క్షయ వ్యాధిని ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చు…

క్షయ వ్యాధిని ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చు

ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేత

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

క్షయ వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించినట్లయితే నయం చేయవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం టి.బి. ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మందమర్రి మండలం అందుగులపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు,ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.సుధాకర్ నాయక్ అధికారులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించినట్లయితే నయం చేయవచ్చని తెలిపారు.100 రోజుల పాటు క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని,తెమడ పరీక్ష,ఎక్స్ రే తీసుకోవడం ద్వారా క్షయ వ్యాధిని గుర్తించవచ్చని, సరైన సమయంలో చికిత్స అందించినట్లయితే పూర్తిగా నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు.జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీల పరిధిలో పరీక్షలు,చికిత్స,అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని,ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు అయినట్లయితే వ్యాధి నివారణ మరింత సులభతరం అవుతుందని తెలిపారు.క్షయ ప్రభావిత ప్రాంతాలలో 14 సంవత్సరాల పైబడిన వారందరికీ పరీక్షలు చేయడం జరుగుతుందని,మధుమేహం, రక్తపోటు,రక్తహీనత,పోషకాహార లోపం,క్యాన్సర్ వంటి అసంక్రమణ వ్యాధులను గుర్తించడం ద్వారా క్షయ వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ సకాలంలో పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చని,ప్రజలు సొంత ఆలోచనతో మందులు వినియోగించకూడదని,ప్రజల సౌకర్యార్థం జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలు,ప్రాథమిక,సామాజిక ఆరోగ్య కేంద్రాలు,బస్తీ దవాఖాన, పల్లె దవాఖాన,ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులు,ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని,వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వినియోగించాలని తెలిపారు.క్షయ వ్యాధి నివారణలో భాగంగా ఆరోగ్య ఉపకేంద్రాల వైద్యులు, సిబ్బంది,ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ అందించడం జరిగిందని తెలిపారు.వ్యాధి పూర్తిగా నయం అయ్యేవరకు తప్పనిసరిగా వైద్యుల సూచన ప్రకారం మందులను వినియోగించాలని,వ్యాధి నయం అయిన తరువాత వైద్య పరీక్షల నివేదిక అనంతరం వైద్యుల సూచన మేరకు మాత్రమే మందుల వినియోగం ఆపాలని తెలిపారు.క్షయ వ్యాధిగ్రస్తులకు కీలు ఫౌండేషన్ ద్వారా డా.రాజ్ కిరణ్ సంస్థ ద్వారా న్యూట్రిషన్ కిట్లను అందించడం జరిగిందని, ఈ కిట్లు వినియోగించడం ద్వారా వ్యాధిని ఎదుర్కొనవచ్చని తెలిపారు.క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నిశ్చయ భూషణ్ యోజన క్రింద ప్రతి నెల 1 వేయి రూపాయలు పోషణ మధ్యము చికిత్స కాలం వరకు అందించడం జరుగుతుందని తెలిపారు.క్షయ వ్యాధిగ్రస్తులు దగ్గిన,తుమ్మిన క్షయ క్రిములు బయటకు వస్తాయని,మాస్క్ ధరించినట్లయితే నియంత్రించవచ్చని, సాధ్యమైనంత వరకు గాలి, వెలుతురు ఉన్న ప్రాంతాలలో ఉండాలని తెలిపారు.జిల్లాలో 759 మంది క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు అందించడం జరుగుతుందని,పోషకాహారం కోసం డి బి టి ద్వారా 150 మంది రోగులకు 6 వేల రూపాయల చొప్పున పోషకాహారం కోసం అందించడం జరుగుతుందని తెలిపారు.స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ప్రజలలో వ్యాధి నివారణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించడం,సమయానికి మందులు అందించడం జరుగుతుందని,జిల్లాలోని రోగులకు పోషకాహారం అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని,క్షయ వ్యాధి రహిత జిల్లాగా మంచిర్యాలను తీర్చిదిద్దుదామని తెలిపారు.అనంతరం ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

గ్రామం లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి

అనంతరం పొన్నారం గ్రామంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ తో కలిసి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించి నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మించుకునేలా వివరించాలని,పనులు త్వరగా పూర్తిచేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని,అంతర్గత రహదారులు,మురుగు కాలువల వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని,నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని తెలిపారు.గ్రామంలో నర్సరీని సందర్శించి వేసవి అయినందున సకాలంలో నీటిని అందించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సతీష్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్,వైద్యాధికారులు డా. అరుణ శ్రీ,డా.రమేష్,మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు,సి పి ఓ లు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు,ఆరోగ్య సిబ్బంది,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version