నర్సంపేట ఆర్డీఓ,ఎమ్మర్వోలకు గ్రామస్తుల పిర్యాదులు.
నర్సంపేట,నేటిధాత్రి:
గ్రామంలో ఓకె కులం,ఓకె మతం అనే విధంగా ఐకమత్యంతో కలిసి ఉన్న గ్రామాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రపన్నిన అన్యమత కులస్తులపై చర్యలు తీసుకోవాలని నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామస్తులు ఆరోపించారు.అన్యమత కులస్తులు ఎవ్వరూ లేకున్నా గ్రామంలో అక్రమ అన్యమత చర్చి కట్టడాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఆ గ్రామస్తులు,అయ్యప్పస్వామి,ఆంజనేయస్వామి భక్తులు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి,ఎమ్మార్వో రాజేష్ లకు వేరు వేరుగా పిర్యాదులు చేస్తూ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ వివిధ కుల సంఘాల పెద్దలు పెండ్యాల భిక్షపతి,వల్లాల శేఖరయ్య గౌడ్,దాసరి రాజిరెడ్డి,తోటకూరి ఐలోని, కొక్కరకొండ బీరప్ప,తుమ్మ నాగయ్య ముద్దం రాజేందర్, వాల్లాల కర్ణాకర్ గౌడ్ లు మాట్లాడుతూ గ్రామంలో అన్యమత చర్చి అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని పంచాయితీ కార్యదర్శికి,పోలీసులకు పిర్యాదు చేయడంతో జీపీ పంచాయితీ నోటీసులు ఇచ్చి అపారని దీంతో మరల ఆర్డీఓ,ఎమ్మార్వోలకు వినతిపత్రాల ద్వారా పిర్యాదు చేసినట్లు చెప్పారు.గ్రామంలో చిన్న పెద్దా తారతమ్యం లేకుండా కలిసి ఉంటున్నామని ఇప్పుడు కొత్తగా అన్యమతం పేరుతో గ్రామంలో చిచ్చుపేటడానికి కుట్రలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా గ్రామస్తులు అవేదన వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరగా తాత్కాలికంగా అక్రమ నిర్మాణ పనులు నిలుపుదల చేస్తున్నట్లు అధికారులను ఆదేశించినట్లు తెలిపారని దాసరిపల్లి గ్రామ వివిధ కుల సంఘాల పెద్దలు తెలిపారు.