తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.
◆:- నకిలీ పట్టాల సృష్టించిన అక్రమార్కులు
◆:- నలుగురిపై కేసు నమోదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: కొంత మంది అక్రమార్కులు
ఏకంగా తహసీల్దార్ సంతకాలను ఫోర్టరీచేసి నకిలీ పట్టాలను సృష్టించారు. ఇంటి నంబర్ కేటాయిం చాలని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకోగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. జహీరాబాద్ పట్టణంలోని డ్రైవర్ కాల నీ, రాంనగర్, బాగారెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లోని 50, 173, 40, 139 తదితర సర్వే నంబర్ లు కలిగిన ప్రభుత్వ భూమి ఉంది. గతంలో అర్హులైన పేదలకు రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అధికశాతం మంది లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. కొంత మంది అక్రమార్కులు ప్రభుత్వ భూముల సర్వేనంబర్ లపై నకిలీ పట్టాలు సృష్టించి తహసీల్దార్ సంతకా లను ఫోర్టరీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా ఇళ్లను నిర్మించుకున్నామని, ఇంటి నం బర్ కేటాయించాలని మున్సిపల్ కార్యాలయంలో నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫికెట్లను పరిశీలించిన మున్సిపల్ అధికారులకు అనుమానం కలిగింది. సర్టిఫికెట్లను పరిశీలించి ఇవి ఒరిజనల్వా తెలపాలని రెవెన్యూ అధికారులకు పంపారు. సమగ్ర విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు.. బోగస్ పట్టాలుగా గుర్తించారు. తహసీల్దార్ సం తకం ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలు సృష్టించారని నిర్ధా రించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు నలుగు రిపై జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్ఐ వినయ్కుమార్ తెలిపారు.