పరకాల సుందరికరణ చేసి అభివృద్ధి చేస్తా

పరకాల సుందరికరణ చేసి అభివృద్ధి చేస్తా

పట్టణంలోని పలు వార్డులలో ప్రర్యటించిన ఎమ్మెల్యే

వరద ముంపు నుంచి కాపాడేందుకు నివేదిక రూపొందించాం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

శనివారం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా 19వ వార్డు పరిధిలోని పాత సిఎంఎస్ గోదాం వద్ద,14 వ వార్డు పరిధిలోని పాత మసీద్ వాడ, గండ్ర వాడలో జరుగుతున్న డ్రైనేజీ పనులను అధికారులతో కలిసి పరిశీలించి,పలు సూచనలు చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పట్టణం ముంపుకు గురి కాకుండా ప్రణాళికాబద్ధంగా అంచలవారిగా నగరాన్ని తలపించేలా సుందరీ కరణ చేసి అభివృద్ధి చేస్తానని అందుకు ప్రజల సహకారం అవసరమని,కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని,ఒక ప్రణాళిక ప్రకారం మున్సిపాలిలో శానిటేషన్ వ్యవస్థ,డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ ను ఏర్పాటు చేస్తున్నామని వర్షాలకు వచ్చే వరదకు అనుకూలంగా ప్రధానంగా నూతన డ్రైనేజీ పనులను ప్రారంభించామన్నారు.సుమారు 24 కోట్లతో పరకాల పట్టణ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశామని,అభివృద్ధి పనులలో పట్టణ ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు కలగచ్చు గాని,భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.అమృత్ పథకం కింద మంచినీటి వ్యవస్థ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.పట్టణం వరద ముంపు నుంచి కాపాడేందుకు తీసుకోవల్సిన చర్యలతో నివేదిక రూపొందించామన్నారు.గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వలన పట్టణ అభివృద్ధి వెనుకబడింది అని,తమ స్వలాభం కోసమే గత ప్రభుత్వ పాలకులు ప్రారంభించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి అన్నారు.

అంతకుముందు 18వ వార్డులో ఇందిరమ్మఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.14 వ వార్డు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు.విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని,ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయం మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,కుంకుమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొలిగూరి రాజేశ్వరరావు,కమిషనర్ కే.సుష్మ,ఏఈ రంజిత్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యాడా శ్రీనివాస్,మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version