: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లుఅన్నారు.బుధవారంతెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలోజిల్లాస్థాయిచైతన్య సభలునల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లోఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కల్లుగీత కార్మికులకుఎన్నికల ప్రణాళికలోఇచ్చిన హామీలు అమలు చేయాలని,రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలుకల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారనిఆయన అన్నారు. తాటి చెట్టుఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డారని,గీత కార్మికులను కాపాడవలసిన బాధ్యతప్రభుత్వానికి ఉందని,తక్షణమే ప్రభుత్వం గీత కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం550 మంది చెట్టు పై నుండి జారీ పడుతున్నారని, వారిలో 180 మంది చనిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి భూములకుధరలు పెరగడంతో తాటి ఈత చెట్లను నరికి వేస్తున్నారని, రోజురోజుకు వనాలు తరిగిపోతున్నాయని ఆయన అన్నారు. ప్రమాదానికి గురైచనిపోయిన వారి కుటుంబాలకు,శాశ్వత వికలాంగులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు విధానం తొలగించాలని, గీత కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుడికి చేయూత పథకం ద్వారా 4000 ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లోగీత కార్మికుల సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించిల ని ఆయన అన్నారు. ప్రతి సొసైటీకిచెట్ల పెంపకానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని 560 జీవో అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గీత కార్మికుల కోసం ప్రతి గ్రామంలో ప్రభుత్వమే కమ్యూనిటీ భవనం నిర్మించి ఇవ్వాలని, నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ప్రతి జిల్లా కేంద్రంలో నెలకొల్పాలని, గౌడ యువతీ యువకులకు ఉపాధిఅవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. కల్లు గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలని కల్లులోని పోషకాలను, ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలనిఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్,తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చౌగాని సీతారాములు, వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న గౌడ్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పామన గుండ్ల అచ్చాలు, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘంరాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ వెంకట్ గౌడ్, వేములకొండ పుల్లయ్య, కల్లుగీత కార్మిక సంఘంజిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి నకిరే కంటి లాలయ్య గౌడ్, అయిత గోని మల్లేష్ గౌడ్, నేలపట్ల నరసింహ, వనం లింగయ్య, కాట్నం యాదగిరి, కాసాని సత్తయ్య, దండెం పల్లి యాదయ్యతదితరులు పాల్గొన్నారు.