జమ్మికుంట కరీంనగర్ జిల్లా నేటి ధాత్రి
ప్రస్తుతం యువత సెల్ ఫోన్ మాయలో పడి తమ విలువైన జీవితాన్ని వృధా చేస్తున్న నేపద్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటుతో పాటు వారికి అవసరమైన క్రీడా పరికరాలను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని యంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ అన్నారు. ఇల్లందకుంట మండల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న క్రీడా పరికరాలను ఆయా గ్రామాల యువతకు అందజేశారు. ఈ సందర్భంగా మంపీపీ మాట్లాడుతూ, క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని. యువత రోజులో కొంత భాగాన్ని క్రీడల పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దైనందిన జీవితంలో క్రీడలను ఒక భాగం చేసుకుంటే మానసిక ప్రశాంతత లభించేందుకు అవకాశం ఉంటుందని. దీన్ని ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతలో ఉన్నటువంటి యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడల పరికరాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంచడం జరుగుతుందన. అవసరం ఉన్నటువంటి యువతీ, యువకులు సంబంధిత కార్యదర్శిని సంప్రదించి. సదరు క్రీడా పరికరాలను తీసికేల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎక్కటి సంజీవరెడ్డి, జిల్లెల తిరుపతిరెడ్డి, మోటపోతుల అయిలయ్య, తెడ్ల ఒదలు, దాంసాని కుమార్, లాల్ మహ్మద్, దరుగుల రాజేష్ తదితరులు పాల్గోన్నారు