తుల్జా భవానీ ఆలయంలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు, హుండీ అపహరణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ అర్బన్: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఖాన్జమాల్పూర్ (భవనమ్మ పల్లె)లోని తుల్జాభవానీ మాత ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఆలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి బంగారం, వెండి నగలు సహా హుండీ ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదును అపహరించి ఆలయ పరిసరాల్లో పడేసి వెళ్లిపోయారు. ఇటీవల దసరా వేడుకల అనంతరం అమ్మవారి నగలు, హుండీ కానుకలు లెక్కించకుండా ఉంచడంతో దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
హుండీ ఆదాయం రూ.10 లక్షలకు పైగానే ఉంటుందని ఆలయ కమిటీ ప్రతినిధులు భావిస్తున్నారు.చోరీ ఘటన తెలుసుకున్న చిరాగ్పల్లి పోలీసులు ఆలయానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.