వరి ప్రత్తి మొక్కజొన్న పంటల పట్ల జాగ్రత్తలు పాటించాలి.

# జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్
# దుగ్గొండి మండలంలో పంటల నమోదు తనిఖీలు చేసిన జేడీఏ

నర్సంపేట,నేటిధాత్రి :

వర్షాకాలంలో అధికంగా సాగుచేసే వరి, ప్రత్తి, మొక్కజొన్న పంటల పట్ల పంటల పట్ల రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సాగు పంటలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రికార్డులలో నమోదు చేయించింది.కాగా ఆయా సాగు చేస్తున్న పంటల నమోదు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా బుదవారం వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా సాగు పంటల నమోదు పట్ల తనిఖీలు చేపట్టగా దుగ్గొండి మండలంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్ సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.దుగ్గొండి మండలంలోని అడవిరంగాపురం,గిర్నిబావి గ్రామాల్లో సందర్శించి పలువురు రైతులతో మాట్లాడారు.పంటల సాగు చేసే విధానం పట్ల అడిగి తెలుసుకున్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి డి.ఉషదయాళ్,వరంగల్ ఉమ్మడి జిల్లా
జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్ టెంట్ .పి. సారంగం,వ్యవసాయ విస్తరణ అధికారి మధులు రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులకు వరి, ప్రత్తి, మొక్కజొన్న పంటలో ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.జేడీఏ ఉషాదయాళ్ వరి నారు మడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్ల వివరిస్తూ సాగు చేసే రైతులు పచ్చి రొట్ట పైరుగా పెసర,జీలుగ మొదలగు పచ్చి రొట్ట పైర్లను తప్పనిసరిగా వేసుకొని పూత దశలో ఎస్ఎస్పి వేసుకొని నేలలో కలియదున్నాలన్నారు.
ప్రస్తుతం వరిలో దీర్ఘకాలిక వరి రకాలకు నారు పోసుకునే సమయం అయిపోయిందని,ఇంకా నార్లు పోయని రైతులు ప్రస్తత పరిస్థితులలో మధ్యకాలిక రకాలు జగిత్యాల వరి -2,3, వరంగల్ సన్నాలు, వరంగల్ సాంబ,జగిత్యాల మశూరి రకాలను సాగు చేసుకోవాలని సూచించారు. స్వల్పకాలిక రకాలను సాగు చేసుకొనే రైతులు- డబ్ల్యూజిఎల్ -1119,డబ్ల్యూజిఎల్ -962, ఆర్ఎన్ఆర్ -15048,కేఎన్ఎం -1638, కేఎన్ఎం-733 సన్న రకాలను మరియు జేజిఎల్ -24423, కేఎన్ఎం-118 ,7037, ఎంటియు-1010 వంటి దొడ్డు రకాలను సాగు చేసుకోవాలని వివరించారు. వరి నాటు వేసే వారంరోజుల ముందు నారు మడిలో కార్బోఫ్యురాన్ 3 జి గుళికలను ఒక గుంట నారుమడికి 400 గ్రాముల చొప్పున వేసినచో వరి నారు పెట్టిన తర్వాత గొట్టం రోగం మరియు కాండం తొలిచే పురుగు రాకుండా అరికట్టవచ్చునని తెలిపారు. వరి నారుమడిలో ఆకులు పసుపు, ఎరుపు రంగు కనిపిస్తే ఎకరాకు సరిపడ నారుమడిలో కార్బండిజం + మాంకోజెబ్ ( సాఫ్)2.5 గ్రాములు ఒక కిలో యూరియాకు చొప్పున కలుపుకొని వేసుకోవాలి. వరి నారు మడిలో లీటరు నీటికి 10 గ్రా. 19:19 :19 కలిపి పిచికారి చేయాలి.నారు పోసిన రైతులు నారు పండుబారి పేలవంగా కనిపించిన చోట ఎకరాకు సరిపడ నారు మడిలో 1.5 నుండి 2 కిలోల యూరియా వేసుకోవాలి. అలాగే జింక్ 1 గ్రామ్ లేదా జింక్ సల్ఫేట్ 2 గ్రామ్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి అని అధికారిని పేర్కొన్నారు.ప్రత్తి పంటలో కొంత మంది రైతులు పొడి దుక్కిలో విత్తనాలు విత్తుకోవడం జరిగిందని చాలిచాలని వర్షపు నీరుతో మొలిచిన మొక్కలకు వేరుకుళ్ళు సోకి మొక్కలు తలలు వాల్చి, ఆకులు రంగు కోల్పోయి, తీవ్రతను బట్టి మొక్కలు ఏండి పోతాయని దీంతో మొక్కలకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3. గ్రాములు ప్రతి లీటరు నీటికి కలిపి మొక్క వేరు భాగం తడిసే విధముగా పిచికారి చేయాలి. బెట్ట పరిస్థితులలో తామర పురుగు బాగా ఉధృతమయ్యే అవకాశమున్నందున 5 శాతం వేప కషాయం లేదా వేప నూనే 5 మి. లీ. ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని, సరిపడు వర్షం లేదా తగినంత తేమ లేనప్పుడు మొలక శాతం తగ్గిన యెడల వర్షం పడిన వెంటనే ఖాళీ ఉన్నచోట (గ్యాప్ ఫిల్లింగ్) విత్తనాలను విత్తుకోవాలన్నారు.భాస్వరం ఎరువులైన ఒక బస్తా డిఎపి లేదా మూడు బస్తాలు ఎస్ఎస్పి ఎకరాకు విత్తిన 20 రోజుల లోపు పదనులో వేసుకొని తర్వాత కాంప్లెక్స్ ఎరువులను పై పాటుగా వేయకూడదన్నారు.20, 40 ,60,80 రోజులకు 4 దఫాలుగా యూరియా 25-30 కిలోలు + పోటాష్ 10 -15 కిలోలు కలిపి వేసుకోవాలని అమే తెలిపారు. ప్రత్తిలో కలుపు నివారణకు క్విజలోఫాఫ్ ఇథైల్ (టర్గా సూపర్) 400 మి.లీ + పైరితియెబాక్ సోడియం(హిట్ వీడ్) 250 మి.లీ లేదా ప్రొప క్విజఫాఫ్(ఎజిల్)+ పైరితియెబాక్ సోడియం(హిట్ వీడ్) 250 మి.లీ కలిపి ఒక ఎకరా విస్తీర్ణములో పిచికారి చేయాలి.ప్రత్తిలో రసం పీల్చే పురుగు నివారణకు పచ్చదోమ, పెనుపై ముడత మొదలగు రసం పీల్చే పురుగు నివారణ కోసం కాండానికి పూత పూసే పద్దతిని చేపట్టాలని ఈ పద్దతిలో మోనోక్రొటోఫాస్, నీరు 1:4 నిష్పత్తిలో మొదట 30 రోజుల వ్యవధిలో ఒకసారి తర్వాత 45 రోజులలో చేపట్టాలని అలాగే 60 రోజుల వ్యవధిలో ఫ్లోనికమిడ్, నీరు 1:20 నిష్పత్తిలో కలిపి కాండానికి పూత పూసే పద్దతిని చేపట్టడం వలన ఖర్చు తగ్గి మేలు చేసే మిత్ర పురుగులు రక్షించబడి పంటను పురుగుల బారినుండి కాపాడుకోవచ్చని తెలియజేశారు.మొక్కజొన్న పంటలో
ప్రీ ఎమేర్జేన్స్ గా మొక్కజొన్నలో కలుపు నివారణకు అట్రజిన్ 50 శాతం పొడి ( అట్రాటాఫ్) 5.0 గ్రా. లు లీటరు నీటికి ( ఒక కిలో ఎకరాకు ) మొక్కజొన్న విత్తిన 2 రోజుల లోపు భూమిలో తేమ ఉన్నప్పుడు భూమిపై పిచికారి చేయాలన్నారు. పోస్ట్ ఎమేర్జేన్స్ గా మొక్కజొన్న లో కలుపు నివారణకు టేంబోట్రియోన్ ద్రావకం ( లాడిస్ ) 115 మీ.లి. + అట్రజిన్ 400 గ్రా.లు లేదా హాలో సల్ఫ్యూరాన్ ( సెంప్రా) ౩6 గ్రా. + అట్రజిన్ 500 గ్రా.లు లేదా టోప్రమిజోన్ ( టింజర్) 36 మి.లి. అట్రజిన్ 500 గ్రా.లు లేదా మీసో ట్రయోన్ + అట్రజిన్ ( కలారీస్ ఎక్స్ ట్రా) 1400 మి.లి. + ఎకరాకు పిచికారి చేసుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాళ్ కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version