రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 28, నేటిధాత్రి:
జాతీయ సైన్స్ డే సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణం లోని తవక్కల్ పాఠశాలలో తవక్కల్స్ స్కిల్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టులలో కలిపి 300 వరకు ప్రాజెక్ట్స్,మోడల్స్ ని తయారు చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా రామకృష్ణాపూర్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ , మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యా సాగర్ రెడ్డి, రామకృష్ణాపుర్ పట్టణం లోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, తవక్కల్ విద్యా సంస్థల చైర్మైన్ అబ్దుల్ అజీజ్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని ప్రతి ప్రాజెక్ట్ ని కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 1000 మంది తల్లితండ్రులకు వివరించారు. అనంతరం ముఖ్య అతిథులు విద్యార్థుల, ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా తవక్కల్ పాఠశాలల చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ సీవీ రామన్‌గా పేరుగాంచిన ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్.. ఆయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం అని తెలిపారు. భౌతికశాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్దం ఆ తేదిని జాతీయసైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. అందులో భాగంగానే జాతీయ సైన్స్ డే వేడుకలను తవక్కల్ పాఠశాలలో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.