జహీరాబాద్లో ఇద్దరు మహిళల అదృశ్యం…

జహీరాబాద్లో ఇద్దరు మహిళల అదృశ్యం…

పోలీసులకు ఫిర్యాదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్లు పట్టణ పోలీస్ స్టేష న్లో కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

స్కూల్కు వెళ్లిన యువతి అదృశ్యం

జహీరాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన సంద్ర జైపాల్ కుమార్తె సంద్ర జాయిసి (24) ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తోంది. ఈ నెల 28వ తేదీన ఉదయం 8 గంటలకు యథావిధిగా పాఠశాలకు వెళ్లిన జాయిసి, సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో తండ్రి జైపాల్ పోలీసు లను ఆశ్రయించారు. తన కుమార్తె ఆచూకీ కనిపెట్టాలని ఆయన ఫిర్యాదులో కోరారు.

ఇంట్లో నుంచి డబ్బుతో భార్య పరార్

మరో ఘటనలో, వెంకటరమణ కాలనీకి చెందిన మాలి పటేల్ సిద్ధ రెడ్డి భార్య మాలి పటేల్ కవిత (29) అదృశ్యమైంది. భర్త సిద్ధ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీ రాత్రి అందరూ కలిసి పడుకున్నారు. అయితే, 28వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లేచి చూడగా కవిత ఇంట్లో కనిపించలేదు. ఆమె వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న 3 లక్షల రూపా యల నగదును తీసుకువెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ రెండు ఘటనలపై జహీరాబాద్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ కె. వినయ్ కుమార్ స్పందిస్తూ.. బాధితుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశామని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version