ఎన్జీవోస్ కాలనీ (నేటిదాత్రి) :
ఈనెల 16న జరగబోయే ఆల్ గూడ్స్ కెరియర్స్ అండ్ త్రీ ఫోర్ వీలర్స్ ప్యాసింజర్ వెహికల్స్ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, విద్యాసంస్థల బస్సు, లారీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బందుకు సహకరించాలని వివిధ అసోసియేషన్స్ మరియు ట్రేడ్ యూనియన్ నాయకులందరూ స్వచ్ఛందంగా రవాణా బందును జయప్రదం చేయాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ హనుమకొండ జిల్లా చైర్మన్ కస్తూరి రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి మాట్లాడుతూ త్వరలో జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో బిజెపికి ఓటమి తప్పదని బిఆర్ఎస్ బిజెపి ఒకటే అని ,హిట్ అండ్ రన్ జీవో 106 (1)(2) సెక్షన్ల గూర్చి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు డ్రైవర్ల పక్షాన మాట్లాడిన రోజు లేదని ఇప్పటికైనా అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల టాక్సీ బస్సు డ్రైవర్ల స్థితిగతులను మానవత కృపతో ఆలోచించాల్సిన అవసరం ఉంది.కావున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకము కాదు మేము కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నాము అని తెలియజేస్తూ ఇప్పటికైనా హిట్ అండ్ రన్ జీవో పైన కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తూ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా ఆటో కార్మికులకు నెలకు పదివేలు ఇస్తూ ఇల్లు లేని నిరుపేద డ్రైవర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని వారికి ప్రమాద బీమా ఐదు లక్షలు ఇస్తూ వారి యొక్క పిల్లలకు ఉచిత విద్య వైద్యం అందించాలని ఆటో డ్రైవర్లకు 100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్నటువంటి హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ నడుపుతున్న లారీ బస్సు డ్రైవర్లకు నెలకు కనీస వేతనం 30,000 ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి లేనియెడల ఆల్ ఇండియా ట్రేడ్ యూనియస్స్ పాటు వివిధ ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పోలేపల్లి సాంబయ్య, పోలేపల్లి కుమార్ ,చుంచు సురేష్ మరియు విద్యాసంస్థల డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..