వైద్య ఖర్చులకోసం నిరుపేద ఎదురుచూపు,
నేటి ధాత్రిమొగుళ్లపల్లి:
విద్యుత్ షాక్ తో ఒళ్లంతా కాలి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఒక యువకుడు వైద్య ఖర్చులకోసం అప్పన్న హస్తం అందించే మహానుభావుడు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నే అనిల్ అలియాస్ అంజి. ముట్లపల్లి సబ్ స్టేషన్ లో అన్ మ్యాన్డ్ కార్మికుడిగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు గత రెండు రోజుల క్రితం విద్యుత్తు పోలుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు తొలుతగా వరంగల్లోని గార్డెన్ హాస్పిటల్ తరలించగా అక్కడి నుండి ఎంజీఎం కు పంపించారు మళ్లీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని యశోద హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. రికార్డ్ అయితే డొక్కాడని అంజి కుటుంబం వైద్య ఖర్చులకోసం తెలిసిన బంధువుల వద్ద అప్పులు తెచ్చి చికిత్స అందిస్తున్నారు అయితే అవి సరిపోక మరిన్ని డబ్బులు కావాలని హాస్పటల్ సిబ్బంది తెలుపగా వైద్య డబ్బుల కోసం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు గాయపడిన అంజికి భార్య తల్లి తండ్రి ఉన్నారు తండ్రి అనారోగ్యంతో మంచంలో పడి గత కొన్ని సంవత్సరాలుగా లేవలేని స్థితిలో ఉండగా ప్రస్తుతం గాయపడిన అంజి కన్న తండ్రికి సేవలు అందించేవాడు ప్రస్తుతం అంజి వెన్నుముక దెబ్బతిని లేవనెల స్థితిలో దావకానలో మెరుగైన వైద్యం కోసం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు భార్య కూలి పని చేసుకుంటూ ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న దిన స్థితిలో అంజి కుటుంబం తల్లడిల్లుతుంది యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడి ప్రజల నుండి ఆర్థిక సహాయం అర్జిస్తున్నాడు మనసున్న మహారాజులు నిరుపేద దళిత కుటుంబానికి చెందిన జన్నే అంజి వైద్యం కోసం సహాయం అందించాలని అంజి కుటుంబ సభ్యులు ప్రజలను వేడుకుంటున్నారు, అంజికి ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు ఈ క్రింది నెంబర్ కు ఫోన్ పే ద్వారా పంపించగలరు 8790519548.