మోడీ సర్కార్ నీ గద్దె దించండి
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం పార్టీ జిల్లా నాయకులు కామ్రేడ్ వెలిశెట్టి రాజయ్య అధ్యక్షతన జరిగింది. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బంధు సాయిలు మాట్లాడుతూ, మోడీ సర్కార్ నిరంకుశ ధోరణి లను నిరసించండి.ఎమ్మెల్సీ కవిత,ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అక్రమ అరెస్టులను ఖండించండి. మోడీ సర్కార్ను వెంటనే జరగబోయే ఎన్నికల్లో గజ్జగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్ గోద్రా ఘటనకు బాధ్యుడైన నరహంతక నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నాడు. ఉద్యమకారులను అణచివేస్తున్నాడు. మేధావులను జిల్లాలో పెడుతున్నాడు. బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలను అమలు చేస్తున్నాడు. ఈడీలను ఐటీలను సిబిఐ లను తమ జేబు సంస్థగా ఉపయోగించుకుంటున్నాడు. గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రతిపక్ష పార్టీలను లొంగదీసుకుంటున్నాడు. తన మాతృ సంస్థ అయినా ఆర్ఎస్ఎస్ విధానాలను భారతదేశంలో అమలు చేస్తున్నాడు. ద్వారా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి దాని స్థానంలో మన ధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నాడు. చరిత్రను మొత్తం వక్రీకరిస్తున్నాడు. నూతన సిద్ధాంతాన్ని పక్కన పెట్టాడు. ట్రీ ప్పు సుల్తాన్ చరిత్రను తిరగరాశాడు.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిపక్షాల గొంతులు తీవ్రంగా నొక్కుతున్నాడు. ఇటీవల కాలంలో ఎస్బిఐ బ్యాంకు బయటపెట్టిన ఎలక్ట్రోలు బాండ్స్ వివరాలలో బిజెపి అవినీతి బయటపడింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే సిఏఏ తీసుకొచ్చాడు. అందులో భాగంగానే ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నాడు అక్రమ అరెస్టులు చేపిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీ వాళ్ళ అరెస్టు అందులో భాగమే. అల్లా డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి ఓటర్లను డబ్బులకు ప్రలోబితం చేసి ప్రతిపక్షాల గొంతులు నొక్కి తిరిగి అధికారంలోకి రావాలనే భారీ కుట్ర చేస్తున్నాడు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీలు వాళ్ళ అరెస్టును సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.