హసన్ పర్తి / నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజున బ్రహ్మోత్సవాలు మొదలై నాలుగు రోజుల పాటు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. సోమవారం స్వామివారు హసన్ పర్తి నుంచి రథంపై ఊరేగిస్తు కొండపైకి చేరుకుంటారు. బుధవారం ఉదయం స్వామీ వారి కళ్యాణం ఉంటుంది. ఈ ఉత్సవాలకు చుట్టూ ఉన్న గ్రామాల వేంకటేశ్వర స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీ వారిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.