బతుకమ్మ వేడుకలో విషాదం.. యువతి మృతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో బతుకమ్మ ఆడుతున్న మంగలి మేఘన (24) అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలింది. వెంటనే ఆమెను జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.