తల్లిదండ్రుల సహకారంతో ఉత్తమ ఫలితాలు
◆:- -ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంకటేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం,సెప్టెంబర్ 14 ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులు తమ వంతు సహకారాన్ని అందించాలని ఝరాసంగం ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంకటేశం తెలిపారు హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ కు చెందిన విద్యార్థులు ప్రతి ఏటా మంచి ఫలితాలు సాధిస్తున్నారని ఈ ఏడాది కూడా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులు తమ విద్యార్థులకు ప్రోత్సహించి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సహకరించాలన్నారు.విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హాస్టల్లో పరిశుభ్రతను పాటిస్తున్నామన్నారు.మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు అందజేస్తూ,ఇప్పటికే విద్యార్థులకు బెడ్ షిట్లు,పెట్టెలు,నోటు పుస్తకాలు అందజేశామన్నారు.ఈ సమావేశంలో వివిధ తరగతులకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు,హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.