ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలనిన, వారి నాయకత్వంలో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేయాలని వారు కోరుకున్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పూరేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, గుంట అశోక్,కారుపాకల అంజిబాబు, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, బద్ధం లాక్ష్మారెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మకంటి భాస్కర్, నాయకులు, బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు హాజరయ్యారు.