వరంగల్, నేటిదాత్రి
వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, వరంగల్ మండల కేంద్రము పరిధిలోని కొత్తవాడ, తుమ్మలకుంట లోని రెండు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అందిస్తున్న ఆహార వస్తువులను, మందులు, అలాగే విద్యార్థుల, సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల సంరక్షణ కొరకు ఇలాగే ప్రతి రోజు నగర పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం అని తహసీల్దార్ ఇక్బాల్ తెలిపారు