టీజీ జెన్కో సీఎండీకి వినతిపత్రం అందజేత

టీజీ జెన్కో సీఎండీకి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం చెల్పూర్ కెటిపిపి టీజీ జెన్కోలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం టీఆర్వీకేఎస్ జెన్కో అధ్యక్ష కార్యదర్శులు ఎలకంటి రగోత్తం, ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో టీజీ జెన్కో సీఎండీ హరీష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మికులు, ఆర్టిజన్ల సమస్యలపై వినతిపత్రం ఇచ్చి పరిష్కరించాలని కోరారు. అనంతరం జోన్కో డైరెక్టర్లు అజయ్, కుమార్రాజా, బాలరాజు, కృష్ణ, భాస్కరరావు, రాజేంద్రప్రసాద్ను కలిశారు. కార్యక్రమంలో టీఆర్వీకేఎస్ నాయకులు పుట్టపాక కిరణ్, లింగంపల్లి రాజేశ్వరరావు సూర నరేందర్ తోట మల్లిక్ తీగల తిరుపతి రావు సాదిక్ పాషా, తిప్పారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version