రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని తొందరగా ప్రారంభించాలని భారతీయ జనతా యువ మోర్చా మండల శాఖ అధ్యక్షులు దుర్శెట్టి రమేష్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అనేక గ్రామాలకు ప్రధాన రహదారైన రామడుగు మండల కేంద్రంలోని పాత బ్రిడ్జి గత సంవత్సరం వర్ష కాలంలో పూర్తిగా కుంగిపోయిందని, నూతన బ్రిడ్జి పూర్తి చేసి ఐదు సంవత్సరాలు అవుతుందని ఐనకానీ ఇంకా నూతన బ్రిడ్జి ప్రారంభించలేదని పాత బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరిందని వెంటనే నూతన బ్రిడ్జిని ప్రారంభించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రామ్, యువమోర్చా మండల ప్రధాన కార్యదర్శులు ఎడవెల్లి లక్ష్మణ్, దయ్యాల రాజు, మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, సామల చందు, మండల కోశాధికారి మార్కోండ అనిల్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, వేముల శ్రీనివాస్, సీనియర్ నాయకులు బొజ్జ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.