మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో రాబోయే స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో ఎస్సి రిజర్వేషన్ చేయాలని ఎల్కిచర్ల గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ తో ఆవేదన వ్యక్తం చేశారు.భారత స్వతంత్రం ఏర్పడింది నాటి నుండి మా గ్రామంలో ఎప్పుడు కూడా ఎస్సీ రిజర్వేషన్ రాలేదని ఇప్పటి కూడా మమ్మల్ని గుర్తించడం లేదు ఎప్పుడు చూసినా జనరల్, బీసీ, రిజర్వేషన్ అయినావి తప్ప మాకు మాత్రం పాలించే అవకాశం ఈనాటికి కూడా రాలేదని, ఇకనైనా మా దళితులను గుర్తించి మా గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో ఎస్సీ రిజర్వేషన్ చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కి మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంలో మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామని ఇంక ముందు ప్రభుత్వం దృష్టికి ఈ విషయం చేరేంతవరకు మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాన్నికి చెందిన దళితులు తదితరులు పాల్గొన్నారు.