ఎంపీ రవిచంద్ర వద్దిరాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన, బీఆర్ఎస్ కొత్తగూడెం పట్టణ సీనియర్ నాయకుడు మోరె భాస్కర్ అకాల మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ రవిచంద్రకు భాస్కర్ ఆకస్మిక మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతి చెందారు.గత నెల 24,25వతేదీలలో తాను భాస్కర్ మాట్లాడుకున్న,అసెంబ్లీ,లోకసభ ఎన్నికల సందర్భాలలో కలిసి పని చేసిన సందర్భాలను ఎంపీ రవిచంద్ర గుర్తు చేసుకుని ఆయన అకాల మరణం తీవ్ర బాధాకరమన్నారు.దీక్షా దివస్ సందర్భంగా కొత్తగూడెంలో నవంబర్ 29వతేదీన భాస్కర్ కు తాను చేసిన సన్మానం చివరదవుతుందని అనుకోలేదని ఎంపీ వద్దిరాజు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.భాస్కర్ మృతితో బీఆర్ఎస్ నిబద్ధత కలిగిన ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని, పార్టీకి తీరని లోటని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు.భాస్కర్ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ,ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.భాస్కర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్నివ్వాలని ఎంపీ వద్దిరాజు భగవంతున్ని ప్రార్థించారు.