# దుర్వాసనతో కొత్తారోగాలకు అధ్యం పోస్తున్న మురికినీరు..
# పట్టించుకోని మున్సిపాలిటీ అధికారులు..
# తగిన చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలి..
# బిఆర్ఎస్ నాయకుడు బీరం నాగిరెడ్డి.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని జాతీయ రహదారుల వెంట కంపుకొడుతున్నది.రోడ్డువెంట అక్కడక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు,మురికి నీరు చేరి దుర్వాసనతో కొత్త రోగాలకు ఆధ్యం పొస్తున్నదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.నర్సంపేట మున్సిపాలిటీలో పరిధిలోని మూడవ వార్డు వల్లబ్ నగర్ జాతీయ రహదారి 100 వెడెల్పు రోడ్డు ఐనప్పటికి సైడ్ కాలువలు అక్కడక్కడ కాలువలు నిర్మించక పోవడంతో ప్రస్తుతం ఉన్న కాలువల్లో మురికి నీరు నిలిచి రోడ్డుపై దుర్వాసన వెదజల్లుతున్నది వార్డు బిఆర్ఎస్ నాయకుడు బీరం నాగిరెడ్డి ఆరోపించారు.దగ్గర్లో ఉన్న గృహాలకు వెళ్లే వాటికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.చుక్కుపక్కల వారికి దోమలు, ఈగల బెడద ఎక్కువగా ఉన్నాయని,మురికి నీటి దుర్వాసనతో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.నర్సంపేట పట్టణంలోని జాతీయ రహదారి వెంట ఈవిధంగా ఉంటే అంతర్గత రోడ్ల పరిస్థితి ఏవిధంగా ఉంటాయో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు తెలిపిన తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.వెంటనే మున్సిపాలిటీ అధికారులు సంబంధిత అధికారులతో కలిసి నూతన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలను కాపాడాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.