తెలంగాణను కుదిపేసిన నైనీ బ్లాక్ టెండర్ల వివాదం

· దెబ్బతిన్న రేవంత్ ప్రభుత్వ ప్రతిష్ట
· రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం?
· విపక్షాలకు బలమైన అస్త్రం
· బయటపడ్డ మంత్రుల మధ్య విభేదాలు
· సింగరేణి విశాల హితాన్ని మరచిన మంత్రులు
· స్వార్థంతో కాంగ్రెస్‌ను బజారుకీడ్చిన వైనం
· సింగరేణిని కాపాడేందుకు నైనీ బ్లాక్ కేటాయింపు
· టెండరు దక్కించుకోవడం కోసం రేగిన రాజకీయ రచ్చ
· ఎట్టకేలకు టెండర్లు రద్దు
· టెండర్లు ఆలస్యమైతే ప్రమాదంలో సింగరేణి భవితవ్యం
· ఇవేమీ పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణ విద్యుత్ అవసరాలకోసం సింగరేణికి కేటాయించిన ఒడిషాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ టెండర్ బాగోతం రాష్ట్ర కాంగ్రెస్‌లోని విభేదాలను బయటపెట్టడం మాత్రమే కాకుండా, బీఆరఎస్, బీజేపీలకు రాజకీయ అస్త్రంగా మారడం వర్తమాన పరిణామం. అత్యంత లాభదాయకంగా వున్న ఈ మైనింగ్ టెండర్ విషయంలో కొందరుమంత్రులు పోటీపడటంతో వారి మధ్య విభేదాలు ఒక్కసారిగా రాజుకున్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆరఎస్ నాయకుడు హరీష్‌రావు ఈ బాగోతంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక బిడ్డర్‌కు అనుకూలంగా కొందరు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ టెండర్ ప్రక్రియను నిలిపివేస్తూ ఆదేశాలివ్వడంతో రగులుతున్న రాజకీయ రచ్చకు తాత్కాలిక విరామం ఏర్పడింది. విపరీత రాజకీయ జోక్యం, నిర్వహణాలోపం వెరసి అత్యంత లాభాల్లో వున్న సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టేశాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిజానికి అటవీ ప్రాంతంలో వున్న నైనీ బ్లాక్‌ను రాష్ట్రానికి 2015లోనే కేంద్రం కేటాయించింది. ఇది అటవీ ప్రాంతంలో వుండటంతో ఆ శాఖనుంచి ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన విధివిధానాల పూర్తి వంటి ప్రక్రియలతో ఇప్పటికే ప్రాజెక్టు చాలా ఆలస్యమైంది. అన్ని అడ్డంకులను దాటుకొని అమలు దశకు వచ్చేసరికి టెండర్లలో రాజకీయ విభేదాలు, వివాదాలు ప్రాజెక్టునుమరింత ఆలస్యం చేసే పరిస్థితి నెలకొనడంతో కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యం గా దీర్ఘకాలంలో ఇంధన భద్రతకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎంతమా త్రం పట్టించుకోక పోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అసలు ప్రమాదాన్ని పక్కనబెట్టి వ్యక్తిగత లాభాలకోసం రాజకీయ రచ్చకు ఎంతమాత్రం వెనుకాడకపోవడం, స్వార్థపరత్వం తప్ప రాష్ట్ర విశాలహితాన్ని ఎవరూ కోరుకోవడంలేదన్న సత్యం బహిర్గతమైంది. టెండర్ తమకే దక్కాలన్నఉద్దేశంతో ఒకరిపై మరొకరు బురదజల్లుకునే ప్రక్రియలోనే తలమునకలై, రాష్ట్ర ప్రయోజనాల ను పట్టించుకోని వైఖరిని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ ప్రక్రియలో విధానపరమైన లోపాలపై కేంద్రం సమీక్ష మొదలు పెట్టడంతో ఎసఎస్‌సీఎల్ బోర్డు సమావేశాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు వసూలు కాక నిండా మునిగే దుస్థితికి కంపెనీ చేరుకోవ డంతో, కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నది. అత్యంత కీలకమైన ఇంధన సదుపాయాలను పట్టించుకోకుండా, రాజకీయ గొడవల్లో ప్రభుత్వం మునిగిపోవడం ఇటు కార్మికులను అటు కేంద్రాన్ని ఆగ్రహానికి గురిచేసింది.
ఎందుకు తీవ్రపోటీ?
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన నైనీ కోల్ బ్లాక్ కోసం ఎందువల్ల ఇంతటి తీవ్ర పోటీ వున్నదన్న ప్రశ్న సహజంగా ఉదయిస్తుంది. నిజం చెప్పాలంటే లాభాల పరంగా ఇదొక కామధేను వు లాంటిది. ఓవర్ బర్డెన్ (ఓబీ) తొలగింపు, డీజిల్ సరఫరాకాంట్రాక్టర్లకు భారీ ఎత్తున ఆదా యం లభిస్తుంది. ముఖ్యంగా దీనికి రైలు రవాణా అందుబాటులో లేకపోవడం సింగరేణికి నష్ట మైనప్పటికీ, కాంట్రాక్టర్లకు మాత్రం లాభాల పంట పండిస్తుంది. దీనికితోడు సింగరేణిపై జీఎస్టీచెల్లింపుల రూపంలో భారంపడే డీజిల్ సరఫరాలను నియంత్రించడంవల్ల మరిన్ని లాభాలు పొందవచ్చు. సీనియర్ రాజకీయ నాయకులు ఈ మైన్ తవ్వకం కాంట్రాక్టును తమకు అనుకూలమైన వ్యక్తులకు ఇవ్వడానికి యత్నించడంతో వివాదం రేగింది. ఇందుకోసం బిడ్డర్లు ప్రదేశాన్ని సందర్శించి, సింగరేణి సంస్థనుంచి “సైట్ విజిట్ సర్టిఫికెట’ తెచ్చుకోవాలంటూ ప్రవేశపెట్టిన నిబంధనతో రగడ మొదలైంది. కేవలం అస్మదీయులకు టెండరు దక్కేలా చేసేందుకే ఈ నిబంధన తీసుకొచ్చారన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పోటీలో వున్న కాంట్రాక్టర్లు సాధారణంగా “మైనస” రేట్లలో (అంటే అంచనా కంటే తక్కువ రేట్లకు) బిడ్లు దాఖలు చేయడం కద్దు. కానీ ఈ నిబంధనను అడ్డుపెట్టుకొని పోటీ తగ్గించడంవల్ల “G7” స్థాయి అధిక రేట్లకు బిడ్లు దాఖలు చేసేందు కు వీలవుతుంది. ఇది అస్మదీయులకు లాభం చేకూర్చే చర్యగా బీఆరఎస్ ఎదురుదాడికి దిగింది.ఇక్కడ కేవలం u£గ్గు తవ్వకం గురించి మాత్రమే కాదు, సైడ్ డీల్స్‌తో పాటు మైనింగ్ కాంట్రాక్టులను కేటాయించడం రాజకీయ ప్రమేయంతో కూడినవి కావడంవల్ల కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుకు దారితీసింది.
సింగరేణి u£గ్గు ఖరీదు ఎక్కువ
కోల్ ఇండియాతో పోలిస్తే, సింగరేణి ఉత్పత్తి చేసే u£గ్గు ఖరీదు ఎక్కువ. సింగరేణి ఉత్పత్తి చేసే u£గ్గు ధర టన్నుకు రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య వుంటోంది. అదే కోల్ ఇండియా u£గ్గు ధర సగటున రూ.2వేలు మాత్రమే. ఉదాహరణకు సింగరేణి జి11 గ్రేడ్ u£గ్గు అమ్మకం ధర టన్నుకు రూ.4088 కాగా, ఇదే గ్రేడ్ u£గ్గును కోల్ ఇండియా రూ.1605కే ఇవ్వగలుగుతోంది. దీనికితోడు సింగరేణి u£గ్గు నాణ్యత 58% కాగా కోల్ ఇండియా u£గ్గు నాణ్యత 86%. దీనివల్ల మార్కెట్ పరంగా సింగరేణి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనాల్సి వస్తున్నది. ఇందుకు ముఖ్యమైన కారణం కోల్ ఇండియాకు ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌లలో విస్తారమైన ఓపెన్ కాస్ట్ గనులున్నాయి. వీటినుంచి తక్కువ ఖర్చుతో u£గ్గును వెలికితీస్తోంది. ఫలితంగా కోల్ ఇండియా తక్కువ ధరకే తన వినియోగదారులకు u£గ్గును సరఫరా చేయగలుగుతోంది. ఇదే సింగరేణి గనులు విషయానికి వస్తే ఒవర్ బర్డెన్ (u£గ్గుపైన వున్న రాతినేల)ను తొలగిస్తే తప్ప u£గ్గు తవ్వకాలు సాధ్యంకాదు. ఫలితంగా u£గ్గు వెలికితీతకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సివస్తోంది. అదీకాకుండా సింగరేణికి భూగర్భ u£గ్గు గనులు అధికం. అంతటి లోతుల్లోనుంచి u£గ్గును బయటకు తీయడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఎందుకంటే అంతటి లోతుల్లోని u£గ్గు బయటకు తీయడానికి భారీ యంత్రాలు అవసరం. అదీకాకుండా ఈ భారీ యంత్రాలు తక్కువ గంటలు మాత్రమే (12గంటలు) పనిచే స్తాయి. ఫలితంగా యూనిట్ ఉత్పత్తి ఖర్చు కోల్ ఇండియాతో పోలిస్తే చాలా అధికం. దీనివల్ల కోల్ ఇండియాతో సింగరేణి పోటీపడలేక పోతున్నది. దీనివల్ల సహజంగానే విద్యుత్‌యేతర పరి శ్రమలు, కోల్ ఇండియా u£గ్గువైపు మళ్లుతుండటంతో, సింగరేణికి డిమాండ్ తగ్గుతోంది. ఈ విపరిణా మాలనుంచి సింగరేణిని గట్టెక్కించేందుకోసం నైనీ బ్లాక్‌ను కేంద్రం కేటాయించింది. ముఖ్యంగా ఓవర్ బర్డెన్ లేకపోవడంవల్ల సింగరేణి సంస్థకు ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. సంవత్సరానికి 10మిలియన్ టన్నుల సామర్థ్యం వున్న ఈ బ్లాక్ నుంచి u£గ్గు వెలికితీత ద్వారా రా బోయే 38 సంవత్సరాల్లో సింగరేణి తన నష్టాలనుంచి బయటపడగలదని అంచనా. ముఖ్యంగా ఇప్పటివరకు తన ఆధీనంలో వున్న గనులనుంచి u£గ్గు ఉత్పత్తికి అవుతున్న అధిక వ్యయాన్ని కూడా ఈ నైనీబ్లాక్ భర్తీ చేయగలదు. ఉదాహరణకు ప్రస్తుతం ఒక టన్ను u£గ్గును వెలికి తీయడానికి సింగరేణి 12 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను తొలగించాల్సి వస్తున్న ది. ఇదే నైనీ బ్లాక్‌కు అయితే 2.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను తొలగిస్తే సరిపోతుంది. ఇది సంస్థకు ఆర్థిక వెసులుబాటుతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచగలదు. అదీకా కుండా నైనీబ్లాక్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన జీ10నాణ్యమైన u£గ్గును అందిస్తుందికూడా. ఏటా 10మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం సరఫరాలో అంతరాలను కూడా తగ్గించడమే కాదు ఖర్చుతో కూడుకున్న పాత గనులపై సంస్థ పెద్దగా ఆధారపడాల్సిన అవసరం వుండదు.
తెలంగాణ ప్రభుత్వ బకాయిలు
ఇప్పటివరకు సింగరేణికి తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.47వేల కోట్ల నుంచి రూ.50వేల కోట్ల వరకు బకాయి పడింది. ఇవి u£గ్గు కొనుగోళ్లు, విద్యుత్ సరఫరాకు చెందినవి కావడం గమనార్హం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో రూ.17వేల కోట్లు,విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కామ్ రూ.12వేల కోట్లు వున్నాయి. గత బీఆరఎస్ ప్రభుత్వ రూ.26వేలకోట్లు బకాయిలు వుంచగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.13వేల కోట్ల నుంచి రూ.16వేల కోట్ల వరకు సింగరేణికి రుణం చెల్లించలేదు. ఈ బకాయిలను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రోడ్‌మ్యాప్ రూపొందించలేదని కేంద్ర u£గ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శి స్తున్నారు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఈ బకాయిలవల్ల సింగరేణి సంస్థ దివాలా దశకు చేరుకుంటోంది. తన ఉద్యోగుల జీతాల చెల్లింపులకు బ్యాంకు రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాదు బకాయిలు చెల్లించకపోవడంవల్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్మి కులకు సంక్షేమ కార్యక్రమాల అమలును నిలిపేసింది. ఇప్పటికే హామీ ఇచ్చిన వాటిని అమలు చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది.
దెబ్బతిన్న పభ్రుత్వ ప్రతిష్ట
నైనిబ్లాక్ టెండర్ల బాగోతం రేవంత్ ప్రభుత్వ ప్రతిష్టను గణనీయంగా దెబ్బతీసింది. విపక్ష బీఆర్ ఎస్, బీజేపీలు, ఇది “కమిషన్ల ప్రభుత్వం” అంటూ విమర్శల దాడిని ఉధతం చేశాయి. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వాటికి నైనీబ్లాక్ టెండర్లు ఒక బలమైన అస్త్రంగా మారాయి. ఇప్పటివరకు గుంభనంగా పనిచేస్తూ వచ్చినప్పటికీ, మంత్రుల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడటంతో రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. లాభాల్లో వున్న సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టి దివాలా స్థాయికి దిగజార్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న అంశం బయటకు వెల్లడి కావడంతో ఎంతో సానుకూల ప్రచారం చేసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగరేణి పాపంలో బీఆరఎస్‌ది సింహభాగ మైనప్పటికీ, ఇప్పుడు అధికారంలో వున్న కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. గుట్టుగా నెట్టుకొద్దా మంటే కప్పల తక్కెడ రాజకీయం వంటబట్టించుకున్న కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత స్వార్థంతో అటు ప్రభుత్వాన్ని ఇటు సంస్థను బజారున పడేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఒక అగ్ర నాయకుడి బంధువుకు లబ్ది చేకూర్చేవిధంగా 2024లో రాష్ట్ర ప్రభుత్వం “సైట్ విజిట్ సర్టిఫికెట”ను ప్రవేశపెట్టిందని హరీష్‌రావు ఆరోపించారు. కేంద్ర u£గ్గు మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణిని ఏ కంగా రాజకీయ ప్రయోగశాలగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాగోతంపై అం తర్గత విచారణ ప్రారంభించామని, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తే సీబీఐ విచారణకు సిద్ధమని స్పష్టంచేశారు. కాగా పారదర్శకత కోసమే టెండర్లను రద్దుచేసామని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించడమే కాకుండా, మళ్లీ కొత్తగా టెండర్లను ఆహ్వానిస్తామని వెల్లడించారు. నైనీ బ్లాక్ టెండర్ బాగోతం ఏకంగా ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ప్రతిష్టను దెబ్బతీయడం, ఒక సీనియర్ మంత్రి తీవ్ర మనో సంక్షోభానికి, అమాయక జర్నలిస్టుల అరెస్ట్‌కు దారితీసి, సమస్యను ఏవిధంగా దారి మళ్లించి ఇతరుల జీవితాలతో ఆడుకోవచ్చో అందరికీ విడమరిచి చెప్పింది.
నిజానికి 2014 నాటికి సింగరేణికి రూ.3500కోట్ల బ్యాంక్ బ్యాలన్స్ వుండగా బీఆరఎస్ ప్రభు త్వం దిగిపోయేనాటికి భారీగా అప్పుల్లో మునిగిపోయిందని, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం సింగ రేణిని తన రాజకీయ లేu£రేటరీలాగా ఉపయోగించడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శకుల వాదన. ముఖ్యంగా పెద్ద, చిన్న కాంట్రాక్టుల ఎంపికలో కల్వకుంట్ల కుటుంబం తమ స్వప్ర యోజనాలకు అనుగుణంగా వ్యవహరించడమే సింగరేణి మునగడానికి ప్రధాన కారణమని ప్ర త్యర్థుల ఆరోపణ. అయితే కేటీఆర్ ఈ ఆరోపణలను ఖండించారు. 2014లో సింగరేణి వార్షిక టర్నోవర్ రూ.12వేల కోట్లు కాగా 2023లో తమ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.32వేల కోట్లకు పెరిగిందని ఆయన సమర్థించుకున్నారు. 2023`24లో సింగరేణి రూ.4705కోట్ల మేర లాభాలను ఆర్జించడం తమ ప్రభుత్వ సమర్థ నిర్వహణకు నిదర్శనమని బీఆరఎస్ నేతలు వాదిస్తు న్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలే సింగరేణిని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో అంచనాలకంటే 20% తక్కువకు టెండర్లు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం అంచనాలకంటే 10% అదనపు రేటుకు కాంట్రాక్టులు అప్పగిస్తున్నదని ఆరోపించారు. ఏది ఏమైనా నైనీ బ్లాక్ టెండర్ల బాగోతం ప్రభావం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రతికూల ప్రభావం చూ పే అవకాశముంది. ఇప్పుడు ఈ అంశం ప్రధాన ప్రతిపక్షమైన బీఆరఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర u£గ్గు మంత్రిత్వశాఖల మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపిందనేది మాత్రం అక్షరసత్యం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version