గోపు కవిత కొన్న భూమి పట్టాను రద్దు చేయాలి

గోపు కవిత కొన్న భూమి పట్టాను రద్దు చేయాలి

ముసిక సదయ్య డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

నా భూమిని అక్రమంగా గోపు కవిత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కావున అధికారులు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి నాకు న్యాయం చేయాలని మూసిక సదయ్య అధికారులను వేడుకున్నారు ఆరేపల్లి గ్రామం టేకుమట్ల మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుసుంబ రాజయ్య దగ్గర నుండి మూసిక కొమురయ్య నాలుగు గంటల 17 పైసల భూమిని 20 సంవత్సరాల క్రితం కొన్నాడు కొమురయ్య కొడుకు సదయ్య అవసర నిమిత్తం భూమిని గోపు కవితకు గుంటకు 60 వేల చొప్పున భూమిని అమ్మడానికి నిర్ణయించుకున్నాడు మొత్తం రూపాయలు 2లక్షల 60 వేలకు ధరను పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించడం జరిగింది. 50 వేల రూపాయలను గోపు కవిత భయాన ఇచ్చింది తర్వాత కుసుంబ రాజయ్య కొడుకు తిరుపతి సదయ్యకు తెలియకుండా భూమిని గోపు కవితకు రిజిస్ట్రేషన్ చేయించాడు దీనితో ఆందోళన చెందిన బాధితులు గత సంవత్సరం స్థానిక పోలీస్ స్టేషన్ టేకుమాట్లలో ఫిర్యాదు చేశారు ఆరేపల్లి గ్రామపంచాయతీ నుండి కూడా పంచాయతీ కార్యదర్శి గత సంవత్సరం ఇంటి అడుగు స్థలాన్ని సర్వే చేసి ఈ భూమి సదయ్యకు చెందిందని ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చినప్పటికీ కూడా తిరుపతి భూమిని వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అనంతరం వారికి న్యాయం జరగపోవడంతో ఎమ్మార్వోకు ఆర్డిఓకు జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చారు కానీ ఇప్పటివరకు బాధితులకు న్యాయం జరగలేదు మా భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారు వారి పట్టాను క్యాన్సల్ చేసి మాకు న్యాయం చేయగలరు అధికారులను వేడుకుంటున్న అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version