మహాదేవపూర్ -నేటిధాత్రి:
మంగళవారం రోజు జాతీయ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని సంఘం నాయకుడు రామయ్య లక్ష్మణ్ లు తెలిపారు. ఈ సమావేశానికి జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య రాష్ట్ర అధ్యక్షుడు మధు కేంద్ర కమిటీ కార్యదర్శి కొంకంటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ కాంపల్లి సతీష్ ప్రధాన కార్యదర్శి సందీప్ రాష్ట్ర కార్యదర్శి లింగయ్య బాల రాజేశం, తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే దళిత ఉద్యమ సంఘాల నాయకులకు ప్రత్యేక ఆహ్వానం తెలపడం జరిగిందని, అలాగే మండల అంబేద్కర్ అభిమానులతో పాటు ఉద్యమ సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు లక్ష్మణ్ రామయ్య కోరారు.