హన్మకొండ/దామెర,నేటిధాత్రి :
దేశ తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు
దామెర మండలంలోని పులుకుర్తి గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల మురళి మాదిగ, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దండు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తాజా మాజీ సర్పంచ్ గోవిందు అశోక్ పాల్గొని మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన సంఘసంస్కర్త,
స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు.
దళిత ఉద్యమాలకు ఆద్యుడిగా ఉన్న జగ్జీవన్1935లో దళితులకు దేవాలయాలలో ప్రవేశం గూర్చి తిరుగుబాటు చేసిన వ్యక్తి అని తెలిపారు. సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి జైలు పాలయ్యాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సొసైటీ డైరెక్టర్ ఈదునూరి సంతోష స్వామి,
గోవిందు ఆదామ్, కుంటమల్ల రాజు, అక్కేశ్వరపు నగేష్, డాక్టర్ రాంబాబు, పాముల రమేష్ వర్మ ,ముండ్రాతి బిక్షపతి, ఓని నవీన్, పాముల రాజు, అక్కేపెళ్లి సతీష్, గోవిందు బాబు, మహేష్, కొప్పుల లక్ష్మయ్య, విజయవర్ధన్, బాబు తదితరులు పాల్గొన్నారు.