ఆసుపత్రిలో రాజ్యమేలుతున్న అపరిశుభ్రత
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. రోగుల కంటే చెత్తే ఎక్కువగా దర్శనమిస్తోంది. ఆసుపత్రి ప్రాంగణంలో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో ఎలుకలు తిరుగుతున్నాయి. ఆసుపత్రి అధికారులు, ఉన్నతాధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.