మెసెంజర్ల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల హామీ
మెసెంజర్ ల రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శి భానోత్ బిక్షపతి
కేసముద్రం/ నేటి దాత్రి
తెలంగాణ లో విద్యాశాఖ పరిధి సమగ్ర శిక్షా అభియాన్ కింద మండల విద్యా( ఎం.ఆర్.సి) పనిచేస్తున్న మెసెంజర్లకు జి. ఓ నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని రాష్ట్ర విద్యాశాకాదికారులయిన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు అసిస్టెంట్ ఎస్ పి డి లను హైదరాబాద్ లో ని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం లో కమిషనర్ రాధారెడ్డి మేడం ఎస్పిడి ని కలవడం జరిగిందని, రాష్ట్ర మెసెంజర్ల యూనియన్ భాద్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు భిక్షపతి. రాష్ట్ర బాధ్యులు గౌరవ అధ్యక్షులు డి శ్రీనివాస్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు భిక్షపతి మాట్లాడుతూ అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మాదిరి వేతనాల పెంపు, మెసెంజర్ల కు జరగలేదని, జి.ఓ.నెంబర్ 60 ప్రకారం వేతనాలు రూ.15600 గా చెల్లిస్తున్నారని, మెసెంజర్ల కు ఇంకా ఆ పెంపు జరగలేదని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని, ఫైల్ ను ప్రభుత్వ అనుమతి తో త్వరలో ఉత్తర్వులు ఇప్పించుటకు హామీ ఇచ్చారని తెలిపారు.