వేములవాడ నేటి ధాత్రి
వేములవాడ పట్టణం లో
కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించుకున్న ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ భవనం వృథాగా మిగిలిపోయింది. భవనానికి తాళం వేసి వదిలేశారు అధికారులు.
పట్టణంలోని చామకుంట ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ గత రెండు సంవత్సరాల క్రితం సిద్ధమైంది. రూ.2.7 కోట్ల వ్యయంతో వేములవాడ మున్సిపల్ నిధుల ద్వారా సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మించారు.ఈ కూరగాయల మార్కెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే చెప్పాలి.ఈ మార్కెట్ ను గతంలో మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబులు ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే.సూపర్ మార్కెట్ ను తలదన్నే విధంగా ఈ వెజిటేబుల్ మార్కెట్ కనువిందు చేస్తూ..అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రైతులు,చిరు కూరగాయ వ్యాపారులు ఎండ,వాన,చలి తేడా లేకుండా దుమ్ములో ధూళితో ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం కోట్ల రూపాయల ప్రజా ధనం వేచ్చించి కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టారు.దీన్ని త్వరగా వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
చామకుంట కూరగాయల మార్కెట్ ద్వారా కూరగాయల క్రయవిక్రయాలు ఇక రోడ్లపై ఉండవని మున్సిపల్ అధికారులు గతంలో చెప్పారు ..అయితే.. ఆ మాటలు నీటిమట్టలయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ మార్కెట్లో అన్ని రకాల సౌకర్యాలు,కూరగాయలు,ఫ్రూట్స్ స్టోర్ చేసుకునేందుకు వెసులుబాటు ఉందన్నారు.చక్కని వెంటిలేషన్, టాయిలెట్స్, పలు గదులు, ప్రతి స్టాల్ కు ఫ్యాన్, సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ వెయిట్ మిషన్ ఛార్జింగ్ కోసం స్విచ్ బోర్డ్స్ అమర్చారు
పట్టణంలోని రెండవ బైపాస్ ప్రాంతంలో మూల వాగుని అనుకొని, కోరుట్ల,చెక్కపల్లి బస్టాండ్స్ ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా కూరగాయల వ్యాపారులు,రైతులు, వినియోగదారులు క్రయవిక్రయాలు ఎండలకు, వాళ్లకు దుమ్ము ధూళికి ఇబ్బందులు ఎదుర్కొట్టు అమ్మకాలు జరుపుతున్నారు.గతంలోను పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ సమీపంలో గల మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన స్టాల్స్ నిరుపయోగంగానే ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.
కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన ఆధునాతన వెజిటేబుల్ మార్కెట్ ను వినియోగంలోకి తేకుండా..మున్సిపల్ అధికారులు తాళం వేసి ఉంచడం శోచనీయం.త్వరగా వినియోగంలోకి తేవాలని రైతులు,స్థానిక ప్రజలు కోరుతున్నారు.
పలు గ్రామాల నుంచి తీసుకొచ్చే రైతులకు, కూరగాయల వ్యాపారులకు ఎంతగానో ఈ సమీకృత కూరగాయల మార్కెట్ ఉపయోగపడనుందని ఆశ పడ్డారు.కానీ ఇప్పటికీ కూడా వినియోగంలోకి రాకపోవడం శోచనీయం.
రోడ్లకు ఇరువైపులా కూరగాయలు అమ్ముతూ…రైతులు,కూరగాయల వ్యాపారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.రైతుల,కూరగాయల చిరు వ్యాపారులు కోసం నిర్మించిన వెజిటేబుల్ మార్కెట్ ప్రారంభమైన కూడా వినియోగంలోకి రాకపోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పంధించి వెజిటేబుల్ మార్కెట్ భవనాన్ని వినియోగంలోకి తేవాలని రైతులు పట్టణ ప్రజలు కోరుతున్నారు