మా మక్కలు కొనే దిక్కులేదు…

మా మక్కలు కొనే దిక్కులేదు…

మార్కెట్లో అమ్ముదామంటే రానిత్తలేరు

మా గోస పట్టని అధికారులు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువ మండలంలో ఎక్కువ రైతులు పత్తి మొక్కజొన్న పంటలపై ఎక్కువ మొగ్గు చూపుతారని వ్యవసాయ అధికారులకు తెలుసు, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మొక్కజొన్న పంట దిగుబడి భారీగా పెరిగిందని అంచనాలు ఉన్నాయి, ఆ రైతుల పండించిన మొక్కలు కొనుగోలు విషయంలో అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆలస్యం కావడంతో పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలలో ముందుగానే ఆరబోసుకొని రోజుల తరబడి కల్లాలలోనే ఎండలో ఎండుతూ అమ్ముకోవడానికి ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ మరియు సొసైటీ అధికారులు మాత్రం ఇప్పటివరకు కొనుగోళ్లపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం మండలంలోని చుట్టుపక్కల గ్రామాల మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాళ్లపూస పల్లి గ్రామ రైతుల ఆవేద

తాళ్ల పూస పల్లి గ్రామంలో రైతులు కొనుగోలు కల్లాలలో ఆరబోసుకొని కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారని సమాచారం. పోనీ కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు వెళ్లి అమ్ముకుందామంటే మార్కెట్ లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి మొక్కజొన్న పంటను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటు మార్కెట్లో కొనుగోలు చేయక ఎప్పటిలాగే సొసైటీ ద్వారా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయక రైతులు దిక్కులేని పరిస్థితిలో దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆరు కాలం పండించి కోతుల బెడద తట్టుకొని మందులు మాకులు చల్లుకొని ఎంతో ప్రయాసపడి ఎండలతో ఎగుతూ వానలకు తడుస్తూ పంట చేతికి వచ్చిందని సంబరపడే సమయంలో అమ్ముకుందామంటే పండించిన దానికంటే ఎక్కువ ప్రయాస పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. మొక్కజొన్న పంట వస్తుందన్న సమయానికి ముందే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నామని పూసపల్లి రైతులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.

ఇదే మంచి అదును…దళారుల దోపిడి

సాధారణంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు ఏ పని అయిన భారీ మొత్తంలో మార్కెట్ కు అమ్మకానికి చేరుతుంది ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది కేసముద్రం మండల ప్రాంతంలో రైతులు పత్తి మొక్కజొన్న మిర్చి పసుపు ఎక్కువ ఈ పంటలనే సాగు చేసి అమ్ముకోవడానికి కేసముద్ర వ్యవసాయ మార్కెట్ కి రావడం జరుగుతుంది ఒక్క కేసముద్రం మండలమే కాక జిల్లాలోని చుట్టుపక్కల మండలాలు రైతులు కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కి తీసుకురావడం జరుగుతున్నది. కేసముద్ర వ్యవసాయ మార్కెట్ పంట పోటెత్తినప్పుడు స్థలం సరిపోక బయట రోడ్లపై పోసుకొని అమ్ముకున్న రోజులు అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది, మార్కెట్ ట్రేడర్ లైసెన్స్ ఉన్న వ్యాపారులు అప్పట్లో మార్కెట్లోనే మాత్రమే కొనుగోలు చేసేవారు రైతుకు గిట్టుబాటు ధర లభించేది తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు చూసుకునేవారు. ఎప్పుడు పూర్తిగా విరుద్ధంగా ట్రేడింగ్ లైసెన్స్ ఉన్న వ్యాపారులు కొంతమంది మార్కెట్లో కొనుగోలు నామమాత్రం చేస్తూ బయట రోడ్ల వెంట కొనుగోలుకి ఎక్కువ ముగ్గు చూపుతున్న ట్రేడర్లు, మార్కెట్లో కొనుగోలు చేస్తే మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పైగా మార్కెట్ ఫీజు చెల్లించాలని ఇవేమీ లేకుండానే వ్యాపారం చేయాలన్న దుర్బుద్ధి కలిగిన ట్రేడర్లు రోజురోజుకు పెరిగిపోతున్నారని పలువురు రైతు సంఘ నాయకులు తెలుపుతున్నారు. ట్రేడర్ లైసెన్సు ఉంటే చాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయం పడితే ఆ సమయం మార్కెట్ సెలవు దినాలతో మాకు సంబంధం లేదంటూ మార్కెట్లోకి వచ్చిన వాటిని కూడా బయటకు రప్పించి కొనుగోలు చేస్తున్నారని సమాచారం అటు మార్కెట్ ఆదాయానికి గండి కొడుతూ రైతును తూకంలో మోసం చేస్తూ ధర విషయంలో ప్రభుత్వ ధర ఒక క్వింటాకు 2400 పలుకుతుంటే, దళారులు 16 00 వందల రూపాయలు ధర నిర్ణయించి తక్కువ చేసి రైతు ఆసరాను సందు దొరికితే చాలు కోట్ల రూపాయలు రైతుల సొమ్మును కా జేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని రైతును నిండా ముంచేస్తున్నారని పలు రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ లో కొనుగోలు చేయాల్సిన వ్యాపారులు మార్కెట్లో కొనుగోలు చేయకుండా రోడ్ల వెంట కొనుగోలు చేయడంపై మార్కెట్ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెట్టకుండా ఏమీ తెలియనట్టు వ్యవహరించడంపై పలువురు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version