ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్
నేటిధాత్రి: హన్మకొండ
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ ఇయర్ వైస్ విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు పరీక్షలు నిర్వహించకపోవడంతో ఏ బీ ఎస్ ఏఫ్ ఆధ్వర్యంలో వీసీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్ మాట్లాడుతూ ఇయర్ వైస్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకాపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని యూనివర్సిటీ పరిధిలో దాదాపు వెయ్యి మంది విద్యార్థుల పరీక్షలు రాయడానికి సిద్దంగా ఉన్నాకని ఎందుకు యూనివర్సిటీ అధికారులు పరీక్షలు నిర్వహించడం లేదని అన్నారు ఒక సబ్జెక్టు కి 7500 పరీక్ష ఫీజు ను యూనివర్సిటీ అధికారులు తీసుకోవడం జరుగుతుంది అయినా కానీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడంతో పోటీ పరీక్షలకు దూరం అవ్వడం జరుగుతుందనీ అన్నారు ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్పందించి ఇయర్ వైస్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలనీ అన్నారు ధర్నా చేయడంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి గారు వచ్చి విద్యార్థి నాయకులకు సర్ది చెప్పి త్వరలో ఒక కమిటీ వేసి పరీక్షలు నిర్వహిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది అనంతరం అడిషనల్ బ్రాంచ్ కంట్రోలర్ తిరుమల దేవి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఏ బీ ఎస్ ఏఫ్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు మచ్చ పవన్ కళ్యాణ్ నాయకులు పృథ్వి రాజ్ నరేందర్ ఉదయ్ కిరణ్ సాయి కిరణ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు