కాంగ్రెస్ పార్టీ మంచి నాయకున్ని కోల్పోయింది
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కేంద్రంలో కూడలి వద్ద కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ కొమురయ్య కూడలి వద్ద శ్రీనివాస్ యొక్క చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ కొమురయ్య మాట్లాడుతూ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేస్తూ, మాజీ మంత్రిగా కాంగ్రెస్ పెద్దదిక్కుగా ఉండేవారని వారు లేని లోటు బాధాకరమని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మారేపల్లి రాజు ఎస్సీ సెల్ మండల నాయకులు రాజేందర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రేణిగుంట్ల సదానందం,ధైనంప ల్లి రాజయ్య, రైతు నాయకుడు ప్రపంచ రెడ్డి, దానబోయిన ఐలుమల్లయ్య ,మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అల్లి శంకర్, బాసాని రాజేష్, సారయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దైనంపల్లి పోశాలు, రామ స్వామి చిరంజీవి, ఎండి సాదిక్,ఐఎన్ టియుసి శాయంపేట మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.