రెండో వార్డ్ కౌన్సిలర్ పుల్లూరు సుధాకర్
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండో వార్డు జ్యోతి నగర్, తిలక్ నగర్ ప్రాంతాలలోనీ సింగరేణి క్వార్టర్ల నుంచి వచ్చే డ్రైనేజీ మురుగునీటి కోసం నిర్మించిన సెప్టిక్ ట్యాంకులు శిథిలావస్థలో ఉండటంతో మురుగునీరు నిలిచి ఉంటున్న విషయాన్ని గమనించిన రెండో వార్డ్ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. సమస్య ఉండటంతో మందమర్రి జిఎం మనోహర్ సంబంధిత అధికారులకు సమస్యను పరిష్కరించాలని తెలపడంతో బుధవారం ఓసి పిఓ, డీజీఎం సివిల్,సివిల్ డిప్యూటీ ఎస్ ఈ పర్యవేక్షణలో సివిల్ శానిటేషన్ సూపర్వైజర్ రాజ్ కుమార్ జెసిబి ద్వారా సెప్టిక్ ట్యాంకులను పూడ్చి వేసి సమస్యను పరిష్కరించారని కౌన్సిలర్ తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ… సమస్య ఉందని చెప్పగానే స్పందించిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.