొదలైంది. ప్రజలు ప్రశ్నించడం మొదలైంది. ప్రభుత్వంలో ఏ రకమైన లుకలుకలు వున్నాయో అటీవల బైటపడింది. ప్రభుత్వంలో ఎంత సమిష్టి వ్యవహారం నడుస్తుందో వాళ్లుకు వాళ్లే బైట పెట్టుకున్నట్లైంది. ఇక తాజాగా మున్సిపల్ ఎన్నికల నిర్వహనకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు మున్సిపాలిటీ పరిధిలో చీరల పంపకం మొదలైంది. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చి పడుతోంది. చీరల పంపిణీని ఎంతో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. సభలు ఏర్పాటు చేసి, మహిళలకు చీరల పంపకాలు చేపట్టింది. ఇటీవల ఒకే రోజు రెండు సంఘటనలు జరిగాయి. మంత్రి దామోదర రాజనర్సింహ చీరలు పంపకాలు చేయడం మొదలు పెట్టడంతో అక్కడికి వచ్చిన మహిళలు చీరుల వద్దన్నారు. ఒక్కసారే మంత్రి దామోదర రాజనర్సింహ కంగుతిన్నారు. ముందైతే చీరలు తీసుకోండని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కాని మహిళలు వినలేదు. మంత్రి వారించారు. మహిళలు వాదనకు దిగారు. చీరులేమీ వద్దు? ఆరు గ్యారెంటీలు ఎప్ప్పుడు అమలు చేస్తారో చెప్పండి? మహిళలకు మహýక్ష్మి పధకం కింద ఇస్తామన్న రూ.2500 ఏమయ్యాయి? ఎప్ప్పుడిస్తారు? అని ప్రశ్నించారు. ఒక రకంగా మహిళలు మంత్రిని నిలదీసినంత పనిచేశారు. దాంతో మంత్రికి కాస్త అసహనం ఏర్పడింది. అయినా తనను తాను సముదాయించుకునే ప్రయత్నం చేశారు. మహిళలు మాత్రం వినలేదు. దాంతో ముందుండి ప్రశ్నిస్తున్న మహిళలను పక్కకు తప్ప్పుకోండన్నారు. అదే రోజు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా మహిళలకు చీరల పంపిణీలో పాల్గొన్నారు. సరిగ్గా అక్కడ కూడా ఉప ముఖ్యమంత్రికి కూడా అదే చేదు అనుభవం ఎదురైంది. మహిళలు ఉప ముఖ్యమంత్రిని నిలదీశారు. సమాదానం చెప్పలేక ఉప ముఖ్యమంత్రి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మహిళలు వినలేదు. మంత్రి చెప్పే మాటలు వినిపించుకోలేదు. ఆరు గ్యారెంటీలు ఎప్ప్పుడిస్తారన్న మాటలే మహిళలు మాట్లాడారు. అంతకు ముందు మరో మంత్రి వివేక్ వెంకటస్వామికి అలాంటి అనుభవమే ఎదురైంది. రోడ్లేప్ప్పుడు బాగు చేస్తారని ప్రజలు ప్రశ్నించారు. తాను వచ్చిన తర్వాత రోడ్లు వేయించానని మంత్రి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ రోడ్లు ఇప్ప్పుడేసినవి కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయలేదని ప్రజలు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజలు, మంత్రికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే ప్రభుత్వానికి చెప్ప్పుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమస్యలు మంత్రి దష్టికి తీసుకెళ్తే ప్రభుత్వానికి చెప్ప్పుకొమ్మని అనడమేమిటని ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఇలా ప్రభుత్వం అటు పార్టీలో, ప్రభుత్వంలో, ప్రజల్లో లోపý, బైట సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీల అమలుపై తొలుత సిఎం. రేవంత్ చెప్పిన మాటలు జనం విన్నారు. కొంత అర్ధం చేసుకున్నారు. సిఎం. చెప్పిన మాటలు నిజమే కావొచ్చని నమ్మారు. ఈసారి కాకపోయినా వచ్చే ఏడాదైనా సరే ఇస్తారేమో అనుకున్నారు. అలా రెండేళ్లు గడిపేశారు. ఇది మూడో ఏడాదికి చేరింది. ఇక పంచాయితీఎన్నికలు పూర్తయ్యాయి. పంచాయితీ ఎన్నికల్లోనూ ప్రజలు అక్కడక్కడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకపోవడంతో ఆ గ్రామంలో మంచి వ్యక్తుల కోసం పార్టీలను ప్రజలు కూడా పక్కన పెట్టారు. సర్పంచ్‌లుగా పోటీ చేసేవారిని నిలదీసే పరిస్దితి అక్కడ వుండదు. ప్రచారానికి కూడా పెద్దగా నాయకులు రాలేదు. దాంతో ఎట్లాగో ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ కూడా మెరుగైన ఫలితాలే వచ్చాయి. కాంగ్రెస్ అనుకున్నదానికంటే ఎక్కువగానే సర్పంచ్‌లు గెలుచుకున్నారు. కాని మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ పార్టీ గెలవాలంటే అంత సులువైన పని కాదు. ఎన్నికల మందు ప్రజలకు అనేక హమీలు ఇచ్చారు. అందులో ఓ రెండు అమలు చేశారు. ఆరు గ్యారెంటీలలో వున్న పదమూడు హమీలలో పది హామీలు అసలైనవే వున్నాయి. వాటి జోలికి వెళ్లడానికి ప్రభుత్వం జంకుతోంది. ప్రతి గహిణికి రూ.2500 ప్రతి నెల ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. ఇంత వరకు అమలు చేయడం లేదు. గతంలో బిఆరఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలకే తూట్లు పడుతున్నాయి. ప్రతి నెల పెద్దవారికి భరోసా రూపంలో రూ.2000వేలు ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే రూ.4000 ఇస్తామన్నారు. రెండేళ్లయ్యింది. ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కళ్యాణ ýక్ష్మి పధకానికి అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఎన్నికల సమయంలో హమీ ఇచ్చినప్ప్పుడు రూ.70వేలకు తులం వుండేది. ఇప్ప్పుడు లక్షా యాభైవేలు దాటింది. అసలు కల్యాణýక్ష్మి ఇవ్వడమే గగనంగా మారింది. అలాంటిది తులం బంగారం మర్చిపోవాల్సిందే అనే పరిస్దితి వచ్చింది. ఇక భవిష్యత్తులో ఇవ్వలేరు. అది కూడా తేలిపోయింది. కాని ప్రతి విద్యార్ధికి రూ.5లక్షల రూపాయల గ్యారెంటీ కార్డు ఇస్తామన్నారు. అది పాలకులు, ప్రజలు కూడా మర్చిపోయారు. ఫీజు రీఎంబర్స్ మెంటు పూర్తిగా ఇస్తేచాలు అనే పరిస్దితికి ప్రజలే వచ్చేశారు. చదువుకునే ప్రతి అమ్మాయికి స్కూటీ ఇస్తామన్నారు. అదీ లేదు. వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇక మహిళలు ఆశలు పెట్టుకున్నది కేవలం రూ.2500. ఆ స్కీమ్ కూడా అమలు కాకపోతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు నైనీ బ్లాక్ బొగ్గు గని వివాదం ముసుకున్న వేళ, సిఎం. రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకుల్లో కలకలం రేపాయి. సిఎం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రా? లేక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రా? అని అన్ని వార్గలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా కుతకుతలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణలో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాలని కోరుకోవాలి. బిఆరఎస్ గద్దెలు కూలితే కాంగ్రెస్ గద్దెలు వెలవాలని చెప్పాలి. బిఆరఎస్‌ను నామరూపాలు లేకుండా చేసి, కాంగ్రెస్‌ను మరింత బలపలడేలా చేయాలి. అంతే కాని బిఆరఎస్ గద్దెలు కూల్చి తెలుగుదేశం జెండాలు ఎగరాలని సిఎం. చెప్పడంలో ఆంతర్యమేమిటన్నదానిపై ఇప్ప్పుడు పెద్ద చర్చనే కాదు, పార్టీలో రచ్చ జరుగుతోంది. పైగా అవకాశం దొరికనప్ప్పుడల్లా సిఎం. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద సానుభూతి చూపించడం, చంద్రబాబును పదే పదే పొగుడుతుండడం కూడాకాంగ్రెస్ నాయకులు సుతారం నచ్చడం లేదు. సిఎం. రేవంత్ రెడ్డి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి వస్తే కాంగ్రెస్‌లో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా లేకపోవంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలు ఒక గురి వుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏవైనా హమీలు ఇచ్చిందంటే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్లు నిజం చేస్తుందని బలంగా నమ్ముతారు. గతంలో అలా ప్రజలు నమ్మడం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన సందర్భాలు చాల వున్నాయి. గూడు లేని పేదలకు పక్కా ఇ ండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి 2004 తర్వాత పదేళ్ల కాలంలో తెలంగాణలో సుమారు 25ýక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం లేదు. గత ఎన్నికల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని నమ్మినట్లే, పించన్లు పెంచుతామంటే నమ్మారు. రైతు భరోసా కూడా పదిహేను వేలు ఇస్తామంటే నమ్మారు. ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేస్తారని ప్రజలు బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వమ్ము చేస్తుందనే భావన ప్రజల్లో మొదలైంది. అధికారంలోకి వచ్చాక సాకులు చెప్పడానికి కాదు ప్రజలు ఓట్లేసి గెలిపించింది. సంపద ఎలా సష్టించాలో..వాటిని ప్రజలకు ఎలా పంచాలో తమకు తెలుసని ఎన్నికల ముందు చెప్పారు. అందుకు తగ్గ ప్రణాళికలు మాకు వున్నాయన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజాన ఖాళీ అంటున్నారు. ఖజానా ఖాళీగా వుందని ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ నాయకులు తెలుసు. ఇప్ప్పుడు తప్పించుకొని చూస్తుండడం అంటే కాంగ్రెస్ పార్టీని దగ్గరుండి నాయకులు, పాలుకులే భ్రష్టుపట్టిస్తున్నారని ప్రజలు కూడా బావిస్తున్నారు. తెలంగాణలోని తెలుగుదేశాన్ని తిరిగి తేవాలన్న దానిపై వున్న ఆసక్తి ఎన్నికల ముందు ఇచ్చిన హమీల అమలుపై లేదని అంటున్నారు?

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version